PUBG గేమ్ లోని బెస్ట్ వెపన్స్ గురించి తెలుసా ?

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది May 14 2019
Slide 1 - PUBG గేమ్ లోని బెస్ట్ వెపన్స్ గురించి తెలుసా ?

స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారికీ PUBG గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అనసరం లేదు, అంతగా ఈ గేమ్ ప్రాచుర్యాన్ని పొందింది. అయితే, కొన్ని దేశాలలో దీన్ని బ్యాన్ చేయాలనీ ఎన్నో నిరసనలు వ్యక్త మవుతున్నాయి. కారణం, ఈ గేమ్ లో అందించిన హై ఎండ్ గ్రాఫిక్స్, నిజానికి దగ్గరగా ఉండేలా రూపొందించిన స్టోరీ లైన్ అప్ మరి ముఖ్యంగా షూటింగ్ ఈ గేమ్ ఆడటానికి గంటలు తరబడి ఈ ఆటకి ప్రజలని అతుక్కుపోయేలా చేస్తుంది.

ఈ ఆటను తమ టైం పాస్ చెయ్యడానికి దానికి ఆడేవారు మంచి అనుభూతి పొందుతారు. మీరు ఈ ఆటలో గెలుపొందాలంటే, ఖచ్చితంగా మీరు ఒక బలమైన ఆయుధం కలిగి ఉండాల్సిందే. కాబట్టి, PUBG లో ప్రత్యర్థిని మట్టి కురిపించే సామర్ధ్యం వున్నా ఆయుధాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గమనిక : PUBG మొబైల్ గేమ్ కేవలం సరదాగా ఆడుకోవడానికి అందించిన ఆట మాత్రమే, దీన్ని కేవలం మీరు సరదాగా సమయాన్ని గడపటాని మాత్రమే ఆడుకోవాలే తప్ప దానికి అడిక్ట్ అవ్వకండి.

Slide 2 - PUBG గేమ్ లోని బెస్ట్ వెపన్స్ గురించి తెలుసా ?

1. AMW - AMMO : 300

PUBG మొబైల్ గేమ్ లో అన్నింటికన్నా అత్యుత్తమమైన రైఫిల్ గా దీన్ని గురించి చెప్పొచ్చు. ఇది అంట తొందరగా లభించదు, ఇది విమానం విడిచిపెట్టే, 'Air Drop' బాక్స్ నుండి ఎక్కువగా లభిస్తుంది. దీనితో, ఎటువంటి హెల్మెట్ ధరించిన నిరాయుధుడైన ప్రత్యధినైనా సరే కేవలం ఒకే ఒక్క హెడ్ షాట్ తో తుదముట్టించవచ్చు. ఒకవేళ ఆయుధాలు ధరించి ఉంటే, రెండు షాట్ లతో ఫినిష్ చేయొచ్చు.                  

Slide 3 - PUBG గేమ్ లోని బెస్ట్ వెపన్స్ గురించి తెలుసా ?

మినీ 14 - AMMO : 5.56  

ఇది సెమీ ఆటోమేటిక్ రైఫిల్ మరియు SKS లకు ఎక్కువ భాగాలను కలపటానికి మద్దతు ఇస్తుంది కానీ ఇది 5.56mm AMMUNITION ను ఉపయోగిస్తుంది. ఇది అంత తొందరగా లభ్యమవ్వదు, కానీ ఇది లభిస్తే 8x జూమ్ దీని అనుసంధానం చేసుకొని చాల దూరంలోవున్న టార్గెట్ ని కూడా ఛేదించవచ్చు. దానితో పాటుగా ఇది ఒక గొప్ప బ్యాలెన్స్ కలిగిన వెపన్ గా కూడా ప్రశంసించబడింది.

Slide 4 - PUBG గేమ్ లోని బెస్ట్ వెపన్స్ గురించి తెలుసా ?

AKM -  AMMO : 7.62

ఈ  AKM వెపన్ ఒక పూర్తి ఆటోమేటిక్ అస్సాల్ట్ రైఫిల్ కాబట్టి, దీనితో ప్రత్యర్ధిపైన బుల్లెట్ల వర్షం కురిపించవచ్చు. ఇది 7.62mm మందుగుండును ఉపయోగిస్తుంది మరియు ఇతర రైఫిల్ల కంటే ఎక్కువ నష్టం కలిగిస్తుంది. అయితే, దీనితో ఎక్కువగా ఉపకరణాలుగా జతచేసుకునే అవకాశం మాత్రం ఉండదు, ఇది M16A4 మాదిరిగానే ఉంటుంది. మీరు మధ్యస్థ దూరంలో ఉన్నవారిని ఎదుర్కొంటున్నప్పుడు ఇది ఉత్తమం.

Slide 5 - PUBG గేమ్ లోని బెస్ట్ వెపన్స్ గురించి తెలుసా ?

S1897- AMMO 12 Gauge

బిల్డింగ్స్ మద్యంలో లేదా లోపల ఉన్నప్పుడు, ఈ షాట్ గన్ నిజంగా ఒక సరైన వెపన్ గా చెప్పొచ్చు. దీన్ని S1897 లేదా ట్రెంచ్ గన్ అనికూడా పిలుస్తారు. ఇది Gauge ఆమ్మో ని ఉపోయోగిస్తుంది, నిరాయుధుడైన ప్రత్యర్థిని కేవలం ఒకే ఒక్క షాట్ తో ఫినిష్ చేయవచ్చు.  ఒకవేళా మీరు గనుక బిల్డింగ్స్ లో ఆడుతున్నట్లయితే, ఈ వెపన్ వెంట తెచ్చుకోవడం మంచింది.  

Slide 6 - PUBG గేమ్ లోని బెస్ట్ వెపన్స్ గురించి తెలుసా ?

VSS Vintorez - AMMO : 9mm 

ఇది ఒక స్నిపర్ రైఫిల్, కానీ AWP కంటే చాలా తక్కువ శక్తి కలిగివుంటుంది. కానీ, దూరంలో వున్నవారిని టార్గెట్ చేయడానికి మరియు అధిక వేగంతో, వారి పైన ఎక్కువ గుళ్ల వర్షం కురిపించి మట్టి మట్టుపెట్టడానికి, ఇది ఒక ఘోరమైన ఆయుధం. కానీ, ఇది సుదూర లక్ష్యాలను చేధించడానికి అంత మంచిది కాదు కానీ ఒక మోస్తరు దూరంలో వున్నవారిని, చాల సులభంగా టార్గెట్ చెయ్యవచు. 

Slide 7 - PUBG గేమ్ లోని బెస్ట్ వెపన్స్ గురించి తెలుసా ?

P1911 - AMMO : 45

మీరు గేమ్ లోకి ఎంటర్ అయిన వెంటనే మీకు ఎటువంటి పవర్ ఫుల్ వెపన్ దొరకనట్లయితే, ఈ P1911 ఆటొమ్యాటిక్ పిస్టల్ ని దగ్గరుంచుకోవచ్చు. ఇది చాల బుల్లెట్లను చాల శక్తివంతముగా ప్రత్యర్దులల్లోకి చొప్పిస్తోంది, కేవలం 4 షాట్స్ తో ఎటువంటి హెల్మెట్ వున్నప్రత్యర్థినైనా సరే బయటికి పంపవచ్చు. 

Slide 8 - PUBG గేమ్ లోని బెస్ట్ వెపన్స్ గురించి తెలుసా ?

బెరిల్ M762 - AMMO :  7.62 

ఇది AKM కంటే ఎక్కువ అటాచ్ మెంట్లు చెయ్యగలిగే సామర్ధ్యంతో వస్తుంది మరియు ఈ బెరిల్ M762 యొక్క వేగవంతమైన ఫైరింగ్ రేటు కారణంగా ఇది ప్రత్యర్థిని    త్వరగా నిలువరించడానికి సరిగ్గా సరిపోతుంది.  ఎక్కువ దూరంలోవున్నా ప్రత్యర్థిని కూడా నియంత్రించడానికి ఇది బలంగా ఉంటుంది.

Slide 9 - PUBG గేమ్ లోని బెస్ట్ వెపన్స్ గురించి తెలుసా ?

స్కార్పియన్ - AMMO :9mm 

ఈ స్కార్పియన్ వెపన్ చూడటానికి చాల చిన్నగా కనిపించినా ఇది ఫుల్ ఆటొమ్యాటిక్ పిస్టల్ కాబట్టి చాల వేగంగా బుల్లెట్స్ సందిస్తుంది. ప్రధానంగా, ఇది ఒక పాకెట్ SMG గన్. కాబట్టి, బిల్డింగ్స్ మధ్యలో చాల దగ్గరిగా ఉన్నవారిని చాల సులభంగా బయటికి పంపవచ్చు. 

Slide 10 - PUBG గేమ్ లోని బెస్ట్ వెపన్స్ గురించి తెలుసా ?

UMP9 - AMMO : 9mm

ఈ ఆటలో అన్నిటికంటే తొందరగా మరియు సులభముగా దొరికే ఒక కామం వెపన్ గా దీని గురించి చెప్పొచ్చు. ఇది 9mm ఆమ్మో ని ఉపయోగిస్తుంది మరియు చాల వేగంగా బుల్లెట్లను ఫైర్ చేసే సామర్ధ్యంతో ఉంటుంది. ఇక దీన్ని బుల్లెట్స్ కూడా అట మొత్తంలో చాలా విరివిగా లభిస్తాయి. దీనితో చాల దగ్గరిగా మరియు ఒక మోస్తరు దూరంలో వున్నా ప్రత్యర్థిని టార్గెట్ చెయ్యడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 

Slide 11 - PUBG గేమ్ లోని బెస్ట్ వెపన్స్ గురించి తెలుసా ?

P18C - AMMO : 9mm

ఎటువంటి వెపన్ దొరకని ప్రస్థితుల్లో, ఈ P18C మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువ మ్యాగజైన్ సామర్ధ్యం మరియు వేగవంతమైన ఫైరింగ్ పవర్ కలిగివుంటుంది కాబట్టి మీకు ఆపత్కాల పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే, డిటో త్వరగా బుల్లెట్లను రీలోడ్ చేసే సామర్ధ్యంతో వస్తుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.          

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status