భారీ ఆఫర్లతో అమెజాన్ తీసుకువస్తున్న సమ్మర్ సేల్ ప్రారంభ తేదీని అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ సమ్మర్ సేల్ మే 4 వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన భారీ ఆఫర్లను మరియు డీల్స్ ను ఆఫర్ల చేయనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. అధనంగా, ICICI, Kotak మరియు RBL Bank బ్యాంక్ అఫర్ ను కూడా కొనుగోలుదారుల కోసం జత చేసింది. దీనితో, ఈ సేల్ నుండి ఈ మూడు బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డ్ తో వస్తువులను కొనుగోలు చేసే వారికి 10% సేవింగ్ (డిస్కౌంట్) కూడా లభిస్తుంది.
ఇప్పటికే ఈ సేల్ నుండి అందించనున్న కొన్ని భారీ ఆఫర్లను గురించి టీజింగ్ చేస్తోంది. వీటిలో, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్స్ మరియు AC లు ముందు వరుసలో ఉన్నాయి. అమెజాన్ ఇప్పటికే అందించిన టీజర్ ప్రకారం, Xiaomi 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో అఫర్ చేయనుంది.
ఈ అప్ కమింగ్ అమెజాన్ సేల్ Amazon Summer Sale నుండి ల్యాప్ టాప్స్ మరియు హెడ్ ఫోన్స్ పైన 70% వరకు డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అంతేకాదు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు మరియు AC ల పైన కూడా గరిష్టంగా 50% డిస్కౌంట్ ను అందించనున్నట్లు టీజింగ్ మొదలుపెట్టింది. హోమ్ & కిచెన్, ఫ్యాషన్ మరియు భారతీయ చిన్న వ్యాపారుల నుండి వచ్చిన యూనిక్ ప్రోడక్ట్స్ పైన 70% వరకూ డిస్కౌంట్ లను ఇవ్వనున్నట్లు చెబుతోంది.
ఈ సేల్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్లు కూడా విడుదలకానున్నాయి. అప్ కమింగ్ లాంచ్ స్మార్ట్ ఫోన్స్ వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్, వన్ ప్లస్ 10R 5G, iQOO Z6 Pro గురించి కూడా అమెజాన్ టీజింగ్ చేస్తోంది. త్వరలో సేల్ కి అందుబాటులోకి రానున్న గెలాక్సీ M53 5G మరియు మరిన్ని ఫోన్స్ ను కూడా వెల్లడించింది. ఇక ఈ సేల్ నుండి అతి తక్కువ ధరకు లభించనున్న ప్రోడక్ట్స్ విషయానికి వస్తే, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్స్, AC లు మరియు రిఫ్రిజిరేటర్లు డిస్కౌంట్ ఆఫర్లు మరియు డీల్స్ తో తక్కువ ధరకు లభించనున్నాయి.