మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4 Review: కంటెంట్ తక్కువుగా ఉంది, ఫోన్ సైజ్ పెద్దదిగా ఉంది.

బై Souvik Das | అప్‌డేట్ చేయబడింది Jun 16 2015
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4  Review: కంటెంట్ తక్కువుగా ఉంది, ఫోన్ సైజ్ పెద్దదిగా ఉంది.
DIGIT RATING
53 /100
  • design

    70

  • performance

    59

  • value for money

    31

  • features

    61

  • PROS
  • డిసెంట్ వీడియో రికార్డింగ్ క్వాలిటీ.
  • స్క్రీన్ పై ఫింగర్ ప్రింట్స్ ను ఆకర్షించదు.
  • CONS
  • ఎక్కువ లోడ్ పడితే పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది.
  • టచ్ రెస్పాన్స్ బాలేదు
  • ఫోటో క్వాలిటీ బిలో ఏవరేజ్

తీర్పు

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4 ను రికమెండ్ చేయటం కష్టతరం. ఒక్క వీడియో రికార్డింగ్ మినహా మినహా ఇందులో ఏమీ బాగాలేదు. 8,699 రూ లకు infibeam వెబ్ సైటు లో దొరుకుతుంది ఇది. ఆ ధర కు రెడ్మీ యురేకా ఫోనులను తీసుకోవటం మంచి చాయిస్. 

BUY మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4
Buy now on flipkart స్టాక్ లేదు 5999

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4 detailed review

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4 ను అన్ బాక్సింగ్ చేయగానే మొదటిగా ఫోన్ చాలా పెద్ద సైజు లో ఉంద అనే ఫీలింగ్ వస్తుంది. ప్రస్తుతం ఫోన్ల డిజైన్ అద్భుతంగా ఉండాలి అనేది వినియోగదారుని మెయిన్ ఎలిమెంట్ కాబట్టి, ఈ ఫోన్ కూడా బయటకు అందంగా కనిపిస్తుంది, కాని లోపల ఎంత స్టామినా ఉందో తెలుసుకుందాం రండి.

బిల్డ్ మరియు డిజైన్: ఏవరేజ్
ఫ్రంట్ లో బెజెల్ లేకుండా డిజైన్ చేసేందుకు ప్రయత్నించింది మైక్రోమ్యాక్స్. ఇరువైపులా గ్లాస్ ఎడ్జెస్ ఉన్నాయి. కాని అసలు స్క్రీన్ డిస్ప్లే కు ఎటువంటి రిస్క్ లేకుండా బెజెల్ గ్లాస్ అడుగున ఉంటుంది స్క్రీన్ డిస్ప్లే. రౌండ్ ఎడ్జెస్ మరియు బ్రషెడ్ మెటల్ ప్లాస్టిక్ బాండ్ బాడీ చుట్టూ ఉంది. హెడ్ ఫోన్ జాక్ పై భాగంలో ఉంది. usb ఛార్జింగ్ పోర్ట్ క్రింద ఉండగా, వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ రైట్ సైడ్ ఉన్నాయి. మ్యాటి బ్యాక్ ఫినిషింగ్ తో ఫోన్ బ్యాక్ ప్యానల్ లో కెమేరా ప్లేస్మెంట్ టాప్ left కార్నర్ లో ఉంది. స్పీకర్ మరియు మైక్రోమ్యాక్స్ లోగో కూడా బ్యాక్ సైడ్ అమర్చారు.

మెటల్ లుకింగ్ ప్లాస్టిక్ బాడీ తో స్టైలింగ్ ఏడ్ చేసే ప్రయత్నం చేసినా ఏవరేజ్ డిజైనింగ్ లుక్స్ ఉన్నాయి ఫోన్ కు. బిల్డ్ క్వాలిటీ కుడా డిసెంట్ అనిపిస్తుంది కాని ప్రీమియం లుక్స్ అయితే కనిపించవు. ఫ్రంట్ ఉండే ఫిజికల్ కేపాసిటివ్ బటన్స్ పై ఇండికేటర్ సింబల్స్ సైతం పెద్దవిగా కనిపిస్తున్నాయి. ముందు చెప్పినట్టుగా బెజెల్ లెస్ డిజైన్ లా కనిపించేందుకు మైక్రోమ్యాక్స్ చేసిన గిమ్మిక్ స్క్రీన్ ఆన్ చేయగానే బెజెల్ ఉంది అని తెలిసి పోతుంది. 6 in స్క్రీన్ కారణంగా చాలా పెద్దదిగా అనిపిస్తుంది ఓవర్ ఆల్ ఫోన్ లుక్.

డిస్ప్లే: బిలో ఏవరేజ్
6 in కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, 960x540 పిక్సెల్స్ రిసల్యుషణ్ తో 184 dpi తో వస్తుంది దీని డిస్ప్లే. స్క్రీన్ సైజ్ ఏమో పెద్దది, రిసల్యుషణ్ చుస్తే బాగా తక్కువ. ఈ కారణంగా డిస్ప్లే ఇక్కడే ఫ్లాప్ అయ్యింది. దీని వలన ఇమేజెస్, వీడియోస్ ఫ్లాట్ గా కనిపిస్తాయి. కలర్స్ లో వార్మ్ నేస లేదు. కలర్ టోన్స్ లో బ్లుయిష్ ఎక్కువుగా ఉంది, రెడ్ కలర్ టోన్ లేదు అన్నట్టు అనిపిస్తాది. ఓవర్ ఆల్ గా  షార్ప్ నేస్ లేదు. వ్యూయింగ్ ఏంగిల్స్ డిసెంట్ గా ఉన్నాయి. తక్కువ రిసల్యుషణ్ మరియు బ్రైట్ నేస కారణంగా సన్ లైట్ లో కూడా విసిబిలిటి తక్కువగా ఉంది. అవుట్ అండ్ అవుట్ ఏవరేజ్ డిస్ప్లే అవుట్పుట్ ఇస్తుంది.


యూజర్ ఇంటర్ఫేస్: స్టాక్ ఆండ్రాయిడ్ లానే ఉంది.
ఐకాన్స్ మరియు పేజెస్ బాగా ఆర్గనైజ్ అయ్యి ఉంటాయి. సింపుల్ ఫినిషింగ్ తో స్టాక్ ఆండ్రాయిడ్ లుక్స్ తో ఉంది UI.

పెర్ఫార్మెన్స్: బాగాలేదు
దీనిలో మీడియా టెక్ 1.3 GHz క్వాడ్ కోర్ ప్రోసెసర్, 1 జిబి ర్యామ్ ఉంది. బ్రౌజింగ్ స్పీడ్ స్టేబుల్ గా ఉంది కాని అప్పుడప్పుడు సడెన్ గా లాగ్ అవుతుంది. Dead Trigger2 లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు పెర్ఫార్మెన్స్ ల్యాగీ అనిపిసిస్తుంది. అలాగే గ్రాఫిక్స్ కూడా లో క్వాలిటీ లో ఉన్నాయి. బెంచ్ మార్క్స్ స్కోర్స్ కూడా తక్కువగా ఉన్నాయి. ఓవర్ ఆల్ గా 1 జిబి ర్యామ్ ఇతరత కారణాల వలన మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4 పెద్ద పెర్ఫార్మెన్స్ ను ప్రదర్శించటం లేదు.
 


Micromax Canvas Doodle 4 performance graph | Create infographics


కెమేరా: పూర్


స్పెసిఫికేషన్స్ వైజ్ గా దీనిలో 8MP ఆటో ఫోకస్ f/2.0 అపెర్చర్ మరియు 2MP ఫ్రంట్ కెమేరా ఉన్నాయి. అయితే స్టిల్ ఫోటోగ్రఫీ డే లైట్ మరియు ఫ్లోరోస్సెంట్ లైటింగ్స్ లో తక్కువ క్వాలిటీ ను ఇస్తుంది. ఫ్లాట్ ఇమేజెస్, తక్కువ షార్ప్ నెస్ తో పాటు  ఖచ్చితమైన కలర్స్ ను చూపించటం లేదు. ఫోటోలోని కలర్స్ కూడా బ్లుయిష్ గా అనిపిస్తాయి. లో లైట్ ఫోటోగ్రఫీ ఇంకా తక్కువ క్వాలిటీ తో ఉన్నాయి. Xiaomi రెడ్మీ 2 లాంటి ఫోన్లతో కంపేర్ చేస్తే ఇది బిలో పార్ కెమేరా అవుట్ పుట్ ను ఇస్తుంది. ఫ్రంట్ కెమేరా  మంచి లైటింగ్ కండిషన్స్ లో కూడా పిక్సిలేటేడ్ ఇమేజెస్ ను ఇస్తుంది. ఓవర్ ఆల్ కెమేరా డిపార్ట్మెంట్ లో ఫ్రంట్ కెమేరా లోని వీడియో రికార్డింగ్ లో మాత్రమే సర్ప్రైసింగ్ గా క్వాలిటీ బాగుంది. నోయిస్ లెవెల్స్ తక్కువుగా మరియు కలర్స్ కూడా స్టిల్ ఇమేజెస్ కన్నా బెటర్ గా ఉన్నాయి  వీడియో రికార్డింగ్ లో.

 

Micromax Canvas Doodle 4: Camera Images


బ్యాటరీ: బాగుంది
డూడుల్ 3లో 2500 mah ఉండగా, డూడుల్ 4 లో 3000 mah అధిక బ్యాటరీ ఉంది. మా బ్యాటరీ టెస్ట్స్ లో 7.1 గంటలు బ్యాక్ అప్ వచ్చింది. ఇది రెడ్మీ 2 (2200 mah) లాంటి కాంపిటేటర్స్ కన్నా ఎక్కువ బ్యాక్ అప్. ఒక గంట పాటు కంటిన్యుస్ గా గేమింగ్ చేస్తే బ్యాటరీ 15 శాతం తగ్గింది. ఇది డిసెంట్ బ్యాటరీ లైఫ్. ఓవర్ ఆల్ ఫుల్ చార్జింగ్ చేస్తే ఒక రోజు అంతా వస్తుంది. 


బాటమ్ లైన్
చెప్పుకునే అంత మంచి విషయాలు మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4 లో ఏమీ లేవు. ఎక్కువ శాతం స్మార్ట్ ఫోన్ యూజర్స్ కు దీని 6in ఓవర్ స్క్రీన్ సైజ్ ఖచ్చితంగా ఇబ్బంది కరంగా ఉంటుంది డైలీ లైఫ్ యూసేజ్ లో. 
పెర్ఫార్మెన్స్ - బిలో ఏవరేజ్
కెమేరా - ఫ్రాంక్లీ చాలా పూర్
ఆడియో క్వాలిటీ - ఏవరేజ్
ear phones వాల్యూమ్ - తక్కువగా ఉంది.
ఇదే ప్రైస్ రేంజ్ లో యు యురేకా మరియు రెడ్మీ 2, పెర్ఫార్మెన్స్ మరియు కెమేరా పరంగా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4 కన్నా చాలా బెటర్.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4 Key Specs, Price and Launch Date

Price: ₹9499
Release Date: 16 Jun 2015
Variant: 8GB
Market Status: Discontinued

Key Specs

  • Screen Size Screen Size
    6" (540 x 960)
  • Camera Camera
    8 | 2 MP
  • Memory Memory
    8 GB/1 GB
  • Battery Battery
    3000 mAh
Souvik Das
Souvik Das

Email Email Souvik Das

Follow Us Facebook Logo Facebook Logo

About Me: The one that switches between BMWs and Harbour Line Second Class. Read More

Advertisements
Advertisements

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4

Buy now on flipkart 5999

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4

Buy now on flipkart ₹ 5999

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status