మీకు తెలియని సూపర్బ్ అండ్ బెస్ట్ యాంటి theft ఆండ్రాయిడ్ యాప్

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Sep 21 2016
మీకు తెలియని సూపర్బ్ అండ్ బెస్ట్ యాంటి theft ఆండ్రాయిడ్ యాప్

కాస్ట్లీ ఫోన్ అయినా బడ్జెట్ ఫోన్ అయినా, కొన్న తరువాత పొతే, పోయింది అని బాధపడటం కన్నా పొతే దానిని ఎలా తిరిగి తెచ్చుకోవాలి అనే విషయాలను తెలుసుకోవటం మనకే ఉపయోగకరం. పోవటం అంటే మీరు మరిచిపోయి వదిలేయటం, దానిని వేరే వ్యక్తులు చూసి బయట షాప్స్ లో అన్ లాంకింగ్ చేసి వాడుకోవటం. కాని అలా వారు వాడుకోకుండా, ఎవరి చేతుల్లో ఉందో తెలుసుకోవటానికి కొన్ని యాప్స్ ఉన్నాయి. ప్లే స్టోర్ లో ది బెస్ట్ యాంటి theft యాప్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకోనున్నారు. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. గమనిక: డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

మీకు తెలియని సూపర్బ్ అండ్ బెస్ట్ యాంటి theft ఆండ్రాయిడ్ యాప్

యాప్ పేరు Cerberus. ప్లే స్టోర్ లో ఈ లింక్ లో ఉంది. యాప్ డౌన్లోడ్ ను లాస్ట్ స్లైడ్ లో ఉన్న లింక్ లో డౌన్లోడ్ చేస్తే మరిన్ని వెర్షన్స్ పొందుతారు. సైజ్ 7MB. 4.4 స్టార్ రేటింగ్. దీనికి మిగిలిన ఫోన్లకు ఉన్న తేడా ... ఇది కేవలం ఫోన్ ఏ ప్రదేశంలో ఉంది అనే విషయమే మాత్రమే కాదు, ఎవరి చేతుల్లో ఉంది, అతని ముఖం కుడా చూపించి ఫోన్ మీ వద్దకు తిరిగి తెచ్చే ఆప్షన్స్ ఇస్తుంది.

మీకు తెలియని సూపర్బ్ అండ్ బెస్ట్ యాంటి theft ఆండ్రాయిడ్ యాప్

ఇది మూడు పద్దతుల్లో ఫోన్ పై పనిచేస్తుంది.

1. వెబ్ సైట్ ద్వారా మీ ఫోన్ ను రిమోట్ కంట్రోలింగ్ చేయటం. 

2. sms కమాండ్స్ ద్వారా రిమోట్ కంట్రోల్. (పోయిన ఫోన్ లో నెట్ లేకపోతే)

3. మీరు కంట్రోల్ చేయకుండానే ఆటోమేటిక్ గా అది అలర్ట్స్ పంపటం. (పోయిన విషయం తెలియనప్పుడు)

మీకు తెలియని సూపర్బ్ అండ్ బెస్ట్ యాంటి theft ఆండ్రాయిడ్ యాప్

ఎందుకు ఇది బెస్ట్ యాప్?
1. కేవలం మొబైల్ లొకేషన్ ట్రాకింగ్ కాదు, ఫోన్ వాడుతున్న వ్యక్తి యొక్క ఫోటో , వీడియోస్ కూడా పంపిస్తుంది మెయిల్ కు. దొంగతనం చేసిన వ్యక్తి ఫోన్ షాట్ డౌన్ కూడా చేయనివ్వకుండా పవర్ ఆప్షన్ ను డిసేబుల్ చేస్తుంది. అలాగే స్టేటస్ బార్ కూడా బ్లాక్ చేయగలదు.

2. ఫోన్ ను సిస్టం యాప్ గా ఇంస్టాల్ చేస్తే(రూట్ ఉంటే) కంప్లీట్ uninstall చేసి gps ను తిరిగి ఏనాబెల్ చేస్తుంది ఫోన్ లో.

3. మైక్రోఫోన్ ద్వారా ఆడియో రికార్డింగ్.

ఇవి కాకుండా ఇంటర్నల్ అండ్ sd కార్డ్ డేటా ఫార్మాట్, అన్ లాక్ కోడ్ చేంజ్, కాల్ డేటా లిస్ట్ send, అలారం, WiFi అండ్ సిమ్ ఇన్ఫర్మేషన్ sending ఉన్నాయి.

మీకు తెలియని సూపర్బ్ అండ్ బెస్ట్ యాంటి theft ఆండ్రాయిడ్ యాప్

ఆటోమేటిక్ ఫంక్షన్స్
1. సిమ్ మార్చగానే, మెయిల్ కు లేదా మీరు ముందుగా సెట్ చేసిన నంబర్ కు ఫోన్ వాడుతున్న వ్యక్తి యొక్క ఫోటో ను పంపిస్తుంది.
2. మీరు ముందుగా సెట్ చేసిన ఏరియా నుండి ఫోన్ దాటితే, మెయిల్ కు అలెర్ట్ వస్తుంది. 
3. custom ఆటోమేషన్ అలర్ట్స్ కూడా ఉన్నాయి. మరిన్ని సందేహాలు కు సమాచారం ఈ లింక్ లో చూడండి. మరింత సమాచారం కొరకు ఈ లింక్స్ చూడండి వెబ్ లింక్ యాప్ లింక్

అయితే ఇవన్నీ మొదటి వారం రోజులు ఫ్రీ, తరువాత ప్రతీ మూడు సంవత్సరాలకు 300 రూ పే చేయాలి. ఇప్పుడు ఇది మీకు నచ్చని విషయం. కదూ? కాని ఫోన్ పోతే కొన్ని వేల రూ కు పోగొట్టుకునే బదులు ఇయర్ కు 100 రూ ఖర్చు చేయటం చాలా బెటర్. ఆలోచించండి! గమనిక: డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements