Xioami Mi 5 32 GB Review: కెమెరా అనుకున్న దాని కన్నా తక్కువ క్వాలిటీ ఇస్తుంది

Xioami Mi 5 32 GB Review: కెమెరా అనుకున్న దాని కన్నా తక్కువ క్వాలిటీ ఇస్తుంది

Prasid Banerjee   |  18 Feb 2021
DIGIT RATING
84 /100
 • design

  90

 • performance

  83

 • value for money

  72

 • features

  82

User Rating : 3/5 Out of 1 Reviews
 • PROS
 • ఫ్లాగ్ షిప్ క్లాస్ పెర్ఫార్మన్స్
 • ప్రీమియం డిజైన్
 • CONS
 • కెమెరా అనుకున్న దాని కన్నా తక్కువ క్వాలిటీ ఇస్తుంది

తీర్పు

ఇది ఇన్నోవేటివ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ తో వస్తున్న ఫోన్ కాదు, కాని సేఫ్ ఫోన్. ఇది మీరు expect చేసినట్టుగానే పవర్ ఫుల్ ఫ్లాగ్ షిప్ ఫోన్. 24,999 రూ లకు ఇది మీకు మంచి డీల్ అనిపించకపోతే ఇంతకుమించి best-in-class ఫోన్ డీల్ మరొకటి లేదు అని చెప్పాలి.

BUY Xioami Mi 5 32 GB
Buy now on amazon అందుబాటు 9599
Buy now on flipkart స్టాక్ లేదు 24999

Xioami Mi 5 32 GB detailed review

Xiaomi ఇండియాలో Mi 3 మోడల్ తో వచ్చి తరువాత Mi 4 లాంచ్ ఇప్పుడు Mi 5. అయితే కంపెని Mi 4 లాంచ్ అయిన వన్ ఇయర్ తరువాత కాకుండా 2 ఇయర్స్ తరువాత ఇస్తుంది Mi 5 ఫ్లాగ్ షిప్ ఫోన్. దీని రివ్యూ తెలుసుకుందాము రండి..


బిల్డ్ అండ్ డిజైన్: ఏ డిజైన్ తో మొబైల్స్ తయారు చేసిందో అదే డిజైన్ ను మరలా దీనిలో ఇచ్చింది.
సామ్సంగ్ S7 లానే ఉంది అని కొందరి అభిప్రాయం, కానీ నిజానికి ఈ డిజైన్ ను Mi నోట్ ఫోనుల్లో Xiaomi తీసుకు వచ్చింది. కేవలం 129 గ్రా ఉండటం వలన సైడ్స్ లో వెనుక curves ఉండటం వలన పట్టుకోవటానికి వాడటానికి చాలా బాగుంటుంది.అయితే ఫ్లాట్ సర్ ఫేసెస్ పై పెడితే ఫోన్ స్లిప్ అవుతుంది వెనుక గ్లాస్ బాడీ అవటం వలన. కొంచెం slant గా ఉన్న వాటిపై పెడితే క్రింద పడుతుంది. బటన్స్ విషయానికి వస్తే ఫోన్ పట్టుకునే టప్పుడు అవసరం లేకపోయినా చేతి వేళ్ళకు తగులుతూ ఉంటాయి, అంటే బయటకు ఎక్కువుగా ఉన్నాయి. ఓవర్ ఆల్ గా 5.15 in స్క్రీన్ కు బెస్ట్ ఫోన్ Mi 5. ఆల్మోస్ట్ పెర్ఫెక్ట్ డిజైన్.డిస్ప్లే: గుడ్
రెడ్మి నోట్ 3 లానే Mi 5 డిస్ప్లే లో slight గా బ్లూ కలర్స్ ను ఎక్కువుగా చూపిస్తుంది. అయితే ఇది రీడింగ్ మోడ్ ఆన్ చేసి strength ను తగ్గిస్తే కరెక్ట్ అయిపోతుంది. QHD డిస్ప్లే లేదని చాలా మంచి ఫీల్ అవుతున్నారు కాని దీనిలో ఉన్న ఫుల్ HD బాగుంది. గేమింగ్ లో ఎక్కువ ఫ్రేమ్స్ ను allow చేస్తుంది కూడా. ఓవర్ ఆల్ గా గ్రౌండ్ బ్రేకింగ్ డిస్ప్లే కాదు కాని మంచి డిస్ప్లే.

యూజర్ ఇంటర్ఫేస్: గుడ్
ప్రస్తుతం Mi 5 లో Mi UI 7 రన్ అవుతుంది, కాని ఇది బీటా వెర్షన్. సో ఫైనల్ వెర్షన్ అప్ డేట్ వచ్చినప్పుడు os లో ఉండే చిన్న చిన్న బగ్స్ సాల్వ్ అవుతాయి. ఇక Mi UI గురించి సెపరేట్ గా చెప్పనవసరం లేదు, creamy లుక్స్ లో useful అదనపు ఫీచర్స్ ను ఇస్తుంది.

అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ స్క్రీన్ ఆఫ్ అయ్యి ఉంటె పనిచేయదు. కూల్ ప్యాడ్ లో డిస్ప్లే ఆఫ్ లో ఉన్నా ఫోన్ ను unlock చేయగలరు. అయితే Mi 5 లానే సామ్సంగ్ S7 అండ్ ఐ ఫోన్ లలో కూడా ఇది పనిచేయదు. ఫర్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పై ప్రెస్ చేసి, స్క్రీన్ ఆన్ అయిన తరువాత మీ ఫింగర్ ను స్కాన్ చేసి unlock చేయగలరు.

పెర్ఫార్మన్స్: చాలా బాగుంది
స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ ప్రొసెసర్ 820 ఉంది దీనిలో. ఇదే మొదటి ఫోన్ ఈ SoC తో ఇండియాలో స్మార్ట్ ఫోన్ రావటం. అయితే ఇక్కడ మంచి చెడు రెండూ ఉన్నాయి..కాని మోస్ట్ గుడ్ ఉంది.

Mi 5 లో 4GB ర్యామ్ కు  బదులు 3GB ర్యామ్ ఉంది, ఇదే రెగ్యులర్ users అందరికీ సరిపోతుంది కాని high resources తీసుకున్ గేమ్స్ ను ఆడుతున్నప్పుడు ఫోన్ లో వెనుక రన్ అవుతున్న బ్యాక్ గ్రౌండ్ యాప్స్ అన్నీ shut off అయిపోతున్నాయి.

ఇది Mi 5 pro (మరొక వేరియంట్, కాని ఇండియాలో రిలీజ్ కాలేదు ఇంకా) కాకపోవటం వలన స్నాప్ డ్రాగన్ 820 1.8GHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది. అందువలన సింగిల్ కోర్ పెర్ఫార్మన్స్ తగ్గుతుంది. అయితే రెగ్యులర్ usage ను affect చేయటం లేదు. మరింత పెర్ఫార్మన్స్ అనాలిసిస్ ను ఈ లింక్ లో తెలుసుకోగలరు.

హీటింగ్ మేనేజ్మెంట్: చాలా బాగుంది
హిటింగ్ విషయానికి వస్తే Mi 5 వండర్ ఫుల్ గా మేనేజ్ చేసింది అని చెప్పాలి. 40 డిగ్రీలకు మించి ఎప్పుడు ఫోన్ హీట్ అవ్వదు. మీరు విపరీతమైన ఎండ ప్రాంతాలలో బయట తిరిగితే తప్ప.

4K వీడియోస్ ను షూట్ చేస్తే Mi 5 ఆటోమాటిక్ గా 7 నిమిషాలకు స్టాప్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఫోన్ 50 డిగ్రిస్ కు వెళ్తుంది. ఇది os బీటా వెర్షన్ బగ్ కూడా అయుండవచ్చు. ఓవర్ హిటింగ్ ను avoid చేయటానికి హర్డ్ వేర్ అండ్ సాఫ్ట్ వేర్ పరంగా చేసిన optimisations. అయితే కేవలం 4K రిసల్యుషణ్ లో వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడే ఫోన్ ఇంత హీట్ అవుతుంది. గేమింగ్ లో కూడా 40-41 కు మించి వెళ్ళలేదు. ఇది మంచి విషయమే.

పవర్: బాగుంది
ప్రొసెసర్ కొత్తగా ఇండియాలో ఇదే ఫోన్ తో వచ్చింది కాబట్టి దీని గురించి కూడా తెలుసుకుందాము.. SD 820 ఎటువంటి డౌట్స్ లేకుండా పవర్ ఫుల్ చిప్. దీనికి అదనంగా adreno 530 GPU మంచి జోడి. అయితే Mi 5 సామ్సంగ్ S7 ను మించలేకపోయింది ప్రొసెసర్ పెర్ఫార్మన్స్ విషయంలో..కాని Mi 5 ఫ్లాగ్ షిప్ క్లాస్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది.

Xiaomi Mi 5 Performance Comparison
Create bar charts

స్టోరేజ్ అండ్ కనెక్టివిటి: చాలా బాగుంది
32GB స్టోరేజ్ ఎక్కువ ఫైల్స్, వీడియోస్, మ్యూజిక్ ను ఫోన్ లో వేసుకొని క్యారీ చేసే వారికీ కచ్చితంగా మైనస్ పాయింట్. ఒక వారం రోజులలో 26GB లో దాదాపు 22GB ను ఫిల్ అప్ చేసేసాను. అవును 32GB లో 26GB ఫ్రీ స్పేస్ వస్తుంది వాడుకోవటానికి. 4G విషయానికి వస్తే బాగా పనిచేస్తుంది. దీనిలో క్వాల్ కామ్ యొక్క X12 LTE మోడెమ్ ఉంది S7 లానే. దాదాపు మిగిలిన ఫోనులు 4G సిగ్నల్ నుండి 3G/2G కు డ్రాప్ అయ్యే ఏరియా లలో ఇది అస్సలు ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. Proximity సెన్సర్ ప్రాబ్లెం ఉన్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటే కాల్స్ లో ఉన్నప్పుడు స్క్రీన్ ఆన్ అవటం జరుగుతుంది.

కెమెరా: వీడియో లో బాగుంది, ఫోటోస్ కు అంతగా బాగుంది అని చెప్పలేము
రెడ్మి నోట్ 3 లానే ఉంది ఈ విషయంలో. Mi 5 లోని కెమెరా సామ్సంగ్ S7 Edge కు ఏ విధంగానూ match కాదు. S7 చాలా బాగుంటుంది. బెస్ట్ కెమెరా ఫోన్ S7 edge ప్రస్తుత మార్కెట్ లో. అయితే Mi 5 ఒకే ప్రైస్ రేంజ్ లో ఉన్న హానర్ 7 అండ్ HTC one A9 కన్నా బెటర్. Mi 5 లో సోనీ IMX 298 సెన్సార్ f/2.0 aperture లెన్స్ మరియు 1.12mi పిక్సెల్ సైజ్ తో వస్తుంది.

బ్రైట్ outdoor లైటింగ్ లేదా బ్రైట్ లైటింగ్ లలో గుడ్ ఫోటోస్ ఇస్తుంది. కాని షార్ప్ నేస్ ఉండటం లేదు వాటిలో...కానీ కలర్ reproduction మరియు వైట్ బాలన్స్ నిజంగా బాగున్నాయి. Low లైట్ లో మాత్రం ఫెయిల్ అయ్యింది రేర్ కెమెరా.డిటేల్స్ ను ఇవటం లేదు, కలర్స్ కూడా ను సరిగా డీల్ చేయటం లేదు. indoor అండ్ dim లైటింగ్ లలో నాయిస్ కూడా ఉంది.

Xiaomi Mi 5 Sample Images

క్లియర్ గా చెప్పలంటీ Mi 5 కెమెరా బాడ్ కాదు. కాని Xiaomi గతంలోని ఫోనుల్లో ఉన్న కేమేరాస్ మంచి పనితనాలు చూపించాయి. అందుకే మనము ఎక్కువ expect చేస్తాము. వీడియో మాత్రం 4-axis OIS వలన బాగుంది. మీరు వీడియోస్ ను ఎక్కువుగా షూట్ చేసే వారు అయితే ఇది బెస్ట్ ఫోన్.

బ్యాటరీ: బాగుంది రెగ్యులర్ users కు
హెవీ usage లో రెండు సార్లు చార్జింగ్ చేయాలి. కాని క్విక్ చార్జింగ్ 3.0(ఇండియన్ వేరియంట్ లో 3.0 క్విక్ charger ఉండదు, 2.0 క్విక్ చార్జర్ మాత్రమే వస్తుంది ఫోన్ తో పాటు) వలన రెండవ సారి సగం చార్జింగ్ చేస్తే ఎండ్ ఆఫ్ the డే వస్తుంది. గుర్తు పెట్టుకోండి ఇది heavy users కు. రెగ్యులర్ users కు అంటే గేమింగ్ మరియు వీడియో షూటింగ్ ఎక్కువుగా చేయని వారికి ఒక రోజు ఫుల్ గా వస్తుంది. గిక్ బెంచ్ 3 బ్యాటరీ టెస్ట్ లో 8 గంటల 45 నిముషాలు వచ్చింది బ్యాక్ అప్. 3.0 కు 2.0 కు చార్జింగ్ చేయటానికి కరెంట్ వాడుకలోనే తేడాలు ఉన్నాయి.

బాటమ్ లైన్
ఇది ఇన్నోవేటివ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ తో వస్తున్న ఫోన్ కాదు, కాని సేఫ్ ఫోన్. ఇది మీరు expect చేసినట్టుగానే పవర్ ఫుల్ ఫ్లాగ్ షిప్ ఫోన్. 24,999 రూ లకు ఇది మీకు మంచి డీల్ అనిపించకపోతే ఇంతకుమించి best-in-class ఫోన్ డీల్ మరొకటి లేదు అని చెప్పాలి.

Xioami Mi 5 32 GB Key Specs, Price and Launch Date

Price:
Release Date: 15 May 2017
Variant: 32GB
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  5.15" (1080 x 1920)
 • Camera Camera
  16 | 4 MP
 • Memory Memory
  32 GB/3 GB
 • Battery Battery
  3000 mAh
Prasid Banerjee
Prasid Banerjee

Email Email Prasid Banerjee

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Trying to explain technology to my parents. Failing miserably. Read More

Advertisements
Advertisements

Xioami Mi 5 32 GB

Xioami Mi 5 32 GB

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status