Oneplus X Onyx Review

బై Prasid Banerjee | అప్‌డేట్ చేయబడింది Apr 08 2016
Oneplus X Onyx Review
DIGIT RATING
73 /100
  • design

    87

  • performance

    65

  • value for money

    67

  • features

    76

User Rating : 4/5 Out of 1 Reviews
  • PROS
  • మంచి లుక్స్
  • గుడ్ బిల్డ్
  • మంచి కెమేరా
  • CONS
  • గ్లాస్ బాడీ ఫ్రంట్ అండ్ బ్యాక్
  • స్నాప్ డ్రాగన్ 801 అవుట్ డేటెడ్ ప్రొసెసర్
  • హెవీ users కు బ్యాటరీ లైఫ్ సరిపోదు

తీర్పు

ఇది పర్టికులర్ స్మార్ట్ ఫోన్ యూసర్ కొనాలిసిన ఫోన్. అంటే మీరు ఏదైనా కొంచెం reliable బ్రాండ్ ఫోన్ ప్రీమియం గా కనిపిస్తే దానిని ఇష్ట పడతారా? అయితే ఆ పర్టికులర్ యూసర్ మీరే. లుక్స్ తో పాటు మంచి కెమేరా , respectable బ్యాటరీ లైఫ్ ఉన్నాయి దీనిలో. కాని బెస్ట్ in క్లాస్ పెర్ఫార్మన్స్ కావాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు.
 

 

BUY Oneplus X Onyx
Price 16999

Oneplus X Onyx detailed review

Oneplus అందరికీ బాగా పాపులర్ అవటానికి కారణం, దాని హై ఎండ్ స్పెసిఫికేషన్స్. మొట్ట మొదటి సారి ఇప్పుడు స్పెక్స్ పై కాకుండా డిజైన్ కోసం అని దింపిన మోడల్, oneplus x. స్వయంగా కంపెని ఈ విషయం చెప్పటం జరిగింది.


సో మరి డిజైన్ విషయంలో సక్సెస్ అయ్యిందా? మోటోరోలా కన్నా బెటర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇస్తుంది. అయితే డిజైన్ తో పాటు మిగిలిన విషయాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి..

బిల్డ్ అండ్ డిజైన్: bar అండ్ ప్రీమియం

ఇది గ్లాస్ బార్ ఫోన్ అని చెప్పలి. గ్లాస్ బాడీ ఉంటుంది. సైడ్స్ మాత్రం మెటల్ ను వాడింది. ముందు వెనుక గ్లాస్ బాడీ ఉండటం వలన ప్రీమియం గా కనిపిస్తుంది మొబైల్. అలాగే చేతి నుండి జారితే బ్రేక్ అవుతుంది అని భయం కూడా ఉంటుంది. అలాగని కేస్ లేదా కవర్స్ జోడిస్తే, లుక్స్ అన్నీ పోతున్నాయి. ఫోన్ పై ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి.

బార్ డిజైన్ ఆండ్రాయిడ్ లో కొత్త ఏమీ కానప్పటికీ, పబ్లిక్ లో ఫోన్ hold చేసి ఉన్నప్పుడు, మీకు తెలుస్తుంది ఆ ఫోన్ ప్రీమియం లుక్స్ ఇంపాక్ట్. సైజ్ కూడా చిన్నదే అవటం వలన holdable గా కూడా ఉంటుంది. బరువు 138 గ్రా. లైట్ గా ఉంటుంది.



డిస్ప్లే: బాగుంది
కంపెని మొదటి నుండీ మూడు విషయాలను చెబుతుంది. ఫోన్ తయారు చేయబడ్డ మేటేరియాల్స్, ఫోన్ సైజ్ అండ్ డిస్ప్లే. 5in అమోలేడ్ డిస్ప్లే డార్క్ థీమ్ తో వస్తుంది, సో నాలుగు వైపులా ఉన్న బెజేల్స్ మరియు స్క్రీన్ కలిసి నట్లు కనిపిస్తాది.(Onyx వేరియంట్).  గొరిల్లా గ్లాస్ 3 టచ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది.

1080p డిస్ప్లే  షార్ప్, బ్రైట్ మరియు వైబ్రెంట్ గా ఉంటుంది. శామ్సంగ్ హై ఎండ్ ఎమోలేడ్ డిస్ప్లే లలో ఉన్నట్టు యెల్లో ఓవర్ dose అయి కనిపించదు. డైరెక్ట్ సన్ లైట్ లో మాత్రం బాలేదు డిస్ప్లే. క్లియర్ గా కనిపించటం లేదు. బాగుంది అనే పదానికి బాగా దూరంగా ఉంది సన్ లైట్ లో. ( adaptive బ్రైట్ నెస్ ను enable చేసినా కూడా)

పెర్ఫార్మెన్స్: బాగుంది
ప్రొసెసర్ పరంగా స్నాప్ డ్రాగన్ 801 చాలా ఓల్డ్ అని చెప్పాలి. 64 బిట్ SoC కాదు ఇది. అంటే యాప్స్ ను ఆప్టిమల్ పెర్ఫర్మాస్ లెవెల్స్ లో రన్ చేయటం కుదరదు. oxygen os ను సాధ్యం అయినంతవరకు tweak చేయటం జరిగింది. నంబర్స్ ను చూస్తే, మోటో x ప్లే కన్నా  oneplus x బాగా పనిచేస్తుంది. కాని పెర్ఫార్మన్స్ కోసం అయితే వీటి కన్నా ఆసుస్ జెన్ ఫోన్ 2 4gb వేరియంట్ ను చూస్ చేసుకుంటాను నేను.
రెగ్యులర్ use లో oneplus x బాగుంది. లాగ్స్ అండ్ stutters ను మరిచిపోయేలా చేస్తుంది. ఒక వేల కనిపించినా అవి oxygen os వలన. గేమింగ్ విషయం లో ఇది మంచి ప్రొసెసర్. సో ఫైనల్ గా చెప్పాలంటే, ఇది బ్యాడ్ ప్రొసెసర్ కాదు, జస్ట్ అవుట్ డేటెడ్ అంతే. దీని కారణంగా oneplus x కేవలం FDD - LTE బాండ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది 4G లో.

OnePlus X Performance
Create bar charts

కెమేరా: బాగుంది.
13MP కెమేరా లో షార్ప్ డిటేల్స్ మరీ ఎక్కువగా లేవు, కాని మంచి కలర్ అండ్ ఫాస్ట్ షట్టర్ పెర్ఫార్మన్స్ ఉన్నాయి. Low లైటింగ్ లో కొంచెం dull అవుతున్నాయి ఫోటోస్. మిగిలిన కండిషన్స్ లో బాగుంది. 8MP కూడా మంచి పిక్చర్స్ తీస్తుంది. సాఫ్ట్ వేర్ లో ఇమేజ్ ను సాఫ్ట్ చేసే ఫీచర్ ఉంది బై డిఫాల్ట్. ఇది ఓవర్ గా లేక పోవటం వలన బాగుంది.

OnePlus X

 

బ్యాటరీ: ఎవరేజ్
2525 mah బ్యాటరీ ఇప్పుడు ఉన్న యాప్స్ అండ్ రిసోర్సెస్ కారణంగా ఆండ్రాయిడ్ కు ఇది తక్కువ అని చెప్పాలి. 10 నుండి 12 గంటలు వస్తుంది బ్యాక్ అప్. హెవీ యూసేజ్ ( ఫుల్ బ్రైట్ నెస్, 6 కాల్స్, ఎక్కవ వాట్స్ అప్, గంట సేపు గేమింగ్, ఎక్కవు వెబ్ బ్రౌజింగ్, కొంచెం కెమేరా క్లిక్స్ ) లో 10 గంటలు వచ్చింది బ్యాటరీ. ఇది చాలా మందికి సరిపోతుంది గా అనిపించ వచ్చు. కానీ oneplus వంటి సూపర్ talk ఉన్న ఫోన్ కొని వాడుతుంటే ఇదేంటి ఈ ఫోన్ కూడా ఇంత తక్కువ వస్తుంది బ్యాక్ అప్ అని అనిపిస్తుంది పవర్(హెవీ) users కు.

స్టోరేజ్: కొంచెం తక్కువ అని చెప్పాలి
దీనిలో ఉన్న ప్రధాన మైన ప్రాబ్లెం 16gb ఇంబిల్ట్ స్టోరేజ్. ఈ ప్రైస్ లో 32gb ఉంటే బాగుంటుంది. ఆఫ్ కోర్స్ 128gb sd కార్డ్ సపోర్ట్ ఉంది కాని, ఆండ్రాయిడ్ ఫోన్స్ లో యాప్స్ డేటా ఇంటర్నెల్ స్టోరేజ్ లో ఉంటే బాగా పనిచేస్తాయి. sd కార్డ్ అయితే పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది.

బాటమ్ లైన్
ఇది పర్టికులర్ స్మార్ట్ ఫోన్ యూసర్ కొనాలిసిన ఫోన్. అంటే మీరు ఏదైనా కొంచెం reliable బ్రాండ్ ఫోన్ ప్రీమియం గా కనిపిస్తే దానిని ఇష్ట పడతారా? అయితే ఆ పర్టికులర్ యూసర్ మీరే. లుక్స్ తో పాటు మంచి కెమేరా , respectable బ్యాటరీ లైఫ్ ఉన్నాయి దీనిలో. కాని బెస్ట్ in క్లాస్ పెర్ఫార్మన్స్ కావాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు.
వీడియో రూపంలో oneplus X కంప్లీట్ రివ్యూ ను క్రింద చూడగలరు...

Oneplus X Onyx Key Specs, Price and Launch Date

Price: ₹16999
Release Date: 10 Nov 2015
Variant: 16GB
Market Status: Launched

Key Specs

  • Screen Size Screen Size
    5" (1080 x 1920)
  • Camera Camera
    13 | N/A MP
  • Memory Memory
    16 GB/3 GB
  • Battery Battery
    2525 mAh
logo
Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably.

Advertisements
Advertisements

Oneplus X Onyx

Price : ₹16999

Oneplus X Onyx

Price : ₹16999

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status