MOTO G4 ప్లస్ Review

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Jun 02 2016
MOTO G4 ప్లస్ Review
 • PROS
 • బెస్ట్ కెమెరా అండర్ 15,000 rs
 • మంచి బ్యాటరీ లైఫ్
 • CONS
 • old డిజైన్
 • హెవీ గేమింగ్ లో ఫ్రేమ్స్ drop అవుతున్నాయి

తీర్పు

కరెంట్ మార్కెట్ లో ఉన్న స్పెక్స్ వైజ్ గా చూస్తె సగం దూరం ట్రెండ్ ను ఫాలో అయ్యింది G4 ప్లస్. కాని ఇంకా కంప్లీట్ గా reach కాలేదు. కెమెరా ఒక్కటే నిజంగా సీరియస్ reason కనిపిస్తుంది ఫోన్ తీసుకోవటానికి. మ్మిగిలిన ఫోన్లతో పోలిస్తే కొంచెం వాటి కన్నా తక్కువ గానే ఉంది ఉదాహరణకు రెడ్మి నోట్ 3. సో మీరు కెమెరా కోసం 40 శాతం పెర్ఫార్మన్స్ ను compromise అవటానికి మొగ్గి చూపించటానికి రెడీ అయితే MOTO G4 plus ను తీసుకోవచ్చు. లేదు ఓవర్ ఆల్ గా బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 15K అని అడిగితె రెడ్మి నోట్ 3 ఇంకా ఆ ప్లేస్ లో ఉంది. "రెగ్యులర్ అండ్ light users మేము, మాకు అంత usage ఉండదు సో కనీసం స్టాండర్డ్ బ్రాండ్ వేల్యూ అండ్ ఆండ్రాయిడ్ అప్ డేట్స్ వస్తాయి గా" అని అనుకుంటే దీనిని తీసుకోవచ్చు.

BUY MOTO G4 ప్లస్

MOTO G4 ప్లస్ detailed review

బిల్డ్ అండ్ డిజైన్: ఓల్డ్ 
ఫ్లాట్ గా ఉంది వెనుక, సో పాత moto మొబైల్స్ దీని కన్నా comfort గా ఉండేవి చేతిలో. డిజైన్ కూడా ఓవర్ ఆల్ గా స్పెషల్ గా ఏమి అనిపించటం లేదు. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ తో వస్తుంది. బాగానే ఉంది కాని కొంచెం outdated డిజైన్ మాదిరిగా ఉంటుంది. ఫైనల్ గా బిల్డ్ అండ్ డిజైన్ లలో దీని కన్నా Le 1S, రెడ్మి నోట్ 3 అండ్ లెనోవో K4 నోట్ బాగుంటాయి. కేవలం ఇవి మెటాలిక్ బాడిస్ తో వస్తున్నాయనే కాదు సింపుల్ గా బెటర్ ఫీలింగ్ ఇస్తాయి.


డిస్ప్లే అండ్ UI: అప్ గ్రేడ్ అయ్యింది కాని..
ఫుల్ HD 1080P డిస్ప్లే ను ఎట్టకేలకు బడ్జెట్ సెగ్మెంట్ లోకి తెచ్చింది కంపెని. nice అండ్ బ్రైట్ డిస్ప్లే ఉంది దీనిలో కాని రెడ్మి నోట్ 3 కన్నా మంచి డిటేల్స్ ఇవటం లేదు G4 ప్లస్. ఈ బడ్జెట్ లో బెస్ట్ డిస్ప్లే అంటే అది లెనోవో ZUK Z1. అయితే సైడ్ by సైడ్ పెడితేనే డిఫరెన్స్ లు కనపడతాయి. కాని నేనైతే రెడ్మి నోట్ 3 మరియు G4 ప్లస్ లో రెడ్మి కే వోట్ వేస్తాను డిస్ప్లే విషయంలో.

ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ వాటర్ ప్రూఫ్: ఒకటి ఉంది ఒకటి లేదు..
ఫాస్ట్ గా ఉంది FP. కాని స్క్వేర్ షేప్ లో ఉండటం అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఫ్రంట్ లో ఉన్న ఈ సాఫ్ట్ బటన్ ను ప్రెస్ చేయనవసరం లేదు, జస్ట్ టచ్ చేస్తే unlock అయిపోతుంది స్క్రీన్ ఆఫ్ లో ఉన్నప్పుడు.అయితే ప్రివియస్ moto G మోడల్ లో వాటర్ ప్రూఫ్ ఇచ్చి కంపెని దీనిలో కేవలం వాటర్ repellent ప్రూఫ్ ఇవటం వింతగా ఉంది. లేటెస్ట్ మోడల్ అంటే పాత మోడల్ కన్నా అడ్వాన్సు గా ఉండాలి కదా! అయితే కంపెని.. "ఫ్రంట్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ను పెట్టడం వలన వాటర్ ప్రూఫ్ ను పెట్టలేక పోయాము" అని చెబుతుంది.

పెర్ఫార్మన్స్: స్మూత్ కాని బెస్ట్ కాదు
స్నాప్ డ్రాగన్ 617 SoC, HTC A9 ఫోన్ లానే మంచి స్మూత్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది G4 ప్లస్ లో కూడా. కానీ బేసిక్ గా ఇది Qualcomm కంపెని పవర్ ఫుల్ ప్రొసెసర్ కాదు. stock ఆండ్రాయిడ్ UI తో అన్నీ పనులు బాగా చేస్తుంది. మీరు పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ కోసం వెతుకు తున్నట్లయితే రెడ్మి నోట్ 3 బెస్ట్ చాయిస్ ఈ బడ్జెట్ లో. దానిలోని SD 650 SoC దీని కన్నా 40% ఫాస్ట్. G4 plus లో మీరు హెవీ గేమింగ్ ఆడితే యాప్ లోడింగ్ టైమ్స్ మరియు గేమింగ్ లో ఫ్రేమ్స్ డ్రాప్ అవటం వంటివి చూస్తారు.

కాని light అండ్ రెగ్యులర్ users కు ఇది అన్ని పనులు ఈజీగా చేస్తుంది. యాప్స్ ఫాస్ట్ గానే లోడ్ అవుతాయి. రెడ్మి నోట్ 3 అండ్ LE 1S అంత snappy పెర్ఫార్మన్స్ ఇవకపోయినా satisfy అవుతారు G4 plus తో.

కెమెరా: బాగుంది
రెడ్మి నోట్ 3 అండ్ LE 1S కన్నా బెటర్ కెమెరా ఉంది దీనిలో. జనరల్ గా MOTO G సిరిస్ లో కెమెరా వీక్ కాని కంపెని ఈ ఫోన్ లో కెమెరా ను మెరుగు పరిచింది. బెటర్ డిటేల్స్ అండ్ కలర్స్ ఉన్నాయి. true to source కలర్స్ ఉంటున్నాయి ఫోటోస్ లో. అలాగని ఇది stunning కెమెరా కాదు కాని కాంపిటిషన్ లో బెటర్ కెమెరా ఫోన్ అని చెప్పవచ్చు.


(L-R) Indoor, White Light, Outdoor, Low Light

Honor 5X మరియు లెనోవో K4 note కన్నా కూడా బాగుంది. కాని Xiaomi Mi 4i కన్నా బెటర్ కాదు. తక్కువ లైటింగ్ లో కూడా బ్రైట్ ఇమేజెస్ ను produce చేస్తుంది. indoor లో కూడా డిటేల్స్ miss అవటం లేదు ఈజీగా.

బ్యాటరీ: గ్రేట్ కాదు కానీ బెటర్
3000 mah బ్యాటరీ light users కు కంప్లీట్ day వస్తుంది. హెవీ users కు రెండు సార్లు చార్జింగ్ చేసుకోవాలి. ఒక గంట గేమింగ్, మినిమమ్ 50 emails, 20 ఫోన్ కాల్స్ అండ్ చాలా వాట్స్ అప్ మెసేజెస్ మరియు సోషల్ మీడియా, బ్రౌజింగ్ ఇంటర్నెట్ చేస్తే రాత్రి చార్జింగ్ చేసిన ఫోన్ మరలా సాయింత్రం 5 గంటలకు చార్జ్ చేయవలసి వచ్చింది. రెడ్మి నోట్ 3 తో పోలిస్తే G4 ప్లస్ తక్కువ బ్యాక్ అప్ ఇస్తుంది. రెగ్యులర్ usage కు మాత్రం సరిపోతుంది G4 plus బ్యాటరి.

బాటం లైన్
కరెంట్ మార్కెట్ లో ఉన్న స్పెక్స్ వైజ్ గా చూస్తె సగం దూరం ట్రెండ్ ను ఫాలో అయ్యింది G4 ప్లస్. కాని ఇంకా కంప్లీట్ గా reach కాలేదు. కెమెరా ఒక్కటే నిజంగా సీరియస్ reason కనిపిస్తుంది ఫోన్ తీసుకోవటానికి. మ్మిగిలిన ఫోన్లతో పోలిస్తే కొంచెం వాటి కన్నా తక్కువ గానే ఉంది ఉదాహరణకు రెడ్మి నోట్ 3. సో మీరు కెమెరా కోసం 40 శాతం పెర్ఫార్మన్స్ ను compromise అవటానికి మొగ్గి చూపించటానికి రెడీ అయితే MOTO G4 plus ను తీసుకోవచ్చు. లేదు ఓవర్ ఆల్ గా బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 15K అని అడిగితె రెడ్మి నోట్ 3 ఇంకా ఆ ప్లేస్ లో ఉంది. "రెగ్యులర్ అండ్ light users మేము, మాకు అంత usage ఉండదు సో కనీసం స్టాండర్డ్ బ్రాండ్ వేల్యూ అండ్ ఆండ్రాయిడ్ అప్ డేట్స్ వస్తాయి గా" అని అనుకుంటే దీనిని తీసుకోవచ్చు.

MOTO G4 ప్లస్ Key Specs, Price and Launch Date

Release Date: 29 May 2016
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  NA
 • Camera Camera
  NA
 • Memory Memory
  NA
 • Battery Battery
  NA
logo
Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Advertisements
Advertisements

MOTO G4 ప్లస్

MOTO G4 ప్లస్

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status