మోటారోలా Moto E3 పవర్ Review

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Sep 28 2016
మోటారోలా Moto E3 పవర్  Review
  • PROS
  • బ్యాటరీ బాగుంది.
  • సింపుల్ అండ్ క్లిన్ లుక్స్
  • CONS
  • పూర్ పెర్ఫార్మన్స్
  • డిస్ప్లే లో గ్రేట్ అనిపించేలా ఏమీ లేదు
  • కెమెరా ఇంకా బాగుండాలి

తీర్పు

ఈ ఫోన్ కొనటానికి ఉన్న ఒకే ఒక కారణం బ్యాటరీ. కాని దీని కన్నా ఓవర్ ఆల్ గా రెడ్మి 3S బెటర్ ఫోన్. మోటో E3 కన్నా తక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్నా ఇది కూడా మంచి బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. Moto E3 power లో ఇప్పటివరకూ స్పెక్స్ తక్కువగా ఉన్న మోటో లో ఉండే నమ్మదగ్గ పెర్ఫార్మన్స్ లేదు. బ్యాటరీ అనేది అన్నిటి కన్నా మీకు ప్రియారిటీ అయితేనే అండ్ మోటోరోలా బ్రాండ్ ఫోన్ కావాలనుకుంటేనే ఇది తీసుకోవాలి.

BUY మోటారోలా Moto E3 పవర్

మోటారోలా Moto E3 పవర్ detailed review

7,999 రూ లకు 3,500 బ్యాటరీ, 2GB రామ్ తో ఇండియాలో మోటోరోలా Moto E3 పవర్ అనే పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. మేము దీనిని వాడటం జరుగుతుంది కొంతకాలం నుండి. సో ఇక్కడ దాని రివ్యూ చూడగలరు.


బిల్డ్ అండ్ డిజైన్:
ప్లాస్టిక్ డిజైన్ తో వస్తుంది కాని చీప్ గా అనిపించదు. వెనుక ఉండే బ్యాటరీ ను రిమూవ్ చేయగలరు. 5 in స్క్రీన్ ఉన్నప్పటికీ బెజేల్స్(ఫ్రాన్ ఫ్రంట్ లుక్స్ లో సైడ్స్ లో ఉండే spaces) రెడ్మి 3S prime కన్నా ఎక్కువ మందంగా ఉన్నాయి. సో దాని కన్నా కాంపాక్ట్ గా లేదు ఈ ఫోన్. కొంచెం లైట్ గా ఉంటుంది 153 గ్రా లో.  9.6 mm thickness. ఓవర్ ఆల్ గా సింపుల్ లుక్స్ అండ్ ప్లాస్టిక్ బాడీ అయినప్పటికీ మంచి తయారీ తో వస్తుంది.

డిస్ప్లే
553 Lux బ్రైట్ నెస్ తో రీజనబుల్ గా ఉంది. అలాగే కొంచెం reflective గా కూడా ఉంది. అంటే సన్ లైటింగ్ లో డిస్ప్లే అంత క్లియర్ గా బ్రైట్ గా కనిపించకపోవటం వంటివి ఉంటాయి. ప్రైస్ కు తగ్గట్టుగా కలర్స్ చూపిస్తుంది. ఓవర్ ఆల్ గా ప్రైస్ కు తగ్గట్టుగా ఉంది. అంటే గ్రేట్ డిస్ప్లే కాదు, అలాగని మీరు నిరుత్సాహ పడేలా ఉండదు.

పెర్ఫార్మెన్స్
మీడియా టెక్ SoC ఉంది ఫోన్ లో. కాని ఇప్పటివరకూ కంపెని స్నాప్ డ్రాగన్ SoC లను వాడింది. మోటో లో స్పెక్స్ ఎంత తక్కువగా ఉన్నా, OS తో మంచి optimisation చేసేది. కాని ఈ సారి ఈ మోడల్ లో in-built యాప్స్ అయిన కెమరా, గూగల్ ఫోటోస్, ఫేస్ బుక్ మరియు ఇతర యాప్స్ ఓపెన్ చేసిన వెంటనే ఓపెన్ అవటం లేదు, కొంచెం slow గా ఉన్నాయి.

ఇక గేమ్స్ గురించి చెప్పనవసరం లేదు, కొంచెం హెవీ గా ఉన్న గేమ్స్ అన్నీ కనిపించేటట్లుగా లాగ్ అవుతున్నాయి. గ్రాఫిక్స్ పవర్ విషయంలో కూడా దీని కన్నా రెడ్మి 3S 70% ఎక్కువ పవర్ కలిగి ఉంది. ఇంత డిఫరెన్స్ ఉంటే అది కచ్చితంగా ప్రాక్టికల్ వాడుకలో కనిపిస్తుంది. అంటే ఓవర్ ఆల్ గా మోటో E3 పవర్ లో అంత పవర్ లేదు స్పీడ్ వైజ్ గా.

కెమెరా
8MP రేర్ కెమెరా స్పెక్ వైజ్ గా అప్ గ్రేడ్ అయ్యింది కాని ఫోటోస్ విషయంలో అప్ గ్రేడ్ అవలేదు అని చెప్పాలి. అన్ని రకాల లైటింగ్స్ లో కొంచెం నాయిస్ ఉండటం చూశాను. జనరల్ గా కేవలం తక్కువ లైటింగ్ ఉన్న ఫోటోస్ లోనే నాయిస్ కనిపిస్తూ ఉంటుంది అన్ని ఫోన్లలో. కలర్స్ ఎవరేజ్, షార్ప్ నెస్ బాలేదు. దీని కన్నా లెనోవో Vibe K5 అండ్ రెడ్మి 3S బెటర్.

Indoor Lights


Indoor Low Light


Outdoor Bright Sunlight


Outdoor Night


Indoor Natural Light

బ్యాటరీ
ఫోన్ కొనటానికి కనిపించే అతి ముఖ్యమైన కారణం ఇదే అనిపిస్తుంది, ఎందుకంటే 3,500 mah ఉంది బ్యాటరీ.PC Mark బ్యాటరీ టెస్ట్ లో 4000 mah బ్యాటరీ ఉన్న రెడ్మి 3S prime ను కూడా మించేసింది. బేసిక్ users కు ఈజీగా 24 గంటలు వస్తుంది బ్యాటరీ. హెవీ user కు నైట్ వరకూ ఉంటుంది.

బాటం లైన్
ఈ ఫోన్ కొనటానికి ఉన్న ఒకే ఒక కారణం బ్యాటరీ. కాని దీని కన్నా ఓవర్ ఆల్ గా రెడ్మి 3S బెటర్ ఫోన్. మోటో E3 కన్నా తక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్నా ఇది కూడా మంచి బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. Moto E3 power లో ఇప్పటివరకూ స్పెక్స్ తక్కువగా ఉన్న మోటో లో ఉండే నమ్మదగ్గ పెర్ఫార్మన్స్ లేదు. బ్యాటరీ అనేది అన్నిటి కన్నా మీకు ప్రియారిటీ అయితేనే అండ్ మోటోరోలా బ్రాండ్ ఫోన్ కావాలనుకుంటేనే ఇది తీసుకోవాలి.

logo
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Advertisements
Advertisements

మోటారోలా Moto E3 పవర్

మోటారోలా Moto E3 పవర్

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.