Rs.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితా

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Aug 21 2019
Slide 1 - Rs.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితా

నేటి కాలంలో, ఒక మంచి స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయడానికి అధిక ధరను చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కేవలం బడ్జెట్ ధరలోనే ఒక స్మార్ట్ చిప్సెట్, AI- డ్యూయల్ వెనుక కెమెరా, వేలిముద్ర సెన్సార్, స్మార్ట్ బ్యాటరీ మరియు  ఫేస్ అన్లాక్ వంటి గొప్ప ఫీచర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ సెగ్మెంట్లో, అనేక కంపెనీలు అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. చెప్పాలంటే, వీటిలో షావోమి పేరు టాప్ ప్లేస్ లో నిలుస్తుంది మరియు ప్రస్తుతం శామ్సంగ్ కూడా షావోమితో పోటీ పడటానికి మార్కెట్లో చాలా స్మార్ట్ ఫోన్లను విడుదలచేసింది. అందుకోసమే,  కేవలం 10,000 రూపాయల కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన  కొన్నిబెస్ట్  స్మార్ట్ ఫోన్లను  ఇక్కడ అందిస్తున్నాను.

Slide 2 - Rs.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితా

1. రెడ్మి నోట్ 7

ఇటీవల భారతదేశంలో మంచి స్పెక్స్ తో, 10,000 రూపాయల కంటే తక్కువధరలో షావోమి నుండి వచ్చినటువంటి స్మార్ట్  ఫోనుగా, ఈ రెడ్మి నోట్ 7 గురించి చెప్పొచ్చు. ఇది ముందు మరియు వెనుకా కూడా ఒక గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది మరియు ఒక 2.2GHz వద్ద క్లాక్ చెయ్యబడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 AIE ప్రొసెసరుతో మంచి పెరఫార్మెన్సు అందిస్తుంది. అలాగే, ఇందులో 12MP +2MP AI డ్యూయల్ కెమేరా, 13MP గొప్ప సెల్ఫీ కెమెరా మరియు 4000mAh వంటి ప్రత్యేకతలతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఓపెన్ సేల్ తో అందుబాటులో వుంది.

Slide 3 - Rs.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితా

2.  శామ్సంగ్ గెలాక్సీ M 20

శామ్సంగ్ తన M సిరీస్ ద్వారా గొప్ప స్పెక్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్లను కేవలం బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చింది.  సరికొత్తగా వచ్చిన ఈ శామ్సంగ్ గెలాక్సీ M 20 స్మార్ట్ ఫోన్,  13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరాని కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్  ఒక 6.3 అంగుళాల FHD+ వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  5000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

Slide 4 - Rs.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితా

3.  అసూస్ జెన్ ఫోన్ మాక్స్ M2

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 OS తో పనిచేస్తుంది మరియు వెనుక భాగంలో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది స్నాప్ డ్రాగన్ 632(14nm)ప్రోసెసరుకి జతగా అడ్రినో 506 గ్రాఫిక్స్ మరియు 3GB ర్యామ్ తో శక్తివంతంగా ఉంటుంది. ఇది వెనుక 13+5MP డ్యూయల్ కెమేరా మరియు ముందు 8MP సెన్సారును కలిగి ఉంటుంది.

Slide 5 - Rs.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితా

4. శామ్సంగ్ గెలాక్సీ M 10

శామ్సంగ్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్,  13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్  ఒక 6.22 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  3400mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

Slide 6 - Rs.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితా

5. రెడ్మి Y3

షావోమి సంస్థ నుండి కేవలం రూ.9,999 ధరలో 32MP సెల్ఫీ కెమేరాతో ఇండియాలో విడుదల చేయబడినటువంటి, ఈ స్మార్ట్ ఫోన్, 1.8 GHz వద్ద క్లాక్ చేయబడిన,  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 12+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక 32MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9,999 ప్రారంభ ధరతో లభిస్తుంది

Slide 7 - Rs.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితా

6. రియల్మీ C2

ఇటీవల, రియల్మీ సంస్థ విడుదల చేసినటువంటి ఈ రియల్మీ C2 , 2GHz వద్ద క్లాక్ చేయబడిన, మీడియా టెక్ హీలియో P22ప్రాసెసర్ శక్తికి జతగా 2GB/3GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 16GB/32GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 13+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.5,999 ప్రారంభ ధరతో లభిస్తుంది మరియు దీని యొక్క మరొక ఫ్లాష్ సేల్, జూన్ 7వ తేది మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది. 

Slide 8 - Rs.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితా

7. రియల్మీ 3

రియల్మీ సంస్థ నుండి కేవలం రూ. 8,999 ధరలో డ్యూయల్  కెమెరాలతో, ఇటీవల ఇండియాలో లాంచ్ చేయబడినటువంటి ఈ రియల్మీ 3 స్మార్ట్ ఫోన్, ఒక 6.22 అంగుళాల HD+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది.  ఇది ఒక  మీడియా టెక్ హీలియో P70 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు ఇది 3GB ర్యామ్ మరియు 64GB అంతర్గత మెమొరీతో వస్తుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB వరకు పెంచుకోవచ్చు. ఇది ఒక 4,230 mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది.

Slide 9 - Rs.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితా

8. XIAOMI MI A2

షావోమి నుండి ముందుగా వచ్చిన ఈ కెమేరా ఫోన్, స్మార్ట్ ఫోన్ 2160 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 FHD+ ఫుల్ వ్యూ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 660AIE ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3010 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 12MP +20MP  డ్యూయల్  కెమేరా సేటప్పుతో మరియు ముందు 20MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది ప్రస్తుతం రూ.9,999 ప్రారంభదరతో లభిస్తోంది. 

Slide 10 - Rs.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితా

9. ASUS ZENFONE MAX PRO M2

సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.26 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 13 MP సెల్ఫీ కెమెరా, 12MP+5MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక పెద్ద 5000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Slide 11 - Rs.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితా

10. NOKIA 5.1 PLUS

నోకియా యొక్క ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5.8 అంగుళాల HD+ నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 8 MP సెల్ఫీ కెమెరా, 13MP+5MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక 3060mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ముందుగా, ఈ ఫోన్ రూ.10,999 ధరతో ఉండగా, ఇప్పుడు కేవలం రూ.7,999 రూపాయల ధరతో అమ్ముడవుతోంది.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status