రూ. 15,000 ధరలో బెస్ట్ 10 స్మార్ట్ ఫోన్లు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Sep 29 2019
రూ. 15,000 ధరలో బెస్ట్ 10 స్మార్ట్ ఫోన్లు

ముందుగా, 15,000 రూపాయల ధరలో ఒక స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే, అందులో ప్రాసెసర్ మంచిదైతే కెమెరాల్లో రాజీపడల్సివచ్చేది లేదా బ్యాటరీ లేదా డిజైన్ మరియు క్వాలిటీలో కొంత నిరాశ చెందాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ మరియు మార్కెట్లో నడుస్తున్న పోటీ కారణంగా, చాలా వరకు స్మార్ట్ ఫోన్ తయారీదారుల ఆలోచన ధోరణిలో మార్పుతెచ్చాయి. ఇప్పుడు కేవలం 15,000 రూపాయల కంటే తక్కువ ధరలో అన్ని ఫీచర్ల సమాహారంగా రూపొందిన స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. అటువంటి కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఇక్కడ అందించిన జాబితాలో చూడవచ్చు. 

రూ. 15,000 ధరలో బెస్ట్ 10 స్మార్ట్ ఫోన్లు

1.XIAOMI REDMI NOTE 7 PRO 

ఇండియాలో మిడ్ రేంజ్ ధరలో ఒక 48MP ప్రధాన కెమేరా, అదీకూడా SONYIMX586 సెన్సారుతో ఒక స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చిన ఘనత, కేవలం షావోమి మాత్రమే సొంతం అని చెప్పొచ్చు. కేవలం, కెమేరా మాత్రమే కాదు ఒక స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసరుతో మంచి స్పీడ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB మరియు 6GB వంటి ర్యామ్ ఎంపికలతో కూడా లభిస్తుంది. అలాగే, ఒక 4,000 బ్యాటరీతో ఒక రోజంతా కూడా చక్కగా సరిపోయేలా అందించారు. 

రూ. 15,000 ధరలో బెస్ట్ 10 స్మార్ట్ ఫోన్లు

2. SAMSUNG GALAXY M30

శామ్సంగ్ గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ - U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక ఎక్సినోస్ 7904  ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 13MP +5MP+5MP  ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. 

రూ. 15,000 ధరలో బెస్ట్ 10 స్మార్ట్ ఫోన్లు

3. HONOR 8X

ఈ స్మార్ట్ ఫోన్  మధ్య స్థాయి ధరలో  2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 5.5 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 20MP+2MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో వస్తుంది.  అంతేకాదు, ప్రస్తుతం దీనిపైనా ధరను కూస్తో తగ్గించింది కాబట్టి  కేవలం రూ. 12,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

రూ. 15,000 ధరలో బెస్ట్ 10 స్మార్ట్ ఫోన్లు

4. REALME 3 PRO

రియల్మీ 3 ప్రో  స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.3 అంగుళాల వాటర్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 90.8%  స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 616 మరియు 4GB మరియు 6GB ర్యామ్ శక్తితో వస్తుంది. 16MP కెమేరాకు జతగా f/2.4 అపర్చరు కలిగిన మరొక 5MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఈ ప్రాధాన 16MP కెమెరా ఒక SonyIMX519  సెన్సారుతో వస్తుంది. 

రూ. 15,000 ధరలో బెస్ట్ 10 స్మార్ట్ ఫోన్లు

5. ASUS ZENFONE MAX PRO M2 TITANIUM EDITION

సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.26 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 13 MP సెల్ఫీ కెమెరా, 12MP+5MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక పెద్ద 5000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

రూ. 15,000 ధరలో బెస్ట్ 10 స్మార్ట్ ఫోన్లు

6. MOTO  G7 POWER 

మోటో నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్  మధ్య స్థాయి ధరలో ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 8MP సెల్ఫీ కెమెరా, 12MP సింగిల్ వెనుక కెమెరాతో వస్తుంది. కానీ ఇది గూగుల్ లెన్స్ తో వస్తుంది కాబట్టి మంచి బొకేహ్ షాట్లు కూడా తీసుకోవచ్చు మరియు మంచి క్లారిటీ ఫోటోలను తీస్తుంది. అలాగే,  ఒక 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు 13,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

రూ. 15,000 ధరలో బెస్ట్ 10 స్మార్ట్ ఫోన్లు

7. HUAWEI  Y9 (2019)

 సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్,  13MP +2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు కూడా 16MP +2MP డ్యూయల్ కెమేరాని కలిగి ఉంటుంది. ఒక 6.5 అంగుళాల సన్నని నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  4000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

రూ. 15,000 ధరలో బెస్ట్ 10 స్మార్ట్ ఫోన్లు

8. NOKIA 6.1 PLUS 

ఈ నోకియా 6.1 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల FHD+ నోచ్ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3060 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 16MP +5MP డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది.

రూ. 15,000 ధరలో బెస్ట్ 10 స్మార్ట్ ఫోన్లు

9. XIAOMI MI A2

షావోమి నుండి ముందుగా వచ్చిన ఈ కెమేరా ఫోన్, స్మార్ట్ ఫోన్ 2160 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 FHD+ ఫుల్ వ్యూ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 660AIE ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3010 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 12MP +20MP  డ్యూయల్  కెమేరా సేటప్పుతో మరియు ముందు 20MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది ప్రస్తుతం రూ.11,999 ప్రారంభదరతో లభిస్తోంది. 

రూ. 15,000 ధరలో బెస్ట్ 10 స్మార్ట్ ఫోన్లు

10. REDMI Y3

షావోమి సంస్థ నుండి కేవలం రూ.9,999 ధరలో 32MP సెల్ఫీ కెమేరాతో ఇండియాలో విడుదల చేయబడినటువంటి, ఈ స్మార్ట్ ఫోన్, 1.8 GHz వద్ద క్లాక్ చేయబడిన,  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది మరియు ఇది 32GB/64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 12+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక 32MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. 

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements