BSNL vs Jio : ఎక్కువ లాభాలనిచ్చే లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Feb 05 2022
BSNL vs Jio : ఎక్కువ లాభాలనిచ్చే లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

ప్రతి టెలికం సంస్థ కూడా వారి కస్టమర్లకు మంచి ప్రయోజానాలను అందించే బెస్ట్ ప్లాన్స్ తీసుకువచ్చాయి. అయితే, వాటిలో తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించే ప్లాన్స్ కొన్నే వున్నాయి. కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ కస్టమర్లకు తగిన ప్రయోజాలను అందిస్తున్నాయి.  అందుకే, BSNL మరియు జియో తమ కస్టమర్లకు అధిక ప్రయోజాలను అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ గురించి చూద్దాం.

BSNL vs Jio : ఎక్కువ లాభాలనిచ్చే లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

BSNL బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

బడ్జెట్ ధరలో లేదా తక్కువ ఖర్చులో కస్టమర్లకు ఎక్కువ లాభాలను అందించే ప్లాన్స్ BSNL చాలానే అందించింది. వాటిలో, BSNL రూ. 106 రీఛార్జ్ ప్లాన్, రూ.197 ప్లాన్, రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ మరియు BSNL రూ.499 STV ప్లాన్ గురించి చెప్పవచ్చు. ఈ ప్లాన్స్ అన్ని కూడా తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజాలను అంధిస్తాయి.

BSNL vs Jio : ఎక్కువ లాభాలనిచ్చే లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

BSNL రూ. 106 రీఛార్జ్ ప్లాన్

BSNL యొక్క రూ. 106 స్పెషల్ టారిఫ్ వోచర్ ఏకంగా 85 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. వ్యాలిడిటీ కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటా మరియు 100 మినిట్స్ ఉచిత లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ 100 మినిట్స్ ఉచిత కాలింగ్ లిమిట్ ముగిసిన తరువాత కాలింగ్ కోసం నిముషానికి 30 పైసలు చెల్లించాలి. అధనంగా, ఈ ప్లాన్‌ ద్వారా 60 రోజుల పాటు కాలర్ ట్యూన్ సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు.

BSNL vs Jio : ఎక్కువ లాభాలనిచ్చే లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

BSNL రూ.197 ప్లాన్

BSNL యొక్క రూ.197 రీఛార్జ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు  డైలీ 100SMS లాభాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే, ఉచిత ప్రయోజానాలన్ని కూడా కేవలం 18 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ వ్యాలీ;    అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తి నెల మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లవ్యాలిడిటీ మాత్రం 150 లకు వర్తిస్తుంది.  

BSNL vs Jio : ఎక్కువ లాభాలనిచ్చే లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

BSNL రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ 10 నెలల (300 రోజులు) వ్యాలిడిటీ తో వస్తుంది మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి.

BSNL vs Jio : ఎక్కువ లాభాలనిచ్చే లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

BSNL రూ.499 STV ప్లాన్

BSNL యొక్క రూ.499 STV ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 180GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా మూడు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, ఫ్రీ కాలర్ ట్యూన్ మరియు ఉచిత Zing యాప్ యాక్సెస్ కూడా అందిస్తుంది.

BSNL vs Jio : ఎక్కువ లాభాలనిచ్చే లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

Jio బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

జియో కస్టమర్లకు బడ్జెట్ ధరలో అధిక లాభాలను అందించే ప్లాన్స్ గురించి చుస్తే, రూ.91, రూ. 209, రూ.499 మరియు రూ.2,999 ప్లాన్స్ మంచి ప్రయోజాలను అందిస్తాయి. ఈ ప్లాన్స్ అన్ని కూడా కస్టమర్లకు డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి.          

BSNL vs Jio : ఎక్కువ లాభాలనిచ్చే లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

జియో రూ.91 ప్లాన్

ఈ ప్లాన్ కేవలం జియోఫోన్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 0.1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 3GB ల హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ మొత్తంగా 50 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

BSNL vs Jio : ఎక్కువ లాభాలనిచ్చే లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

జియో రూ.209 ప్లాన్

రిలయన్స్ జియో యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్ 209 రూపాయలకు వస్తుంది. రూ.209 ప్లాన్ తో కస్టమర్లు 28 రోజుల పాటు డైలీ 1GB చొప్పున మొత్తం 28GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS  లను అందిస్తుంది. అంతేకాదు, జియో యాప్‌ లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది. జియో యొక్క రెండవ ప్లాన్ 239 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకు 1.5 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

BSNL vs Jio : ఎక్కువ లాభాలనిచ్చే లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

Jio Rs.499 Plan

ఈ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా పొందుతారు. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అధనంగా, పైన తెలిపిన విధంగా ఈ ప్లాన్ 1 సంవత్సరం 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది. కొత్త వినియోగదారులు ఈ ప్లాన్‌తో జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌కు కూడా సభ్యత్వాన్ని కూడా అందుకుంటారు.

BSNL vs Jio : ఎక్కువ లాభాలనిచ్చే లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

Jio Rs.2,999 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements