78
71
59
67
మైక్రోమ్యాక్స్ వంటి ఇండియన్ బ్రాండ్స్ అంటే చాలా మందికి అనేక కారణాల వలన ఇష్టం ఉండదు. కాని xpress 2 లాంటి మోడల్స్ నెమ్మదిగా ఆ ఫీలింగ్ ను ఫేడ్ అవుట్ చేస్తున్నాయి అని చెప్పాలి. 7 వేల రూ లకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ . అయితే బ్యాటరీ మాత్రం dissppoint చేస్తుంది.
నిన్న మొన్నటి వరకూ ఉన్న రెడ్మి 2, లెనోవో A6000 సిరిస్ మోడల్స్ కు కాన్వాస్ xpress 2 గట్టి పోటీ ఇచ్చేలా కాంపిటేటివ్ పేపర్ స్పెక్స్ తో లాంచ్ చేసింది మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ గా. దీని ధర 6,999 రూ. అయితే దీనిలోని స్పెక్స్ నిజంగా వాటికి తగ్గా అవుట్ పుట్ ను ఇస్తున్నయా?
కాన్వాస్ xpress 2 key specs - ప్రొసెసర్ - మీడియా టెక్ MT6592M CPU octo కోర్ 1.4 GHz కార్టెక్స్-A, ర్యామ్ - 1GB, డిస్ప్లే - 720 X 1280 5in , కెమేరా - 13MP రేర్, 2 MP ఫ్రంట్, స్టోరేజ్ - 8gb ఇంబిల్ట్, 32 sd సపోర్ట్, బ్యాటరీ - 2500 mah
బిల్డ్ మరియు డిజైన్ : నో కామెంట్. బాగుంది.
మైక్రోమ్యాక్స్ కొత్త డిజైన్స్ పై ప్రయోగాలు చేస్తుంది. ఈ ఫోన్ లుక్స్ బాగున్నాయి. మ్యాటీ బ్యాక్ ప్యానల్ డిజైన్, గోల్డన్ సైడ్స్ ట్రిమ్, బిల్డ్ ప్లాస్టిక్ అయినా sturdy ఫీలింగ్ ఇస్తుంది చేతిలో పట్టుకునేందుకు. ఫోన్ క్రింద రెండు స్పీకర్ గ్రిల్స్ కూడా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ అందులో కేవలం రైట్ సైడ్ గ్రిల్ లోనే స్పీకర్ ఉంది.
డిస్ప్లే మరియు UI : గుడ్
5 in 720P HD డిస్ప్లే ఈ బడ్జెట్ లో మంచి విషయం. లెనోవో a6000 లాంటి డిస్ప్లే క్వాలిటి ఉంది దీనిలో. కలర్ gamut మరియు రిప్రోడక్షన్ చాలా బాగుంది. టచ్ కూడా లైట్ ఫీలింగ్ ఇస్తుంది. viewing angles కూడా చాలా wide గా ఉన్నాయి. రెడ్మి 2 అంత మంచి డిస్ప్లే కాదు కాని ఇది బెస్ట్ డిస్ప్లే అని చెప్పవచ్చు.
ఫోను కిట్ క్యాట్ os తో వస్తుంది. కంపెని త్వరలో లాలిపాప్ కూడా వస్తుంది అని చెబుతుంది. ui సేమ్ ఆండ్రాయిడ్ స్టాక్ వెర్షన్ లుక్స్ తోనే ఉంది. సొంతంగా ఎటువంటి హంగులు add చేయలేదు మైక్రోమ్యాక్స్ దీనిలో. లాగ్స్ లేవు స్మూత్ గా ఉంది ui, కాని bloatware (అనవసరమైన యాప్స్) ఎక్కువుగా ఉన్నాయని చెప్పాలి. టోటల్ గా 800 mb bloatware ఉంది. దీని వలన ఫోన్ తో పాటు మనం వాడుకోవటానికి వస్తున్న ఫ్రీ స్పేస్ (4.98 out of 8gb ఇంబిల్ట్ స్టోరేజ్) కు ఇంకా తగ్గుతుంది. bloatware అనేది పట్టించుకోవలసిన విషయం ఎందుకంటే ఈ యాప్స్ వలన ఫోన్ లో స్టోరేజ్ మరియు ర్యామ్ wastage అవుతాయి. రూటింగ్ చేసుకుంటేనే కాని వీటిని uninstall చేయలేము. ఫోన్ కొన్న వెంటనే రూటింగ్ అంటే అంత ఫాస్ట్ గా చేయలేము ఎంత పవర్ స్మార్ట్ ఫోన్ యూజర్ అయినప్పటికీ. రూటింగ్ అంటే ఏంటి? ఈ లింక్ లో తెలుసుకోండి కంప్లీట్ గా.
పెర్ఫార్మన్స్ : 2gb ర్యామ్ లేకపోయినా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది
ఆక్టో కోర్ మీడియా టెక్ ప్రొసెసర్ ను ఇంత తక్కువ బడ్జెట్ లో రిలీజ్ చేసేసరికి మిగిలిన ఫోనులకు మైండ్ బ్లాక్ అయ్యిందని చెప్పాలి. xpress 2 బ్రిలియంట్ పెర్ఫర్మార్. మోర్ than impressive అవుట్ పుట్. డెయిలీ టాస్క్ లను గురించి అయితే చెప్పనవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. బ్రౌజర్ మరియు మల్టీ టాస్కింగ్ కూడా డిసెంట్, 1GB ర్యామ్ ఉంటే స్మార్ట్ ఫోన్ యూజర్స్ ను బాగా ఆకర్షించేది. దీనిని కొనటానికి ఒక పెద్ద కారణం అయ్యేది. కాని 2 gb ర్యామ్ లేకపోయినా దీని పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. గేమింగ్ పెర్ఫార్మెన్స్ కూడా బెస్ట్, హై ఎండ్ గ్రాఫిక్స్ లార్జ్ గేమ్స్ ను సూపర్ గా హేండిల్ చేస్తుంది xpress 2. దీని synthetic బెంచ్ మార్క్ స్కోర్స్ పై ఒకసారి చూడండి. మీకు అర్థమవుతుంది. అంతే కాదు xpress 2 లో హెడ్ ఫోన్స్ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ ప్రైస్ లో ఇంతవరకూ ఇటువంటి క్వాలిటీ నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. లౌడ్ స్పీకర్ కూడా డిసెంట్ సౌండ్ ఇస్తుంది. కాల్ క్వాలిటీ కూడా trustworthy.
బ్యాటరీ : ఏవరేజ్ - బిలో ఏవరేజ్ కు మధ్యలో ఉంది
ఈ ఫోన్ లో ఉన్న ఒకే ఒక్క మైనస్ బ్యాటరీ. పూర్తిగా బ్యాడ్ కాదు కాని consistent లైఫ్ ఇవ్వటంలేదు. 1080P లూప్ వీడియో టెస్ట్ లో 5 గంటలకే 2,500 mah బ్యాటరీ అయిపొయింది. wifi - 3g నెట్వర్క్స్ లో రోజూ వారి పనులకు ఫోన్ వాడుతుంటే కేవలం 6 గంటలే బ్యాక్ అప్ ఇస్తుంది. ఒక గంట పాటు గేమింగ్ ఆడితే 30% తగ్గిపోతుంది. ఫుల్ ఛార్జింగ్ అవటానికి 2 నుండి 3 గంటలు టైమ్ తీసుకుంటుంది. మీరు గేమ్స్ అవీ పెద్దగా ఆడకపోతే సింగిల్ చార్జ్ లో ఫోన్ 7 నుండి 8 గంటలు వస్తుంది. ఇది ఫర్వాలేదు అని చెప్పాలి.
కెమేరా: బాగుంది కాని 13MP కు మీరు expect చేసే అంత ఉండదు క్వాలిటీ
13MP బ్యాక్ కెమేరా సెన్సార్ బెస్ట్ అని చెప్పలేము. కాని ధరకు తగ్గ ఫోటోలను ఇస్తుంది. రేర్ కెమేరా తో తీసిన ఫోటోస్ లో డిసెంట్ డైనమిక్ range మరియు మంచి కలర్ రిప్రోడక్షన్ ఉన్నాయి. Low లైట్ ఇమేజెస్ లో noise కనిపిస్తుంది కాని ఫోటోస్ బానే ఉన్నాయి. ఇక 2mp ఫ్రంట్ కెమేరా మిగిలిన ఏవరేజ్ బడ్జెట్ ఫోనుల కన్నా బానే ఉంది అని చెప్పాలి.
Micromax Canvas Xpress 2
బాటం లైన్ రికమెండేడ్ టు నాన్ గేమర్స్
మైక్రోమ్యాక్స్ జులై నెలలో రిలీజ్ చేసిన కాన్వాస్ xpress 2 మోడల్ ధర పరంగా గ్రేట్ ఫోన్ అని చెప్పాలి. కాని దీనికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈ ధరలో 2gb ర్యామ్ లేకపోయినా బెస్ట్ పెర్ఫార్మెన్స్ , మంచి కెమేరా , మంచి బిల్డ్ డిజైన్, ఏవరేజ్ టు బిలో ఏవరేజ్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది ఫోన్. ఇక మీ అవసరాలకు తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోండి. మొబైల్ గేమింగ్ లో ఇంటరెస్ట్ లేనివారికి ఇది 7K లో రికమెండేడ్ ఫోన్.
Expected Price: |
![]() |
Release Date: | 15 May 2017 |
Variant: | 8GB |
Market Status: | Discontinued |
18 May 2022
18 May 2022
18 May 2022
18 May 2022
18 May 2022
18 Feb 2021
18 Feb 2021
18 Feb 2021
18 Feb 2021
09 Mar 2018
Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.
మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.