79
82
67
95
మొదటి మోడల్ అంత కంటెంట్ తో లేదు. కాని దీని ప్రైసింగ్ పాయిట్ వలన ఇతర ఫ్లాగ్ షిప్ కిల్లర్స్ కన్నా ఇది బెటర్. 20 వేల నుండి 30 వేల ధరలో ఫోన్ తీసుకునే ఉద్దేశం ఉంటే ఇది తీసుకోండి. ఆల్రెడీ oneplus one మోడల్ ఉండి...దాని నుండి దీనికి అప్ గ్రేడ్ అవుదాం అని మాత్రం దీనిని తీసుకోవద్దు, oneplus one కు దీనికి పెద్ద worthable తేడాలు ఉండవు.
జులై 29 నుండి ఆగస్ట్ 10 వరకూ డైలీ యూసేజ్ ఫోన్ లా oneplus 2 ను వాడుతున్నా. మీ వద్ద oneplus వన్ ఉంటే, oneplus 2 కు మారే అవసరం లేదు. ఇది కేవలం అన్ని బ్రాండ్స్ లానే జస్ట్ నేమ్ సేక్ అప్ గ్రేడ్ మోడల్. అప్పటివరకు మార్కెట్ లో ఉన్న లెక్కలు అన్నీ చెరిపేస్తూ oneplus వన్(మొదటి మోడల్) స్మార్ట్ ఫోన్ ఏరా లో ఒక అమేజింగ్ ఫోన్ అనే స్థానం సంపాదించుకుంది. కాని oneplus 2 లో అంతటి amazing ఫీలింగ్ కలిగించే కంటెంట్ లేదు.
Oneplus 2 స్పెసిఫికేషన్స్ - 5.5 in 1080 x 1920 పిక్సెల్స్ LTPS LCD 401PPi కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ MSM8994 810 క్వాడ్ కోర్ Cortex-A53 అండ్ క్వాడ్ కోర్ 1.8GHz Cortex-A57 ప్రొసెసర్, 16GB-3GB , 64GB-4GB, అడ్రెనో 430, 13MP OIS, laser ఆటో ఫోకస్ రేర్ కెమేరా, 5MP 1080P ఫ్రంట్ కెమేరా, డ్యూయల్ నానో సిమ్, డ్యూయల్ స్టాండ్ బై, లాలిపాప్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, నాన్ రిమూవబుల్ 3300 mah బ్యాటరీ, బ్లూ టూత్ 4.1, 4G LTE
బిల్డ్ అండ్ డిజైన్ : చెప్పటానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. బాగుంది.
బ్యాక్ ఉన్న sandstone ప్యానల్ సేమ్ మొదటి మోడల్ వలె ఉంది కానీ దాని కన్నా తక్కువ క్వాలిటి లా అనిపిస్తాది. ఫినిషింగ్ రఫ్ గా ఉంది. రిమూవబుల్ బ్యాక్ ప్యానల్ ఇవ్వటం వలన సన్నని డిజైన్ తో వచ్చింది, oneplus వన్ మొదటి మోడల్ కు హార్డ్ గా ఉంటుంది.
ఫోన్ కెరీ చేయటానికి చాలా bulky గా అనిపించింది. కాని బరువు విషయంలో ఇబ్బందిగా అనిపించటం లేదు. లైట్ గానే అనిపిస్తుంది. దీనికి చుట్టూ మెటల్ ఫ్రేమ్ ఉంది. మెటల్ బిల్డ్ ను కవర్ చేసి ప్రీమియం లుక్ ఇవ్వటానికి మరియు బ్యాక్ ప్యానల్ ను రిమూవబుల్ గా చేసేందుకు మెటల్ ఫ్రేమ్ పెట్టింది oneplus. అయితే వాస్తవానికి ఫోన్ కు ఈ మెటల్ ఫ్రేమ్ ఎటువంటి అందం యాడ్ చేయలేదు పైగా కంపెని అందిస్తున్న వుడ్ ఫినిషింగ్ styleswap కవర్స్ కు ఇది mis match గా అనిపించింది. పర్సనల్ గా నాకు పెద్ద ఫోనులంటే ఇష్టం ఉండవు కాని రోజులు గడుస్తుండగా నా పాకెట్ లో చాలా సులువుగా పట్టినట్టు అనిపించింది.
డిస్ప్లే అండ్ UI: డిస్ప్లే లో ప్రైస్ తగ్గించటానికి compromise అయ్యింది. UI లో చాలా issues ఉన్నాయి.
5.5 in FHD ఉండవలసినంత షార్ప్ గా ఉంది. కాని డిమ్ గా ఉంది. ఫ్లాగ్ షిప్ కిల్లర్ స్మార్ట్ ఫోన్స్ కు ఉండే క్వాలిటీ కాదు ఇది. ప్రైస్ కటింగ్ చేయటానికి oneplus డిస్ప్లే లో ఒక visible compromise చేసింది. వీడియో కెమేరా ఆన్ చేసి.. ఒక్కసారి అలా ఫోన్ ను అటు ఇటు మూవ్ చేయండి, డిస్ప్లే లో refresh rate తక్కువగా ఉంది అని మీకు అర్థమవుతుంది.
ui పరంగా oxygen os కూడా work-in-progress లా ఉంది. చాలా బగ్స్ ఉన్నాయి. కాల్ రికార్డింగ్ యాప్ అసలు పనిచేయదు. రెండు కన్నా ఎక్కువ సందర్భాలలో cellular డేటా రీజన్ ఏమి లేకుండా off అయ్యేది. అలాగే హోం స్క్రీన్ లోని గూగల్ సర్చ్ బార్ రోజులో ఒక్కసారైనా కనపడకుండా మాయమవుతుంది. కాల్ లిఫ్ట్ చేస్తునప్పుడు లేదా మాట్లాడతున్నప్పుడు UI కారణంగా మరియు proximity సెన్సార్ సరిగా పనిచేయకపోవటం వలన ఫోన్ freeze అయ్యేది. దీని వలన బ్యాక్ గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా కొన్ని యాప్స్ ఓపెన్ అయిపోవటం, కాల్ hold లోకి వెళ్ళటం etc జరిగేవి. చాలా ఫేమస్ అని చెప్పబడే oneplus వంటి బ్రాండ్స్ ను ఎక్కువ డబ్బులు పెట్టి కన్నాక ఇలాంటి చిన్న చిన్న విషయాలలో కూడా ఫోన్ ఇబ్బంది పెడితే నిజంగా అప్పుడు తెలుస్తాది యూజర్ కు అన్ని ఫేమస్ మోడల్స్ perfect ఫోనులు అయ్యి ఉండవు అని. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా నా డెస్క్ పై ఉన్నప్పుడు సరిగా పనిచేసేది కాదు. చేతిలో ఉన్నప్పుడు మాత్రం బాగానే పనిచేసేది.
ఇవన్నీ బేసిక్ యూజర్స్ కైనా పవర్ యూజర్స్ కైనా చిన్న flaws లాగ కనిపించవచ్చు.. కానీ అసలు ఫోన్ రియల్ టైమ్ లో కూడా ఎలా ఉంది అని తెలియజేయటం అసలైన రివ్యూ అని డిజిట్ ఒపినియన్. oxygen os అంటే ఇదేదో డిఫరెంట్ ఫీచర్స్ తో ఎక్స్ట్రా గా తెచ్చిపెట్టేది ఏమీ ఉండదు ఒక్క Shelf screen ఫీచర్ తప్ప. ఆండ్రాయిడ్ లాలిపాప్ లో ఉన్న లుక్స్ ఫీచర్సే ఉన్నాయి దీనిలో కూడా.
Shelf screen మోస్ట్ used యాప్స్ అండ్ ఫేవరేట్ కాంటాక్ట్స్ ను చూపిస్తుంది. ఇది కూడా ఇంతకముందు లాంచర్స్ ద్వారా చాలా మంది చూసిన ఫీచరే. అలాగే హార్డ్ వేర్ బటన్ "All Notifications" మోడ్ నుండి "Priority" మరియు "No Interruptions" మోడ్ కు మరెందుకు పనిచేస్తుంది. ఐ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి ఈ ఫోన్ తీసుకున్న వారికీ ఇది నచ్చుతుంది బహుసా.
Fingerprint Sensor: చేతిలోనే స్కానింగ్ పనిచేస్తుంది.
ఆపిల్ touch id కన్నా ఫాస్ట్ కాదు కాని ఫర్వాలేదు. అలాగే పైన చెప్పినట్టు మీ చేతిలో కాకుండా ఫోన్ ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెడితే ఫింగర్ ప్రింట్ పనిచేయటం లేదు. ఇంకా దీనిపై డెవలప్మెంట్ జరిగే చోటు ఉంది. అయితే కేవలం unlocking స్కానర్ గానే కాకుండా కొన్ని functions యాడ్ చేయటం మంచి విషయం.
పెర్ఫార్మెన్స్ : బాగుంది, హీటింగ్ పై కంప్లైంట్ చేయరు
ఇక్కడ ముందుగా చెప్పవలసిన విషయం oneplus 2 ముందు మోడల్ అంత హిట్ అవటం లేదు. హిటింగ్ అనేది ఫోన్ లో కామన్. కాని మీరు issue గా తీసుకోవలసినంత హిటింగ్ దీనిలో లేదు. Injustice: Gods Among Us and Marvel: Contest Of Champions వంటి గేమ్స్ ను రెండు గంటలు పాటు ఫోన్ ఎక్కువ హిట్ అవుతుంది అనే ఫీలింగ్ లేకుండా ఆడగాలిగాము. ఎటువంటి ప్రొసెసర్ అయిన ఎంత హిట్ అవుతుందో ఇది కూడా అంతే హిట్ ఎక్కుతుంది.
ఇందుకు ప్రధాన కారణం కంపెని మొదటి మోడల్ కన్నా తక్కువ clock స్పీడ్ తో ప్రొసెసర్ ను ఇందులో జోడించింది. అలాగే cooling paste అనే దానిని యాడ్ చేసింది oneplus దీనిలో. ఇది 5 నుండి 10% హీటింగ్ issue ను తగ్గిస్తుంది. మీరు AC రూమ్ లో ఉంటే ఫోన్ వేడిగా ఉన్నట్లు అనిపిస్తే ఒక్క నిమిషం దానిని వాడకుండా ఉంచితే చాలు కూల్ అయిపోతుంది. అయినా ac రూమ్ లో గేమ్స్ ఆడినప్పుడు ఫోన్ నిజంగా ఎప్పుడూ complain చేసే అంత హిటింగ్ ఇవ్వలేదు.
clock స్పీడ్ తగ్గించటం వలన oneplus 2 బెంచ్మార్క్ స్కోర్స్ oneplus మొదటి మోడల్ అంత గ్రౌండ్ బ్రేకింగ్ స్కోర్స్ ఇవ్వలేదు. సెకెండ్ మోడల్ మొదటి దాని కన్నా ఎక్కువ స్కోర్ ఇచ్చింది కాని ఎక్కువ తేడాలు లేవు. రెగ్యులర్ ఫోన్ usage కు 1.7GHz ఆక్టో కోర్ ప్రొసెసర్ చాలా ఎక్కువ. హై ఎండ్ గేమ్స్ చాలా సునాయాసంగా ఆడుకోవచ్చు కాని ఎక్కువ సేపు ఆడితే కొన్ని లాగ్స్ ను చూస్తారు. కాని ఓవర్ ఆల్ గా పెర్ఫార్మన్స్ పై కంప్లైంట్స్ ఏమీ లేవు.
ఇందుకు కారణం 4GB ర్యామ్. 12 గంటలు పాటు యాప్ ను ఓపెన్ చేసి ఉంచినా మధ్యలో గేమ్స్ ఆడినా సరే చాలా రేర్ గా యాప్స్ suspend అవటం చూసాను. clock స్పీడ్ తగ్గించినా ర్యామ్ 4GB అవటం వలన మంచి balancing అయ్యింది పెర్ఫార్మెన్స్.
బ్యాటరీ: మీరు expect చేసే అంత బ్యాక్ అప్ ఉండదు
డిస్ప్లే మొదటి మైనస్ అయితే రెండవది బ్యాటరీ అని చెప్పాలి. ఒక రోజు మొట్ట బ్యాటరీ ఉంటుంది కాని ఫుల్ డే పాటు బ్యాక్ అప్ ఉంచటానికి మీరు గట్టిగా ప్రయత్నించాలి. అన్నీ enable అయ్యి రన్ అవుతూ ఫోన్ ను అలా వాడుకుంటూ బ్యాటరీ అయిపోతుంది అనే ఆలోచన లేకుండా ఉండటానికి అవదు. దాని మీద కొంత బ్యాక్ అప్ measures తీసుకుంటూ ఉంటే ఫుల్ డే వస్తుంది. బ్యాటరీ లైఫ్ పై సింపుల్ గా ఈ లింక్ లో క్లియర్ గా వివరించటం జరిగింది. ఇక్కడ చూడండి.
కెమేరా: బాగుంది కాని దీని కన్నా ఫాస్ట్ కెమేరా ఫోనులు ఉన్నాయి మార్కెట్ లో
Laser assisted ఆటో ఫోకస్ కెమేరా oneplus 2 లో మంచి అవుట్ పుట్ ను ఇస్తుంది. వెనుక ఉన్న 13MP కెమేరా బాగా ఇంప్రూవ్ అయ్యింది. కాని కేవలం కెమేరా విషయం లోనే టాప్ గా నిలిచిన LG G4 కన్నా ఫాస్ట్ ఫోకస్ చేయదు oneplus 2. అయితే ఇదేమి మైనస్ కాదు.
OnePlus 2
oneplus 2 లో ఇమేజెస్ కోసం ఉన్న డిఫాల్ట్ యాప్ గూగల్ ఫోటోస్, అంటే మీరు ఫోటో తీసి అది ఎలా ఉంది అని చూద్దామని సైడ్ కు స్వైప్ చేస్తే ఫోన్ freeze అవుతుంది. గూగల్ ఫోటోస్ యాప్ పెద్ద sources తో ఉంటుంది ( 20,000 కు పైగా డబ్బులు పెడుతున్నప్పుడు రోజుకి ఒక మోడల్ దిగుతున్నప్పుడు ఇంకా freezings ఏంటి అండీ!?? ఇలాంటి కారణాలే వలెనే కొంతమంది ఆండ్రాయిడ్ కన్నా ఆపిల్ ఐ ఫోన్లను ప్రిఫర్ చేస్తారు.)
కెమేరా మాత్రం మంచి ఫోటోలను తీస్తుంది. Low లైటింగ్ కండిషన్స్ లో కూడా మంచి క్వాలిటీ ఫోటోస్ ను ఇస్తుంది.
బాటమ్ లైన్:
గత సంవత్సరం వచ్చిన Oneplus one ఫ్లాగ్ షిప్(హై ఎండ్ ఫోన్) ఫోనుల్లో టాప్ స్మార్ట్ ఫోన్. oneplus 2 balanced గా గుడ్ వాల్యూ ఫర్ మనీ తో వస్తుంది. 20-30 వేల రూపాయలలో ఫోన్ కొనే ఉద్దేశం ఉంటే oneplus 2 ను రికమెండ్ చేస్తాము. కాని oneplus one నుండి అప్ గ్రేడ్ అయ్యేందుకు ఫోన్ కొనే ఉద్దేశంతో ఉంటే, oneplus 2 కరెక్ట్ ఫోన్ కాదు.
మీ స్మార్ట్ ఫోన్ చేయవలసిన అన్నీ పనులు ఇది చాలా ఫాస్ట్ గా చేస్తుంది. కాని మీరు expect చేసినంత out అండ్ out ఫ్లాగ్ షిప్ కిల్లర్ ఫోన్ కాదు ఇది. కాని పెర్ఫార్మన్స్ టు ప్రైస్ ratio లో, oneplus 2 కు కిల్లర్(సూపర్బ్) ప్రైసింగ్ ఇచ్చింది కంపెని.
Expected Price: |
![]() |
Release Date: | 15 May 2017 |
Variant: | 64GB |
Market Status: | Discontinued |
26 May 2022
26 May 2022
26 May 2022
26 May 2022
26 May 2022
18 Feb 2021
18 Feb 2021
18 Feb 2021
18 Feb 2021
09 Mar 2018
Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.
మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.