ZTE నుబియా Z9 మిని Review: బెస్ట్ కెమేరా, ఏవరేజ్ పెర్ఫార్మన్స్

బై Prasid Banerjee | అప్‌డేట్ చేయబడింది Jun 16 2015
ZTE నుబియా Z9 మిని  Review: బెస్ట్ కెమేరా, ఏవరేజ్ పెర్ఫార్మన్స్
DIGIT RATING
73 /100
  • design

    83

  • performance

    68

  • value for money

    68

  • features

    74

  • PROS
  • 20 వేల లోపు ఉన్న ఫోనులన్నింటిలో ఇది బెస్ట్ కెమేరా తో వస్తుంది
  • కాపాక్ట్ మరియు ప్రీమియం లుక్స్
  • CONS
  • గ్లాసీ బ్యాక్, ఫింగర్ ప్రింట్లను ఎక్కువుగా ఆకర్షిస్తాది
  • పెర్ఫార్మెన్స్ ధరకు తగ్గట్టుగా అనిపించలేదు

తీర్పు

17 వేల బడ్జెట్ ఉండి, ఏవరేజ్ పెర్ఫార్మన్స్ తో బెస్ట్ కెమేరా కావాలని అనుకుంటే ఇది కరెక్ట్ చాయిస్. లేదు పెర్ఫార్మెన్స్ ఎక్కువ ప్రియారిటి అయితే ఆసుస్ జెన్ ఫోన్ 2 దీని కన్నా బెటర్ ఆప్షన్. 15 వేలకు మించ కూడదు అని అనుకున్నట్లు అయితే కొంచెం తక్కువ క్వాలిటీ కెమేరా తో Xiaomi మి 4i సేమ్ కాన్ఫిగరేషన్ తో సేమ్ పెర్ఫార్మన్స్ ను ఇస్తుంది. Xiaomi మి 4i కెమేరా బాగుంటుంది కాని ZTE Z9 పోలిస్తే మాత్రం కొంచెం తక్కువ ఇమ్ప్రేస్సివ్ కెమేరా అని చెప్పాలి.

Xiaomi మి 4i పూర్తి రివ్యూ ఇక్కడ చూడగలరు.

BUY ZTE నుబియా Z9 మిని
Buy now on amazon స్టాక్ లేదు 6799

ZTE నుబియా Z9 మిని detailed review

లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన ZTE చైనీస్ కంపెని, నుబియా Z9 మరియు బ్లేడ్ క్లక్స్  అని రెండు మోడల్స్ ను లాంచ్ చేసింది. 16,999 రూ ధరతో అమెజాన్ లో లభిస్తున్న ZTE Z9 ధరకు తగ్గ అవుట్పుట్ ను ఇస్తుందా లేదా చూద్దాం రండి.

బిల్డ్ మరియు డిజైన్: కాంపాక్ట్ సైజ్


మొదటిసారి మొబైల్ ను చూసిన వెంటనే మంచి బిల్డ్ మరియు లుక్స్ అని అభిప్రాయం కలుగుతుంది. లోతుగా పరిశీలిస్తే వెనుక ఉన్న షైనీ ప్లాస్టిక్ అని తెలుసుకుంటారు. ఇది ఫింగర్ ప్రింట్స్ ను ఆకర్షిస్తుంది. ఫోన్ ముందూ, వెనుక ప్లాస్టిక్ బాడీ ఉండగా, సైడ్స్ లో మెటల్ రిమ్ ను గమనిస్తారు.


Xiaomi మి 4i కన్నా 1mm పొడవుగా మరియు 0.4 mm ఎక్కువ మందం ఉంటుంది. అంటే ఇది చాలా స్లిమ్ మరియు కాంపాక్ట్ గా ఉందని ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి(మి 4i కాంపాక్ట్ మొబైల్ అని మీరు ఒప్పుకుంటే). బిల్డ్ డిజైన్ పరంగా ఎటువంటి కంప్లెయింట్లు లేవు కాని బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిషింగ్ కాకుండా మ్యాటి ఫినిషింగ్ ఇచ్చి ఉంటే బాగున్ను. అయితే గ్లాసీ బ్యాక్ కొందరికి నచ్చుతుంది.


డిస్ప్లే: వెరీ గుడ్
ఫోనులో మొట్ట మొదటిగా మిమ్మల్ని ఆకర్షించేది, 5in 1080P డిస్ప్లే, ఇది Xiaomi మి 4i అంత షార్ప్, కలరఫుల్ మరియు బ్రైట్ గా ఉంది. కలర్స్ అన్నీ బాగా బ్యాలన్స్ గా ఉన్నాయి. డిస్ప్లే నిజంగా చాలా నైస్ గా అనిపిస్తాది.

యూజర్ ఇంటర్ఫేస్: బాగుంది.
ZTE నుబియా UI చాలా కలరఫుల్ గా సూపర్ లుక్స్ ను ఇస్తుంది. ఇది లుక్స్ కు ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చింది అని కొన్ని నిముషాలు ఫోన్ తో గడపగానే అర్థమవుతుంది. దీనికి తోడూ కొన్ని జేస్తర్ బేస్డ్ ఫీచర్స్ ను అదనంగా ఇస్తుంది. మూడు వేళ్లతో డిస్ప్లే పై పైకి స్వైప్ చేస్తే స్క్రీన్ షాట్ తీయటం మరియు ఎడమ వైపు స్వైప్ చేస్తే యాప్స్ నుండి యాప్స్ కు మారటం లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ కూడా ఉంది కాని 5in స్క్రీన్ మించిన స్క్రీన్ ల పై ఈ ఆప్షన్ బాగుంటుంది.

ఓవర్ ఆల్ గా మంచి లుక్స్ తో ఉంది UI కాని MIUI os అంత ఉపయోగకరంగా ఉండదు. అన్నిటికీ మించి ప్రత్యేకంగా కొత్తగా నేర్చుకునే సమస్యలు లేకుండా అన్నీ సింపుల్ గా ఇస్తుంది ZTE నుబియా UI.

పెర్ఫార్మెన్స్: గేమింగ్ మరియు హెవీ యూజర్స్ కు ఇది కరెక్ట్ కాదు
ఈ ఫోన్ కు ఉన్న మొదటి మైనస్, పెర్ఫార్మెన్స్. స్నాప్ డ్రాగన్ 615 SoC , 2జిబి ర్యామ్ పై పనిచేసే Z9 కు రెండు ప్రాబ్లెమ్స్ ఉన్నాయి. మొదటిది స్నాప్ డ్రాగన్ 615 నిజంగా పెద్ద పెర్ఫార్మింగ్ ప్రోసెసర్ కాదు. రెండవ డి ఇదే స్పెసిఫికేషన్ Xiaomi మి4i లో ఉంది, కాని అది దీని కన్నా 4 వేలు తక్కువ ధరకు లభిస్తుంది.


 

ZTE Nubia Z9 Mini Performance | Create infographics

Xiaomi మి 4i లానే ZTE Z9 కూడా గేమింగ్ మొబైల్ ఫోన్ కాదు. అలానే హెవీ యూజర్స్ కూడా ఇది కరెక్ట్ కాదు. ఈజీగా ఫోన్ లాగ్ అవటం ఫాస్ట్ గా హీట్ ఎక్కడం దీనిలో మనకు నచ్చని అంశాలు.

బ్యాటరీ: బాగుంది
Xiaomi కు ఉన్నంత (3000 mah) బ్యాటరీ ఇందులో లేదు కాని ZTE నుబియా Z9 2900 mah బ్యాటరీ బాగా బ్యాక్ అప్ ఇస్తుంది. అలాగని Xiaomi మి 4i ని మించలేదు కాని 7 గంటల పాటు వచ్చింది మా బ్యాటరీ బ్యాక్ అప్ టెస్ట్ లో. రెగ్యులర్ యూసేజ్ లో ఫోన్ ఒక రోజు పూర్తిగా వస్తుంది. పవర్ సేవింగ్ మోడ్స్ వాడితే ఇంకా ఎక్కువ వస్తుంది.

ZTE Nubia Z9 Mini Battery Graph | Create infographics


కెమేరా: బెస్ట్ కెమేరా
ZTE Z9 లో 20 వేల బడ్జెట్ లోని ఫోనుల అన్నింటికన్నా మంచి కెమేరా ఉంది. Xiaomi మి 4i కన్నా కడు బాగుంది దీని కెమేరా. దీని కెమేరా పెర్ఫార్మెన్స్ ను ఇక్కడ చూడండి.

బాటమ్ లైన్
అయితే ZTE నుబియా Z9 మిని ను కొనాలా? ప్యూర్ పెర్ఫార్మెన్స్ అనేది మీకు ఇంపార్టెంట్ అయితే ఆసుస్ 2జిబి(15K) లేదా 4జిబి(20K) వేరియంట్స్ లోని మోడల్ చూస్ చేసుకోండి. లేదా  ఒక మాదిరి పెర్ఫార్మెన్స్ ఉండి బెస్ట్ కెమేరా కావాలి అనుకుంటే, బడ్జెట్ లో అయితే Xiaomi మి4i కరెక్ట్ చాయిస్, లేదు 17 వేలు మీ బడ్జెట్ అయితే Xiaomi మి 4i కన్నా బెస్ట్ కెమేరా అవుట్పుట్ ZTE లో వస్తుంది. ఆఫ్ కోర్స్ కెమేరా విషయంలో 20 వేల లోపు ఉన్న ఫోనుల కన్నా ZTE Z9 టాప్ కాబట్టి ఆసుస్ కన్నా ఇది కెమేరా లో బెస్ట్.
Xiaomi మి 4i పూర్తి రివ్యూ ఇక్కడ చూడగలరు.

ZTE నుబియా Z9 మిని Key Specs, Price and Launch Date

Expected Price:
Release Date: 25 Oct 2016
Variant: 16GB
Market Status: Discontinued

Key Specs

  • Screen Size Screen Size
    5" (1080 x 1920)
  • Camera Camera
    16 | 8 MP
  • Memory Memory
    16 GB/2 GB
  • Battery Battery
    2900 mAh
logo
Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably.

Advertisements
Advertisements

ZTE నుబియా Z9 మిని

Buy now on amazon ₹ 6799

ZTE నుబియా Z9 మిని

Buy now on amazon ₹ 6799

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status