Amazon మరియు Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jan 20 2020
Slide 1 - Amazon మరియు Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు

చాల తక్కువ ధరతో మంచి కెమెరాలతో, అదికూడా ఒకటి రెండూ కాదు ట్రిపుల్ మరియు క్వాడ్ కెమేరాలతో వచ్చిన ఫోన్లలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితా ఇక్కడ అందించాను. మీరు ఒక ట్రిపుల్ లేదా క్వాడ్ కెమెరా సెటప్పుతో కూడిన ఒక మంచి ఓవరాల్ ఫోన్ గురించి చూస్తున్నట్లయితే, ఈ సొగసైన ఫోన్లను Amazon మరియు Flipkart సేల్ నుండి చాలా తక్కువ ధరలో కొనవచ్చు. ఈ రోజు, ఈ కెమెరా సెటప్‌తో వచ్చే స్మార్ట్‌ ఫోన్లు మరియు వాటి భారీ డిస్కౌంట్ల గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ కెమెరా సెటప్‌ ను కచ్చితంగా ఇష్టపడతారు, ఎందుకంటే ఇవి తాజా సాంకేతికతతో వచ్చాయి.

Slide 2 - Amazon మరియు Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు

1. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్

Flipkart అఫర్ ధర : Rs. 5,999

బ్యాంక్ అఫర్ : ICICI & Kotak  బ్యాంక్ 10% డిస్కౌంట్  

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్, HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.21 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది.  ఇది 269ppi పిక్సెళ్ళ సాంద్రతను కలిగి, 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు ఒక 88 శాతం బాడీ-టూ-స్క్రీన్ రేషియాతో వస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోను యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది ఇటీవల మీడియా టెక్ తాజాగా ప్రకటించిన 2.0GHz క్లాక్ స్పీడ్ చేయగల మీడియా టెక్ హీలియో A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజితో పాటుగా ఒక SD మెమొరీ కార్డ్ తో 256GB వరకూ స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.

ఇక ఇందులోని కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.8 అపర్చరు కలిగిన ఒక ప్రధాన కెమేరాతో పాటుగా ఒక 2MP కెమేరా మరియు మరొక లో లోట్ సెన్సార్ కలగలిపి అందించిన ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో ఒక 8MP AI కెమెరాతో వస్తుంది. అధనంగా, ఇది AI బొకే, AR స్టిక్కర్లు AI బ్యూటీ మోడ్ వంటి అనేక ప్రత్యేకమైన ఫిచర్లతో, ఈ కెమెరాలను అందించింది. 

Slide 3 - Amazon మరియు Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు

2. Moto One Action  

Flipkart అఫర్ ధర : Rs.8,999

బ్యాంక్ అఫర్ : ICICI & Kotak  బ్యాంక్ 10% డిస్కౌంట్  
ఈఫోన్ ఒక 6.3-అంగుళాల ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 1080 × 2520 పిక్సెళ్ళ FHD + డిస్ప్లే మరియు 84 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఒక పంచ్ హోల్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 2.2 గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9609 ప్రాసెసర్ ఉంది. ఇది 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక వేలిముద్ర సెన్సార్ అందించబడుతుంది.

ఇక కెమెరా గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోనులో వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ఒక f /1.8 అపర్చరు కలిగిన 12 MP ప్రధాన కెమెరా మరియు 5MP డెప్త్ కెమెరాతో పాటుగా f/2.2 అపర్చరు గల ఒక 16MP అల్ట్రా వైడ్ యాక్షన్ కెమేరా  కూడా  ఉంటుంది. ఇక సెల్ఫీ కోసం ఒక 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 9.0 పైన పనిచేస్తుంది మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో భాగంగా వుంటుంది. ఈ ఫోన్ ఒక 3500 mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 10W ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది

Slide 4 - Amazon మరియు Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు

3. VIVO U10  

Amazon అఫర్ ధర : Rs. 8,990

బ్యాంక్ అఫర్ : SBI క్రెడిట్ కార్డుతో 10% డిస్కౌంట్

ఈ వివో యు 10 ఒక పెద్ద 6.35-అంగుళాల HD + ఐపిఎస్ డిస్‌ప్లేతో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ ఎలక్ట్రిక్ బ్లూ మరియు థండర్ బ్లాక్ వంటి రెండు మంచి కలర్ రంగులలో అందించబడుతోంది. ఇవి కాకుండా, ఒక పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోనులో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోనులో డార్క్ మోడ్‌ ని కూడా అందించారు.

కెమెరా విభాగం గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 13 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా  2 MP  డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

Slide 5 - Amazon మరియు Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు

4. రియల్మి 5 :

Flipkart అఫర్ ధర : Rs. 8,999

బ్యాంక్ అఫర్ : ICICI & Kotak  బ్యాంక్ 10% డిస్కౌంట్  ​

 రియల్మి 5 యొక్క స్పెక్స్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ ఒక 6.5-అంగుళాల మినీ-డ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంది, దీని స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి కూడా 89% గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోనుకు క్రిస్టల్ డిజైన్ ఇవ్వబడింది మరియు ఈ ఫోన్ను క్రిస్టల్ బ్లూ మరియు క్రిస్టల్ పర్పుల్ కలర్ వేరియంట్‌లలో ప్రవేశపెట్టారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ కూడా రియల్మి 5 ప్రో మాదిరిగానే వెనుక ఒక క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంది. ఇది 240fps స్లో-మో వీడియో, 190 డిగ్రీల వ్యూ ని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఒక పెద్ద 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

Slide 6 - Amazon మరియు Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు

5. శామ్సంగ్ గెలాక్సీ M 30

Amazon అఫర్ ధర : Rs.8,999

బ్యాంక్ అఫర్ : SBI క్రెడిట్ కార్డుతో 10% డిస్కౌంట్

శామ్సంగ్ గెలాక్సీ M 30 ఫోనుతో సూపర్ అమోలెడ్ స్క్రీన్‌ పొందుతారు, ఈ మొబైల్ ఫోనులోని బ్యాటరీ వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఈ ఫోన్‌లో 13 ఎంపి ప్రైమరీ సెన్సారుకు జతగా ఒక 5 ఎంపి డెప్త్ సెన్సార్‌మరియు ఒక 5 MP అల్ట్రా వైడ్ కెమెరాతో ఉంటుంది. అంటే, ఈ ఫోన్‌లో మీరు ట్రిపుల్ కెమెరా సెటప్ పొందుతున్నారు మరియు ఒక పెద్ద 5000 mAh సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది.

Slide 7 - Amazon మరియు Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు

6. రెడ్మి నోట్ 8

Amazon అఫర్ ధర : Rs. 9,999

బ్యాంక్ అఫర్ : SBI క్రెడిట్ కార్డుతో 10% డిస్కౌంట్​

షావోమి రెడ్మి నోట్ 8 మొబైల్ ఫోన్‌లో, ఒక 6.3-అంగుళాల డాట్ నాచ్ స్క్రీన్ లభిస్తుంది, దీనికి తోడు ఇది సరికొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్ తో లభిస్తుంది. ఇందులో ఒక 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని  అందించింది. అలాగే, ఇందులో కూడా ఒక 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇచ్చింది మరియు ఇది యుఎస్‌బి టైప్ సి పోర్టుతో ఉంటుంది.

ఇక కెమేరా విభాగానికి వస్తే, ఒక 48MP ప్రాధమిక కెమెరా వస్తుంది. దేనికి జతగా, ఒక  8MP 120 డిగ్రీల అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, మరొక 2MP మాక్రో లెన్స్ మరియు చివరిదిగా ఒక 2MP డెప్త్ సెన్సారుతో ఉంటుంది . దీని ద్వారా మీరు పోర్ట్రెయిట్ ఫోటోలను తీయవచ్చు. ఈ ఫోన్ ముందు భాగంలో ఒక 13MP తక్కువ-కాంతి(Low-Light ) కెమెరాని అందించింది. ఇది AI ఎనేబుల్ తోమంచి ఫోటోలను తీయవచ్చు. 

Slide 8 - Amazon మరియు Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు

7. హానర్ 20 i 

Amazon అఫర్ ధర : Rs.10,999

బ్యాంక్ అఫర్ : SBI క్రెడిట్ కార్డుతో 10% డిస్కౌంట్

హానర్ 20i స్మార్ట్ ఫోన్,  ఈసిరిస్ యొక్క ప్రధాన ఫోన్‌ల రూపకల్పనతో వచ్చిన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు. వెనుక ప్యానెల్‌లో గ్రేడియంట్ కలర్ డిజైన్, అలాగే నిలువుగా అమర్చిన ట్రిపుల్ కెమెరా సెటప్పుతో అందించబడుతుంది. ఈ హానర్ 20i ను ఫాంటమ్ బ్లూ, ఫాంటమ్ రెడ్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్స్ లో కొనవచ్చు. ఈ హానర్ 20 i ఫోన్ రూ .10,999 ధరలో 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ కలిగి ఉంది. ఇది AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 24MP + 8MP + 2MP కెమేరాలను కలిగి ఉంటుంది.  ఈ పరికరం యొక్క ప్రధాన కెమెరా AIS సూపర్ నైట్ షాట్లను తీయగలదు.

Slide 9 - Amazon మరియు Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు

8. షావోమి Mi A 3 

Amazon అఫర్ ధర : Rs.12,499

బ్యాంక్ అఫర్ : SBI క్రెడిట్ కార్డుతో 10% డిస్కౌంట్

షావోమి మి A3 లో ఒక 6.08-అంగుళాల HD + AMOLED డిస్ప్లేతో వస్తుంది మరియు ఇది ఒక 7 వ తరం ఇన్ - డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది 720x1560 p రిజల్యూషన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక వాటర్‌డ్రాప్-నోచ్ డిజైన్‌తో 19.5: 9 యాస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత శక్తిని కలిగి ఉంది, ఇది 4GB / 6GB RAM శక్తితో మరియు 64GB / 128GB వంటి ఇంటర్నల్ స్టోరేజి ఎంపికలతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్,  3.5 హెడ్‌ఫోన్ జాక్‌ కలిగి ఉంటుంది మరియు ఆండ్రాయిడ్ 9 పై పనిచేస్తుంది.

ఇక కెమెరా విషయానికొస్తే, ఈ ఫోన్  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఉంది, దీనిలో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 48 MP ప్రాధమిక సెన్సార్ ఉంటుంది. అలాగే, 118-డిగ్రీల వైడ్ యాంగిల్ f / 1.79 లెన్స్‌తో 8MP సెకండరీ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ముందు భాగంలో 32 MP కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చరు లెన్స్‌తో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 4030mAh బ్యాటరీ మద్దతు ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.మరియు టైప్-సి యుఎస్‌బి పోర్ట్‌తో వస్తుంది.

Slide 10 - Amazon మరియు Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు

9. వివో జెడ్ 1 ప్రో

Flipkart అఫర్ ధర : Rs.10,990

బ్యాంక్ అఫర్ : ICICI & Kotak  బ్యాంక్ 10% డిస్కౌంట్  

ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో  ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది.

Slide 11 - Amazon మరియు Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు

10. రియల్మీ 5 ప్రో

Flipkart అఫర్ ధర : Rs.11,999

బ్యాంక్ అఫర్ : ICICI & Kotak  బ్యాంక్ 10% డిస్కౌంట్  

రియల్మి 5 ప్రో స్మార్ట్ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 SoC యొక్క శక్తిని కలిగి ఉంది మరియు ఒక 6.3-అంగుళాల Full HD + డిస్ప్లేని 90.6 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో వాటర్‌డ్రాప్ నోచ్ డిజైన్ ఉంది, వెనుక ఒక ప్రత్యేకమైన క్రిస్టల్ డిజైన్ కలిగి ఉంది, ఇది హోలోగ్రాఫిక్ కలర్ ఎఫెక్ట్‌ను కలిగి ఉందని మరియు స్పార్క్లింగ్ బ్లూ మరియు క్రిస్టల్ గ్రీన్ కలర్ ఎంపికలతో వస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, రియల్మి 5 ప్రో వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఇది f / 2.25 ఎపర్చరు లెన్స్ మరియు 119 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో ఒక 8 ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. దీనికి జతగా 48MP ప్రాధమిక సోనీ IMX586 సెన్సార్‌తో పాటు, F / 2.4 లెన్స్‌తో 2MP పోర్ట్రెయిట్ లెన్స్ మరియు f / 2.4 మాక్రో లెన్స్‌తో 2MP కెమెరా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్, మెరుగైన Low -Light చిత్రాలను కూడా అందిస్తుంది. ముందు భాగంలో 16MP సోనీ IMX471 సెన్సార్, f / 2.0 ఎపర్చర్‌తో ఉంటుంది, 

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status