Nextbit Robin Review

బై Prasid Banerjee | అప్‌డేట్ చేయబడింది Jun 03 2016
Nextbit Robin Review
 • PROS
 • మంచి డిఫరెంట్ లుక్స్
 • CONS
 • క్లౌడ్ స్టోరేజ్ పై మీకు కంట్రోల్ ఉండదు
 • low స్టాండర్డ్ కెమెరా
 • ఎవరేజ్ బ్యాటరీ లైఫ్

తీర్పు

ఐడియా బానే ఉంది. స్మార్ట్ algorithm ద్వారా డేటా ను ఆటోమేటిక్ గా బ్యాక్ అప్ చేయటం. కాని దీనితో పాటు manual selective డేటా బ్యాక్ అప్ ఆప్షన్ ఇచ్చి ఉండవలసింది. అలాగే ఇంటర్నెట్ స్పీడ్ మరియు డేటా అవసరం అయ్యే పద్దతి ద్వారా ఫైల్స్ ను స్టోర్ చేసుకునే అంత environment మన పరిసరలాలో బాగా రేర్ అని చెప్పుకోవచ్చు. అమెరికా వంటి దేశాలలో బయటకు వెళ్ళినా WiFi రకరకాల పద్దతులలో అందుతుంది. మన దగ్గర ఇంటిలోనే WiFi ఉండటం ఇప్పుడిప్పుడు మొదలైంది. మొదలైన అవ్వకపోయినా అదే బ్యాక్ అప్ SD కార్డ్ లో పెట్టుకోవచ్చు గా. క్లౌడ్ స్టోరేజ్ ఫోన్ కొని నెలకు 2000 వేల రూ వైఫై ప్లాన్ వేసుకునే బదులు, 1000 రూ పెట్టి 64GB లేదా 128GB SD కార్డ్ కొని అందులోకి బ్యాక్ అప్ చేసుకోవటం మిన్న. ఇక మిగలిన స్పెక్స్ విషయానికి వస్తే కెమెరా ఎవరేజ్, ఫోన్ అంత పవర్ ఫుల్ కాదు, డిస్ప్లే కూడా గ్రేట్ అనేటట్టుగా ఉండదు. కేవలం డిజైన్ అండ్ లుక్స్ బాగున్నాయి. దీని కన్నా Xiaomi Mi 5, Nexus 5X అండ్ లెనోవో Vibe X3 మంచి ఫోనులు.

BUY Nextbit Robin

Nextbit Robin detailed review

Nextbit స్మార్ట్ క్లౌడ్: స్మార్ట్ కాని ఫంక్షనల్ కాదు.
క్లౌడ్ స్టోరేజ్ బాగుంది. కానీ మీ వద్ద హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు unlimited data సదుపాయాలు ఉంటే ఇది కరెక్ట్ గా ఉంటుంది. 2G లేదా 3G లేదా లిమిటెడ్ 4G ఇంటర్నెట్ సర్వీసులు వాడుతూ ఈ ఫోన్ కొంటె నిరాశ పడతారు క్లౌడ్ స్టోరేజ్ వైజ్ గా. అన్నీ ఉన్నా మీ డేటా కంపెని క్లౌడ్(internet హార్డ్ డిస్క్ వంటిది) స్పేస్ లో ఉంచటం కూడా ఒక వైపు రిస్క్ అని ఆలోచించాలి.


ఇవన్నీ వ్యక్తీ గత అభిప్రాయాలూ నమ్మకాల మీద ఆధారపడ వచ్చు కాని అసలు క్లౌడ్ ఏలా పనిచేస్తుంది అనేది చూద్దాం రండి. స్మార్ట్ స్టోరేజ్ గా ఉన్న దీనిలోని స్పేస్ టెక్నాలజీ algorithms మీ ఫోన్ లో ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, ఉండాలి అనే విషయాలను మీ వాడుక బట్టి సొంతంగా నిర్ణయిస్తుంది. దాని బట్టి మీరు వాడని యాప్స్ ను బ్యాక్ అప్ చేస్తుంది.

అయితే మీరు బ్యాక్ అప్ వద్దు అనుకుంటే ఆ యాప్స్ ను pin చేయగలరు. అయితే మీకు నచ్చినప్పుడు మీ ఫోన్ లోని యాప్స్ మరియు ఫైల్స్ ను క్లౌడ్ లోకి మూవ్ చేసుకోవటానికి అవ్వదు. అంత కంపెని algorithms బట్టి జరుగుతాయి. అంటే ఇది కొంచెం మైనస్ అని చెప్పాలి.ఫర్ eg: ఇప్పుడు ఫోన్ ఇంటర్నెల్ 32GB స్టోరేజ్ లో కొంచెమే ఫ్రీ స్పేస్ ఉన్నప్పుడు, మీరు క్లౌడ్ లోకి ఫైల్స్/యాప్స్ ను manual గా మూవ్ చేసి ఫ్రీ స్పేస్ ను పొందలేరు. అదే eg లో కంపెని స్మార్ట్ algorithm 1GB యాప్స్ అండ్ డేటా ను తనకు నచ్చినవి మూవ్ చేయాలని అనుకుంటే అవే మూవ్ అవుతాయి. అంతకు మించి తక్కువ, ఎక్కువా లేదా selected డేటా అనేది క్లౌడ్ లోకి పంపలేరు.

అలాగే క్లౌడ్ స్టోరేజ్ ను కేవలం ఫోన్ నుండే వాడుకోగలరు, డెస్క్ టాప్ సైట్ ఏమీ లేదు. అంటే అసలు గూగల్ డ్రైవ్ లో కాకుండా ఇప్పుడు నేను nextbit క్లౌడ్ స్టోరేజ్ ను ఎందుకు ప్రిఫర్ చేస్తాను ఇన్ని లిమిటేషన్స్ ఉంటె. మమూల ఫోన్ తీసుకోని, గూగల్ డ్రైవ్ లో నాకు నచ్చినవి నచ్చినప్పుడు స్టోర్ చేసుకోగలను కదా! అలాగే ఇది డెస్క్ టాప్, ఫోన్, టాబ్లెట్ అన్నిటిలోనూ access చేసుకోగలను.

అయితే డేటా ను మాత్రం కంపెని క్లౌడ్ నుండి మీకు నచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకోగలరు ఒక వేల దానిని ముందు క్లౌడ్ లోకి అప్ లోడ్ చేసి ఉంటె. అయినా SD కార్డ్ కొనుక్కొని దానిలో సేవ చేసుకుంటాము కాని ఇంటర్నెట్ అవసరం అయ్యే క్లౌడ్ లోకి ఎందుకు బ్యాక్ అప్ తీసుకుంటాము?  పోనీ తీసుకునే ఆలోచన ఉన్నా మాటి మాటికి ఇంటర్నెట్ నుండి డేటా డౌన్లోడ్ చేసుకోవటానికి మన దగ్గర ఇంటర్నెట్ స్పీడ్ కనెక్షన్స్ మరియు unlimited డేటా ప్లాన్స్ చాలా ఎక్కువ. 

అలాగే మీ క్లౌడ్ లో ఏమి ఉన్నాయో తెలుసుకోవాలంటే కేవలం సెట్టింగ్స్ మెనూ ద్వారా చూడగలరు. ఫోన్ కొంటె 100GB స్పేస్ వస్తుంది ఫ్రీ గా. ఇది స్మార్ట్ స్టోరేజ్ సెట్టింగ్స్ లో ఉంటుంది. దాని పై టాప్ చేస్తే క్లౌడ్ లో ఏమున్నాయో చూడగలరు. నేను వాడుతున్న ఫోన్ లో కొన్ని వరాల నుండి కంపెని 1.8GB మీడియా కంటెంట్ ను మరియు 13MB ఫోటోస్ అండ్ వీడియోస్ ను బ్యాక్ అప్ చేసింది క్లౌడ్ లోకి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు రెండు. ఒకటి కంపెని మీరు వాడని డేటా ఏంటో తెలుసుకొని వాటిని అప్ లోడ్ చేస్తుంది. రెండవ విషయం మీరు దేనిని బ్యాక్ అప్ చేసుకోలేరు, అలాగే ఏది బ్యాక్ అప్ అవ్వాలి అని కూడా సెట్ చేయలేరు. కేవలం ఏది బ్యాక్ అప్ అవకూదదో pinning ద్వారా సెట్ చేయగలరు అంతే!

ఫోన్ వెనుక నాలుగు LED లైట్స్ ఉన్నాయి. వాటి పైన క్లౌడ్ ఐకాన్ ఉంటుంది. బ్యాక్ అప్ అవుతుంటే లైట్స్ వెలుగుతాయి. నేను ఫోన్ వాడిన వారం రోజులలో రాబిన్ లైట్స్ వెలగటం ఎప్పుడూ చూడలేదు. కాని బ్యాక్ అప్ అయ్యింది డేటా. may be lights ఫోన్ ఫ్రంట్ భాగం లో ఉంటె బాగున్ను అనిపించింది. ఇదీ రాబిన్ ఫోన్ లోని ముఖ్యమైన స్పెషల్ ఫీచర్ గా వచ్చిన క్లౌడ్ కాన్సెప్ట్. ఇక ఇది మీకు నచ్చుతుందా లేదా అనే విషయాన్ని నిర్ణయించుకోవాలని అనుకుంటే మరలా పైన చెప్పినది ఒక సారి స్లో గా చదువు కుంటూ వెళ్ళండి, కచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది.  :-) నిజం!

బిల్డ్ అండ్ డిజైన్: అవార్డ్స్ ఇవ్వాలి నిజంగా
రాబిన్ లో ఉన్న హై లైట్ డిజైన్. నా ఫోన్ లో ఫ్రంట్ లో బ్లూ కలర్, బ్యాక్ లో వైట్ కలర్. స్మూత్ అండ్ క్లిన్ డిజైన్. ఫ్రంట్ లో స్పీకర్ గ్రిల్స్ సింపుల్ గా ప్లేస్ చేయబడ్డాయి. అలగే బాటం లోని USB పోర్ట్ C అండ్ టాప్ లో ఉన్న హెడ్ ఫోన్ జాక్ కూడా బాగా ఫిట్ అయ్యాయి. రాబిన్ ఫోన్ కు Red Dot నుండి డిజైన్ అవార్డ్ కూడా వచ్చింది. నిజంగా వార్డ్ కు అర్హత ఉన్న ఫోన్ ఇది.

అయితే ఇది అంత కంఫర్ట్ గా, సేఫ్ గా, సమర్ధంగా గా వాడుకోగలిగే ఫోన్ కాదు. అదేంటి అలా అన్నారు? బాగుంది గా డిజైన్ అని అనుకోకండి..  స్క్రీన్ సైజ్ 5.2 comfort సైజే కాని సామ్సంగ్ S7 అండ్ Nexus 5X (5 in ఫోన్స్ ఇవి కూడా) లతో పోలిస్తే చాలా పెద్దగా ఉంది ఫోన్. edges curved గా లేవు, సో చేతిలో గుచ్చుకున్నట్టు ఉంటుంది, ఫోన్ కూడా పెద్ద సైజ్ లో ఉండటం వలన. కొన్ని సార్లు స్లిప్ అవుతుంది కూడా. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్ సైడ్ భాగంలో పవర్ బటన్ లో ఉంటుంది. ఇది  చాలా గట్టిగా ప్రెస్ చేయవలసి వస్తుంది. కాని ఓవర్ ఆల్ గా చాలా కంపెనీలు ఫోన్ లుక్స్ పై sincere గా ఇన్నోవేషన్ తెవని టైమ్ లో రాబిన్ తీసుకువచ్చింది. అది మెచ్చుకోవాలి.

డిస్ప్లే: బాగుంది
1080P ఫుల్ HD డిస్ప్లే ఇది. బాగుంది. బ్లాక్స్ బాగా చూపిస్తుంది. complain చేయటానికి ఏమీ లేదు. 19,999 రూ కు తగ్గ డిస్ప్లే ఉంది ఫోన్ లో.

UI: మరింత కావాలి
ప్రతీ మూడు యాప్స్ ఒక folder గా ఏర్పడి ఉంటున్నాయి. పెర్సనల్ గా స్క్రీన్ అంతా ఫిల్ అప్ అవటం వలన నచ్చలేదు నాకు ఈ ఫీచర్. వెర్టికల్ యాప్స్ లిస్టు ఉంటుంది. సర్చ్ ఆప్షన్ లేదు యాప్స్ కు. ఫోన్ మార్ష్ మల్లో పైన నడుస్తుంది. సేమ్ లుక్స్. డిఫరెంట్ గా ఏమీ లేడు లుక్స్ వైజ్ గా UI లో.

పెర్ఫార్మన్స్: ఫర్వాలేదు
స్నాప్ద్ డ్రాగన్ 808 SoC నేక్సాస్ 5x లో కూడా ఉంది. కాని దాని అంత పెర్ఫార్మన్స్ స్కోర్ ఇవటం లేదు. అయినా రాబిన్ ఫాస్ట్ గానే ఉంది. అక్కడక్కడ slight లాగ్స్ ఉన్నాయి. అలాగే యాప్ లోడింగ్ టైమ్ కూడా ఎక్కువ ఉంటుంది హెవీ గేమ్స్ కు. సో స్మూత్ పెర్ఫర్మార్ కాదు హెవీ users కు. కాని రెగ్యులర్ users కు ఫర్వాలేదు. దీని కన్నా లెనోవో Vibe X3 బాగా ఫాస్ట్.

రాబిన్ ఫోన్ తొందరగా హీట్ అవుతుంది. అయితే హీట్ అయినప్పుడు మాత్రం ఊరికినే అవటం లేదు, బయట వాతావరణం బాగా వేడిగా ఉన్న మీరు హెవీ గేమింగ్ చేసినా అవుతుంది.

కెమెరా: inspiring గా లేదు
రాబిన్ లో 13MP రేర్ కెమెరా సబ్ స్టాండర్డ్ షాట్స్ తీస్తుంది. లైటింగ్ ఎలా ఉనా ఫోటోస్ desaturated గా ఉన్నాయి. అలాగే డిటేల్స్ కూడా అంత బాలేవు. Low లైటింగ్ లో ఇంకా బాలేవు. ఫోకస్ కూడా స్లో. కొన్ని సార్లు దగ్గర గా వెళ్లి close షాట్స్ తీస్తుంటే ఫోకస్ ఫెయిల్ అవుతుంది కూడా. ఇమేజ్ క్వాలిటి ఇంకా బెతర్ గా ఉండాలి. అయితే ఇది సాఫ్ట్ వేర్ తో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది.

   
These images are representational. Please click here for the full sized camera samples. 

బ్యాటరీ: సరిపోలేదు
2680 mah ఉంది బ్యాటరీ. హెవీ usage లో 7 గంటలు వస్తుంది. మార్నింగ్ 9 గంటలకు ఫుల్ చార్జింగ్ 100% లో ఉంటే, 45 నిముషాలు గేమింగ్, 5 ఫోన్ కాల్స్, 30 మినిట్స్ బ్రౌజింగ్ అండ్ నిరంతరం మెసేజింగ్ చేస్తే మధ్యాహ్నం 4 గంటలకు 15%కు వచ్చింది బ్యాటరీ బ్యాక్ అప్. డిస్ప్లే ఆటోమేటిక్ మోడ్ లో ఉంది ఈ టైమ్ అంతా.

రాబిన్ క్వాల్ కామ్ క్విక్ చార్జింగ్ 2.0 సపోర్ట్ తో వస్తుంది. కాని compatible adapter లేదు ఫోన్ తో పాటు. కేవలం USB C పోర్ట్ కేబుల్ మాత్రమే వస్తుంది. నాకు వచ్చిన ఫోన్ కొన్ని సార్లు చార్జింగ్ కూడా పనిచేసేది కాదు. may be ఈ unit కు ఎదో problem ఉంది ఉండవచ్చు.

బాటం లైన్
ఐడియా బానే ఉంది. స్మార్ట్ algorithm ద్వారా డేటా ను ఆటోమేటిక్ గా బ్యాక్ అప్ చేయటం. కాని దీనితో పాటు manual selective డేటా బ్యాక్ అప్ ఆప్షన్ ఇచ్చి ఉండవలసింది. అలాగే ఇంటర్నెట్ స్పీడ్ మరియు డేటా అవసరం అయ్యే పద్దతి ద్వారా ఫైల్స్ ను స్టోర్ చేసుకునే అంత environment మన పరిసరలాలో బాగా రేర్ అని చెప్పుకోవచ్చు. అమెరికా వంటి దేశాలలో బయటకు వెళ్ళినా WiFi రకరకాల పద్దతులలో అందుతుంది. మన దగ్గర ఇంటిలోనే WiFi ఉండటం ఇప్పుడిప్పుడు మొదలైంది. మొదలైన అవ్వకపోయినా అదే బ్యాక్ అప్ SD కార్డ్ లో పెట్టుకోవచ్చు గా. క్లౌడ్ స్టోరేజ్ ఫోన్ కొని నెలకు 2000 వేల రూ వైఫై ప్లాన్ వేసుకునే బదులు, 1000 రూ పెట్టి 64GB లేదా 128GB SD కార్డ్ కొని అందులోకి బ్యాక్ అప్ చేసుకోవటం మిన్న. ఇక మిగలిన స్పెక్స్ విషయానికి వస్తే కెమెరా ఎవరేజ్, ఫోన్ అంత పవర్ ఫుల్ కాదు, డిస్ప్లే కూడా గ్రేట్ అనేటట్టుగా ఉండదు. కేవలం డిజైన్ అండ్ లుక్స్ బాగున్నాయి. దీని కన్నా Xiaomi Mi 5, Nexus 5X అండ్ లెనోవో Vibe X3 మంచి ఫోనులు.

Nextbit Robin Key Specs, Price and Launch Date

Release Date: 02 Jun 2016
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  NA
 • Camera Camera
  NA
 • Memory Memory
  NA
 • Battery Battery
  NA
logo
Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably.

Advertisements
Advertisements

Nextbit Robin

Nextbit Robin

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status