అతిపెద్ద 5,000 mAh మరియు 6,000 mAh బ్యాటరీ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్లు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Oct 18 2019
Slide 1 - అతిపెద్ద 5,000 mAh మరియు 6,000 mAh బ్యాటరీ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్లు

ఇప్పటి వరకూ 4,000 మరియు 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చిన మొబైల్ తయారీ కంపెనీలు, ఇప్పుడు ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్లను కూడా భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టాయి. గేమింగ్ మరియు ఆన్లైన్ వీడియో కంటెంట్ ని ఎక్కువగా ఇష్టపడే వినియోగదారులకు పెద్ద బ్యాటరీ ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. అందుకోసమే, ఈ రోజు మనం 5000 ఎమ్ఏహెచ్ మరియు 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీలతో వచ్చే ఫోన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం ...

Slide 2 - అతిపెద్ద 5,000 mAh మరియు 6,000 mAh బ్యాటరీ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్లు

1. శామ్‌సంగ్ గెలాక్సీ M 30s

ఈ గెలాక్సీ M30s ఒక 6.4-అంగుళాల FHD + సూపర్ AMLOED డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఈ ఫోన్ ఒపల్ బ్లాక్, సఫైర్ బ్లూ మరియు పెర్ల్ వైట్ వంటి కలర్ ఎంపికలలో ప్రారంభించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు ఇది సామ్‌సంగ్ వన్ UI స్కిన్ తో ఆండ్రాయిడ్ 9 పై OS పైన పనిచేస్తుంది.

 

ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 6000 mAh బ్యాటరీతో పనిచేస్తుంది మరియు గేమింగ్ వినియోగదారుల కోసం, ఈ ఫోన్ గేమ్ బూస్టర్ ఫీచర్‌ను కలిగి ఉంది, ఇది AI ని ఉపయోగించి మంచి గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇక వెనుక ప్యానెల్‌లో వేలిముద్ర సెన్సార్ కూడా ఉంచబడింది

Slide 3 - అతిపెద్ద 5,000 mAh మరియు 6,000 mAh బ్యాటరీ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్లు

2. రియల్మి 5

ఈ రియల్మి 5 యొక్క స్పెక్స్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ ఒక 6.5-అంగుళాల మినీ-డ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంది, దీని స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి కూడా 89% గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోనుకు క్రిస్టల్ డిజైన్ ఇవ్వబడింది మరియు ఈ ఫోన్ను క్రిస్టల్ బ్లూ మరియు క్రిస్టల్ పర్పుల్ కలర్ వేరియంట్‌లలో ప్రవేశపెట్టారు.

 

ఇక ఈ స్మార్ట్ ఫోన్ కూడా రియల్మి 5 ప్రో మాదిరిగానే వెనుక ఒక క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంది. ఇది 240fps స్లో-మో వీడియో, 190 డిగ్రీల వ్యూ ని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఒక పెద్ద 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

Slide 4 - అతిపెద్ద 5,000 mAh మరియు 6,000 mAh బ్యాటరీ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్లు

3. వివో జెడ్ 1 ప్రో

ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో  ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. 

Slide 5 - అతిపెద్ద 5,000 mAh మరియు 6,000 mAh బ్యాటరీ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్లు

4. ఇన్ఫినిక్ హాట్ 8

ఈ INFINIX HOT 8 స్మార్ట్ ఫోన్  ఒక 6.52 అంగుళాల HD+ IPS డ్యూ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది . ఈ స్మార్ట్ఫోన్ను ఆండ్రాయిడ్ 9 ఫై మీద ఆధారితంగా XOS 5.0 చీతా తో ప్రారంభించింది మరియు ఈ పూర్తి డివైజ్ మొత్తానికి పవర్ అందించాడని ఒక పెద్ద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 2.0Ghz వరకూ క్లాక్ అందించగల ఒక Helio P22 Octa-core 64-bit ప్రాసెసరుతో వస్తుంది. దీనికి జతగా, 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజ్ అనుసంధానంతో వస్తుంది.

ఈ  HOT 8 కెమేరాల గురించి  మాట్లాడితే,  వెనుకభాగంలో  13 మెగాపిక్సెల్ (f1.8) ప్రధాన కెమేరాకి జతగా మరొక 2MP డెప్త్ సెన్సార్ మరియు ఒక లో లైట్ సెన్సార్ జతగా కలిపిన ఒక  ట్రిపుల్ రియర్ కెమేరాని ఇందులో అందించారు. ఆటో సీన్ డిటెక్షన్, AI పోర్ట్రైట్, AI HDR, AI బ్యూటీ, AI Bokeh మరియు నైట్ షాట్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం  ఒక 8-MP AI కెమెరాని ఒక ఫ్లాష్ ని కలిగి ఉంది, దీని ఎపర్చరు f2.0 గా ఉంటుంది.

Slide 6 - అతిపెద్ద 5,000 mAh మరియు 6,000 mAh బ్యాటరీ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్లు

5. శామ్సంగ్ గెలాక్సీ M30

శామ్సంగ్ గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్  ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ - U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక ఎక్సినోస్ 7904  ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది. . ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 8.0.1 పైన ఆధారితంగా శామ్సంగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. ఒక SD కార్డు ద్వారా 512GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 13MP +5MP+5MP  ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 13MP ప్రధాన కెమరా మరియు 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్లకోసం మరియు మరొక 5MP డెప్త్ ని పసిగట్టటానికి ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరాని అందించారు. 

Slide 7 - అతిపెద్ద 5,000 mAh మరియు 6,000 mAh బ్యాటరీ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్లు

6. వివో వై 15

ఈ వివో వై 15 లో ఒక 6.20-అంగుళాల HD + డిస్ప్లే  ఉంది, ఇది 720 × 1544 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ఉంటుంది. స్క్రీన్ పైభాగంలో వాటర్ డ్రాప్ నాచ్ అందించబడుతుంది, దీనిలో సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ను మీడియాటెక్ హెలియో పి 22 ఆక్టా-కోర్ SoC , 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్‌తో పరిచయం చేశారు. అలాగే, ఈ ఫోన్ యొక్క స్టోరేజిను పెంచడానికి మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఇవ్వబడింది.

 

ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ ఒక పెద్ద  5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది కాని ఇది వేగంగా ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వదు. సాఫ్ట్‌వేర్పరంగా  ఈ వివో వై 15 ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 9 లో పనిచేస్తుంది. కనెక్టివిటీ కోసం, పరికరం డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్లు, 4 జి వోల్టిఇ, బ్లూటూత్, వై-ఫై మరియు Gps ను అందిస్తుంది.

Slide 8 - అతిపెద్ద 5,000 mAh మరియు 6,000 mAh బ్యాటరీ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్లు

7. గెలాక్సీ M20

గెలాక్సీ M20 ఒక 2340x 1080 రిజల్యూషనుతో, 19.5 :9 యాస్పెక్ట్ రేషియో గల కొంచెం పెద్దదైన ఒక 6.3 - అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా, ఒక  వాటర్ డ్రాప్ నోచ్ వలె కనిపించే, ఇన్ఫినిటీ - V  డిస్ప్లేతో వస్తుంది. ఇది 90% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది. ఇది 1.8GHz డ్యూయల్ కొర్ జతగా 1.6 హెక్సాకోర్ కలిపిన, క్లాక్ చేయబడిన Exynos 7904 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా Mali-G71 MP2 GPU శక్తితో వస్తుంది. ఈ ఫోన్, 3GB + 32GB స్టోరేజి మరియు 4GB + 64GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ఒక మెమొరీ కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజిని పెంచుకునే వీలును కూడా కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ VoLTE సిమ్ ఫిచరుతో వస్తుంది.

Slide 9 - అతిపెద్ద 5,000 mAh మరియు 6,000 mAh బ్యాటరీ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్లు

8. వివో వై 12

13MP ప్రాధమిక కెమెరా మరియు 8MP వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2MP డెప్త్  సెన్సార్ తో ఈ మొబైల్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. వివో వై 12 సెల్ఫీ కోసం 8 ఎంపి ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. భారతదేశంలో ప్రారంభించిన ఈ వివో ఫోన్ వాయిస్ అండ్ హ్యాండ్ గెస్చర్  నియంత్రణ, AI బ్యూటిఫికేషన్, పోర్ట్రెయిట్ మోడ్, లైవ్ ఫోటోలు, హెచ్‌డిఆర్, స్లో-మో, టైమ్‌లాప్స్ మొదలైన అనేక కెమెరా ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ యొక్క మరొక ప్రధాన ప్రత్యేకతగా ఇందులోని 5,000 mAh బ్యాటరీ గురించి చెప్పొచ్చు. 

Slide 10 - అతిపెద్ద 5,000 mAh మరియు 6,000 mAh బ్యాటరీ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్లు

9. ఒప్పో A9 2020

ఈ స్మార్ట్‌ఫోన్ ఒక 6.50 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, పైన వాటర్‌డ్రాప్ నాచ్ ఉంది మరియు గొరిల్లా గ్లాస్ 3+ యొక్క రక్షణ కూడా ఇవ్వబడింది. కనెక్టివిటీ కోసం, ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో-సిమ్‌తో) కనెక్టివిటీతో వస్తుంది మరియు ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా కలర్‌ఓఎస్ 6.0.1 లో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది మరియు 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

కెమెరా పరంగా చూస్తే, ఒక క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ర్ ఒప్పో A9 2020 లో ఇవ్వబడింది. అలాగే, 48 MP  ప్రైమరీ కెమెరా ఇందులో ఇవ్వబడింది. ఈ ఫోన్ ముందు భాగంలో 16 MP కెమెరా అందించబడుతుంది. ఒప్పో A9 2020, 8GB RAM మరియు 128GB స్టోరేజిని అందిస్తుంది మరియు ఈ పరికరంలో మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.

Slide 11 - అతిపెద్ద 5,000 mAh మరియు 6,000 mAh బ్యాటరీ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్లు

10. అసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M2

సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.26 అంగుళాల FHD+సుస్ జెన్ఫోన్  మాక్స్ ప్రో M2, ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  660 ప్రాసెసర్,4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జతగా వస్తుంది, దీన్ని 2TB వరకు విస్తరించవచ్చు. అసూస్ జెన్ఫోన్  మాక్స్ ప్రో M2 సెల్ఫీ కోసం ముందు 13MP కెమేరాతో పాటు వేనుక 12MP + 5MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక బ్యాటరీ విషానికి వస్తే ఇందులో కూడా ఒక పెద్ద 5,000mAh బ్యాటరీని పొందుతారు.   

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status