కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్ Review

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది May 27 2016
కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్ Review
DIGIT RATING
63 /100
 • design

  66

 • performance

  55

 • value for money

  52

 • feature

  77

 • PROS
 • మంచి బిల్డ్ క్వాలిటీ
 • ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్
 • CONS
 • ఏవరేజ్ పెర్ఫార్మన్స్
 • మొదటి మోడల్ అంత పర్ఫెక్ట్ గా కలర్స్ చూపించటం లేదు ప్లస్ మోడల్

తీర్పు

కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్ ఆల్రెడీ మంచి ఫోన్ అని పేరు తెచ్చుకున్న మొదటి నోట్ 3 కు slight గా అప్ గ్రేడ్ అయ్యింది. కాని మీరు ఈ బడ్జెట్ లో ఫోన్ తీసుకునే ఆలోచనలో ఉంటే Xiaomi రెడ్మి నోట్ 3 3GB ర్యామ్ -32GB వేరియంట్ మంచి చాయిస్. కాని మీ బడ్జెట్ లిమిటెడ్ అయితే ప్లస్ మోడల్ కన్నా మొదటి కూల్ ప్యాడ్ నోట్ 3 తీసుకోవటం బెటర్. ఎందుకంటే డిస్ప్లే లో మొదటి మోడల్ మంచి కలర్స్ చూపిస్తుంది HD అయినప్పటికీ. అలాగే పెర్ఫార్మన్స్ కూడా ప్లస్ కన్నా మొదటి మోడల్ slight గా high.

BUY కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్
Price 8999

కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్ detailed review

కూల్ ప్యాడ్ కేవలం డిస్ప్లే ను HD నుండి FHD కు అప్ గ్రేడ్ చేసి మరియు కొంచెం బరువు పెరిగిన మార్పులతో కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్ అనే మోడల్ ను లాంచ్ చేసింది 8,999 రూ లకు. అయితే ఈ రెండు స్పెక్స్ మార్పులు కాకుండా పెర్ఫార్మన్స్ మరియు ఇతర విషయాలలో ప్లస్ మోడల్ మొదటి కూల్ ప్యాడ్ నోట్ 3 మోడల్ పై అప్ గ్రేడ్ అయ్యిందా లేదా తెలుసుకుందాము రండి రివ్యూ లో..


డిస్ప్లే: అప్ గ్రేడ్ అయ్యింది కాని బెటర్మెంట్ లేదు
ఒరిజినల్(మొదటి) కూల్ ప్యాడ్ నోట్ 3 బెస్ట్ వ్యూయింగ్ angles కలిగిన ఫోన్ ఆ బడ్జెట్ లో. మరి దీనికి ఫుల్ HD యాడ్ అయితే ఇంకా బెటర్ గా ఉంటుంది కదా. కాని మొదటి మోడల్ అంత బెటర్ డిస్ప్లే కాదు ప్లస్ లోని డిస్ప్లే. slight గా కూల్ tone ఉంది ఫోన్ లో. ఇది ఎక్కువ శాతం మందికి నచ్చని tone. warm tone నే నచ్చుతుంది ఎక్కువ మందికి. మొదటి మోడల్ warm గా ఉండేది. సన్ లైట్ విసిబిలిటి మాత్రం improve అయ్యింది. కాని ఓవర్ ఆల్ డిస్ప్లే రెడ్మి నోట్ 3 కన్నా బెటర్ కాదు.

పెర్ఫార్మన్స్: బాగుంది
సేమ్ స్పెక్స్ తో వస్తుంది. అంటే one ఇయర్ ఓల్డ్ మీడియా టెక్ SoC, 3GB ర్యామ్ ఉన్నాయి. day to day పెర్ఫార్మన్స్ లో స్మూత్ గా ఉంది. సోషల్ మీడియా యాప్స్, కేమెరా యాప్, నాన్ గేమింగ్ యాప్స్ ఏమైనా సరే ఫోన్ ను slow చేయటం లేదు. అయితే హెవీ గా ఉండే యాప్స్ అన్నీ ఒకే సారి ఓపెన్ చేస్తే lags ఉంటున్నాయి. అయితే అన్ని సార్లు కాదు. గ్రాఫిక్స్ పెర్ఫార్మన్స్ ఎవరేజ్. హెవీ గేమింగ్ లో ఫోన్ లాగ్ అవుతుంది ఒరిజినల్ మోడల్ కన్నా. ఈ విషయాలు అన్నీ పరిగణలోకి తీసుకున్నా ఫోన్ recommended buy 8,999 రూ లకు. అంటే వాల్యూ ఫర్ మనీ హాండ్ సెట్ ఇది.

 

 

కెమెరా అండ్ బ్యాటరీ: బాగున్నాయి
మెగా పిక్సెల్ కౌంట్ కూడా సేమ్. కాని క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యింది slight గా. 13MP రేర్ shooter నోట్ 3 ప్లస్ లో షార్ప్ గా ఉంది. ఫోకస్ స్పీడ్, dynamic రేంజ్, ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా.. మిగిలిన అన్నీ సేమ్ క్వాలిటీ లను ఇస్తున్నాయి.

 
  

చాల చిన్న డిఫరెన్స్ చూశాము బ్యాటరీ లో రెండు మోడల్స్ కు. కాని ఓవర్ ఆల్ గా ఆల్మోస్ట్ సిమిలర్ అని అనుకోవచ్చు. 9 గంటల స్క్రీన్ ఆన్ టైమ్ గిక్ బెంచ్ స్కోర్ ఇస్తున్నాయి రెండు మోడల్స్. అంటే చాలా బాగుంది బ్యాటరీ లైఫ్.

బిల్డ్, యూజర్ ఇంటర్ఫేస్, డిజైన్ వంటి మిగిలిన విషయాలు సేమ్ ఒరిజినల్ కూల్ ప్యాడ్ నోట్ 3 మోడల్ లానే ఉన్నాయి. incase మీరు ఒరిజినల్ నోట్ 3 రివ్యూ చూడాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.

బాటమ్ లైన్ కూల్ ప్యాడ్ నోట్ మొదటి మోడల్ మంచి చాయిస్ ప్లస్ కన్నా
కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్ ఆల్రెడీ మంచి ఫోన్ అని పేరు తెచ్చుకున్న మొదటి నోట్ 3 కు slight గా అప్ గ్రేడ్ అయ్యింది. కాని మీరు ఈ సెగ్మెంట్లో ఫోన్ తీసుకునే ఆలోచనలో ఉంటే కొంచెం మనీ యాడ్ చేసి Xiaomi రెడ్మి నోట్ 3 3GB ర్యామ్ -32GB వేరియంట్ మంచి చాయిస్.  మీ బడ్జెట్ లిమిటెడ్ అయితే ప్లస్ మోడల్ కన్నా మొదటి కూల్ ప్యాడ్ నోట్ 3 తీసుకోవటం బెటర్. ఎందుకంటే డిస్ప్లే లో మొదటి మోడల్ మంచి కలర్స్ చూపిస్తుంది HD అయినప్పటికీ. అలాగే పెర్ఫార్మన్స్ కూడా ప్లస్ కన్నా మొదటి మోడల్ slight గా high.

logo
Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Advertisements
Advertisements

కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్

Price : ₹8999

కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్

Price : ₹8999

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status