Vivo V3 మాక్స్ Review

బై Souvik Das | అప్‌డేట్ చేయబడింది May 16 2016
Vivo V3 మాక్స్ Review
DIGIT RATING
74 /100
 • design

  80

 • performance

  70

 • value for money

  57

 • features

  81

User Rating : 5/5 Out of 1 Reviews
 • PROS
 • సుపర్బ్ పెర్ఫార్మన్స్
 • షార్ప్ అండ్ crisp (స్పష్టమైన) డిస్ప్లే
 • customized యూజర్ ఇంటర్ఫేస్
 • CONS
 • dull కెమెరా
 • bulky(భారీ) మరియు బోరింగ్ డిజైన్
 • ఓవర్ ప్రైస్

తీర్పు

Vivo V3 మాక్స్ మంచి స్మార్ట్ ఫోన్. ఫోన్ సైజ్ మరియు ఓవర్ ఆల్ బుల్కీ ఫీలింగ్ మినహా ఎంజాయ్ చేస్తారు ఫోన్ వాడటం. కాని ప్రైస్ ఓవర్ అని చెప్పాలి. 23,980 రూ ఉంది దీని ప్రైస్. స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ SoC 820 కలిగిన ఫోన్ Mi 5 ప్రైస్ - 24,990 రూ. సో Mi 5 లో అయితే పెర్ఫార్మన్స్, వేరి గుడ్ reliable os, గుడ్ డిస్ప్లే, బెటర్ బ్యాటరీ లైఫ్, బెటర్ కెమెరా అండ్ much బెటర్ లుక్స్ అండ్ ఓవర్ ఆల్ బాడీ ఫీలింగ్ ఉంటుంది. V3 మాక్స్ ధర సుమారు 20 వేల రూ ఉంటే సెన్సిబుల్ గా ఉండేది. 23,980 రూ లకు Vivo V3 మాక్స్ ను రికమెండ్ చేయటం కష్టం.

BUY Vivo V3 మాక్స్
Buy now on amazon అందుబాటు 17979

Vivo V3 మాక్స్ detailed review

4GB ర్యామ్, స్నాప్ డ్రాగన్ 652 ప్రొసెసర్ తో వస్తుంది V3 మాక్స్ అనే విషయం వినటానికి బాగుంది స్పెక్ వైజ్ గా కానీ ఇండియాలో మనీ ఫర్ వేల్యూ లేని ఫోనులకు డిమాండ్ ఉండదు. మోటోరోలా, Xiaomi, oneplus వంటి కంపెనిలు సక్సెస్ మోడల్స్ లాంచ్ చేసిన తరువాత కూడా వేల్యూ ఫర్ మనీ లేని మోడల్స్ లాంచ్ చేసిన అవి సక్సెస్ కాలేదు. ఇప్పుడు వాటి కున్నంత లెగసీ కూడా లేని Vivo కంపెని ఈ మోడల్ తో మార్కెట్ లో స్థానం సంపాదించుకోనుందా తెలుసుకుందాము రండి..


పెర్ఫార్మన్స్ - చాలా ఫాస్ట్ గా ఉంది.
స్నాప్ద్ డ్రాగన్ 652 SoC ఫ్లాగ్ షిప్ రేంజ్ లో రెండవ ఫాస్ట్ ప్రొసెసర్ గా ఉంది అని చెప్పవచ్చు. డే టు డే పెర్ఫార్మన్స్ లో V3 మాక్స్ సూపర్బ్. అన్నీ వెంటనే ఓపెన్ అవటం అవుతున్నాయి. యాప్స్ అయినా, ఆప్షన్స్ అయినా, సెట్టింగ్స్ అయినా. బ్యాక్ గ్రౌండ్ లో ఎనిమిది యాప్స్ రన్ అవుతున్నా asphalt 8 చాలా ఫాస్ట్ గా రన్ అవటం మంచి విషయం.

మీరు ఈజీగా బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ ను అప్ డేట్ చేస్తూ, ఫోన్ మాట్లాడటం, ఫోటోస్ ను ఎడిట్ చేయటం, వాట్స్ అప్ చేయటం వంటివి చేయగలరు. సాధారణంగా యాప్స్ అప్ డేట్ అవుతున్నప్పుడు మరే ఇతర పనులు అంత ఈజీగా చేయటం కుదరదు ఆండ్రాయిడ్ లో. హెవీ గేమ్స్ ను కూడా ఫోన్ ఈజీగా హేండిల్ చేస్తుంది. క్రింద బెంచ్ మార్క్స్ చూడగలరు..


Create bar charts

డిస్ప్లే అండ్ UI: బాగుంది
5.5-inch 1080p LCD డిస్ప్లే అనేది దాదాపు అన్ని ఫోనుల్లో ఉంటున్న స్పెసిఫికేషన్. కాని V3 మాక్స్ లోని డిస్ప్లే surprise అని చెప్పాలి. pleasant టచ్ రెస్పాన్స్ తో డిస్ప్లే అద్భుతం అని చెప్పాలి. మిస్ టచ్ లు లేదా స్వైప్స్ అనేవి ఉండవు. కలర్స్ లో కూడా వెరీ గుడ్ జాబ్. షార్ప్ నేస అండ్ కాంట్రాస్ట్ కూడా బాగున్నాయి. ట్రూ to source కలర్స్ చూపిస్తుంది డిస్ప్లే. అంటే బయట ఎలాంటి కలర్స్ ఉంటాయో ఎక్కువా తక్కువా లేకుండా అవే చూపించటం.

దీనిలో FunTouch UI 2.5 os ఉంది. బెస్ట్ customisation ఇస్తుంది ఈ os. My House థీమ్ కాన్సెప్ట్ బాగుంది. అయితే ఇది వాడితే కొంచెం పెర్ఫార్మన్స్ లో ఉండే ఆ flow తగ్గుతుంది. సెట్టింగ్స్ కూడా ప్రియారిటీ బట్టి ఆర్డర్ చేయబడ్డాయి. కొత్తగా ఫోన్ కొన్న వారు కొంత అలవాటు పడాలి. కొన్ని లాంచర్స్ లో మరియు ఆపిల్ ఫోన్లో ఉండే స్వైప్ డౌన్ to సర్చ్ ఫీచర్ , కంట్రోల్ సెంటర్ వంటివి బాగున్నాయి. 

కెమెరా: ఎవరేజ్
ఎవరేజ్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది కెమెరా విషయంలో. ఫోటోస్ ఫర్వాలేదు అనిపించే బ్రైట్ గా ఉన్నాయి. ఫోటోస్ slight గా undersaturate అయ్యాయి. కాంట్రాస్ట్ ఉండటం లేదు. నాయిస్ లెవెల్స్ కుడా ఎక్కువుగా ఉన్నాయి. ప్రోపర్ గా ఫ్రేమ్ చేసి ఫోటో తీస్తే మీకు డిసెంట్ ఫోటో వస్తుంది క్వాలిటీ పరంగా. కానీ డైలీ వాడుకలో ప్రతీ సారి అంత శ్రద్ద పెట్టి తీయరు కాబట్టి ఎవరేజ్ క్వాలిటీ ఫోటోస్ వస్తాయి. Low లైటింగ్ లో ఇంకా తక్కువ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. రేర్ కెమెరా కన్నా8MP ఫ్రంట్ కెమెరా బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది low లైట్ లో. 

కెమెరా యాప్ మాత్రం ఫాస్ట్ గా ఉంది. అలాగే  టచ్ మరియు షట్టర్ response కూడా స్మూత్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ రన్ అవుతున్నా instant గా ఫోటో తీయగలరు కెమెరా ఓపెన్ చేసి. కానీ ఇదే ప్రైస్ రేంజ్ లో ఉన్న Xiaomi MI5 కన్నా  slight గా ఎక్కువ టైమ్ తీసుకుంటుంది ఫోకస్ కు. 

 


Indoor (Fluorescent)


Indoor (Low Light)


Outdoor (Daylight)

బిల్డ్ అండ్ డిజైన్: పెద్దగా స్పెషల్ ఏమి లేదు.
Vivo V3 మాక్స్ మెటల్ unibody డిజైన్ తో వస్తుంది. ఇప్పుడు ఇది సర్వ సాధారణం. అందులోనూ ఇంత high ప్రైస్ లో. కానీ ఫోన్ స్లిమ్ గా లేదు, బరువు కూడా 168 గ్రా. ఇది ఎక్కువ అని చెప్పవచ్చ్చు. చూడటానికి కూడా హెవీ గా ఉంటుంది, ఫీలింగ్ కూడా హెవీ అనిపిస్తుంది మీ చేతిలో లేదా పాకెట్ లో ఉన్నప్పుడు. అన్ని ఫోనుల వలె ఉండవలసినవన్నీ ఉన్నాయి బిల్ట్ పరంగా, ఫింగర్ ప్రింట్ కూడా ఫాస్ట్ గా పనిచేస్తుంది. సో పెద్దగా డిజైన్ వైజ్ గా కానీ బిల్ట్ పరంగా కాని స్పెషల్ లేదు ఫోనులో.

బ్యాటరీ లైఫ్: వన్ డే
3000 mah బ్యాటరీ గిక్ బెంచ్ 3 టెస్ట్ లో 6 గంటల 30 నిముషాలు వచ్చింది బ్యాక్ అప్. అంటే అంత పవర్ ఫుల్ కాదు ప్రైస్ తో పోలిస్తే. డైలీ usage లో వాట్స్ అప్ ఎవరేజ్ use, 30 mins గేమింగ్, వన్ hour మ్యూజిక్ అండ్ ఇతర యాప్స్ తో 10 గంటలు వస్తుంది. క్విక్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. క్విక్ చార్జింగ్ అడాప్టర్ కూడా వస్తుంది ఫోన్ తో పాటు. సో ఒక ఫుల్ డే వస్తుంది అని చెప్పాలి సింగిల్ చార్జ్ లో.

బాటం లైన్: ఓవర్ ప్రైస్
Vivo V3 మాక్స్ మంచి స్మార్ట్ ఫోన్. ఫోన్ సైజ్ మరియు ఓవర్ ఆల్ బుల్కీ ఫీలింగ్ మినహా ఎంజాయ్ చేస్తారు ఫోన్ వాడటం. కాని ప్రైస్ ఓవర్ అని చెప్పాలి. 23,980 రూ ఉంది దీని ప్రైస్. స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ SoC 820 కలిగిన ఫోన్ Mi 5 ప్రైస్ - 24,990 రూ. సో Mi 5 లో అయితే పెర్ఫార్మన్స్, వేరి గుడ్ reliable os, గుడ్ డిస్ప్లే, బెటర్ బ్యాటరీ లైఫ్, బెటర్ కెమెరా అండ్ much బెటర్ లుక్స్ అండ్ ఓవర్ ఆల్ బాడీ ఫీలింగ్ ఉంటుంది. V3 మాక్స్ ధర సుమారు 20 వేల రూ ఉంటే సెన్సిబుల్ గా ఉండేది. 23,980 రూ లకు Vivo V3 మాక్స్ ను రికమెండ్ చేయటం కష్టం.

Vivo V3 మాక్స్ Key Specs, Price and Launch Date

Price:
Release Date: 05 Apr 2016
Variant: 32GB
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  5.5" (1080 x 1920)
 • Camera Camera
  13 | 8 MP
 • Memory Memory
  32 GB/4 GB
 • Battery Battery
  3000 mAh
logo
Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class.

Advertisements
Advertisements

Vivo V3 మాక్స్

Vivo V3 మాక్స్

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status