ఎక్కువ రామ్ ఉంది ఫోన్ లో, కాని ఆ అదనపు రామ్ ను ఫోన్ వాడుతున్నట్లు కనిపించటం లేదు. పెర్ఫార్మన్స్ వైజ్ గా దీని కన్నా రెడ్మి నోట్ 3, Le 2 బెటర్ ఫోనులు. కూల్ ప్యాడ్ నోట్ 5 లో ఉన్న మంచి విషయం బ్యాటరీ లైఫ్. అయితే ఇదే బ్యాటరీ లైఫ్ రెడ్మి 3S ప్రైమ్ అండ్ రెడ్మి నోట్ 3 కూడా ఇస్తున్నాయి. సో వాటిని కాదని దీనిని రికమెండ్ చేయటానికి కూల్ ప్యాడ్ నోట్ 5 లో కారణాలు ఏమి కనిపించటం లేదు. దానికి తోడూ డిస్ప్లే కూడా ఎవరేజ్.
ఇండియాలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు ఎప్పటికీ పాపులారిటీ తగ్గదు. ఒక వైపు oneplus వంటి కంపెనిలు హై ఎండ్ స్పెక్స్ ను ఎవరూ ఇవ్వనంత తక్కువ రేట్లలో ఫోనులు లాంచ్ చేస్తున్నా, ఫ్లాగ్ షిప్ మార్కెట్ పెరుగుతుంది ఏమో కానీ బడ్జెట్ సెగ్మెంట్ ను మాత్రం రీప్లేస్ చేయటం జరగదు ఇప్పట్లో. రీసెంట్ గా బడ్జెట్ సెగ్మెంట్ లో 10,999 రూ లకు కూల్ పాడ్ 4GB రామ్ తో నోట్ 5 అనే ఫోన్ లాంచ్ చేసింది. ఇక్కడ దీని రివ్యూ చూడగలరు...
బిల్డ్ అండ్ డిజైన్: సూపర్ కాదు అలాగని బలేకపోవటం అనేది లేదు
చూసిన వెంటనే సూపర్బ్ లుక్స్ అనిపించే ఫోన్ కాదు కానీ bad లుక్స్ ఉన్నాయి అని కూడా అనటానికి లేదు. మెటల్ బాడీ డిజైన్, 5.5 in 2.5D గ్లాస్ డిస్ప్లే, లైట్ వెలగని capacitive నేవిగేషన్ బటన్స్, ఫ్రంట్ కెమెరా & ఫ్లాష్ అండ్ sensors తో అన్ని ఫోనుల్లనే రెగ్యులర్ గా ఉన్నాయి ఫ్రంట్ లుక్స్. పవర్ బటన్ రైట్ సైడ్, వాల్యూం బటన్స్ లెఫ్ట్ సైడ్, హెడ్ ఫోన్ జాక్ top లో ఉండగా usb స్లాట్ క్రింద ఉంది.
ఫోన్ వెనక్కి తిప్పితే రెడ్మి నోట్ 3 లానే ఉంటుంది. కెమెరా, ఫింగర్ ప్రింట్ etc అన్ని same ప్లేస్ మెంట్స్ లో ఉన్నాయి రెండింటికీ. క్రింద ఇమేజ్ చూడండి.
అయితే కూల్ పాడ్ తోటి ఫోనుల వలె అంత మంచి తయారి ఫీలింగ్ ఇవటం లేదు. వెనుక పనెల్ యొక్క క్రిందా, పైనా edges చేతికి తెలుస్తూ ఉంటాయి. ఒకసారి తెలుసుకున్న తరువాత వీటిని మరిచిపోలేరు. అయిష్టంగానే ఫీల్ అవుతారు.
డిస్ప్లే అండ్ UI: బేసిక్ విషయాలలో మైనస్
5.5 ఫుల్ HD డిస్ప్లే 1080 x 1920 పిక్సెల్స్ తో వస్తుంది. 520 Lux బ్రైట్ నెస్ తో కలర్స్ అండ్ బ్లాక్ లెవెల్స్ సంతృప్తిగానే అనిపిస్తాయి. అయితే వ్యూయింగ్ angles అంత బెస్ట్ అని చెప్పలేము. కొంచెం angle మారితే డిస్ప్లే లో కలర్ షిఫ్ట్ గమనిస్తారు. డిస్ప్లే చుచుట్టూ డిస్ప్లే లోనే ఒక బెజేల్ ఉంటుంది బ్లాక్ కలర్ లో. ఇది కూడా అందరికీ నచ్చకపోవచ్చు. బేసిక్ విషయం అయిన టచ్ రెస్పాన్స్ కూడా ఇబ్బందిగా ఉండటం ఆశ్చర్యం గా ఉంది.
కూల్ UI 8.0 ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో based. యాప్ డ్రాయర్ లేదు అన్ని చైనీస్ os ల లానే. అయితే దీనిలో ప్రత్యేకంగా మీకు క్విక్ సెట్టింగ్స్ అనేవి క్రింద నుండి స్వైప్ చేసుకుంటే వస్తాయి. అంటే పై నుండి స్వైప్ చేస్తే కేవలం నోటిఫికేషన్స్ ఉంటాయి. రెండింటినీ కలిపి ఉంచటం ఇష్టపడని వారిని నచ్చుతుంది ఇది.
పెర్ఫార్మన్స్: 4GB రామ్ ఉపయోగం కనపడటం లేదు
ఫోన్ ప్రధాన హైలైట్ 4GB రామ్ కలిగి ఉండటం. 4GB రామ్ తో వచ్చే cheapest ఫోన్ కూడా ఇదే. అయితే ఫోన్ full రామ్ ను వినియోగించుకోవటం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఫోన్ లాగ్స్ ఇస్తుంది. బెంచ్ మార్క్స్ లో moto G4 ప్లస్ కు సిమిలర్ స్కోర్స్ ఇస్తుంది కూల్ ప్యాడ్ నోట్ 5. కానీ moto లో సగం రామ్(2GB) మరియు same స్నాప్ డ్రాగన్ 617 SoC ఉన్నాయి. బహుసా moto లో ఉన్న బెటర్ stock(ఒరిజినల్) ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇందుకు కారణం అయ్యి ఉంటుంది అని అంచనా.
కూల్ ప్యాడ్ నోట్ 5 లో హై ఎండ్ గేమింగ్(Asphalt 8 అండ్ Injustice: Gods among us) వంటివి రన్ అవుతున్నాయి కానీ slight గా ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నాయి ఆడుతున్నప్పుడు. అయితే హీటింగ్ issue అంత ఎక్కువుగా లేదు. మా టెస్ట్ లలో rare గా 37 డిగ్రీస్ కు వెళ్ళింది ఫోన్. అది కూడా గేమింగ్ చేస్తున్నప్పుడే.
కాల్ క్వాలిటీ విషయానికి వస్తే ఫోన్ బాగుంది అని చెప్పాలి. అయితే ఫోన్ లో 5GHz WiFi బ్యాండ్ సపోర్ట్ లేదు అని గమనించాలి మీరు. కానీ ప్రస్తుతం మాత్రం దీని వలన ఇబ్బంది ఏమి ఉండదు.
కెమెరా: ఎవరేజ్ కు దగ్గరిలో ఉంది
13MP f/2/2 aperture లెన్స్ ఉన్నాయి వెనుక. కెమెరా యాప్ లో నైట్ మోడ్, HDR, Beauty మోడ్ అండ్ Pro మోడ్స్ ఉన్నాయి. 1080P ఫుల్ HD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది.
తోటి ఫోన్స్ తో పోలిస్తే ఇమేజెస్ లో మాత్రం డిటేల్స్ లేవు అంతగా. నాయిస్ ఎక్కువ ఉంటుంది.కలర్స్ కూడా సంతృప్తిగా లేవు. కాని తీసిన ఫోటోస్ బ్రైట్ గా ఉంటున్నాయి. కొన్ని సార్లు కలర్స్ పరంగా బాగా ఇబ్బంది పడుతుంది కెమెరా. తక్కువ లైటింగ్ లో నాయిస్ ఇంకా పెరుగుతుంది. నైట్ మోడ్ ఉన్నప్పటికీ ఫోటోస్ కేవలం బ్రైట్ గా ఉంటున్నాయి కానీ డిటేల్స్ బాగా తక్కువ.
ఫ్రంట్ లో 8MP కెమెరా LED ఫ్లాష్ తో వస్తుంది. ఇది కూడా డిటేల్స్ ఇవటం లేదు. అలాగే ఫ్రంట్ ఫ్లాష్ కూడా ఆటోమాటిక్ కాదు. మీరు manual గా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే ఫ్లాష్ ఆన్ చేస్తే అలా వెలిగి ఉంటుంది మీరు ఆఫ్ చేసేవరకూ. క్రింద నోట్ 5 తో తీసిన ఫోటోస్ చూడగలరు..
View post on imgur.com
బ్యాటరీ: బెస్ట్
4010 mah ఉంది. టోటల్ ఫోన్ అంతటిలో ఇదే బెస్ట్ రిసల్ట్ ఇస్తుంది. ఈజీ గా ఒక కంప్లీట్ average వర్కింగ్ డే వస్తుంది. ప్రతీ రోజూ గంటన్నర సేపు వీడియోస్ చూస్తున్నా ఇది రోజు చివరి వరకూ వస్తుంది. 100 నుండి 85% శాతానికి బ్యాటరీ పడటానికి గంటన్నర పడుతుంది. కాని ఆ తరువాత నుండి స్లో గా తగ్గుతుంది. గేమ్స్ లేదా వీడియోస్ ను ఆడని/చూడని రోజులలో రాత్రి 11 అయినా ఫోన్ లో ఇంకా 50% చార్జింగ్ ఉండేది. అంటే రెగ్యులర్ users కు రెండు రోజులు వస్తుంది బ్యాక్ అప్.
బాటం లైన్:
ఎక్కువ రామ్ ఉంది ఫోన్ లో, కాని ఆ అదనపు రామ్ ను ఫోన్ వాడుతున్నట్లు కనిపించటం లేదు. పెర్ఫార్మన్స్ వైజ్ గా దీని కన్నా రెడ్మి నోట్ 3, Le 2 బెటర్ ఫోనులు. కూల్ ప్యాడ్ నోట్ 5 లో ఉన్న మంచి విషయం బ్యాటరీ లైఫ్. అయితే ఇదే బ్యాటరీ లైఫ్ రెడ్మి 3S ప్రైమ్ అండ్ రెడ్మి నోట్ 3 కూడా ఇస్తున్నాయి. సో వాటిని కాదని దీనిని రికమెండ్ చేయటానికి కూల్ ప్యాడ్ నోట్ 5 లో కారణాలు ఏమి కనిపించటం లేదు. దానికి తోడూ డిస్ప్లే కూడా ఎవరేజ్.
Release Date: | 28 Nov 2016 |
Market Status: | Launched |
25 Jan 2021
25 Jan 2021
23 Jan 2021
23 Jan 2021
22 Jan 2021
19 Nov 2018
29 Mar 2018
09 Mar 2018
09 Mar 2018
09 Mar 2018
Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.
మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.