క్షియోమి Mi4i Review: విపరీతమైన పెర్ఫార్మెన్స్ మీకు అంతగా అవసరం లేదనుకుంటే తక్షణం ఈ ఫోన్ ను తీసుకోవచ్చు.

బై Soham Raninga | అప్‌డేట్ చేయబడింది May 18 2015
క్షియోమి Mi4i Review: విపరీతమైన పెర్ఫార్మెన్స్ మీకు అంతగా అవసరం లేదనుకుంటే తక్షణం ఈ ఫోన్ ను తీసుకోవచ్చు.
DIGIT RATING
77 /100
 • design

  76

 • performance

  75

 • value for money

  77

 • features

  77

 • PROS
 • 5 ఇంచ్ స్క్రీన్ లో అతి చాలా చిన్నగా ఉన్న ఫోన్ ఇది
 • లాంగ్ బ్యాటరి లైఫ్
 • అద్భుతమైన స్క్రీన్
 • మంచి కెమేరా
 • CONS
 • ఫోన్ వేడి ఎక్కడం వలన పెర్ఫార్మెన్స్ మీద ప్రభావం చూపుతుంది.
 • 16 జిబి స్టోరేజి తోనే లభిస్తుంది. అదనపు స్టోరేజి సౌకర్యం లేదు.
 • ఫ్లాష్-సెల్ మోడల్ కొంతమందికి విసుగును తెప్పించవచ్చు

తీర్పు

Xiaomi Mi4i రూ.15,000 లోపు ఎవరైనా ఫోన్ కనుక్కోవడానికి ఎదురుచూస్తుంటే  12,999 కి ఇది  చాలా మంచి ఫోన్ . అయితే, Xiaomi Mi4i ఆండ్రాయిడ్ ఫోన్లను ఎక్కువుగా వాడే  ఔత్సాహికులకు మాత్రం పెర్ఫార్మెన్స్ విషయంలో నిరాశ పరుస్తుంది. 

BUY క్షియోమి Mi4i
Buy now on amazon అందుబాటు 9990
Buy now on flipkart స్టాక్ లేదు 9999

క్షియోమి Mi4i detailed review

స్పెసిఫికేషన్స్ : 

నెట్వర్క్: 4G డ్యుయల్ SIM, డ్యుయల్ స్టాండ్ బై

SoC: (క్వాడ్-కోర్ 1.7GHz ARM కార్టెక్స్ A53 + క్వాడ్-కోర్ 1.1GHz ARM కార్టెక్స్ A53) తో 28nm ఆధారంగా 64-బిట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 615 octacore SoC

ర్యామ్: 2GB DDR3

స్టోరేజ్: ఆన్బోర్డ్ 16GB, మెమరీ పెంచుకునే వీలు లేదు.

స్క్రీన్: తెర: 5 అంగుళాల పూర్తి HD 1080p IPS డిస్ప్లే. 441 PPI పిక్సెల్ డెన్సిటీ. 'Sunlight Display' అనే కొత్త టెక్నాలజీని ఇందులో జోడించారు. దీని గురించి ఎక్కువుగా క్రింద చదవగలరు.

కెమెరా: F/ 2.0 లెన్స్ మరియు  5 element లెన్స్ తో 13MP సెన్సార్

బ్యాటరీ: 3120mAh సీల్డ్రీ మరియు  వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్

OS: Android 5.0.2 (లాలిపాప్)

ఆసుస్ Zenfone 2(2జిబి) కు  కచ్చితంగా Xiaomi Mi4i స్పెసిఫికేషన్స్ పరంగా గట్టి పోటీ ఇచ్చింది.


 

ఫోన్ డిజైన్ :Mi4I లో ప్రధమంగా చెప్పుకోదగినది దాని కాంపాక్ట్ డిజైన్. చాలా స్లిమ్ గా, తెలికిగా అందంగా ఉండే ఈ ఫోన్ ప్రస్తుత మార్కెట్ లో అతి చిన్న 5 ఇంచీల స్మార్ట్ ఫోన్. దీని వలన ఫోన్ ను ఒక్క చేతితో వాడుకునే అవకాశం ఉంది. 130 గ్రా బరువు ఉన్న Mi4i 7.8mm సన్నగా మ్యటీ ప్లాస్టిక్ బ్యాక్ ఫినిషింగ్ తో తాయారు అయ్యింది. ఫోన్ నాలుగు కార్నర్లలో చాలా స్మూత్ గా గుండ్రంగా ఉంటుంది. ఓవర్ ఆల్ గా MI 4I చాలా  ఆకర్షణీయంగా, తెలివిగా 5 అంగుళాల స్క్రీన్ గా స్మార్ట్ ఫోన్ వినియోగదారులను తన వైపుకు తిప్పుకుంది.

డిస్ప్లే: ఈ ఫోనులో కలర్స్, షార్ప్ నెస్, వ్యుయింగ్ ఎంగల్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఎక్కువ ప్రకాశవంతమైన మరియు కాంతివంతమైన పదునైన డిస్ప్లే కలిగి ఉండటంలో Mi4i ట్రెండ్ ను మొదలు పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఫోన్ కొన్న వెంటనే మీకు డిఫాల్ట్ గా కలర్ టోన్ కూలర్ ఆప్షన్ లో ఉంటుంది, అది మీకు నచ్చనట్టు అయితే దానిని వార్మ్ మోడ్ లోకి మార్చుకుంటే మీ సమస్య తీరిపోతుంది. 'సన్ లైట్ డిస్ప్లే' గా మొదటి నుండి ప్రచారం చేసుకుంటూ వస్తున్న Mi4i నిజంగా ఆ విషయంలో వినియోగదారుల మన్నలను పొందుతుంది. మాములుగా ఇప్పటి వరకూ వచ్చిన స్మార్ట్ ఫోన్లలో ఉన్న ఏమ్బియంట్ సెన్సార్(Ambient Light సెన్సార్)  టెక్నాలజీ ని ఓక మెట్టు దాటింది సన్ లైట్ డిస్ప్లే. సాధారణంగా ఏమ్బియంట్ సెన్సార్ అనేది ఎండలోకి లేదా ఎక్కువ కాంతివంతమైన ప్రదేశాలలోకి వెలినప్పుడు ఆటోమేటిక్ గా ఫోన్ స్క్రీన్ డిస్ప్లే బ్రైట్ నెస్ పెంచుతుంది. కానీ సన్ లైట్ డిస్ప్లే ఎండలోకి వెలితే ఫోన్ డిస్ప్లే కాంట్రాస్ట్ ను బాగా పెంచి మనకు ప్రకాశవంతంగా కనపడేలా చేస్తుంది. నా రివ్యూ చేస్తునంత కాలం ఎప్పుడూ ఎండలో చదవటానికి కాని, చూడటానికి స్క్రీన్ ఇబ్బంది పెట్టలేదు. అదనపు ప్రకాశవంతమైన డిస్ప్లే, స్లిమ్ OGS స్క్రీన్ గ్లాస్ ప్యానెల్ మరియు సన్ లైట్ డిస్ప్లే టెక్నాలజీ అనేవి Mi4i స్క్రీన్ డిస్ప్లే విషయంలో చెప్పుకోవలిసిన విషయాలు.

 

పెర్ఫార్మెన్స్: ఫాస్ట్ కాని ఇష్టపడెంత పెర్ఫార్మెన్స్ ను ఇవ్వదు.
Snapdragon 615 SoC నిజంగా పూర్తి స్తాయిలో పెర్ఫార్మెన్స్ ను ఇవ్వటం విఫలమైంది. అలాగే 28nm 8-కోర్ ప్రాసెసర్ వేడి ఎక్కడం వంటి సమస్యలతో ఉంది అని ఇప్పటికే మనకు తెలుసు. అంతేగాక Snapdragon 615 మోడల్ CPU క్లాక్ స్పీడ్ లను వేగంగా పనిచేయనివ్వదు. చాలా పెద్ద బ్యాటరీ ఉండటం వలన Snapdragon 615 SoC కు గాలి వెళ్ళేంత సరియిన స్పేస్ కూడా Mi4i లో లేదు. కాకపోతే 2జిబి ర్యామ్ ఉండటం వలన Snapdragon 615 SoC, 2జిబి ర్యామ్ పవర్ ను జోడించుకొని,  హెవీ గేమింగ్ మరియు మల్టి టాస్కింగ్ లకు తప్పితే మిగతా విషయాలలో ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ ను ఇస్తుంది. ముందు నుండి Xiaomi చేపుకొస్తున్న సెకెండ్ జేనేరేషన్  Snapdragon 615 SoC, 4x కార్టెక్స్ A53 కోర్ల తో 1.0GHz కి బదులు 1.1 GHz ప్రాసెసింగ్ స్పీడ్ ను అందిస్తుంది. ఇదేమి గుర్తించ దగ్గ వ్యత్యాసం కాదు. లాలిపాప్ ఆండ్రాయిడ్ 5.0 మీద నడుస్తున్న Mi4i జనరల్ వాడుకకి మరియు గేమింగ్ ki Xiaomi Mi3 కన్నా మెరుగైన పెర్ఫార్మెన్స్ చూపించటం లేదు.

 

మొత్తానికి Xiaomi Mi4i ఫోన్ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది కానీ పవర్ యూజర్లకు మరియు  పెద్ద పెద్ద అప్లికేషన్స్ మరియు గేమ్స్ ను ఇంస్టాల్ చేసుకునే యూజర్లకు ఇది మంచి చోయిస్ కాదు. Mi4i దిగువ మోడల్ Mi3 నుండి దీనికి మారుదాం అని అనుకునే వాళ్లకి ఒక సలహా- పెర్ఫార్మెన్స్ పెద్దగా అవసరం లేదు అనుకుంటే Mi3 నుండి Mi4i కు మారవచ్చు.

కెమెరా: ఆకట్టుకుంది
Xiaomi ఫోన్లకు పెట్టింది పేరు వాళ్ళు వాడే HDR సేన్సార్స్. Mi4i అదే తరహ కెమేరా సెన్సార్లను తన 13MP లో వాడింది. తక్కువ షట్టర్ లాగ్ తో అధిక నాణ్యత చిత్రాలను ఇస్తుంది Mi4i. లో లైట్ లో తప్ప నార్మల్ మరియు ఏవరేజ్ లైటింగ్ కండిషన్స్ లో Mi4i Mi3 మరియు ఆసుస్ Zenfone 2 కన్నామెరుగైన  ఫోటోలను ఇస్తుంది. Mi4i లో మీరు ఫాస్ట్ గా ఫోటోలు తీసుకోగలుగుతారు. ఫోటోలు HDR మోడ్ అద్భుతమైన క్వాలిటీని ఇస్తుంది. కెమేరా విషయంలోధర పరంగా చూసుకుంటే కచ్చింతంగా Mi4i మిగతా ఫోన్లకి గట్టి పోటీ ఇస్తుంది.

 

 

 

Xiaomi Mi 4i Second Album

 

యూజర్ ఇంటర్ఫేస్: స్మార్ట్  మరియు  ఉపయోగించడానికి సులభం గా ఉంటుంది. కస్టమైజేషన్ ఎక్కువుగా అందిస్తుంది. Mi4i ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆధారంగా MIUI 6.5.0.3 నడుస్తుంది. బాగా పాలిష్ చేయబడిన ఇంటర్ఫేస్ MIUI 6 లో కనిపిస్తోంది, విపరీతమైన కష్టమైజేషన్స్ ను కూడా అందిస్తుంది. కానీ MIUI OS ఎప్పుడూ అధిక ర్యామ్ ను తీసుకుంటుంది అనే విషయం మనకు తెలిసినదే.

 

 \

 

 

బ్యాటరీ లైఫ్:  చాలా బాగుంది 
31200mah బ్యాటరీ Mi4i నిజంగా మెరుగైన బ్యాక్ అప్ ను ఇస్తుంది. గేమింగ్ లేకుండా  దాపుగా రెండు రోజులు సులువుగా వస్తుంది. పవర్ యూసేజ్ లో ఒక రోజు వస్తుంది. గేమింగ్ లో అన్ని ఫోన్ల మాదిరి గానే Mi4i కూడా ఉంది. 15నిముషాలు పాటు ఆడిన (Marvels: Contest of Champions) గేమ్ కి 10 శాతం బ్యాటరీ తగ్గింది.

.

 

కాల్ క్వాలిటీ:  నెట్వర్క్ మరియు కాల్ క్వాలిటీ విషయంలో Mi4i కు ఎటువంటి సమస్యలు లేవు. మిగతా స్మార్ట్ ఫోన్లలో ఉండే నెట్వర్క్ రిసీవింగ్ ఇబ్బందులు మరియు వైఫై సమస్యలు ఏమీ లేవు.


బాటమ్ లైన్:  ముందు చెప్పినట్టుగా Mi4i 12,999 కు చాలా ఎక్కువ ఫీచర్స్ ను ఇస్తుంది. కాని ఎక్కువ అప్లికేషన్స్ లేదా గేమ్స్ వాడే పవర్ యూజర్స్ కు Mi4i పెర్ఫార్మెన్స్ విషయంలో నిరాశ  పరుస్తుంది. కొంచెం ఎక్కువ డబ్బులు వేసుకుంటే పవర్ యూజర్లకు Xiaomi Mi4 16జిబి(17,999) లభిస్తుంది లేదా డ్యుయల్ సిమ్ అవసరం తప్పనిసరిగా  ఉన్న పవర్ యూజర్స్ కి OnePlusOne మరియు ఆసుస్ Zenfone 2 నచ్చుతాయి.
 

 

Xiaomi Mi 4i ఫ్లిప్ కార్ట్ లో రూ. 12,999 కి దొరుకుతుంది

 

 

క్షియోమి Mi4i Key Specs, Price and Launch Date

Expected Price:
Release Date: 13 Jul 2015
Variant: 16GB , 32GB
Market Status: Discontinued

Key Specs

 • Screen Size Screen Size
  5" (1080 x 1920)
 • Camera Camera
  13 | 5 MP
 • Memory Memory
  16GB & 32 GB/2 GB
 • Battery Battery
  3120 mAh
logo
Soham Raninga

Chief Editor

Advertisements
Advertisements

క్షియోమి Mi4i

క్షియోమి Mi4i

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status