InFocus Epic 1 Review

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Nov 21 2016
InFocus Epic 1 Review
 • PROS
 • మెటాలిక్ డిజైన్
 • ఫాస్ట్
 • CONS
 • బ్యాటరీ లైఫ్ బాలేదు
 • useless యూజర్ ఇంటర్ఫేస్

తీర్పు

అండర్ 15K బడ్జెట్ లో ఉన్న ఫోనుల్లో Epic 1 కూడా ఒక బెటర్ ఫోన్ అని చెప్పవచ్చు కాని ఇది recommended ఫోన్ మాత్రం కాదు. deca core కేవలం బెంచ్ మార్క్స్ లోనే బాగుంది. రియల్ time లో ఎటువంటి డిఫరెన్స్ చూపించటం లేదు. ముఖ్యంగా యూజర్ ఇంటర్ఫేస్ మైనస్ పాయింట్. కెమెరా ఫోన్ కావాలనుకుంటే Nubia Z11 మినీ అండ్ moto G4 ప్లస్ బెటర్ ఫోనులు. పెర్ఫార్మన్స్ అండ్ ఓవర్ ఆల్ గా బెస్ట్ ఫోనులు కావాలనుకుంటే Le 2 అండ్ రెడ్మి నోట్ 3. 

BUY InFocus Epic 1

InFocus Epic 1 detailed review

12,999 రూలకు ఇండియాలో Epic 1 పేరుతో deca core ప్రొసెసర్ (10 కోర్స్) తో Infocus కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది రీసెంట్ గా. అయితే ఇది నిజంగా మంచి స్పెక్స్ తోనే కాకుండా మంచి కంటెంట్ తో కూడా పనిచేస్తుందా లేదా తెలుసుకుందాము రండి క్రింద రివ్యూ లో..


ఫోన్ యొక్క కంప్లీట్ స్పెక్స్ అండ్ డిటేల్స్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

బిల్ అండ్ డిజైన్: డిఫరెంట్ గా లేదు కానీ బాగుంది
డిజైన్ బాగుంది. కానీ ఇప్పుడు అన్ని కంపెనీలు ఇలాంటి డిజైన్ కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ అయితే ప్రీమియం గా కూడా ఉంటుంది. వెనుక brushed మెటల్ ఉంటుంది. ఫోన్ పై భాగంలో IR blaster అండ్ హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. క్రింద సింగల్ స్పీకర్ గ్రిల్, usb టైప్ c పోర్ట్ అండ్ నాయిస్ cancellation మైక్ మరియు రెండు screws ఉన్నాయి.మరలా వేనకు వెళితే కెమెరా module క్రింద కూడా నాయిస్ cancellation mic ఉంది. అయితే రైట్ సైడ్ లో ఉన్న వాల్యూం అండ్ పవర్ బటన్స్ కొంచెం పైకి ఉన్నాయి అని చెప్పాలి. అలాగే ఫ్రంట్ సైడ్ లో సైడ్స్ లో ఉన్న బెజేల్స్ కూడా ఎక్కువ gaps తో వస్తున్నాయి.  ఓవర్ ఆల్ గా ఫోన్ సింగిల్ హ్యాండ్ usage కు అనుకూలంగా ఉండదు అనేది వాస్తవం. కానీ చుట్టూ రౌండ్ edges కారణంగా చేతిలో పట్టుకునేటప్పుడు సౌలభ్యంగానే ఉంటుంది.

డిస్ప్లే: బాగుంది
1080P డిస్ప్లే తగినంత బ్రైట్ గానే ఉంది డీసెంట్ కలర్స్ తో. మాక్సిమమ్ 534 Lux luminance ఇస్తుంది. అంటే Xiaomi Redmi Note 3. అండ్ Le 2 కన్నా బ్రైట్ గా ఉంది ఫోన్. వ్యూయింగ్ angles extreme గా పెట్టినప్పుడు కొంచెం డిస్ప్లే షెడ్ అవుతుంది కాని అంత extreme angle లో ఫోన్ వాడటం జరగదు కాబట్టి, ఇది రియల్ వాడుక లో బాగుంటుంది. 401PPi పిక్సెల్ డెన్సిటీ కూడా బాగుంది.

కొందరికీ డిస్ప్లే cool కలర్స్ మోడ్ లో ఉన్నట్లు అనిపించవచ్చు. అందుకేనేమో కంపెని కూడా warm మోడ్ కు మార్చుకునేలా క్విక్ సెట్టింగ్స్ లో ఆప్షన్ ఇస్తుంది. మంచి కలర్స్, స్మూత్ టచ్ పెర్ఫార్మన్స్ తో ఇది బెటర్ డిస్ప్లే లలో ఒకటి అని చెప్పాలి.

యూజర్ ఇంటర్ ఫేస్(UI):  బాలేదు. stable గా కూడా లేదు
జనరల్ గా infocus ui అంత బాగా opimitse అయ్యి రాదు. సో ఈ ఫోన్ లో కూడా అలానే ఉంది InLife UI. ఫంక్షన్స్ మరియు లుక్స్ రెండూ మంచిగా లేవు. అలాగే infocus రౌండ్ ఐకాన్స్ కూడా సరిగా లేవు. pre installed యాప్స్ కూడా ఉన్నాయి. ఇవేమీ రిమూవ్ చేయటానికి కూడా అవ్వదు. దీనికి తోడూ ఫింగర్ ప్రింట్ sensor కూడా సరిగ్గా respond అవటం లేదు అప్పుడప్పుడు. చాలాసార్లు రెండు సార్లు టచ్ చేయవలసి వస్తుంది unlock చేయటానికి. 

పెర్ఫార్మెన్స్: ఫర్వాలేదు
InLife యూజర్ ఇంటర్ఫేస్ కారణంగా ఫోన్ పెర్ఫార్మన్స్ స్మూత్ గా లేదు. benchmark apps, Asphalt 8 మరియు ఫోన్ తో పాటు వచ్చే pre installed యాప్స్ ఉండగా అండ్ ఫోన్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఎటువంటి యాప్స్ రన్ అవ్వనప్పుడు 1.5GB ఫ్రీ రామ్ ఉంది. ఇంకా ఫోన్ అప్పుడప్పుడు UI transistions లో లాగ్ అవటం కూడా చూశాము. ఇందుకు కూడా UI సరిగా optimise చేయకపోవటం వలనే. ప్రొసెసర్ విషయానికి వస్తే Helio X20 డైలీ పనులను బాగానే మేనేజ్ చేస్తుంది. చాలా వరకూ ఫోన్ అండర్ 15K బడ్జెట్ లోని ఫోనులన్నిటితో పోటీపడేలా ఇస్తుంది పెర్ఫర్మాన్స్. ఫాస్ట్ అండ్ స్మూత్ గా ఉంది. హీటింగ్ కూడా 38 డిగ్రీలకు మించి వెళ్ళలేదు అంత ఈజీగా. అయితే ప్రొసెసర్ highest క్లాక్ స్పీడ్ కు వెళ్ళటం లేదు. 1.4GHz వద్దనే ఉండటం వలన యాప్ లోడింగ్ times కూడా ఎక్కువ సేపు ఉన్నట్లు అంచనా.

 

 

 

Create bar charts

 

 

అంటే రియల్ time లో deca core ప్రొసెసర్ పనిచేయవలసినంతగా పనిచేయటం లేదు Epic 1లో.  8 కోర్స్ ఉన్న రెడ్మి నోట్ 3 అండ్ Le 2 తో బెంచ్ మార్క్ స్కోర్స్ లో పోటీపడుతుంది కాని ఆ రెండు extra కోర్స్ కారణంగా, రియల్ time వాడుక లో అదనపు స్పీడ్ ను చూపించలేకపోతుంది.  అయితే InFocus మాత్రం Xiaomi అంత హెవీ గా UI ను క్లీన్ చేయకపోయినా మినిమమ్ optimisation తో వస్తే బాగుంటుంది. గ్రాఫిక్స్ పెర్ఫార్మన్స్ మాత్రం ఆ రెండు ఫోనుల కన్నా తక్కువే epic 1 లో.

కెమెరా: ఫర్వాలేదు కన్నా కొంచెం తక్కువగానే ఉంది
16MP f/2.0 aperture రేర్ కెమెరా CMOS sensor తో వస్తుంది. డీసెంట్ గా నే ఉంది కెమెరా. లైటింగ్ ఉన్నప్పుడు డిపెండ్ అవ్వదగ్గ ఫోటోస్ ఇస్తుంది. అప్పుడప్పుడు మాత్రం బయట లైటింగ్ బాగున్నా ఫోటోస్ లో లైటింగ్ కట్ అవుతుంది. మరోవైపు indoor అండ్ low లైటింగ్ లో నాయిస్ లెవెల్స్ average కన్నా ఎక్కువగా ఉన్నాయి. low లైటింగ్ లో డిటేల్స్ కూడా పోతున్నాయి. రెడ్మి నోట్ 3 అండ్ Le 2 కన్నా బెటర్ గా అయితే లేదు. స్పీడ్ విషయంలో కూడా competitors కన్నా తక్కువ స్పీడ్ కలిగి ఉంది అని చెప్పాలి. ఆటో ఫోకస్ time అండ్ టచ్ ఫోకస్ కూడా తీసుకుంటున్నాయి. ఇది కూడా ఇమేజ్ processing లో optimisation లేకపోవటం వలన అనిపిస్తుంది.

 

InFocus Epic 1

 

బ్యాటరీ: బాలేదు
ఇదే ఫోన్ లో మొట్టమొదటి weak పాయింట్. 3000 mah ఉంది కాని నాలుగు గంటల కాన్నా తక్కువ బ్యాక్ అప్ ఇస్తుంది PC Mark బ్యాటరీ టెస్ట్ లో. ఈ ప్రైస్ రేంజ్ లో వచ్చే అన్ని ఫోనుల్లో ఇదే తక్కువ స్కోర్ అని చెప్పాలి. అయితే ఇందుకు కారణం దీనిలో ఉన్న 10 cores ప్రొసెసర్ అని అంచనా.బ్యాటరీ విషయంలో కూడా కంపెని optimisation చేయలేదు. రెగ్యులర్ day లో మీరు బ్యాటరీ saver మోడ్స్ ను బాగా వాడితేనే కాని రాత్రి వరకూ బ్యాక్ అప్ రావటంలేదు. రెండు సార్లు చార్జింగ్ చేయవలసి వస్తుంది ప్రతీ రోజూ. ఈ సమయంలో డిస్ప్లే ఆటో మోడ్ లో ఉంటూ, average ఫోన్ కాల్స్, ఎక్కువ మెసేజింగ్, కొంత సోషల్ నెట్వర్కింగ్ మరియు 20 నిముషాలు గేమింగ్. అంతే!

బాటం లైన్:
అండర్ 15K బడ్జెట్ లో ఉన్న ఫోనుల్లో Epic 1 కూడా ఒక బెటర్ ఫోన్ అని చెప్పవచ్చు కాని ఇది recommended ఫోన్ మాత్రం కాదు. deca core కేవలం బెంచ్ మార్క్స్ లోనే బాగుంది. రియల్ time లో ఎటువంటి డిఫరెన్స్ చూపించటం లేదు. ముఖ్యంగా యూజర్ ఇంటర్ఫేస్ మైనస్ పాయింట్. కెమెరా ఫోన్ కావాలనుకుంటే Nubia Z11 మినీ అండ్ moto G4 ప్లస్ బెటర్ ఫోనులు. పెర్ఫార్మన్స్ అండ్ ఓవర్ ఆల్ గా బెస్ట్ ఫోనులు కావాలనుకుంటే Le 2 అండ్ రెడ్మి నోట్ 3. 

InFocus Epic 1 Key Specs, Price and Launch Date

Release Date: 20 Nov 2016
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  NA
 • Camera Camera
  NA
 • Memory Memory
  NA
 • Battery Battery
  NA
logo
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Advertisements
Advertisements

InFocus Epic 1

InFocus Epic 1

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status