లెనోవో Vibe K5 Review

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Sep 12 2016
లెనోవో Vibe K5 Review
 • PROS
 • డీసెంట్ ఓవర్ ఆల్ పెర్ఫార్మన్స్
 • బ్యాటరీ కాలేజ్/వర్క్ users కు కంప్లీట్ day వస్తుంది.
 • మంచి స్పీకర్ ఆడియో
 • day light ఫోటోస్ బాగున్నాయి.
 • CONS
 • డిస్ప్లే కు గ్లాస్ ప్రొటెక్షన్ లేదు
 • ఈజీగా సిమ్స్ ను మార్చుకోవటానికి అవ్వదు
 • ప్రత్యేకతలు ఏమీ ఉండవు

తీర్పు

మీరు గమించినట్లు అయితే లెనోవో Vibe K5 అన్ని సెగ్మెంట్స్ తో 6,999 రూ ప్రైస్ తో కంపేర్ చేస్తే నిజంగా తీసుకోగలిగే ఫోన్ అని చెప్పాలి. అయితే Xiaomi రెడ్మి 3S prime అన్ని విధాలుగా దీని కన్నా ( ప్రస్తుతం ఉన్న మిగిలిన ఫోనులకన్నాకూడా ) బెటర్ ఫోన్ అనే విషయం కూడా మీకు చెప్పాలి. సో లెనోవో Vibe K5 కూడా మంచి ప్రత్యామ్నాయ చాయిస్.

BUY లెనోవో Vibe K5

లెనోవో Vibe K5 detailed review

బిల్డ్ అండ్ డిజైన్
6,999 రూ ప్రైస్ అనేది మంచి ప్రైస్ అని చెప్పాలి. కాని డిజైన్ విషయంలో ప్రత్యేకం ఏమి లేదనేది కూడా వాస్తవమే. same డిజైన్. కాని బాలేదు అని చెప్పలేము. రెడ్మి 3S ప్రైమ్ లుక్స్ కు దగ్గరిలో ఉంది అనవచ్చు. బోర్డర్ మెటాలిక్ rim ఫ్రంట్ edges లో కనిపిస్తుంది. మైక్రో USB పోర్ట్ మరియు ఆడియో పోర్ట్స్ టాప్ లో ఉన్నాయి. స్క్రీన్ 5 in అవటం వలన ఫోన్ సింగిల్ హ్యాండ్ లో ఈజీగానే ఉంది వాడటానికి. హైలైట్ ఏంటంటే ఫోన్ లో డ్యూయల్ సిమ్ స్లాట్స్ మరియు SD కార్డ్ స్లాట్ సెపరేట్ గా ఉన్నాయి. హైబ్రిడ్ కాదు. బ్యాటరీ క్రింద ఉంటాయి. అంటే బ్యాటరీ ను కూడా రిమూవ్ చేసుకోగలరు.


బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బాగుంది. చేతిలో ఉన్నప్పుడు నిజంగా మంచి ఫీలింగ్ ఇస్తుంది. లుక్స్ వైజ్ గా గ్రేట్ అనిపించకపోయినా ప్లాస్టిక్ మాత్రం స్మూత్ గా ఉంటుంది. సింపుల్ లుక్స్ తో 150 గ్రా బరువు మరియు 8.2mm మందంగా ఉంటుంది ఫోన్. 5 in స్క్రీన్ కు ఇది సర్వసాధారణం. సో ఓవర్ ఆల్ గా బిల్డ్ అండ్ డిజైన్ సెగ్మెంట్ లో Vibe K5 డీసెంట్ ఫోన్, ప్రైస్ తో పోలిస్తే.


డిస్ప్లే అండ్ UI
5 in IPS LCD డిస్ప్లే 720x1280 pixels కలిగి ఉంది. అంటే HD. ఫెయిర్ కలర్ accuracy. బ్రైట్ నెస్ మాత్రం కాంపిటీషన్ ఫోనులకు ఉన్నంత లేదు. ఫర్ eg: రెడ్మి నోట 3 లో ఎక్కువ ఉంటుంది. బ్రైట్ నెస్ తక్కువైతే బయట ఉన్నప్పుడు స్క్రీన్ పై డైరెక్ట్ sunlight లో ఉంటే కనపడటం అనేది కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు.  కాని K5 లో కలర్స్ క్రిస్పి గా మంచి కాంట్రాస్ట్ మరియు saturation లెవెల్స్ కలిగి ఉంటాయి.

డాల్బీ atmos స్పీకర్స్ ఉన్నాయి. టచ్ రెస్పాన్స్ బాగుంది అనవచ్చు. కాని పర్సనల్ గా లెనోవో UI నచ్చదు. పైగా Xiaomi లాంటి ఫోనుల్లో MIUI లాంటి మంచి లుక్స్ కలిగిన UI's మార్కెట్ లో అందుబాటులో ఉన్నప్పుడు లెనోవో ఇంకా బాగా వెనకబడి ఉంది అనిపిస్తుంది ఈ విషయంలో. కాని ఓవర్ ఆల్ గా డిస్ప్లే విషయంలో ప్రైస్ తో పోలిస్తే Vibe K5 తీసుకోగలిగే ఫోన్ అని మాత్రం చెప్పవచ్చు.

పెర్ఫార్మన్స్
ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 415 SoC 1.4Ghz మరియు 2GB ర్యామ్ కాంబినేషన్ తో చాలా వరకూ లాగ్స్ లేకుండా మేనేజ్ చేస్తుంది Vibe K5. కాని చిప్ ఆల్రెడీ ఒకటిన్నరేళ్ళు పాతది. అడ్రెనో 405 గ్రాఫిక్స్ GPU చిప్ visual duties చూసుకుంటుంది. రియల్ లైఫ్ usage లో day-to-day పనులను బాగా పెర్ఫరం చేస్తుంది. గేమింగ్ కు ఫర్వాలేదు అనిపించింది.

వాట్స్ అప్, ఫేస్ బుక్, email etc వంటివి బాగానే లోడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ స్ప్లిట్ సెకెండ్ అంత time తీసుకుంటుంది యాప్స్ ఓపెన్ చేయటానికి మరియు ఒక దాని నుండి మరొక యాప్ కు మారటానికి. కాని ఈ ప్రైస్ కు అనుకున్నంత లాగ్ slowness అయితే ఎక్కడా కనిపించటం లేదు మేజర్ గా. Asphalt వంటి హెవీ గేమింగ్ లో ఆప్షన్స్ లో navigate అవుతుంటే చిన్న చిన్న లాగ్స్ ఉన్నా, గేమింగ్ మాత్రం స్మూత్ గా ఉంది. 15 నిముషాలు wifi ఆన్ లో ఉండగా గేమింగ్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ ను అప్ డేట్ చేస్తే ఫోన్ బాడీ టెంపరేచర్ 39.1 డిగ్రీ సెల్సియస్ కు వెళ్ళింది. కొంచెం హాట్ గా అనిపించింది చేతికి. కాని వెంటనే కూల్ అయిపోతుంది కూడా.

అలా అని కంప్లీట్ గా గేమింగ్ బాగుంది అనటానికి లేదు. హెవీ గేమ్స్ కొన్ని క్రాష్ కూడా అయ్యాయి. కాని ఓవర్ ఆల్ గా ఫోన్  డీసెంట్ performer అని చెప్పాలి కోర్ పెర్ఫార్మన్స్ విషయంలో. డాల్బీ ఆడియో స్పీకర్స్ విషయానికి వస్తే నార్మల్ స్మార్ట్ ఫోన్ స్పీకర్స్ కన్నా సౌండ్ బాగుంది అని చెప్పాలి. స్టీరియో ఆడియో కూడా ఉంది డ్యూయల్ స్పీకర్ ప్లేస్ మెంట్ లో.

కాలింగ్ అండ్ నెట్ వర్క్ క్వాలిటీ కూడా depend అవగలరు. కాని ear piece సౌండ్ క్వాలిటీ గ్రేట్ గా లేదు. hearing క్వాలిటీ తగ్గటం, పెరగటం అవుతుంది. అయితే ఇది నేను రివ్యూ చేసిన డివైజ్ లోని లోపం అయ్యి కూడా ఉండవచ్చు. సో ఓవర్ ఆల్ గా పెర్ఫార్మన్స్ విషయంలో ప్రైస్ తో పోలిస్తే Vibe K5 బాగుంది అని చెప్పాలి.

కెమెరా
13MP రేర్ కెమెరా impressive గా ఉంది. ఈ ప్రైస్ లో లెనోవో ఈ క్వాలిటీ అందిస్తుంది అని అనుకోలేదు. బడ్జెట్ లో లెనోవో ఫోన్స్ లో ఇది బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పాలి. అయితే కెమెరా యాప్ ఓపెన్ అవటానికి కొంచెం స్ప్లిట్ సెకెండ్ ఎక్కువ టైం తీసుకుంటుంది మరియు ఫోటోస్ తీసేటప్పుడు టాపింగ్ వంటి విషయాలలో కూడా కొంచెం laggy గా ఉంది. క్రింద ఫోటో శాంపిల్స్ చూడగలరు.

View post on imgur.com

 కాని ఫోటోస్ విషయంలో మంచి బాలన్స్ ఉంది. మంచి కలర్స్, వైట్ బాలన్స్ మరియు saturation ఉంది. డిటేల్స్ మాత్రం గ్రేట్ గా లేవు. అలాగే డిఫాల్ట్ గా కెమెరా dim పిక్స్ తీస్తుంది. ఇక Low లైటింగ్ లో నాయిస్ లెవెల్స్ బాగా ఉన్నాయి. అంటే బాలేవు. కానీ ఓవర్ ఆల్ గా ప్రైస్ తో పోలిస్తే Low లైటింగ్ ఫోటోగ్రఫి కూడా ఫర్వాలేదు అని చెప్పాలి. ఫ్రంట్ లోని 5MP మరీ అంత బాగుంది అని చెప్పలేము.  ఫోటోస్ enhance చేయటానికి సాఫ్ట్ టచ్ మరీ ఎక్కువ అవుతుంది.

బ్యాటరీ లైఫ్
2750mAh బ్యాటరీ ఉంది. నమ్మదగిన బ్యాక్ అప్ ఇస్తుంది సింపుల్ గా చెప్పాలంటే. సోషల్ మీడియా, వెబ్ బ్రౌజింగ్, 10 మినిట్స్ మాప్స్ usage, 15 నిముషాలు వీడియో స్ట్రీమింగ్, గంట..గంటన్నర మ్యూజిక్, 30 నిముషాలు గేమింగ్ తో Vibe K5 నోట్ ఉదయం 10గంటల నుండి మిడ్ నైట్ వరకూ వచ్చింది. సో ఏవరేజ్ గా 12 గంటలు వస్తుంది బ్యాటరీ లైఫ్. బాగా optimise చేయటం జరిగింది సాఫ్ట్ వేర్ తో.

బాటం లైన్
మీరు గమించినట్లు అయితే లెనోవో Vibe K5 అన్ని సెగ్మెంట్స్ తో 6,999 రూ ప్రైస్ తో కంపేర్ చేస్తే నిజంగా తీసుకోగలిగే ఫోన్ అని చెప్పాలి. అయితే Xiaomi రెడ్మి 3S prime అన్ని విధాలుగా దీని కన్నా ( ప్రస్తుతం ఉన్న మిగిలిన ఫోనులకన్నాకూడా ) బెటర్ ఫోన్ అనే విషయం కూడా మీకు చెప్పాలి. సో లెనోవో Vibe K5 కూడా మంచి ప్రత్యామ్నాయ చాయిస్.

లెనోవో Vibe K5 Key Specs, Price and Launch Date

Release Date: 11 Sep 2016
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  NA
 • Camera Camera
  NA
 • Memory Memory
  NA
 • Battery Battery
  NA
logo
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Advertisements
Advertisements

లెనోవో Vibe K5

లెనోవో Vibe K5

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status