లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇవే TOP 10 స్మార్ట్ ఫోన్లు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Oct 11 2019
Slide 1 - లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇవే TOP 10 స్మార్ట్ ఫోన్లు

కేవలం బడ్జెట్ ధరలోనే ఒక స్మార్ట్ చిప్సెట్, బెస్ట్ AI కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్మార్ట్ బ్యాటరీ మరియు  ఫేస్ అన్లాక్ వంటి గొప్ప ఫీచర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో విడుదలయ్యి అమ్మకాలను జోరుగా సాగిస్తున్న స్మార్ట్ ఫోన్లలో కేవలం 10,000 రూపాయల కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన  కొన్నిబెస్ట్  స్మార్ట్ ఫోన్లను ఇక్కడ అందిస్తున్నాను.

Slide 2 - లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇవే TOP 10 స్మార్ట్ ఫోన్లు

1. RealMe 5

ఇటీవల భారతదేశంలో మంచి స్పెక్స్ తో, 10,000 రూపాయల కంటే తక్కువధరలో రియల్మీ నుండి వచ్చినటువంటి స్మార్ట్  ఫోనుగా, ఈ రియల్మీ 5 గురించి చెప్పొచ్చు. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 AIE ప్రొసెసరుతో మంచి పెరఫార్మెన్సు అందిస్తుంది. అలాగే, ఇందులో గరిష్టంగా నాలుగు కెమెరాల సెటప్ 12MP+8MP +2MP+2MP  AI క్వాడ్ కెమేరాలతో ఉంటుంది. అలాగే,  ముందు ఒక 13MP గొప్ప సెల్ఫీ కెమెరా మరియు 5000mAh బ్యాటరీ వంటి ప్రత్యేకతలతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫ్లాష్ సేల్స్ Flipkart ద్వారా అందుబాటులో వుంది.   

Slide 3 - లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇవే TOP 10 స్మార్ట్ ఫోన్లు

2. Xiaomi Redmi Note 7S

షావోమి తన నోట్ 7 సిరీస్ ద్వారా గొప్ప స్పెక్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్లను కేవలం బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చింది.  సరికొత్తగా వచ్చిన ఈ రెడ్మి నోట్ 7s  స్మార్ట్ ఫోన్,  వెనుక 48MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమేరాని కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్  ఒక 6.3 అంగుళాల FHD+ వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  4000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

Slide 4 - లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇవే TOP 10 స్మార్ట్ ఫోన్లు

3.  Infinix HOT 8

ఇన్ఫినిక్స్ నుండి సరికొత్తగా వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరలో వెనుక మూడు కెమేరాల సెటప్ మరియు ఒక పెద్ద HD డిస్ప్లే తో వస్తుంది. ఈ పూర్తి డివైజ్ మొత్తానికి పవర్ అందించాడని ఒక పెద్ద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 2.0Ghz వరకూ క్లాక్ అందించగల ఒక Helio P22 Octa-core 64-bit ప్రాసెసరుతో వస్తుంది. దీనికి జతగా, 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజ్ అనుసంధానంతో వస్తుంది.

Slide 5 - లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇవే TOP 10 స్మార్ట్ ఫోన్లు

4.  Samsung Galaxy M 20

శామ్సంగ్ తన M సిరీస్ ద్వారా గొప్ప స్పెక్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్లను కేవలం బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చింది.  సరికొత్తగా వచ్చిన ఈ శామ్సంగ్ గెలాక్సీ M 20 స్మార్ట్ ఫోన్,  13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరాని కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్  ఒక 6.3 అంగుళాల FHD+ వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  5000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

Slide 6 - లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇవే TOP 10 స్మార్ట్ ఫోన్లు

5. Samsung Galaxy M 10

శామ్సంగ్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్,  13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్  ఒక 6.22 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  3400mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.  

Slide 7 - లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇవే TOP 10 స్మార్ట్ ఫోన్లు

5. Redmi Y3

షావోమి సంస్థ నుండి కేవలం రూ.9,999 ధరలో 32MP సెల్ఫీ కెమేరాతో ఇండియాలో విడుదల చేయబడినటువంటి, ఈ స్మార్ట్ ఫోన్, 1.8 GHz వద్ద క్లాక్ చేయబడిన,  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 12+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక 32MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.8,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. 

Slide 8 - లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇవే TOP 10 స్మార్ట్ ఫోన్లు

6. Realme C2

ఇటీవల, రియల్మీ సంస్థ విడుదల చేసినటువంటి ఈ రియల్మీ C2 , 2GHz వద్ద క్లాక్ చేయబడిన, మీడియా టెక్ హీలియో P22ప్రాసెసర్ శక్తికి జతగా 2GB/3GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 16GB/32GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 13+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.5,999 ప్రారంభ ధరతో లభిస్తుంది మరియు దీని యొక్క మరొక ఫ్లాష్ సేల్, జూన్ 7వ తేది మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది. 

Slide 9 - లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇవే TOP 10 స్మార్ట్ ఫోన్లు

7. Realme 3

రియల్మీ సంస్థ నుండి కేవలం రూ. 8,999 ధరలో డ్యూయల్  కెమెరాలతో, ఇటీవల ఇండియాలో లాంచ్ చేయబడినటువంటి ఈ రియల్మీ 3 స్మార్ట్ ఫోన్, ఒక 6.22 అంగుళాల HD+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది.  ఇది ఒక  మీడియా టెక్ హీలియో P70 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు ఇది 3GB ర్యామ్ మరియు 64GB అంతర్గత మెమొరీతో వస్తుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB వరకు పెంచుకోవచ్చు. ఇది ఒక 4,230 mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది.

Slide 10 - లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇవే TOP 10 స్మార్ట్ ఫోన్లు

8. XIAOMI MI A2

షావోమి నుండి ముందుగా వచ్చిన ఈ కెమేరా ఫోన్, స్మార్ట్ ఫోన్ 2160 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 FHD+ ఫుల్ వ్యూ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 660AIE ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3010 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 12MP +20MP  డ్యూయల్  కెమేరా సేటప్పుతో మరియు ముందు 20MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది ప్రస్తుతం రూ.9,999 ప్రారంభదరతో లభిస్తోంది. 

Slide 11 - లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇవే TOP 10 స్మార్ట్ ఫోన్లు

9. Realme 3i

సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 13 MP సెల్ఫీ కెమెరా, 13MP+2MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక పెద్ద 4230mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇక ఇది మంచి డిజన్ మరియు గ్రేడియంట్ కలర్ తో చూడగానే ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇది ఒక మీడియా టెక్ హీలియో P60 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది.

Slide 12 - లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇవే TOP 10 స్మార్ట్ ఫోన్లు

10. NOKIA 2.2

నోకియా యొక్క ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5.71 అంగుళాల HD+ డాట్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 5 MP సెల్ఫీ కెమెరా, 13MP వెనుక కెమెరా మరియు ఒక 3000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.  ఈ ఫోన్ రూ.6,999 ధరతో   అమ్ముడవుతోంది. అలాగే, ఈ ఫోన్ Android One కార్యక్రమంలో భాగంగా వచ్చింది కాబట్టి, ఫోన్ అప్డేట్లను త్వరగా అందుకుంటుంది మరియు రెండు ప్రధాన అప్డేట్ లను కూడా పొందుతుంది.     

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status