జియామి Mi మాక్స్ Review

బై Prasid Banerjee | అప్‌డేట్ చేయబడింది Jul 01 2016
జియామి Mi మాక్స్ Review
 • PROS
 • గ్రేట్ డిస్ప్లే for content viewing
 • స్మూత్ పెర్ఫార్మన్స్
 • excellent బ్యాటరీ లైఫ్
 • ప్రీమియం ఫిలింగ్
 • CONS
 • dull కెమెరా
 • సులభంగా లేదు వాడటానికి సైజ్ వలన

తీర్పు

సెకండరీ డివైజ్ గా పెర్ఫెక్ట్ చాయిస్. వాయిస్ కాలింగ్ tablet అని చెప్పాలి. ఫాస్ట్ ,ప్రీమియం, పవర్ ఫుల్. పేరెంట్స్ లేదా ఇంటిలోని అందరికీ అనే అవసరాలకు బెస్ట్ డివైజ్. అయితే ప్రస్తుత ట్రెండ్ లో సెకండరీ డివైజ్ ను maintain చేయటం అనేది చాలా అరుదు. మీరు గాడ్జెట్ ప్రియులు, వర్క్ చేస్తున్న వారు అయితేనే దీనిని కొనే అవకాశాలు ఉంటాయి. ప్రైమరీ ఫోన్ గా మాత్రం సైజ్ కారణంగా అంత suitable కాదు. లేదా సైజ్ ఏమి ఇబ్బంది లేదు నాకు అనుకుంటే కంటెంట్ వైజ్ గా ఒక్క కెమెరా మినహాయిస్తే మంచి ఫోన్ ఇది.

BUY జియామి Mi మాక్స్

జియామి Mi మాక్స్ detailed review

Digit Rating: 83/100   ప్రెస్ : 14,999 రూ 
డిస్ప్లే: బిగ్, బోల్డ్ అండ్ బ్రైట్ 
6.44 in 1080P 342ppi తో రావటం వలన షార్ప్ గా ఉంది. అయితే ఇంత పెద్ద స్క్రీన్ ఉంది కాబట్టి కంపెనీ higher వేరియంట్ ఒకటి రిలీజ్ చేసి దానిలో QHD డిస్ప్లే పెడితే బాగుంటుంది. ఇక మాక్స్ లో వ్యూయింగ్ angles అంత గ్రేట్ గా లేవు. స్క్రీన్ పెద్దగా ఉంది కాబట్టి బాగుండాలి.

Mi మాక్స్ లో కాంట్రాస్ట్ కూడా కొంచెం తక్కువుగా ఉంది.slight bluish tint కూడా ఉంది. ఇది సెట్టింగ్స్ లో మార్చగలరు. అలాగే డిస్ప్లే ను warm, cool మోడ్స్ లోకి మార్చటానికి ఆప్షన్స్ ఉన్నాయి. అంత accurate కాకపోయినా mostly పనిచేస్తున్నాయి. కానీ ఓవర్ ఆల్ గా డిస్ప్లే గ్రేట్. ఈ స్క్రీన్ సైజ్ లో ఇతర ఫోనులతో కంపేర్ చేస్తే ఇదే బాగుంది అని చెప్పాలి.

బిల్డ్ అండ్ డిజైన్ : బాగుంది కానీ సైజ్ పెద్దది స్క్రీన్ వలన 
లెనోవో ఫాబ్ ప్లస్ లా ఇది మరీ పెద్దదిగా అనిపించదు. అలాగే 4.7in స్క్రీన్ ఉన్న ఫోన్ కన్నా సన్నగా అనిపిస్తుంది 7.5mm thin body వలన. బిల్ట్ బాగుంది కానీ హ్యాండిల్ చేయటానికి అంత సులభంగా అనిపించటం లేదు.

height ,width మరియు weight కారణంగా సెకండరీ డివైజ్ గా దీనిని పరిగణించవచ్చు. 173mm పొడవు,88mm వెడల్పు, 203 గ్రా బరువు కలిగి ఉంది. అంటే ఈ సైజ్ లో 203 గ్రా తక్కువనే చెప్పాలి. కానీ చేతిలో పట్టుకునే డివైజ్ గా చూస్తే బరువే. పైగా మీకు నాలా చిన్న డివైజెస్ అంటేనే ఇష్టమైతే మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఇక సింగిల్ హాండ్ అంటే కష్టమే వాడటం.ఏదో సింపుల్ పనులే చేయగలరు సింగిల్ హ్యాండ్ తో..

క్రింద రెండు స్పీకర్ గ్రిల్స్ డిజైన్ ఉంది కానీ వాటిలో ఒకటే స్పీకర్. మధ్యలో మైక్రో usb పోర్ట్. 16MP రేర్ కెమెరా module వెనుక టాప్ లెఫ్ట్ లో ఉంది. దీనికి డ్యూయల్ LED flash ఉంటుంది పక్కనే. ఫోన్ పై భాగంలో 3.5mm ఆడియో జాక్, mic, IR బ్లాస్టర్  ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా వెనుకే ఉంది. అయితే ఇంత పెద్ద సైజ్ ఫోనులో FP ముందు ఉంటే బాగుండేది Mi 5లా. అంతేకాదు redmi సిరీస్ కు వెనుక , Mi సిరీస్ కు ముందు ఉన్నట్లు బ్రాండ్ identity కూడా ఉండేది. వెనుక ఉండటం వలన స్కానర్ ను రీచ్ అవటం కూడా కష్టంగానే ఉంది.

ఫైనల్ గా Mi మాక్స్ గుడ్ లుకింగ్ డివైజ్. సైజ్ పెద్దది అయినా మీరు ఒకసారి చూస్తే తీసుకోవాలనిపిస్తుంది దీనిని. బ్యాక్ solid అల్యూమినియం, slight textured డిజైన్ తో వస్తుంది గ్రిప్ కొరకు. రెడ్మి  నోట్ 3 కన్నా మరింత ప్రీమియం గా ఉంది. Le 2 అంత ప్రీమియం గా అనిపిస్తుంది. వెనుక పైనా క్రిందా ప్లాస్టిక్ స్ట్రిప్ ఉంది anteenna కొరకు. mostly డివైజ్ మెటాలిక్ బాడీ. సన్నగా ఉండటం వలన పాకెట్ లో ఈజీగా పడుతుంది కానీ పెట్టిన తరువాత మీకు కంఫర్ట్ గా ఉండదు పాకెట్ లో. అందుకే ఇది ప్రైమరీ డివైజ్ గా కాకుండా ఆఫీస్ డెస్క్ లేదా హోమ్ tables మీద ఉండవలసిన సెకండరీ డివైజ్ అని చెప్పటం జరిగింది.

బ్యాటరీ : బిగ్ ఫోన్, బిగ్ బ్యాటరీ 
ఈ ఫోన్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ లైఫ్. actual గా సైజ్ ఎలానో పెద్దది గా ఉంది కాబట్టి ఇంకా పెద్ద బ్యాటరీ పెట్టాలి. కానీ 4850mah బ్యాటరీ మంచి బ్యాక్ అప్ ఇస్తుంది. 50% బ్రైట్ నెస్ తో ఫోన్ కంప్లిట్ గా one and half day వచ్చింది. దీనికన్నా ఎక్కువ కావాలి అనుకుంటే మీకు Gionee marathon M5 ఒక్కటే కరెక్ట్ చాయిస్. redmi note 3 అయితే one day వస్తుంది.

గీక్ బెంచ్ టెస్ట్ లో కూడా బ్యాటరీ 13 గంటలు వచ్చింది. impressive result ఇది. హెవీ usage చేస్తే మాక్స్ ఒక రోజు కంప్లిట్ గా వస్తుంది. ఏవరేజ్ usage అయితే రెండు రోజులు వస్తుంది. 20 నిమిషాలు గేమింగ్ చేస్తే 2% drop అవుతుంది బ్యాటరీ.

పెర్ఫార్మన్స్ : పెద్ద స్క్రీన్ పై గేమింగ్ 
650 స్నాప్ డ్రాగన్ ఆల్రెడీ బెస్ట్ ప్రొసెసర్  అని ప్రూవ్ అయ్యింది రెడ్మి నోట్ 3 వలన. దీనిలో కూడా లాగ్స్, worry అయ్యేంత హీటింగ్ issues ఏమీ లేవు. కానీ Le 2 తో పోలిస్తే slight గా తక్కువ పవర్ ఫుల్ ఇది. కానీ మీకు కావలసిన పనులన్నీ చేస్తుంది ఈజీగా. సింపుల్ గా చెప్పాలంటే రెడ్మి నోట్ 3 లానే same పవర్ ఫుల్ గా ఉంది MI మాక్స్. క్రింద స్కోర్స్ చూడగలరు.

యాప్స్ కూడా 6.44 in స్క్రీన్ కు fit అయ్యాయి. మార్ష్ మల్లో కు థాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. అయితే అమెజాన్ యాప్ ఒకటి compatible గా లేదని చెబుతుంది, దీని గురించి కంపెనీ అది device filtering issue అని తెలిపింది. త్వరలోనే solve అవుతున్నట్లు కూడా చెప్పింది. అన్ని రెగులర్ అండ్ డైలీ యాప్స్ బాగా వర్క్ అవుతున్నాయి.

మాక్స్ పై గేమింగ్ మంచి fun. అయితే ఎక్కువ movements ఉన్నవి బాగా ఎంజాయ్ చేస్తారు. swipes ఉన్నవి కొంచెం చేతికి నొప్పిగా ఉంటాయి మీరు గేమర్ అయితే.

కెమెరా: ఇంకా బాగుండాలి 
ఇక్కడ చెప్పటానికి ఏమీ లేదు. దీనిలోని 16MP same రెడ్మి నోట్ 3 లానే ఏవరేజ్ గా ఉంది. Low లైట్ లో oversharp ఫోటోస్ వస్తున్నాయి. నాయిస్ కూడా ఉంటుంది.ఇది ఆటోమేటిక్ గా ISO increase అవటం వలన జరుగుతుంది.

ఇండోర్ లో కూడా ISO పెరుగుతుంది. సో ఇక్కడ కూడా noise ఉంటుంది. డీటేల్స్ పోతున్నాయి. ఓవర్ ఆల్ గా ఇది ఫోటో గ్రఫీ లవర్స్ కు నచ్చే కెమెరా కాదు. dull కెమెరా క్వాలిటీ. క్రింద లింక్ పై క్లిక్ చేసి సాంపిల్స్ చూడగలరు.

View post on imgur.com

బాటమ్ లైన్
సెకండరీ డివైజ్ గా పెర్ఫెక్ట్ చాయిస్. వాయిస్ కాలింగ్ tablet అని చెప్పాలి. ఫాస్ట్ ,ప్రీమియం, పవర్ ఫుల్. పేరెంట్స్ లేదా ఇంటిలోని అందరికీ అనే అవసరాలకు బెస్ట్ డివైజ్. అయితే ప్రస్తుత ట్రెండ్ లో సెకండరీ డివైజ్ ను maintain చేయటం అనేది చాలా అరుదు. మీరు గాడ్జెట్ ప్రియులు, వర్క్ చేస్తున్న వారు అయితేనే దీనిని కొనే అవకాశాలు ఉంటాయి. ప్రైమరీ ఫోన్ గా మాత్రం సైజ్ కారణంగా అంత suitable కాదు. లేదా సైజ్ ఏమి ఇబ్బంది లేదు నాకు అనుకుంటే కంటెంట్ వైజ్ గా ఒక్క కెమెరా మినహాయిస్తే మంచి ఫోన్ ఇది.

జియామి Mi మాక్స్ Key Specs, Price and Launch Date

Release Date: 30 Jun 2016
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  NA
 • Camera Camera
  NA
 • Memory Memory
  NA
 • Battery Battery
  NA
logo
Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably.

Advertisements
Advertisements

జియామి Mi మాక్స్

జియామి Mi మాక్స్

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status