మైక్రోమ్యాక్స్ కాన్వాస్ లాప్ టాబ్ Review: రెండింటికి పూర్తిగా న్యాయం చేయలేక పోయింది

బై Prasid Banerjee | అప్‌డేట్ చేయబడింది Jun 22 2015
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ లాప్ టాబ్  Review: రెండింటికి పూర్తిగా న్యాయం చేయలేక పోయింది
DIGIT RATING
60 /100
  • design

    71

  • performance

    53

  • value for money

    54

  • features

    61

  • PROS
  • డివైజ్ తో పాటు కీ బోర్డ్ వస్తుంది.
  • బడ్జెట్ ధర
  • CONS
  • డిజైన్ అంత స్టాండర్డ్ గా లేదు
  • బ్యాటరీ లైఫ్ తక్కువగా ఉంది

తీర్పు

దీని ధరకు (14,990రూ) ఇది బాగానే ఉంది అని అనుకోవచ్చు, కాని లాప్ టాబ్ కదా అని దీని మీద ఆధారపడి అన్ని కంపూటర్ పనులు చేసుకోవచ్చు అనే ప్లేన్స్ తో దీనిని ఆర్డర్ చేస్తే డిసప్పోయింట్ అవుతారు. క్రోమ్ బుక్స్ అయితే దీనికన్నా 2000 రూ తక్కువ లో దొరుకుతున్నాయి.
 

BUY మైక్రోమ్యాక్స్ కాన్వాస్ లాప్ టాబ్

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ లాప్ టాబ్ detailed review

కేవలం ఒక కీ బోర్డ్ ఇచ్చి టాబ్లెట్ కు లాప్ టాబ్ అనే పేరు పెట్టి లాప్టాప్ తక్కువకి వస్తుంది అనే అభిప్రాయం తెప్పించింది మైక్రోమ్యాక్స్. అన్ని ఫీచర్స్ ఇచ్చింది అని చెప్పుకోవటానికే కాని రియల్ టైమ్ యూసేజ్ లో మీకు వాటి పనితనం, క్వాలిటి విషయాలపై డిసప్పోయింట్మెంట్ వస్తుంది. దీనిలో 2జిబ్ ర్యామ్, 8జిబి ఇంటర్నెల్ స్టోరేజ్, 32 జిబి అదనపు స్టోరేజ్ సదుపాయం, టచ్ స్క్రీన్, విండౌస్ 8 os ఉన్నాయి. 14,990 రూ ధర ఉన్న దీనికి సిమ్ కూడా ఉంది.

బిల్డ్ మరియు డిజైన్: ఫర్వాలేదు
మొత్తం అంతా ప్లాస్టిక్ తో తయారు చేయబడింది. చూడటానికి రాగ్గేడ్ లుక్ ఇస్తుంది. చూడానికి x'iaomi మి ప్యాడ్ అంత అందమైన లుక్స్ తో ఉండదు, కాని బిల్ట్ క్వాలిటీ మాత్రం  స్ట్రాంగ్ గా ఉంటుంది. వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ చాలా చిన్నవిగా ఉండటం వలన ఒకదాని బదులు మరొకటి ప్రెస్ అవుతుంది.

                                  
                                  

దీనితో పాటు కీ బోర్డ్ ఇచ్చి మైక్రోమ్యాక్స్ దీనికి లాప్ టాబ్ అనే పేరును పెట్టింది. కీ నోర్డ్ ఐడియా ఈ ధరకి బాగుంది. కాని కీ బోర్డ్ ను టాబ్లెట్ కు కనెక్ట్ చేసే విధానం బాలేదు. కేవలం ఒక్క పోసిషన్ లోనే పెట్టుకోవటానికి అవుతుంది. అలాగే కనెక్షన్ కూడా సులభంగా స్టేబుల్ గా లేదు. పిన్ కనెక్టర్ ద్వారా కీ బోర్డ్ కు కనెక్ట్ అవుతుంది టాబ్లెట్ కమ్ లాప్ టాబ్. ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెడితే కాని కనెక్షన్ సరిగ్గా పనిచేయటంలేదు. 

                                 

లాప్ టాబ్ కొంచెం పెద్దగా, బరువుగా కూడా ఉంది. అంటే దీనిని టాబ్లెట్ గా ఉపయోగించే సందర్భాలు తక్కువుగా ఉంటాయి. కేవలం ఒక దగ్గర ప్లే చేసి లాప్ టాప్ ఆ వాడేందుకే ఇష్టం చూపుతారు.

కీ బోర్డ్: బాలేదు

                               

14,999 రూ లకు ఇంతకు మించి మంచి కీ బోర్డ్ ను అడగటం అంత ఫెయిర్ కాదు అని కొంతమంది అనుకుంటారు. కాని నిజంగా బాలేని కీ బోర్డ్ మీద వర్క్ చేయటానికి ఎంత మందికి ఇష్టం ఉంటుంది, అది ఎంత అనుకూలమైన ధర లో వచ్చ్సినప్పటికీ.

                                    

 వెరీ లో క్వాలిటీ కీ బోర్డ్. దీనికి usb పోస్ట్ కూడా ఇచ్చింది మైక్రోమ్యాక్స్. అన్ని ఆప్షన్స్ ఇచ్చింది అని చెప్పుకోవటానికి ఇచ్చింది కాని దేనిలోని క్వాలిటీ లేదు.

డిస్ప్లే: బాగుంది
నిజంగా బ్రైట్ డిస్ప్లే వచ్చింది కాని వ్యూయింగ్ ఏంగిల్స్ చాలా పూర్. లాప్ టాప్ లా యూజ్ చేసినప్పుడు మాత్రమే వ్యూయింగ్ ఏంగిల్స్ పూర్ అనిపిస్తాయి. ఫిక్స్\డ ప్లేస్ మెంట్ ఉండటం వలన. కలర్స్ మరియు టచ్ బాగున్నాయి. వీడియో ప్లే కూడా బాగుంది.

పెర్ఫార్మెన్స్: కేవలం టాబ్లెట్ పనులకే
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ లాప్ టాబ్ ను కేవలం రైటింగ్, మూవీస్ వాచింగ్ లాంటి అవసరాలను తీర్చుకోవటానికి మాత్రమే బాగుంటుంది పెర్ఫార్మెన్స్ విషయంలో. అలా కాకుండా ఫుల్ ఫ్లేడ్జేడ్ లాప్ టాప్ గా వాడుకునే వాళ్లకి ఇది కర్కేట్ డివైజ్ కాదు.
కారణాలు... లాప్ టాబ్ లో కేవలం 2జిబి ర్యామ్ ఉంది, ఇది గూగల్ క్రోమ్ వంటి బ్రౌజర్స్ ను ఓపెన్ చేస్తే చాలు లాగ్ అవుతుంది. రెండవది, 8జిబి ఇంటర్నెల్ స్టోరేజ్ మాత్రమే ఉంది, అదనపు స్టోరేజ్ సపోర్ట్ ఉన్నప్పటికీ అది 32 జిబి మాత్రమే, ఇది కంప్లీట్ లాప్టాప్ పనులకు సరిపోదు. 

బ్యాటరీ: ఏవరేజ్
మా బ్యాక్ అప్ టెస్ట్ లలో గూగల్ క్రోమ్ డివైజ్ లపై 7.5 గంటలు పాటు వచ్చే ఏవరేజ్ బ్యాటరీ బ్యాక్ అప్ దీనిపై 5.2 గంటలు వచ్చింది. 5.2 గంటలు తక్కువేమీ కాదు కాని Xiaomi మి ప్యాడ్ 16.6 గంటలు  బ్యాక్ అప్ ఇస్తుంది.


Micromax Canvas Laptab Battery | Create infographics

 

కేవలం బ్యాక్ అప్ మాత్రమే కాదు, ఛార్జింగ్ కూడా చాలా ఎక్కువ సేపు తీసుకుంటుంది. పైగా దీని ఒరిజినల్ చార్జర్ ఉపయోగిస్తేనే ఛార్జింగ్ స్పీడ్ గా అవుతుంది.

బాటమ్ లైన్:
దీని ధరకు (14,990రూ) ఇది బాగానే ఉంది అని అనుకోవచ్చు, కాని లాప్ టాబ్ కదా అని దీని మీద ఆధారపడి అన్ని కంపూటర్ పనులు చేసుకోవచ్చు అనే ప్లేన్స్ తో దీనిని ఆర్డర్ చేస్తే డిసప్పోయింట్ అవుతారు. క్రోమ్ బుక్స్ అయితే దీనికన్నా 2000 రూ తక్కువ లో దొరుకుతున్నాయి.
 

 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ లాప్ టాబ్ Key Specs, Price and Launch Date

Release Date: 05 Oct 2015
Market Status: Launched

Key Specs

  • OS OS
    Windows
  • Screen Size (inch) Screen Size (inch)
    10.1
  • Resolution Resolution
    1280 x 800
  • Memory Memory
    32 GB/2 GB
logo
Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably.

Advertisements
Advertisements

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ లాప్ టాబ్

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ లాప్ టాబ్

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status