బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Feb 01 2019
Slide 1 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

మొదటి నుండి ఫైనల్ లైన్ వరకు ఉత్కంతంగా నడిచే ఒక రేసును ఎవరు ఇష్టపడతారు. గూగుల్ ఆప్ స్టోరులో, చక్కగా మెరుగుపరచబడిన గ్రాఫిక్స్ మరియు ఆటతీరుతో వాటి మార్కును నిలబెట్టుకునే కొన్ని అటువంటి గేమ్స్ అందుబాటువున్నాయి. మీరుకూడా ఈ గేమ్ ఆడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టండి.       

Slide 2 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

1. Asphalt 9

ఆస్పాల్ట్ 8 అబ్భుతమైన విజయాన్ని సాధించడంతో, దానికి కొనసాగింపుగా ఈ ఆస్పాల్ట్ 9 ని తీసుకొచ్చింది. ఈ కొత్తగా వచ్చిన గేములో కొత్త వాతావరణము, ఛాలెంజ్ మరియు స్టంట్లను తీసుకొస్తుంది. అంటే, ఇపుడు మరింత గేమింగ్ అనుభూతిని పొందవచ్చు ఈ ఆస్పాల్ట్ 9 గేముతో. అలాగే ఇందులో కొత్త కార్లు  మరియు  సులభమైన కంట్రోల్స్ కూడా తీసుకొచ్చింది.

Slide 3 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

2. GT Rasing Stunts : Car Driving

స్టెంట్ గేమ్స్ మీరు అమితంగా ఇష్టపడేవారైతే, అధికమైన స్టంట్లు మరియు ఉత్కంఠను రేకెత్తించే ఈ గేమ్ మీకు సరిగ్గా సరిపోతుంది. వేగంగా కారును నడుపుతున్నపుడు, మధ్యలో వచ్చే ఆటంకాలను స్టన్ట్స్ ద్వారా దాటాల్సి ఉంటుంది.     

Slide 4 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

3. Crazy Bike Attacks Racing New : Motorcycle Racing

రోడ్ రాష్ గేమ్ లాంటి అనుభూతిని మీ ఆంధ్రోడి మొబైల్లో పొందాలనుకుంటున్నారా? అయితే, ఈ క్రేజీ బైక్ అట్టాక్స్ గేమ్ మీరు కోరుకునే ఒక గేమ్ కావచ్చు. ఈ గేములో, మీరు స్పోర్ట్స్ బైక్ నడుపుతూనే మీ ప్రత్యర్ధిపైన కొట్టడం లేదా కాలితో కిక్స్ ఇస్తూ దాడి చేయాల్సివుంటుంది.

Slide 5 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

4. Impossible Car Game 2018

మీరు ఎక్కువ చాలెంజింగ్ ఉండేటువంటి గేమ్లను ఇష్టపడేవారైతే కనుక ఈ గేమ్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ గేమ్ లో అనేకరకాలైన ఆశ్చర్యకర విన్యాసాలను మీరు చేయవలసివుంటుంది.  మెలితిరిగిన మార్గాలు మరియు ఘోరమైన అడ్డంకులవంటి వాటిని దాటుకుంటూ మీ కారును నడపవలసివుంటుంది.

Slide 6 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

5. SBK 16 Official Mobile Game

సూపర్ బైక్  వరల్డ్ ఛాంపియన్షిప్  యొక్క అధికారిక గేమ్, ఈ SBK 16  చాల రకాలైన కంట్రోలింగ్ పద్దతులతో మీకు మంచి బైక్ రేసింగ్ అనుభూతినిస్తుంది. రియల్ వరల్డ్ క్యారెక్టర్లతో మరియు చాల ఎక్కువ రేసింగ్ ట్రాక్లతో వస్తుంది ఈ గేమ్. దీని యొక్క గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయి మరియు దీని యొక్క గేమ్ ప్లే గొప్పగా ఉంటుంది.  

Slide 7 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

6. Turbo Highway Racer 2018

రద్దీగా ఉండే, హైవే పైన రేసింగ్ ఇష్టపడేవారు ఎంచుకోదగిన గేమ్స్ లో ఇది కూడా ఒకటి. కేవలం ట్రాఫిక్ రోడ్లపైన కారును నడపటమే కాకుండా, మీ శత్రువుల పైన దాడి చేయాల్సివుంటుంది  ఈ గేములో.

Slide 8 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

7. Traffic Rider

ట్రాఫిక్ రేసర్ క్యారెక్టర్ల నుండి వచ్చిన మరొక ఆడెక్టివ్ గేమ్ ఈ ట్రాఫిక్ రైడర్. ముందు వచ్చిన టైటిల్ లాగ కాకుండా, బెటర్ గ్రాఫిక్స్ మరియు ఒక సరికొత్త కెరీర్ తో వస్తుంది ఈ గేమ్. కాబట్టి, అనంతమైన హైవెల పైన ప్రయాణిస్తూ మీ మిషన్ పూర్తి చేయడం ద్వారా కొత్త బైకులకు అప్గ్రేడ్ అవ్వవచ్చు.

Slide 9 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

8. Gravity Rider

బైక్ రేసింగ్ గేమ్ లో ఛాలెంజ్ కోరుకునేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ గేమ్ మోటో జంప్స్, మెగా రాంప్స్, ఆస్పాల్ట్ ఎలివేటర్లు మెలికలు తిరిగిన  మరియు డ్రిఫ్ట్ ట్రాక్స్ మీకు ఛాలంజ్ చేస్తాయి. మీ అద్భుతమైన ఆటతీరుతో లెజండరీ కారు బాగాలను పొందవచ్చు.

Slide 10 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

9. Beach buggy Blitz

ఈ బీచ్ బగ్గి బ్లిట్జ్ గేమ్  మీ మొబైల్ ఫోనులో వర్చువల్ ప్రపంచంలో నుండి  ఒక డైనమిక్ మరియు విధ్వంసక రియాలిటీలోకి తీసుకొస్తుంది. మీ హాట్ రాడ్ బగ్గి ని రహస్య గుహలు మరియు పురాతన దేవాలయాల మద్య తీసుకుపోవచ్చు. 

Slide 11 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

10. Drift Max City -Car Racing in City

ఈ డ్రిఫ్ట్ మ్యాక్స్ సిటీ గేమ్ ఆడుతున్నప్పుడు, నిజమైన రోడ్డు మీద రేసింగ్ చేస్తున్న అనుభూతి మీకు కలుగుతుంది మరియు ఇందులో హై పెరఫార్మెన్సు కార్లను ఇందులో మీరు డ్రైవ్ చేయవచ్చు. ఈ గేములో 14 డ్రిఫ్ట్ కార్లను అందిస్తుంది మరియు 7 రేస్ ట్రాక్లను కూడా అందిస్తుంది. మీరు రేసింగ్ చేసేటప్పుడు ఈ ప్లేస్ తెలిపే విధంగా స్కోర్ బోర్డు కూడా చూడవచ్చు .      

Slide 12 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

11. Real Racing 3

ఈ రియల్ రేసింగ్ 3 గేమ్ అధికారకంగా ద్రువీకరించబడిన ట్రాక్స్ తో వస్తుంది మరియు వేగవంతమైన కార్లతో  మంచి గేమింగ్ అనుభూతినిస్తుంది. ఈ గేములో, మీరు అనేక కెమేరా వ్యూస్ అందుకోవచ్చు మరియు ఈ ఆట తీరు చాల సున్నితంగా ఉంటుంది. ఇది ఎక్కువగా గ్రాఫిక్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది.

Slide 13 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

12. Need For Speed : No Limits

నీడ్ ఫర్ స్పీడ్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదనుకుంటా, ఎందుకంటే ఇప్పటివరకూ వచ్చిన ఈ గేమ్ సిరీస్లలో చాల ప్రాచుర్యాన్ని పొందిన వాటిలో ఇది కూడా ఒకటి. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు చాల ఎక్సయిట్మెంట్ గా ఉంటుంది మరియు ఇప్పుడు కోతగా తెచ్చిన గ్యారేజితో మీ కారును మీకు కావలసినట్లుగా మార్చుకునే అవకాశంకూడా అందించింది. 

Slide 14 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

13. Riptide GP3 :Renegade

నల్లని తారు రోడ్లపైన రేసింగ్ గేమ్స్ ఆడి విసుగుచెందారా? అయితే, ఈ  Riptide GP3 గేమ్ తో నీటిపైన అద్భుతమైన రేసింగ్ చేయండి. ఇది కొత్త ట్రంవారిని దృష్టిలో ఉంచుకొని నిర్మించినది, ఇందులో జెట్ స్పీఎదుటో నడిచే బోట్లతో వివిధ రకాల విన్యాసాలు చేయవచ్చు. 

Slide 15 - బెస్ట్ రేసింగ్ గేమ్స్ (జనవరి 2019)

14. 32 secs

ట్రోన్ లాంటి ఫ్యూచర్ బైక్ తో గేమింగ్ చేయాలనీ ఉందా? అయితే, ఈ 32 secs గేమ్ తో మీ కోరిక నిరవేర్చుకోవచ్చు. ఈ ఫ్యూచర్ బైక్ తో మీకు ఇచ్చిన సమయంలో ముగిసేలోపుగా, గమ్యస్థానాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో, మీకు వచ్చే అడ్డంకులను దాటుకుంటూ మరియు మధ్యలో దొరికే బూస్ట్ లను తీసుకుంటూ, ఈ గేమ్ ముంగిచాల్సి వుంటుంది.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status