Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jul 06 2022
Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

కస్టమర్లకు అన్ని విధాలా తగిన ప్రయోజనాలను అందించే అన్లిమిటెడ్ ప్లాన్స్ చాలానే Jio మరియు BSNL అఫర్ చేస్తున్నాయి. వాటిలో, Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ గురుంచి ఈరోజు మనం మాట్లాడనున్నాము. అదీకూడా అధిక ప్రయోజనాలను అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ గురించి చూడబోతున్నాము. వీటిలో కొన్ని జియో ప్లాన్స్ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మరియు  డిస్ని+  హాట్ స్టార్ మూడు ప్రముఖ OTT ప్లాట్ఫారాలకు కూడా ఉచిత సబ్ స్క్రిప్షన్ అందించే ప్లాన్స్ కూడా ఉన్నాయి. అలాగే, కస్టమర్లకు అధిక వ్యాలిడిటీని అతితక్కువ రేటుకే అఫర్ చేసే BSNL బెస్ట్ ప్లాన్స్ కూడా వున్నాయి.

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

BSNL బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

బడ్జెట్ ధరలో లేదా తక్కువ ఖర్చులో కస్టమర్లకు ఎక్కువ లాభాలను అందించే ప్లాన్స్ BSNL చాలానే అందించింది. వాటిలో, BSNL రూ. 107 రీఛార్జ్ ప్లాన్, రూ.197 ప్లాన్, రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ మరియు BSNL రూ.797 ప్లాన్స్ గురించి చెప్పవచ్చు. ఈ ప్లాన్స్ అన్ని కూడా తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజాలను అంధిస్తాయి.

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

BSNL రూ. 107 రీఛార్జ్ ప్లాన్

BSNL యొక్క రూ. 107 ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 50 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటా మరియు 200 మినిట్స్ ఉచిత లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ 200 మినిట్స్ ఉచిత కాలింగ్ లిమిట్ ముగిసిన తరువాత కాలింగ్ కోసం నిముషానికి 30 పైసలు చెల్లించాలి. అధనంగా, ఈ ప్లాన్‌ ద్వారా 50 రోజుల పాటు కాలర్ ట్యూన్ సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు.

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

BSNL రూ.197 ప్లాన్

BSNL యొక్క రూ.197 రీఛార్జ్ ప్లాన్ 100 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు  డైలీ 100SMS లాభాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే, ఈ ఉచిత ప్రయోజానాలన్ని కూడా కేవలం 18 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ వ్యాలీడిటి మాత్రం 100 రోజుల వరకూ ఉంటుంది.

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

BSNL రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ 6 నెలల (200 రోజులు) వ్యాలిడిటీ తో వస్తుంది మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి.

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

BSNL రూ.797 ప్లాన్

BSNL యొక్క రూ.797 ప్లాన్ పూర్తి సంవత్సరం వ్యాలిడిటీ, అంటే 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా, అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకి 100 SMS ఉచిత సర్వీస్ ను కూడా పొందవచ్చు. అయితే, ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి.

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

జియో యొక్క చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్స్

రిలయన్స్ జియో యొక్క చౌకైన ప్లాన్స్ 149 మరియు 209 రూపాయలకు వస్తాయి. వీటిలో రూ.149 రూపాయల ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీతో వస్తే, రూ.209 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రెండు ప్లాన్స్ కూడా 1GB డైలీ హై స్పీడ్ డేటాను, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS పూర్తి వ్యాలిడిటీ కాలానికి అందిస్తాయి. అంతేకాదు, జియో యాప్‌ లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది.

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

జియో యొక్క చౌకైన అన్లిమిటెడ్ ప్లాన్

జియో మరొక బడ్జెట్ అన్లిమిటెడ్ ప్లాన్ 239 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకు 1.5 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

Jio Rs.499 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ కస్టమర్లకు అధికలాభాలను అందిస్తుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా పొందుతారు. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ 499 రూపాయల విలువైన 1 సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది. 

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

Jio Rs.479 ప్రీపెయిడ్ ప్లాన్స్

Jio Rs.479 Plan కూడా కస్టమర్లకు అధిక లాభాలను అందిస్తుంది. రూ. 479 ప్లాన్ డైలీ 1.5GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ను అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఇది 56 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

Jio Rs.799 ప్రీపెయిడ్ ప్లాన్స్

Jio Rs.799 Plan కూడా ఇదే విధమైన అధిక లాభాలను అందిస్తుంది. రూ. 799 ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ను అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఇది 56 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా 1 సంవత్సరం 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

Jio Rs.1,499 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 168GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అలాగే,రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

Jio Rs.2,999 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5  GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5 GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అలాగే,రూ. 499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. 

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

ఎక్కువ లాభాలను అందించే Jio పోస్ట్ పెయిడ్ ప్లాన్స్

Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కోసం చూసేవారు Jio యొక్క రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను చూడవచ్చు. 

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

Jio రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియో యొక్క ఈ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒక నెల రెంటల్ ప్లాన్ మరియు ఇది బిల్ వ్యవధికి గాను 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లిమిట్ కూడా వుంది. ఈ ప్లాన్ తో Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు. అంతేకాదు, మీరు 200 GB వరకు డేటాని రోల్ అవుట్ కూడా చేసుకోవచ్చు.

Jio మరియు BSNL తమ కస్టమర్లకు అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అఫర్ చేసే మరొక రెండు ప్లాన్స్ వున్నాయి.  అందులో ఒకటి రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మరియు మరొకటి రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. వీటిలో రూ.599 ప్లాన్ 1 అదనపు సిమ్ కార్డ్ తో వస్తే, రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాత్రం 2 అదనపు సిమ్ కార్డ్ లను తీసుకువస్తుంది. ఈ ప్లాన్ తో Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.