సామ్సంగ్ గాలక్సీ నోట్ 4 Review

బై Kunal Khullar | అప్‌డేట్ చేయబడింది May 12 2015
సామ్సంగ్ గాలక్సీ నోట్ 4 Review
DIGIT RATING
82 /100
 • design

  87

 • performance

  85

 • value for money

  60

 • features

  88

User Rating : 4/5 Out of 2 Reviews
 • PROS
 • రూపకల్పన సవరణ చాలా గొప్పగా ఉన్నది
 • ప్రదర్శన (డిస్ప్లే) అద్భుతంగా ఉన్నది
 • శక్తివంతమైన హార్డువేర్ మరియు సాఫ్ట్వేర్ అంశాలు
 • 4K వీడియో తో OIS కెమెరా
 • CONS
 • పట్టుకోవడానికి ఇంకనూ పెద్దగా ఉంది
 • వెనుకవైపు ఉన్న ప్లాస్టిక్ పానెల్ బలహీనముగా ఉంది

తీర్పు

ఖరీదైన హార్డువేర్ మరియు ఫీచర్ రిచ్ యూసర్ ఇంటర్ఫేస్ కలయిక తో ప్రస్తుతం ఉన్న ఉత్తమమైన ఫ్యాబ్లేట్లలో సామ్సంగ్ గాలక్సీ నోట్ 4 ఒకటి. దీని డిజైన్ లో ఆహ్వానించదగిన మార్పులు పొందుపరిచారు. ఉత్తమమైన అమోలేడ్ (AMOLED) డిస్ప్లే మనల్ని ఇంకా ఎక్కువ ఆశించేలా చేస్తుంది. సామ్సంగ్, ఫాబ్లేట్ తయారీదారులలో రారాజని మరొకసారి నిరూపించుకుంది. మీరు మీ ఫోన్ లో ఎక్కువ స్థలాన్ని కోరుకుంటే దీనిపై పెట్టుబడి పెట్టవచ్చు.

గాలక్సీ నోట్ సిరీస్ తో, ఫాబ్లేట్ విభాగాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చిన ఘనత సామ్సంగ్ కు దక్కింది. సాంప్రదాయ పరిమాణం లో ఉన్న  స్మార్ట్ ఫోన్లకు మరియు టాబ్లెట్ లకు వారధి ఏర్పరచిన నోట్ సిరీస్, దాని పనితీరు మరియు ఎక్కువ స్థలం చేత ఘనత వహినచింది. ప్రస్తుతం ఉన్న ఫాబ్లేట్లలో గాలక్సీ నోట్ 4 ఖచ్చితంగా దిగ్గజం  మరియు అన్నిటికంటే మెరుగైనది అని చెప్పవచ్చు. కానీ నిజంగా దాని పనితీరు ఎలా ఉంటుంది? మా సమీక్ష చూడండి . . .   

 

BUY సామ్సంగ్ గాలక్సీ నోట్ 4
Buy now on flipkart స్టాక్ లేదు 27990

సామ్సంగ్ గాలక్సీ నోట్ 4 detailed review

వివరణలు


డిస్ప్లే: 5.7 ఇంచుల ఉత్తమమైన అమోలేడ్ (AMOLED), 2560x1440 స్పష్టతతో గొరిల్లా గ్లాస్ 3 (515ppi)
బ్యాటరీ: 3220mAh, వేగవంతమైన బ్యాటరీ ఛార్జింగ్: 30 నిముషాలలలో 60% (క్విక్ ఛార్జ్ 2.0)  
స్టోరేజి (నిల్వ): 32 జిబి
కెమెరా: వెనుకవైపు ఫ్లాష్ మరియు OIS తో 16MP, ముందువైపు 1440p వీడియో తో 3MP
ఎస్ ఓ సి: క్వాల్కంమ్ స్నాప్ డ్రాగన్ 805
సి పీ యు: క్వాడ్ కోర్ 2.7 గిగా హెడ్జ్ 
జీ పీ యు: అడ్రినో 420
ర్యాం: 3 జిబి 
ఆపరేటింగ్ సిస్టం: టచ్ విజ్ యు యక్స్ కనెక్టివిటి తో ఆండ్రాయిడ్ 4.4.4: 4G, వై-ఫై,బ్లూటూత్, ఓటిజి యుయస్బి, ఐఆర్ బ్లాస్టర్ పోర్ట్  

నిర్మాణం మరియు డిజైన్

ప్లాస్టిక్ స్మార్ట్ ఫోన్లతో చులకన చేయబడిన, అసాధారణమైన శక్తి గల కొరియన్ కంపని సామ్సంగ్, మొదటి  లోహపు పరికరాలలో నోట్ 4 ఒకటి. మీరు ఆనందంతో గంతులు వేయడానికి ముందు ఒక విషయం స్పష్ఠ చేస్తున్నాం, గాలక్సీ ఆల్ఫా లాగే దీనికికూడా కేవలం ఫాబ్లేట్  యొక్క చట్రం/ఫ్రేమ్ మాత్రమే లోహపుది. ముందువైపు మొత్తం గ్లాస్ ఉన్నది కానీ, వెనుకవైపు మరల లెధర్ ఫినిషింగ్ ఉన్న, తొలగించగల ప్లాస్టిక్ ప్యానెలే ఉన్నది.

ముందువైపు, 2K స్పష్టతతో మరియు515ppi పిక్సెల్ సాంద్రతతో, 5.7 ఇంచుల సూపర్ అమోలేడ్ (AMOLED) ప్యానెల్ అద్భుతంగా కనిపిస్తుంది. సరిపోల్చలేని పదును మరియు కాంతివంతమైన రంగులు దీనిలో ఉన్నాయి. అమోలేడ్ (AMOLED) డిస్ప్లే కాబట్టి దీనిలోని భేదం గొప్పగా మరియు నలుపు నిమ్నతంగా ఉంది. స్మార్ట్ ఫోన్ లలో ఉండవలసిన డిస్ప్లే, ఉత్తమమైన అమోలేడ్ (AMOLED) మాత్రమే అని సామ్సంగ్ మరోసారి ఋజువు చేసింది. డిస్ప్లే క్రింద మరల రెండు సామర్థ్యపు బటన్లు, వేలిముద్ర స్కానర్ తో కూడిన ఒక హార్డువేర్ హోం కీ ఉన్నాయి. డిస్ప్లే పైన సాధారణ సెన్సర్లు, ఇయర్ పీస్, ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ మరియు 3.7 మెగా పిక్సెల్ ముందువైపు కెమెరా ఉన్నాయి. 

లోహపు ఫ్రేమ్ చేర్చడంవలన బలమైన నిర్మాణపు అనుభూతిని కలిగిస్తుంది. అయినప్పటికీ ఫ్రేమ్ లో కొన్ని వంకరలు, వంపులు ఉన్నాయి. ఉదాహరణకు హెడ్ ఫోన్ పిన్ను కొరకు నిర్దేశించబడిన చోట చిన్న వంపు ఉంది. ఏదేమైనప్పటికీ, లోహపు ఫ్రేమ్ తో ఉన్న నోట్ 4 ఖచ్చితంగా ప్రధానమైన ఫాబ్లేట్.

నుకవైపు బలహీనపు ప్లాస్టిక్ పానెల్ ఉన్నప్పటికీ, దానివలన డిజైనింగ్ విభాగానికి తక్కువ పాయింట్లు పడనందుకు ధన్యవాదాలు. అది చక్కగా కలిసిపోవడమే కాకుండా అదనంగా చక్కటి పట్టు ఇస్తుంది. వెనుకవైపు లౌడ్ స్పీకర్, 16 మెగా పిక్సెల్ కెమెరా, ఎఈడి ఫ్లాష్, మరియు దాని ప్రక్కన హార్ట్ రేట్ మానిటర్ ఉన్నాయి. వెనుక పానెల్ క్రింద 3220mAh బ్యాటరీ మరియు సిమ్ కార్డ్ కొరకు, యస్డి కార్డ్ కొరకు రెండు స్లాట్లు ఉన్నాయి.

వీటితోపాటుగా, ఫాబ్లేట్ క్రింది భాగంలో చక్కగా ఇమిడిపోయే ఎస్-పెన్ను కూడా మీకు లభిస్తుంది. ప్లాస్టిక్ ఫినిష్ ఉన్న ఎస్-పెన్ను ఒక బటను కలిగిఉండి, వాడటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. పైగా దానియొక్క మొన పాడైపోతుంది అయినను పరవాలేదు సామ్సంగ్ మీకోసం అదనంగా 5 మొనలను బాక్స్ లో ఇస్తుంది.

మొదటిసారి చూసినప్పుడు, నోట్ 4 దానిముందున్న దానిలాగే కనిపిస్తుంది కానీ దీనిలో కొన్ని మంచి నవీకరణాలు ఉన్నాయి. లోహపు ఫ్రేమ్ ఒక అద్భుతమైన ఎంపిక. కెమెరాకు ఓఐఎస్ జతచేయడంవలన నాణ్యత పెరిగింది. 2K ఉత్తమమైన అమోలేడ్ (AMOLED) పానెల్ ఆనందదాయకం.

యూసర్ ఇంటర్ఫేస్ మరియు పనితీరు  

నోట్ 4, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్ క్యాట్ తో పాటుగా సామ్సంగ్ టచ్ విజ్ ఇంటర్ఫేస్ తో పనిచేస్తుంది. ఇది దాదాపుగా గాలక్సీ S5 మరియు ఇటీవల వచ్చిన ఇతర గాలక్సీ ఉపకరణాలలోని యూసర్ ఇంటర్ఫేస్ వలె ఉంది. గత కొద్ది సంవత్సరాలలో టచ్ విజ్ బాగా అభివృద్ధి చెందింది మొత్తానికి సామ్సంగ్ దానిని సరియైనదిగా మలచింది. దీనికిముందు ఉన్న టచ్ విజ్, మెమరీ నిర్వహణ మరియు స్పందనలో అంత సమర్దవంతంగా లేదు. కానీ క్రొత్తగా వచ్చిన టచ్ విజ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇదియే మన ప్రియమైన యూసర్ ఇంటర్ఫేస్ అని చెప్పవచ్చు.  

వెల్లువెత్తే అనవసరపు సాఫ్ట్ వేర్ లేనందున సామ్సంగ్ కు ధన్యవాదాలు, కానీ తన స్వంత యాప్ స్టోర్ ను చేర్చింది. దీనిలోని గాలక్సీ ఎసెన్సియల్స్ మరియు గాలక్సీ గిఫ్ట్స్ నుండి మీకు కావలసిన యాప్స్ ను డౌన్లోడ్ చేస్కోవచ్చు. సామ్సంగ్ చాలా ఉదారంగా పెద్ద జాబితా, ఉచిత యాప్స్ మరియు యాప్ సబ్స్క్రిప్షన్ ను నోట్ 4 తో పాటుగా అందిస్తుంది. ఉచిత ఆఫీస్ ఎడిటర్ యాప్, కిన్డ్లి నుంచి  నెలకు ఒక ఉచిత పుస్తకము, జూంఇన్ నుంచి 1000 రూ. విలువచేసే ఉచిత ఫోటో ప్రింట్లు మొదలైనవి కొన్ని ముఖమైన బహుమతులు. ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి. హోం స్క్రీన్ కు ఎడమవైపు ఉన్న మై మ్యాగజైన్, ఫ్లిప్ బోర్డు వంటి యాప్. ఇది వివిధరకాల వార్తలు, వ్యాసాలను వివిధ వర్గాలనుంచి తెచ్చి మీముందు ఉంచుతుంది.

బాగా ప్రాచుర్యం పొందిన, సామ్సంగ్ యొక్క ఎస్-నోట్ మరియు ఎస్-హెల్త్ యాప్స్ ను కూడా మీరు పొందవచ్చును. మొదటిది మీరు ఎస్-పెన్ను తో వ్రాయడానికి కావసిన టూల్స్ అందిస్తుంది. రెండవది కొన్ని ఆసక్తికరమైన, ఆరోగ్యానికి సంభందించిన ట్రాకర్స్ మరియు ఫీచర్స్ అందిస్తుంది. బ్లాకింగ్ మోడ్ మరియు ప్రైవేటు మోడ్ దీనిలో ఉన్నాయి. ఇవి కాక ఇంకా ఎన్నో అనుకూలికరణలు, మీ అభిరుచికి తగ్గట్టుగా మార్చుకొనుటకు వాడుకోవచ్చును. ఫాబ్లేట్ ని ఒక చేతితో వాడటానికి అనువుగా ఉండటం కోసం, నోట్ 4 ఒక క్రొత్త పరిమాణాన్ని మార్చగలిగే ఫీచర్ ను కూడా అందిస్తుంది. దీని ద్వారా నడుస్తున్న ఏ యాప్ నైనా దాని యొక్క పరిమాణాన్ని మార్చుకోవచ్చును. ఎస్-పెన్ను దాని యొక్క నిజమైన సామర్ధ్యాన్ని మీకందిస్తుంది. దీని ద్వారా వ్రాయడం మరియు చిత్రించడమేకాకుండా, మీ డిస్ప్లే పైన ఉన్న దేనినైనా కట్/కాపీ చేసి దానిని అలాగే పంపవచ్చును. ఎస్-పెన్ను మీరు మీ మొత్తం ఫోన్ న్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా దీని యొక్క కదలికలు కర్సర్ అనుభూతిని కలిగిస్తాయి.  

 యూసర్ ఇంటర్ఫేస్ చాలా మృదువుగా ఉండి, దాని మొత్తం పనితనంలో మనం ఎటువంటి సమస్యలు గుర్తించలేని   అనుభూతిని ఇస్తుంది. మల్టీ టాస్కింగ్ సమర్దవంతంగా నిర్వర్తించబడింది మరియు మెమరీ నిర్వహణ కూడా ఆర్డరులో పనిచేస్తుంది. దీనికి అప్పగించే ప్రతి పనిని సమర్దవంతంగా నిర్వర్తించే ఫాబ్లేట్ నిజంగా శక్తివంతమైనది. మీరు కొనదగిన శక్తివంతమైన ఆండ్రాయిడ్ ఫోన్ లలో, స్నాప్ డ్రాగన్ 805 SoC మరియు 3GB ర్యాం కలిగిఉన్న, నోట్ 4 ఖచ్చితంగా ఒకటి. 

రియల్ రేసింగ్ 3, ఇన్ జస్టిస్:గాడ్స్ అమాంగ్ అస్, అస్ఫాల్ట్ 8: ఎయిర్ బార్న్ వంటి సంక్లిష్టమైన గేమ్స్ ఎటువంటి ఆటంకం లేకుండా, ఫ్రేమ్ రేట్ పడిపోకుండా పనిచేస్తాయి. నోట్ 4 లో సినిమాలు ప్లే చేయడం, ముఖ్యంగా 1080p మరియు 1440p రసగుల్లాలు తిన్నట్టుగా ఉటుంది. బెంచ్మార్క్ టెస్టులలో నోట్ 4 దాదాపుగా అన్ని విభాగాల్లో అత్యధిక మార్కులు సంపాదించింది. బెంచ్మార్క్ స్కోరు ఈ క్రింద వివరించబడింది:

ఒకటిన్నర రోజుల సాధారణ వాడుకను ఇచ్చే పెద్ద 3220mAh బ్యాటరీ, దాని నిర్వహణ సామర్థ్యంతో ఆకట్టకుంది. నేపద్యపు డేటా మరియు నిర్వహణ ను పరిమితం చేసే పవర్ సేవింగ్ మోడ్ దీనిలో మీకు లభిస్తుంది. ఇంకను గ్రే స్కేల్ థీమ్ ను వర్తింపచేసే గ్రే స్కేల్ మోడ్ కూడా ఉంది.ఇవి కాక సామ్సంగ్ యొక్క క్రొత్త అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంది. ఇది డిస్ప్లే ను బ్య్లాక్ అండ్ వైట్ లోకి మార్చి  ఫోన్ కాల్స్ మరియు టెక్స్ట్ మెసేజెస్ వంటి కొన్నింటిని మాత్రమే అనుమతిస్తుంది.విస్త్రుతపు వాడకంలో, ఎటువంటి పవర్ సేవింగ్ మోడ్స్ వాడకుండానే, దాదాపుగా ఒక రోజు పూర్తి ఛార్జ్ వస్తుంది.   

కెమెరా 

OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) కలిగిఉన్న క్రొత్త 16 మెగా పిక్సెల్ కెమెరా నిజంగా ప్రస్తుతించదగినదే. OIS పదును మరియు ఫోకస్ లను బాగుగా మెరుగుపరుస్తుంది. కెమెరా ఖచ్చితత్వము కలిగి, వేగవంతమైన ఫోకస్ తో మరియు జీరో షట్టర్ డిలే తో పనిచేస్తుంది. ఆటో-వైట్ బ్యాలన్సు బాగుంది కానీ కొంత మెరుగుపరచడం అవసరం ఎందుకంటే టోన్లలో కొంతమేరకు ఖచ్చితత్వము లోపించినట్లుగా అనిపిస్తుంది. రంగుల పునరుత్పత్తి నియంత్రణ మరియు గాఢత బాగున్నాయి. వివిధరకాల మోడ్స్, ఫిల్టర్స్ మరియు సెట్టింగులు నిక్షిప్తమైఉన్న కెమెరా యాప్  సహజమైన చిత్రీకరణకు దోహదపడుతుంది.  

కొన్ని ఫోటోలు అస్పష్టంగా వచ్చినప్పటికీ, ఐఫోన్ 6 లేదా ఎక్స్పీరియా Z3 తో పోల్చినప్పుడు దీనిలో మెచ్చుకోతగ్గ లోలైట్ పెర్ఫార్మన్స్ ఉంది. క్రింద కొన్ని నమూనాలను పరిశీలించండి:

వీడియో రికార్డింగ్ చాలా మృదువుగా ఉండి, వీడియోలు అద్భుతంగా వస్తున్నాయి ముఖ్యంగా 4K. ఆడియో రికార్డింగ్ కూడా స్పష్టంగా ఉంది బహుళ మైకులకు ధన్యవాదాలు. 

సారాంశం 
ఒకప్పుడు పెద్ద స్క్రీన్ కలిగి ఉన్నందుకు సామ్సంగ్ ను విమర్శించారు కానీ ఈరోజు మార్కెట్ అదే ధోరణి అనుసరిస్తుంది. ఉత్తమమైన ఫాబ్లేట్ గా  పేరొందిన గాలక్సీ నోట్ 4, సామ్సంగ్ అందించిన మరో అద్భుతమైన ఉత్పత్తి. క్రొత్త డిజైన్ తో మరికాస్త మెరుగుపడిన నోట్ 4 దానియొక్క పనితనము మరియు ఉత్పాదకతకు పేరొందింది. మీరు ఒక ఫాబ్లేట్ కొరకు చూస్తుంటే, ఇదియే సరియైనది. 

సామ్సంగ్ గాలక్సీ నోట్ 4 Key Specs, Price and Launch Date

Price: ₹58300
Release Date: 05 Oct 2015
Variant: 32GB
Market Status: Discontinued

Key Specs

 • Screen Size Screen Size
  5.7" (1440 x 2560)
 • Camera Camera
  16 | 3.7 MP
 • Memory Memory
  32 GB/3 GB
 • Battery Battery
  3220 mAh
Kunal Khullar
Kunal Khullar

Email Email Kunal Khullar

Advertisements
Advertisements

సామ్సంగ్ గాలక్సీ నోట్ 4

Buy now on flipkart 27990

సామ్సంగ్ గాలక్సీ నోట్ 4

Buy now on flipkart ₹ 27990

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status