మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Sep 21 2015
Slide 1 - మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

గూగల్ అంటే, జి మెయిల్, గూగల్ నౌ లాంచర్, యుట్యూబ్ అని మాత్రమే చాలా మందికి తెలుసు. కాని ఇక్కడ ఎవ్వరికీ తెలియని గూగల్ తయారు చేసిన యాప్స్ ను చూడండి. వీటిలో కొన్ని ఉపయోగకరమైనవి ఉన్నాయి. యాప్స్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.

Slide 2 - మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

Snapseed
డెస్క్ టాప్ కు మాత్రమే అందుబాటులో ఉండే ప్రొఫెషనల్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ ను ఆండ్రాయిడ్ లో కూడా యాప్ గా లాంచ్ చేసింది గూగల్. పైన యాప్ పేరు మీద క్లిక్ చేస్తే ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేయగలరు.

Slide 3 - మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

Chrome Dev
క్రోమ్ మొబైల్ బ్రౌసర్ లో లేటెస్ట్ ఫీచర్స్ అండ్ లుక్స్ అందరికన్నా ముందు మీరు వాడగలరు. అంటే ఇది టెస్టింగ్ యాప్. అప్ డేట్స్ అన్నీ ముంది దీనికి వస్తాయి. ఇది వాడిన వారు ఇచ్చే ఫీడ్ బ్యాక్ తో అసలు వెర్షన్ పబ్లిక్ లోకి వస్తుంది.

Slide 4 - మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

Chrome Remote Desktop
మీ ఫోన్ లో ఉన్న క్రోమ్ బ్రౌసర్ నుండే మీ లాప్ టాప్స్ అండ్ కంప్యూటర్స్ ను వాడుకోవచ్చు. యాప్ సింపుల్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. ఇతర విషయాలకు ప్లే స్టోర్ లో యాప్ ఇన్ఫర్మేషన్ లో చూడగలరు. 4.4 స్టార్ రేటింగ్ ఉంది.
 

Slide 5 - మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

Google Gesture Search
మీ ఫోన్ లో యాప్స్ ఎక్కువుగా ఇంస్టాల్ చేసారా? హోం స్క్రీన్ నుండే చేతితో లెటర్స్ డ్రా చేస్తే యాప్స్, కాంటాక్ట్స్, బుక్ మార్క్స్, సెట్టింగ్స్, మ్యూజిక్ ఓపెన్ అవుతాయి మీరు ముందు సెట్ చేసుకున్న దాని బట్టి. 

Slide 6 - మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

Google Authenticator
మీ జి మెయిల్ అకౌంట్ ను ఎవరైనా వాడుతున్నరేమో అని డౌట్ ఉందా? లేదా అకౌంట్ లో ప్రైవెసీ మెయిల్స్ అండ్ ఇమేజెస్ వంటి డేటా ఉంది అని మీరు జిమెయిల్ ను మరింత సెక్యూర్ గా ఉంచాలని అనుకుంటున్నారా? ఇది బెస్ట్ అండ్ అఫిషియల్ సపోర్ట్ ఫీచర్. లాగిన్ అయ్యే ప్రతీ సారి ఈ యాప్ ఇంస్టాల్ చేసుకున్నాక ఒక కోడ్ వస్తుంది, దానిని కూడా ఎంటర్ చేయాలి జెనెరల్ అకౌంట్ పాస్వర్డ్ తో పాటు. యాప్ ను ఇంస్టాల్ చేస్తే అంతా అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చకపోతే uninstall చేసుకోవచ్చు కదా! 
 

Slide 7 - మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

My Maps
ఇది అందరికీ పరిచయం ఉన్న మ్యాప్స్ యాప్ కాదు. ఇది మై మ్యాప్స్. మ్యాప్స్ ను పర్సనలైజ్ చేసుకోవచ్చు. కొంతమందికి లైఫ్ లో వాళ్ల జర్నీస్ లేదా సొంత ఊరిలోనే వెళ్లిన ప్లేసెస్ ను ట్రాక్ చేసుకోవటం ఇష్టం కాని అవి పబ్లిక్ కు తెలియటం ఇష్టం ఉండదు. సో అలంటి వాళ్లకు ఇది బాగుంటుంది.

Slide 8 - మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్


Androidify
ఆండ్రాయిడ్ కేరక్టర్స్ ను క్రియేట్ చేసి emoticons, ఇమేజెస్, GIF's గా సేవ్ చేసుకోగలరు. ఇది ఫన్ ఒరిఎంటేడ్ యాప్.

Slide 9 - మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

Cloud Print
ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉండే డాక్యుమెంట్, ఫోటో లను ప్రింట్ తీయవచ్చు. గూగల్ క్లౌడ్ ప్రింట కనెక్ట్ అయిన ప్రింటర్ కు షేర్ చేస్తే ప్రింట్ వస్తుంది. ఆఫీస్ అవసరాలకు బాగుంటుంది.

Slide 10 - మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

Messenger
ఇది గూగల్ స్టాండర్డ్ మెసేజింగ్ అప్లికేషన్. దీనిలో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే, మెసేజెస్ ను బ్లాక్, mute, archieve చేసుకోవచ్చు. రోజూ నెట్వర్క్ మెసేజ్ లు నుండి frustate అవతున్నారా?. mute ఆప్షన్ పెట్టుకుంటే సైలెంట్ గా వస్తాయి. mute చేస్తే సైలెంట్ గా  నోటిఫికేషన్ బార్ లో కి వస్తాయి కాని నోటిఫికేషన్ సౌండ్ రాదు. అవేమి అర్జెంట్ గా చూసే అంత మెసేజ్ లు కాదు కాబట్టి తీరిక దొరికనప్పుడు చూడగలరు. బ్లాక్ అయిన మెసేజెస్ అయితే బ్లాక్ అయినట్లు నోటిఫికేషన్ ఉండదు.

Slide 11 - మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

Google Goggles
మీరు ఫోన్ తో ఫోటో తీసి.. ఆ ఇమేజ్ ద్వారా ఇంటర్నెట్ లో ఇన్ఫర్మేషన్ సర్చ్ చేయగలరు. అంటే ఇమేజ్ సర్చ్. 

Slide 12 - మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

Cardboard
ఫ్యూచర్ లో అందరికీ అందుబాటులోకి వస్తున్న virtual రియాలిటీ టెక్నాలజీ కు సంబందించిన యాప్. అంటే కళ్ళ దగ్గర పెట్టుకుంటే మీరు 3D లో ఆనందిస్తారు దేనినైనా. ఫర్ eg మీరు ఒక ఈవెంట్ చూడాలని అనుకుంటున్నారు. అయితే దానిని అటెండ్ అయిన వారి కన్నా ఇందులో ఆ ఈవెంట్ చూస్తే మీరు ఆ ఈవెంట్ లో పాల్గొని స్టేజ్ పై ఉన్న వారి పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. కాని దీనికి కార్డ్ బోర్డ్ అనే పరికరం కావలి. కార్డ్ బోర్డ్ లో ఫోన్ పెట్టి,  కార్డ్ బోర్డ్ ద్వారా చూస్తే ఆ అనుభూతి వస్తుంది. ఒకసారి ఇంస్టాల్ చేసి, టైమ్ పాస్ చేయండి. కళ్ళ కు దగ్గరగా పెట్టుకుంటే కాన్సెప్ట్ అర్థమవుతుంది కొంచెం.

Slide 13 - మీకు తెలియని గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

Google My Business
పేరు చూసి ఇది మీకు సంబంధించిన యాప్ కాదేమో అనుకోకండి. కాన్సెప్ట్ సింపుల్. మీకు చిన్న షాప్ లేదా ఏదైనా బిజినెస్ ఉంటే దానిని google మ్యాప్స్ లో చెక్ in చేసి... ఎప్పటికప్పుడు ఫోటోస్, ఇన్ఫర్మేషన్, అప్ డేట్స్ అన్నీ మొబైల్ నుండి input చేసి, బిజినెస్ ను google maps లో అందరికీ కనపడేలా చేసి పాపులర్ అవ్వండి సింపుల్ గా.

యాప్స్ డౌన్లోడ్ చేయటానికి పైన ఉండే వాటి పేర్ల పై క్లిక్ చేయండి.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status