Xiaomi రెడ్మి నోట్ 3 32GB Review: true performer

బై Soham Raninga | అప్‌డేట్ చేయబడింది Mar 07 2016
Xiaomi రెడ్మి నోట్ 3 32GB Review: true performer
DIGIT RATING
85 /100
 • design

  78

 • performance

  90

 • value for money

  100

 • features

  81

User Rating : 4.3333333333333/5 Out of 6 Reviews
 • PROS
 • ఎక్సెల్లంట్ పెర్ఫార్మన్స్
 • గ్రేట్ బ్యాటరీ లైఫ్
 • గుడ్ బిల్డ్ క్వాలిటి
 • వేల్యూ ఫర్ మనీ
 • CONS
 • ఎవరేజ్ Low లైటింగ్ ఫోటోస్
 • ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో తో కాకుండా లాలిపాప్ వెర్షన్ తో వస్తుంది out of the బాక్స్
 • NFC మరియు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లేవు

తీర్పు

Xiaomi రెడ్మి నోట్ 3 highly recommended స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ లో. మీరు స్పెసిఫిక్ గా బ్యాటరీ లైఫ్ అండ్ ఫోన్ పెర్ఫార్మన్స్ రెండూ parallel గా ఇచ్చే ఫోన్ల కోసం wait చేస్తుంటే రెడ్మి నోట్ 3 బెస్ట్ ఛాయిస్. అయితే కేవలం Low లైట్ లో ఫోటోస్ noise గా వస్తున్నాయి.

BUY Xiaomi రెడ్మి నోట్ 3 32GB
Buy now on amazon అందుబాటు 6899
Buy now on flipkart స్టాక్ లేదు 11999

Xiaomi రెడ్మి నోట్ 3 32GB detailed review

Xiaomi రెడ్మి నోట్ 3 పేరుతో 2gb ర్యామ్ - 16gb స్టోరేజ్ మోడల్ 9,999 రూ లకు, 3gb ర్యామ్ -32gb స్టోరేజ్ మోడల్ 11,999 రూ లకు లాంచ్ చేసింది ఇండియాలో. మరి ఇది కొత్త ప్రొసెసర్ తో రియల్ టైమ్ లో ఎలా ఉందో రివ్యూ లో తెలుసుకుందాము రండి..


ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూడండి..
SoC: Qualcomm Snapdragon 650 with hexa-core processor (2x1.8 GHz A72 + 4x1.4 GHz A53)
GPU: Adreno 510 GPU
RAM: 3GB LPDDR3
Storage: 32GB with microSD కార్డ్ స్లాట్ for expansion via the SIM 2 slot
Screen size and Resolution: 5.5-inch 1080p IPS display
Network Support: 4G LTE సపోర్ట్, LTE support for Band 3,5,40 and 41 in India.
Dimensions: 150 x 76 x 8.65mm
Weight: 164g
Battery: 4050mAh
Fingerprint scanner
Rear Camera: 16MP, f/2.0 with phase detect AF అండ్ dual tone led flash
Front Camera: 5MP, f2.0 front camera
IR Blaster
No NFC support

Android Lollipop 5.1.1 రన్నింగ్ ఆన్ MiUI 7

పెర్ఫార్మన్స్: సీరియస్ fire power
స్నాప్ డ్రాగన్ 650 SoC vast గా pure పెర్ఫార్మన్స్ ను డెలివర్ చేస్తుంది. ఇలాంటి పెర్ఫార్మన్స్ సాధారణంగా బ్యాటరీ లైఫ్ లేదా thermal management capabilities వంటి విషయాలలో ఎటువంటి నాణ్యత తగ్గకుండా ఇవ్వడం చాలా మంచి విషయం. బెంచ్ మార్క్ స్కోర్స్ పక్కన పెడితే మా టెస్ట్ లతో ఫోన్ ను టెస్ట్ చేయటం మొదలు పెట్టాము. 2160P ultra HD వీడియో ను రికార్డ్ చేశాము 5 నిముషాలు పాటు. అయితే సాధారణంగా డిఫాల్ట్ కెమేరా ఈ resolution సపోర్ట్ చేయదు, కాని గూగల్ కెమేరా యాప్ ద్వారా UHD ను రికార్డ్ చేశాము రెడ్మి నోట్ 3 లో. రికార్డింగ్ వెంటనే 30 నిముషాలు Asphalt అండ్ modern combat 5 తో గేమింగ్ చేశాము. తరువాత AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ ను re టెస్ట్ చేశాము. ఈ మూడు టెస్టింగ్ లలో రెడ్మి నోట్ 3 ఎక్కడా లాగ్ అవ్వటం లేదా excess గా heat అవటం వంటివి జరగలేదు. అంటే బెంచ్ మార్క్ స్కోర్స్ లోనే కాదు రియల్ టైమ్ లో కూడా ఎక్సెల్లంట్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది బ్యాటరీ drainings కూడా లేకుండా. mi 4i లా హీటింగ్ ఇబ్బందులు కూడా ఇవ్వటం లేదు.

Xiaomi Redmi Note 3
Create bar charts


బ్యాటరీ లైఫ్: బిగ్ battery అండ్ పవర్ management
పెద్ద బ్యాటరీ ను చిన్న సైజ్ లో బాగా జోడించింది xiaomi. ఇది 690Wh/L హై డెన్సిటీ కారణంగా సాధ్యమైంది అని చెప్పాలి.  హెవీ usage లో 15% మిగిలి ఉంటుంది ఒక రోజు కంప్లీట్ అయ్యేసరికి. ఎవరేజ్ usage లో రెండు రోజులు వస్తుంది బ్యాటరీ. చార్జింగ్ విషయానికి వస్తే 5 పెర్సంట్ నుండి 100% కు రెండు గంటల టైమ్ తీసుకుంటుంది బ్యాటరీ ఒరిజినల్ చార్జర్ తో.

Xiaomi Redmi Note 3 battery test
Create bar charts

కెమేరా: MP పెరిగింది కాని క్వాలిటీ పెరగలేదు.
Xiaomi ఇప్పటి వరకూ కెమేరా సెగ్మెంట్ లో బెస్ట్ ఫోటోస్ ఇచ్చే హాండ్ సెట్స్ ను ఇచ్చింది. కాని రెడ్మి నోట్ 3 లో ఈ ట్రెండ్ బ్రేక్ అయ్యింది. 16MP phase డిటెక్షన్ ఆటో ఫోకస్ ఫోకస్ అండ్ capturing పరంగా ఫాస్ట్ గా ఉంది. core ఇమేజ్ క్వాలిటీ మాత్రం రాపిడ్ గా తగ్గింది Low లైట్ లో. నార్మల్ డే లైట్ లో మంచి ఫోటోస్ ఇస్తుంది. కలర్ reproduction కూడా బాగా బాలన్స్ చేసింది నోట్ 3. లాని low లైటింగ్ అండ్ indoor లో noise ఇస్తుంది. క్రింద ఫోటో samples చెక్ చేయండి..

View post on imgur.com

డిజైన్ అండ్ బిల్ట్ : డిఫరెంట్ approach
slight డిఫరెన్స్ తెచ్చింది ప్రివియస్ రెడ్మి note ఫోన్లతో పోలిస్తే. మెటల్ బాడీ అండ్ curved బ్యాక్ with స్మూత్ అండ్ matte ఫినిష్. 5.5 డిస్ప్లే తో comfortable గానే ఉంది వాడటానికి. మరింత ప్రీమియం గా కూడా ఉంది. అయితే వెనుక matte ఫినిషింగ్ వలన చేతిలో నుండి స్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ పరంగా సాలిడ్ గా ఉంది. కాని ఫ్రంట్ లో షైనీ మెటల్ edge పెయింట్ పోతుంది ఈజీగా. ఇది కనుక జరిగితే ఫోన్ లుక్స్ పాడవుతాయి. గొరిల్లా గ్లాస్ లేదు డిస్ప్లే కు. టచ్ బాగుంది కాని గొరిల్లా గ్లాస్ డిస్ప్లే లో ఉండే అంత స్మూత్ గా లేదు. వెనుక స్పీకర్ వద్ద చిన్న bent డిజైన్ ఇచ్చింది. దీని వలన ఫోన్ flat సర్ ఫేస్ లపై పెట్టినా కూడా సౌండ్ తగ్గటం వంటివి జరగవు. కెమేరా లెన్స్ డ్యూయల్ tone ఫ్లాష్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనుక ఉన్నాయి. వాల్యూం అండ్ పవర్ బటన్స్ రైట్ సైడ్ ఉన్నాయి. ఫ్రంట్ లో capacitive టచ్ బటన్స్ ఉన్నాయి స్క్రీన్ క్రింద, పైన సేల్ఫీ కెమేరా, ambient లైట్ సెన్సార్ అండ్ నోటిఫికేషన్ LED లైట్ ఉంది.

స్క్రీన్ క్వాలిటీ : బాగుంది.
1080P 5.5 in డిస్ప్లే IPS panel బ్రైట్ నెస్, కలరింగ్ అండ్ వ్యూయింగ్ angles లో బాగుంది. రెడ్మి నోట్ 3 లో sunlight మోడ్ కూడా ఉంది. ఇది Mi 4i లో introduce చేసింది కంపెని. అంటే ఎక్కువ లైటింగ్ పడితే డిస్ప్లే ఆటో మేటిక్ గా కాంట్రాస్ట్ లెవెల్స్ ను పెంచుతుంది. ఇది mi 4i లో బాగుంది కాని దీనిలో బాగా difference చూపించటం లేదు డైరెక్ట్ సన్ లైట్ లోకి వెళ్తే. అలాగే డిస్ప్లే బ్లూ కలరింగ్ ను చూపిస్తుంది ఎక్కువుగా, cooler గా ఉంది దీని వలన. అయితే వీటిని సెట్టింగ్స్ లో మార్చుకోగలరు.

యూజర్ ఇంటర్ఫేస్: మార్ష్ mallow తో రావటం లేదు
ఆండ్రాయిడ్ 5.1.1 based MiUI 7 పై రన్ అవుతుంది ఫోన్. మార్ష్ మల్లో తో రావటం లేదు. ఇది drawback, ఎందుకంటే ఫ్లాగ్ షిప్ మోడల్ Mi 5 మార్ష్ మల్లో తోనే వస్తుంది. ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో వలన మరింత పెర్ఫార్మన్స్ చూసే వాళ్ళము బహుశా. ఇక ui విషయానికి వాస్తే చాలా customisations ఉంటాయని అందరికీ తెలిసినదే. అలాగే MiUI మెమరీ ఎక్కువుగా వాడుతుంది అని నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది, కాని దీనిలో 3gb ర్యామ్ కారణంగా ఫోన్ హెవీ మల్టీ టాస్కింగ్ అండ్ గేమింగ్ లో కూడా స్మూత్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది రెడ్మి నోట్ 3.

కాల్ క్వాలిటీ: బాగుంది
రివ్యూ టైమ్ లో ఎప్పుడూ మేజర్ కాల్ క్వాలిటీ issue లను చూడలేదు.. కాని తక్కువ సిగ్నల్స్ లో అప్పుడప్పుడు వాయిస్ reception ప్రాబ్లెం ఇచ్చేది. రెడ్మి నోట్ 3 VoLTE సపోర్ట్ చేస్తుంది. అయితే ఇండియాలో ప్రస్తుతం రిలయన్స్ jio LTE మాత్రమే VoLTE సపోర్ట్ చేస్తుంది.

బాటమ్ లైన్
Xiaomi రెడ్మి నోట్ 3 highly recommended స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ లో. మీరు స్పెసిఫిక్ గా బ్యాటరీ లైఫ్ అండ్ ఫోన్ పెర్ఫార్మన్స్ రెండూ parallel గా ఇచ్చే ఫోన్ల కోసం wait చేస్తుంటే రెడ్మి నోట్ 3 బెస్ట్ ఛాయిస్. అయితే కేవలం Low లైట్ లో ఫోటోస్ noise గా వస్తున్నాయి. XIAOMI REDMI NOTE 3 కంప్లీట్ వీడియో రివ్యూ ను తెలుగులో చూడండి క్రింద వీడియోలో..

Xiaomi రెడ్మి నోట్ 3 32GB Key Specs, Price and Launch Date

Price:
Release Date: 17 Jan 2017
Variant: 32GB
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  5.5" (1080 x 1920)
 • Camera Camera
  16 | 5 MP
 • Memory Memory
  32 GB/3 GB
 • Battery Battery
  4050 mAh
logo
Soham Raninga

Chief Editor

Advertisements
Advertisements

Xiaomi రెడ్మి నోట్ 3 32GB

Xiaomi రెడ్మి నోట్ 3 32GB

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status