govo announced big price cut on latest 5.2 Dolby soundbar
Price Cut: ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన సౌండ్ బార్ పై కంపెనీ భారీ తగ్గింపు ప్రకటించింది. కంపెనీ అందించిన ఈ గొప్ప తగ్గింపు తో డ్యూయల్ సబ్ ఉఫర్ కలిగిన 5.2 Dolby సౌండ్ బార్ చాలా చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఇప్పుడు కేవలం 9 వేల రూపాయల బడ్జెట్ కేటగిరిలో లభిస్తుంది. ఇది కాకుండా అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై ఆఫర్ చేస్తున్న అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
బడ్జెట్ ధరలో మంచి ఆడియో ప్రొడక్ట్స్ అందిస్తున్న బ్రాండ్ గా పేరు పొందిన GOVO లేటెస్ట్ సౌండ్ బార్ పై ఈ తగ్గింపు ప్రకటించింది. కంపెనీ ఇటీవల అందించిన 5.1 డాల్బీ ఆడియో సౌండ్ బార్ GOSURROUND 999 పై ఈ ప్రైస్ కట్ ప్రకటించింది. ఈ సౌండ్ బార్ రూ. 13,999 రూపాయల ధరతో 2025 ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది.
అయితే, ఇప్పుడు ఈ సౌండ్ బార్ పై కంపెనీ అందించిన రూ. 4,500 ప్రైస్ కట్ తో కేవలం రూ. 9,499 ధరకే సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ప్లాట్ ఫామ్స్ కూడా 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించాయి. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 8,550 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read: కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart TV అందుకోండి.!
ఈ గోవో సౌండ్ బార్ ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన 5.2 ఛానల్ సౌండ్ బార్ మరియు ఇది టోటల్ 660W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో మూడు 3.54 ఇంచ్ స్పీకర్లు కలిగిన బార్, రెండు 3.54 ఇంచ్ స్పీకర్లు కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు 6.5 ఇంచ్ ఉఫర్ కలిగిన రెండు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ మంచిగా ఆకట్టుకునే ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది.
సౌండ్ పరంగా, ఈ గోవో సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ మూడు ప్రత్యేకమైన ఈక్వలైజర్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది HDMI ARC, ఆప్టికల్, AUX,USB మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కంట్రోల్ కూడా కలిగి ఉంటుంది.