లెనోవా ZUK Z1 Review

బై Prasid Banerjee | అప్‌డేట్ చేయబడింది May 16 2016
లెనోవా ZUK Z1 Review
DIGIT RATING
75 /100
 • design

  86

 • performance

  75

 • value for money

  63

 • features

  76

User Rating : 1.5/5 Out of 2 Reviews
 • PROS
 • గ్రేట్ డిస్ప్లే
 • లాంగ్ బ్యాటరీ లైఫ్
 • గుడ్ పెర్ఫార్మన్స్
 • CONS
 • కెమెరా ఇంకా బాగుండాలి

తీర్పు

లెనోవో ZUK Z1 అంతా ఎక్స్పీరియన్స్ కు సంబందించిన ఫోన్. నంబర్స్, స్పెక్స్ చూస్తె పెద్దగా స్పెషల్ అనిపించదు. కాని దీనిని వాడిన తరువాత definite గా డబ్బులకు తగ్గా ఫోన్ అనిపించింది. అయితే రెడ్మి నోట్ 3 కన్నా పవర్ ఫుల్ ఫోన్ కాదు. కాని ఫోన్ లో ఆప్షన్స్ ను మీకు నచ్చినట్టుగా మార్చుకోవటం మీకు బాగా ఇష్టమైతే ఈ ఫోన్ ఖచ్చితంగా నచ్చుతుంది.

BUY లెనోవా ZUK Z1
Buy now on amazon స్టాక్ లేదు 7999

లెనోవా ZUK Z1 detailed review

లెనోవో గత సంవత్సరం నుండి మంచి changes చేసింది అని చెప్పాలి. డిజైన్, స్పెక్స్, ప్రైసేస్ ఇలా కొన్ని కీలక విషయాలలో users కు తగ్గట్టుగా కంటిన్యూ అయ్యింది.


లేటెస్ట్ గా ZUK అనే సబ్ బ్రాండింగ్ ను కూడా తీసుకుంది చైనాలో. ఈ బ్రాండింగ్ లో రిలీజ్ అయిన Z1 ఫోనును లేట్ అయినా ఇండియాలో కూడా రిలీజ్ చేయటం జరిగింది.

స్పెక్స్ పరంగా ఇది oneplus one స్మార్ట్ ఫోన్ అని చెప్పలి. కాని ఆ ఫోన్ దాదాపు వన్ ఇయర్ పైనే ఓల్డ్. మరి అయినా కంపెని ఈ ఫోన్ ను ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసింది? ఈ ప్రశ్నకు జవాబు దొరికింది నాకు. మీరు తెలుసుకోండి..

బిల్డ్ అండ్ డిజైన్: దృడంగా గా ఉంది.
ఇది కొంచెం Vibe X3 నుండి inspire అయినట్లు ఉంటుంది. మెటాలిక్ ఫ్రేమ్ అండ్ ప్లాస్టిక్ బ్యాక్ panel. ప్లాస్టిక్ అయినప్పటికీ బ్యాక్ ఫినిషింగ్ మెటాలిక్ లానే ఉంటుంది. గట్టిగా మాట్లాడితే.. నిజంగా మెటల్ వాడిన ఫోనుల కన్నా ఈ ప్లాస్టిక్ ఫినిషింగ్ బాగుంది :) కాని చాలా మంది ఇది all మెటల్ బాడి అని confuse అవుతారు. పర్సనల్ గా Xiaomi రెడ్మి నోట్ 3 అండ్ LeEco Le 1S  వెనుక ఉండే antenna డిజైన్ల కన్నా బెటర్ లుక్స్ కలిగి ఉంది.

కాని ఓవర్ ఆల్ ఫోన్ అంత సులభంగా డిజైన్ కాలేదు సౌకర్యం విషయం లో. వైడ్ గా ఉంటుంది. సింగిల్ హ్యాండ్ లో కష్టం వాడటం. కాని మీరు 5.5 ఇన్ డిస్ప్లే కలిగిన ఫోన్ కొంటున్నారంటే ఆల్రెడీ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవటం లేనట్లే.

డిస్ప్లే: ఈ బడ్జెట్ రేంజ్ లో ఇది బెస్ట్
చైనా లో 2015 లో రిలీజ్ చేసి, ఇంత లేటుగా ఇండియాలో ఈ ఫోన్ రిలీజ్ చేయటానికి ఒక కారణం డిస్ప్లే అని చెప్పాలి. 5.5 in FHD డిస్ప్లే. ఇదే డిస్ప్లే సేమ్ బెస్ట్ ఫర్స్ట్ ప్రిఫరెన్స్ అండర్ 20K ఫోన్ గా పేరు తెచ్చుకున్న Vibe X3 లో ఉంది. కలర్స్, Vibrance అండ్ వైడ్ ఫ్రేమ్స్ లో మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటారు.

మాక్సిమమ్ బ్రైట్ నెస్ 450 nits ఇస్తుంది అని చెబుతుంది కంపెని. ఇది బెస్ట్ సన్ లైట్ విజిబిలిటీ కాదు కాని ఇండోర్స్ లో కలర్స్ సూపర్. బ్లాక్ మరియు వైట్ కలర్స్ కూడా వెరీ గుడ్. కాంట్రాస్ట్ రేషియో గ్రేట్ అని చెప్పాలి. ఇవన్నీ ఇంకా మీకు నచ్చినట్టుగా కూడా  మార్చుకోవటానికి Cyanogen mod డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తుంది. DPI సెట్టింగ్స్ కూడా మార్చగలరు, కాని అవి పెద్ద impact ఇవటం లేదు.

OS అండ్ UI: చాలా స్టేబుల్ గా ఉంది
లెనోవో ZUK Z1 ఆండ్రాయిడ్ 5.1.1 బేస్డ్ CM 12  పైనే నడుస్తుంది. కాని CM 13(Cyanogen Mod వెర్షన్ నంబర్ 13) తో మార్ష్ మల్లో అప్ డేట్ జూన్ లో రానుంది అని చెప్పింది కంపెని. జనరల్ stock ఒరిజినల్ ఆండ్రాయిడ్ ఇదే సేమ్ లుక్స్ ఉంటాయి 99%. కాని ఆప్షన్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి. గతంలో CM os తో Yutopia oneplus ఫోనులు రిలీజ్ అయ్యాయి. అవేమి స్టేబుల్ os గా లేవు. కాని దీనిలో బాగా స్టేబుల్ అయ్యింది. అంటే errors ఏమీ లేకుండా రన్ అవుతుంది. ఓవర్ ఆల్ గా Z1 లో os స్మూత్ గా స్టేబుల్ గా పెర్ఫరం చేస్తుంది. ఈ ఫోన్ ను రూటింగ్ చేసినా వారేంటి పోదు.

పెర్ఫార్మన్స్: steady గా ఉంది.
స్నాప్ డ్రాగన్ 801 ప్రొసెసర్ రెండు సంవత్సరాల క్రింద వచ్చింది. అంటే లాజిక్ ప్రకారం ఫోన్ ఎంత కాదు అనుకున్నా వన్ ఇయర్ ఓల్డ్ SoC తో వస్తుంది. కాని ZUK టీం దీనిని బాగా optimise చేసింది. బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా ఎక్కువగా రాలేదు. కాని ఇది స్కోర్స్ ఫోన్ కాదు పర్సనల్ గా ఎక్స్పిరియన్స్ చేస్తేనే తెలుస్తుంది దీని పవర్.


Cyanogen mod tweak చేయటం వలన UI స్మూత్ గా ఉంది. యాప్స్ కూడా ఫాస్ట్ గా ఓపెన్ అవుతున్నాయి. కేవలం హెవీ గేమ్స్(Injustice: Gods Among Us) ను ఓపెన్ చేస్తేనే లోడింగ్ టైమ్ తీసుకోవటం జరుగుంటుంది. అంటే actual గేమ్స్ అన్నీ లాగ్స్ లేవు mostly. ప్రొసెసర్ దాదాపు ఫుల్ క్లాక్ స్పీడ్(2.4GHz) లో రన్ అవుతున్నా టెంపరేచర్ 40 డిగ్రీల కన్నా తక్కువగా ఉంది. అయితే మీరు outdoors అండ్ summer లో ఉంటే టెంపరేచర్ పెరుగుతుంది ఆఫ్ కోర్స్.

ఇప్పటివరకూ క్వాల్ కామ్ తయారు చేసిన మోస్ట్ balanced ప్రొసెసర్ స్నాప్ డ్రాగన్ 810 అనే చెప్పాలి. కానీ ఇది 64bit SoC కాదు. కాని నేను ప్రతీ ఫోనులో వాడే చాలా యాప్స్ వరకూ దీనిలో కూడా పనిచేస్తున్నాయి. OneplusX లాంటి స్పెక్స్ తో వచ్చినా దానిలో accept చేయలేనిది దీనిలో accept చేసేది ఏంటంటే ప్రైస్. ఇది కేవలం 13,499 రూ. అది 16 వేల రూ సుమారు. అంతేకాదు దీనిలో 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉంది. oneplus X లో 16GB మాత్రమే ఉంది. SD కార్డ్ సపోర్ట్ రెండింటిలోను లేదు.

ఫింగర్ ప్రింట్ స్కానర్ Nexus imprint అంత ఫాస్ట్ కాదు అలాగని complain చేసే అంత స్లో కాదు. నచ్చుతుంది. కాని కొన్ని సార్లు మిస్ అయ్యింది ఫింగర్ ప్రింట్. కాని ఆపిల్ కూడా మిస్ అవుతుంది అని మీకు తెలుసా? :)

కెమెరా: కేవలం ఒకే ఒక మైనస్
ఫోన్ లో ఉన్న అన్ని మంచి విషయాలకు భిన్నంగా కెమెరా దీనిలో weak గా ఉంది. outdoor లోనే మంచి షార్ప్ నెస్ కలిగిన ఫోటోస్ ఇస్తుంది. Low లైటింగ్ లో డిటేల్స్ మరియు షార్ప్ నేస్ లేవు. కలర్స్ ఫర్వాలేదు. షట్టర్ లో లాగ్ లేదు కానీ కెమెరా స్లో గా ఉంది రెడ్మి నోట్ 3 వంటి ఫోనులతో పోలిస్తే. ఫోకస్ అవటానికి కూడా ఒక సెకెండ్ పడుతుంది.

   
Outdoor Daylight Shots (Click to enlarge)

  
(L-R) Indoor, Studio and Low Light (Click to enlarge)

 

బ్యాటరీ: చాలా ఎక్కువ సేపు వస్తుంది
ఫోన్ వెడల్పుగా ఉంది అని మొదటిలో చెప్పుకున్నాము. ఇది ఫోన్ ను పెద్దగా చేసింది అని మైనస్ అనుకున్నాము కాని అదే పాయింట్ వలన కంపెని కు పెద్ద బ్యాటరీ ఇచ్చే అవకాశం దొరికింది. గిక్ బెంచ్ 3 బ్యాటరీ టెస్ట్ లో ZUK Z1 8 గంటలు వస్తుంది. మంచి విషయమే. రెగ్యులర్ usage లో స్క్రీన్ బ్రైట్ నెస్ ను ఆటో మోడ్ లో ఉంచి వాడితే, కొంచెం ఎక్కువ సేపు గేమింగ్ చేసినా, ఫోన్ చీకటి పడే వరకూ వచ్చింది. most users కు ఒక రోజు కంప్లీట్ గా వస్తుంది బ్యాక్ అప్.balanced మోడ్ లో సెట్ చేసుకుంటే రెడ్మి నోట్ 3 అంత బ్యాక్ అప్ ఇస్తుంది Z1. నేను పెర్ఫార్మన్స్ మోడ్ లో వాడటం జరిగింది.

బాటం లైన్: అంతా ఎక్స్పీరియన్స్
లెనోవో ZUK Z1 అంతా ఎక్స్పీరియన్స్ కు సంబందించిన ఫోన్. నంబర్స్, స్పెక్స్ చూస్తె పెద్దగా స్పెషల్ అనిపించదు. కాని దీనిని వాడిన తరువాత definite గా డబ్బులకు తగ్గా ఫోన్ అనిపించింది. అయితే రెడ్మి నోట్ 3 కన్నా పవర్ ఫుల్ ఫోన్ కాదు. కాని ఫోన్ లో ఆప్షన్స్ ను మీకు నచ్చినట్టుగా మార్చుకోవటం మీకు బాగా ఇష్టమైతే ఈ ఫోన్ ఖచ్చితంగా నచ్చుతుంది.

లెనోవా ZUK Z1 Key Specs, Price and Launch Date

Price:
Release Date: 10 May 2016
Variant: 64GB
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  5.5" (1080 x 1920)
 • Camera Camera
  13 | 8 MP
 • Memory Memory
  64 GB/3 GB
 • Battery Battery
  4100 mAh
logo
Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably.

Advertisements
Advertisements

లెనోవా ZUK Z1

Buy now on amazon ₹ 7999

లెనోవా ZUK Z1

Buy now on amazon ₹ 7999

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status