లెనోవో Z2 ప్లస్ 64GB Review

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Nov 04 2016
లెనోవో Z2 ప్లస్ 64GB Review
 • PROS
 • Excellent పెర్ఫార్మన్స్
 • మంచి డిస్ప్లే
 • ఒక రోజు పూర్తిగా వచ్చే బ్యాటరీ లైఫ్
 • CONS
 • కెమెరా ఇంకా బాగుండాలి

తీర్పు

ఇప్పుడు 20 వేల బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ లెనోవో Z2 ప్లస్. మంచి పెర్ఫార్మన్స్, డిస్ప్లే, డిజైన్, బ్యాటరీ లైఫ్ ఉన్నాయి దీనిలో. కెమెరా ఒక్కటే కొంచెం వీక్. కాని అన్నీ కన్సిడర్ చేస్తే ఇది recommend చేయదగ్గ ఫోన్ అని చెప్పాలి. సో మీ వద్ద 20 వేల బడ్జెట్ ఉంటే, లెనోవో Z2 ప్లస్ కొనవచ్చు.

BUY లెనోవో Z2 ప్లస్ 64GB

లెనోవో Z2 ప్లస్ 64GB detailed review

స్నాప్ డ్రాగన్ 820 లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ ప్రొసెసర్ ప్రస్తుత మార్కెట్ లో. ఈ SoC తో ఇప్పటికీ LG G5, HTC 10, Oneplus 3, Xiaomi Mi 5 అండ్ LeEco Le Max 2 రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ ఫ్లాగ్ షిప్ ఫోనులు. అంటే హై ఎండ్. కానీ ఏదీ 20 వేల బడ్జెట్ లో లేదు. సో ఫర్స్ట్ టైం లెనోవో Z2 ప్లస్ 20 వేల బడ్జెట్ లో ఈ SoC కలిగి ఉంది. మొదటి వేరియంట్ 3GB రామ్ అండ్ 32GB స్టోరేజ్ 18 వేలకు వస్తుంది. రెండవది 4GB రామ్, 64GB తో 20 వేలకు వస్తుంది. ఇక్కడ దీని రివ్యూ చూద్దాం రండి!


బిల్డ్ అండ్ డిజైన్
మెటల్ అండ్ గ్లాస్ తో బిల్ట్ అయిన ఫోన్ ఇది. 5 in స్క్రీన్ అనే కాకుండా కంపెని వీలైనంత compact గా ఉండేలా ఫోన్ డిజైన్ ను తయారు చేసింది లెనోవో.

ఫ్రంట్ లో మల్టీ ఫంక్షనల్ బటన్ తో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మరింత useful డిజైన్ గా ఉంది. ఫోన్ చుటూ ఫైబర్ మెటీరియల్ ఉండగా వెనుక ఫైబర్ గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్ ఫింగర్ ప్రింట్ లను బాగా ఆకర్షిస్తుంది. అయితే గ్లాస్ కు scractches పడే అవకాశాలు ఉండటం వలన కంపెని బాక్స్ లో ఫోన్ కు కేసు అందిస్తుంది ఫ్రీ గా.

డిస్ప్లే అండ్ UI : బాగున్నాయి
5 in IPS డిస్ప్లే  బ్రైట్ గా ఉంది. లైటింగ్ లలో ఫర్వాలేదు అనిపించే బ్రైట్ నెస్ తో కనిపిస్తుంది. డిస్ప్లే పై ప్రీ installed matte స్క్రీన్ గార్డ్ ఉండటం వలన మరింత ఇష్టపడతారు. 547 Lux మాక్సిమమ్ బ్రైట్ నెస్ ఉంది ఫోన్ లో.

ZUI 2.0 యూజర్ ఇంటర్ ఫేస్ తో ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో పై రన్ అవుతుంది ఫోన్. క్విక్ సెట్టింగ్స్ లో ఆపిల్ ఐ ఫోన్ వలె క్రింద ఉంటాయి. గూగల్ లాంచర్ తో వస్తుంది ఫోన్. అయితే నోటిఫికేషన్ బార్ లో నోటిఫికేషన్స్ ను సింగిల్/డబుల్ ఫింగర్ తో స్వైప్ చేసిన వాటిని expand చేయలేరు. అలాగే led లైట్ కూడా చాలా dim గా ఉంది. అది కూడా సింగిల్ వైట్ కలర్ లోనే  బ్లింక్ అవుతుంది.

డిస్ప్లే క్రింద ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్ పై మీ వేలు పెడితే చాలు ఫోన్ డిస్ప్లే ఆఫ్ లో ఉన్న డైరెక్ట్ గా unlock చేయగలరు ఫోన్ ను. అలాగే ఇది నేవిగేషన్ బటన్స్ ఫంక్షన్స్ కూడా ఇస్తుంది. ఇంకా రీసెంట్ యాప్స్ లిస్టు లో ఉన్న యాప్స్ ను స్వైప్స్ ద్వారా కూడా access చేయగలరు. స్క్రీన్ లో ఉండే నేవిగేషన్ బటన్స్ ను hide కూడా చేసుకొని ఫిజికల్ బటన్ ద్వారా వాడుకోగలరు.

పెర్ఫార్మన్స్: 20 వేల బడ్జెట్ లో కొత్త highest పెర్ఫర్మార్
Le Max 2 (18 వేలు) ఫోన్ ఒకటే లెనోవో Z2 ప్లస్ కు క్లోజ్ గా వస్తుంది స్పెక్స్ విషయంలో. ఈ ఫోన్ నిజంగా beast పెర్ఫార్మన్స్ ఇస్తుంది. Le మాక్స్ 2 ను కూడా మించిన పెర్ఫార్మన్స్ ఉంది దీనిలో. హిటింగ్ ఎప్పుడూ 40 degrees దాటలేదు. Oneplus 3 కన్నా తక్కువ పెర్ఫార్మన్స్ ఇస్తుంది కాని oneplus 3 దీని కన్నా 8 వేలు ఎక్కువ ప్రైస్ కలిగిన ఫోన్. అయితే Z2 ప్లస్ మాత్రం చాలా స్మూత్ గా హేండిల్ చేస్తుంది ఏ పని చెప్పినా. హెవీ గేమింగ్ కూడా చాలా బాగుంది.

కాల్ క్వాలిటీ అండ్ రిసెప్షన్ కూడా బాగున్నాయి. కనెక్షన్ పూర్ గా ఉన్న ఏరియాస్ లో కూడా కాల్ డ్రాప్స్ లేవు. ఫోన్ అడుగున ఉన్న స్పీకర్ సింగిల్ స్పీకర్ కాని లౌడ్ గా ఉంది. ఆడియో కొంచెం వీక్ అవుతుంది ఎక్కువ వాల్యూం పెడితే. హెడ్ ఫోన్స్ లో మాత్రం crisp అండ్ క్లియర్ గా ఉంది.

బ్యాటరీ: ఒక రోజు వస్తుంది.

3500 mah బ్యాటరీ ఈజీగా ఒక వర్కింగ్ day వస్తుంది. PC మార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఫుల్ చార్జ్ కు 7 నుండి 7.5 గంటలు వచ్చింది లైఫ్. ప్రతీ ఫోన్ లో గేమింగ్ అనే సరికి బ్యాటరీ బాగా హరిస్తుంది. కాని Z2 ప్లస్ లో ఒక గంట సేపు గేమింగ్ చేసినా ఫుల్ day వస్తుంది బ్యాటరీ లైఫ్.

కెమెరా: ఇంకా బాగుండాలి.
ఈ ఫోన్ లో ఉన్న ఏకైక మైనస్ - కెమెరా. అయితే అలాగని బాలేదు అని కాదు, కాని అన్ని బాగున్నాయి, ఇదొక్కటే ఒక విధంగా వాటిలా ఒక లెవెల్ లో లేదు. 13MP రేర్ కెమెరా ఎక్కువ శాతం మందికి సంతృప్తి ఇస్తుంది. బాగా కెమెరా లవర్స్ అయితే మాత్రం ఎవరేజ్ గా ఫీల్ అవుతారు. మంచి లైటింగ్ ఉంటే ఫోటోస్ బాగుంటాయి, లైటింగ్ తగ్గే కొద్దీ నాయిస్ వస్తుంది.

HDR మోడ్ బాగుంది, కాని ఒకటి రెండు సేకేండ్స్ పడుతుంది ఫోటోస్ క్లిక్ చేయటానికి. కెమెరా తో 4K వీడియోస్ కూడా షూట్ చేయగలరు. కాని ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ లేకపోవటం వలన మరియు ఆటో ఫోకస్ స్లో గా ఉండటం వలన రికార్డింగ్ ఫర్వాలేదు అనిపిస్తుంది, గ్రేట్ అనిపించదు. మరో వైపు ఫ్రంట్ కెమెరా మంచి సేల్ఫీస్ ఇస్తుంది Low లైట్ లో కూడా. క్రింద ఇమేజ్ samples చూడగలరు. 

Images taken from Lenovo Z2 Plus

బాటమ్ లైన్: 20 వేలు లో ఫోన్ అనుకుంటే, ఇదే కొనండి!
ఇప్పుడు 20 వేల బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ లెనోవో Z2 ప్లస్. మంచి పెర్ఫార్మన్స్, డిస్ప్లే, డిజైన్, బ్యాటరీ లైఫ్ ఉన్నాయి దీనిలో. కెమెరా ఒక్కటే కొంచెం వీక్. కాని అన్నీ కన్సిడర్ చేస్తే ఇది recommend చేయదగ్గ ఫోన్ అని చెప్పాలి. సో మీ వద్ద 20 వేల బడ్జెట్ ఉంటే, లెనోవో Z2 ప్లస్ కొనవచ్చు.

లెనోవో Z2 ప్లస్ 64GB Key Specs, Price and Launch Date

Release Date: 20 Oct 2016
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  NA
 • Camera Camera
  NA
 • Memory Memory
  NA
 • Battery Battery
  NA
logo
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Advertisements
Advertisements

లెనోవో Z2 ప్లస్ 64GB

లెనోవో Z2 ప్లస్ 64GB

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status