ఆసుస్ జెన్ ఫోన్ 2 (2 జిబి ర్యామ్) ZE550ML Review: పెర్ఫార్మెన్స్ లో టాప్

బై Prasid Banerjee | అప్‌డేట్ చేయబడింది Jun 01 2015
ఆసుస్ జెన్ ఫోన్ 2 (2 జిబి ర్యామ్) ZE550ML Review: పెర్ఫార్మెన్స్ లో టాప్
DIGIT RATING
78 /100
 • design

  83

 • performance

  86

 • value for money

  67

 • features

  77

 • PROS
 • పెర్ఫార్మెన్స్ విషయంలో ది బెస్ట్
 • మంచి బాడి బిల్డ్
 • అంత ఈజీగా హీట్ అయ్యే ఫోన్ కాదు
 • CONS
 • ఏవరేజ్ కెమేరా
 • బ్యాటరీ లైఫ్ ఇంకాస్త ఉంటే బాగున్ను

తీర్పు

ఆసుస్ జెన్ ఫోన్ 2 పెర్ఫార్మెన్స్ లో నంబర్ వన్(15 వేల బడ్జెట్ లో). హిటింగ్ ఉండదు. కాని Xiaomi మి 4i అంత బ్యాటరీ బ్యాక్ అప్ ను ఇవ్వటంలేదు. అలాగే కెమేరా క్వాలిటీ లో Xiaomi దీని కన్నా బెటర్ ఫోటోస్ ను ఇస్తుంది. సో మీకు కెమేరా ఎక్కువ క్వాలిటీ మరియు కామ్పెక్ట్ (చిన్న సైజు) స్మార్ట్ ఫోన్ కావాలని అనుకుంటే Xiaomi మి 4i తీసుకోండి. లేదు పెర్ఫార్మెన్స్ మొబైల్ కావాలని అనుకుంటే ఆసుస్ జెన్ ఫోన్ 2 2జిబి వెర్షన్ ను తీసుకోండి. కాని ఆసుస్ కెమేరా Xiaomi మి4i అంత బెటర్ కాదు కాని మంచి మంచి కెమేరా అని చేపుకోవచ్చు. మంచి లైటింగ్ కండిషన్స్ ఉంటే ప్రోపర్ ఫోటోస్ ను తీస్తుంది ఆసుస్.
ఓవర్ ఆల్ గా కెమేరా మరియు బ్యాటరీ xiaomi మి 4i తో కంపేర్ చేస్తే బెటర్ కాదు కాని ఇది ఇస్తున్న పెర్ఫార్మెన్స్ తో వాటిని జత కలిపితే, 15 వేల ధరకు ఆసుస్ బెస్ట్ చాయిస్.

BUY ఆసుస్ జెన్ ఫోన్ 2 (2 జిబి ర్యామ్) ZE550ML
Buy now on flipkart స్టాక్ లేదు 6999

ఆసుస్ జెన్ ఫోన్ 2 (2 జిబి ర్యామ్) ZE550ML detailed review

ఆసుస్ తాజాగా జెన్ ఫోన్ 2 సిరిస్ లో డిఫెరెంట్ వేరియంట్స్ లో  మూడు స్మార్ట్ ఫోనులను దించింది. అందులో రెండు 2 జిబి మోడల్స్, ఒకటి 4జిబి మోడల్(18,999 రూ.). ఇప్పుడు మనం 2జిబి మోడల్ ఆసుస్ జెన్ ఫోన్ రివ్యూ ను చూద్దాం. ఇది ఫుల్ HD 2 జిబి మోడల్ 14,999 రూ లకు లభించగా, HD 2జిబి మోడల్ 12,999 రూ. లకు లభిస్తుంది. అలాగే క్వాడ్-కోర్ 2.3 GHz ఇంటెల్ ప్రాసెసర్ 4జిబి మోడల్ లో ఉండగా, క్వాడ్-కోర్ 1.8 GHz  ఇంటెల్ ప్రాసెసర్ 2 జిబి వేరియేంట్ లో వాడారు. మిగతా అన్ని ఫీచర్స్ మూడింటి లో సేమ్ టు సేమ్.14,999 రూ 2జిబి మరియు 1080P ఫుల్ HD  అసుస్ జెన్ ఫోన్ Xiaomi మి 4i కి గట్టి పోటీ ఇవనుంది. Xiaomi మి 4 i కన్నా ఇది రెండు వేలు ఎక్కువే కాని ఈ ఎక్కువ డబ్బులు మి 4i తో  పోటీని బ్యాలన్స్ చేస్తుందో లేదో చూద్దాం.

పెర్ఫార్మెన్స్:
4జిబి ఆసుస్ జెన్ ఫోన్ 2 వలే , 2జిబి మోడల్ కూడా పెర్ఫార్మెన్స్ లో డి బెస్ట్ అని తేలిపోయింది. CPU స్నాప్ డ్రాగన్ 800 మరియు 801 దగ్గరిలో పనిచేస్తుంది. GPU మాత్రం OnePlus వన్ మొబైల్ లాగా  పనిచేస్తుంది. అంటే ఇక్కడ గేమర్స్ ఎవరైనా ఉంటే, ఈ ఫోన్ ను వెంటనే తీసుకోవచ్చు. 15k బడ్జెట్ లో దొరికే బెస్ట్ గేమింగ్ పెర్ఫార్మింగ్ మొబైల్ అసుస్ జెన్ ఫోన్ 2 2 జిబి.

Zenfone 2 2GB Performance | Create infographics

 

ఈ మోడల్ లో PowerVR గG6430 GPU ఉంది. ఇది ఆపిల్ 5S మోడల్ లో వాడిన GPU. సో ఆపిల్ అంత కాకపోయినా దాని దగ్గర లో గేమింగ్ పెర్ఫార్మెన్స్ ను ఇస్తుంది ఆసుస్ జెన్ ఫోన్ 2. దీని దగ్గరిలోకి 15 వేల రూ. బడ్జెట్ లో మరే ఇతర ఫోన్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ విషయంలో దగ్గరలో లేదు.

ఇక ఫోన్ నార్మల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇదే బడ్జెట్ లో ఉండటం వలన ఆసుస్ జెన్ ఫోన్ 2 కి పోటీ అని అనుకుంటున్న Xiaomi మి 4i దీని దరిదాపుల్లో ఎక్కడా లేదు. అసలు చెప్పాలంటే, మి 4i అనే కాదు, మరే ఇతర స్మార్ట్ ఫోన్స్ పెర్ఫార్మెన్స్ లో ఆసుస్ జెన్ 2 దగ్గరిలో లేవు. బెంచ్ మార్క్స్ స్కోర్స్ లో Xiaomi మి 4i కి డబుల్ స్కోర్ ను ఇచ్చింది ఆసుస్ జెన్ 2. మి 4i లో ఉన్న ఎక్స్ట్రా 4 CPU కోర్స్ వలన మల్టీ కోర్ పెర్ఫార్మెన్స్ స్కోర్ మాత్రం కొంచెం బెటర్ గా స్కోర్ చేసింది మి4i ఫోన్. కాని మి 4i లో హిటింగ్ ఇస్యుస్ ఎక్కువుగా ఉండటం వలన, ఆసుస్ జెన్ 2 నే ఓవర్ ఆల్ గా రియల్ టైం లో మీకు నచ్చుతుంది.

బ్యాటరీ:
ఇంటెల్ ఆటమ్ Z3560 SoC ప్రాసెసర్ విడియో పెర్ఫార్మెన్స్ కి బాగా ఆప్టిమైజ్ చేయబడింది. విడియో టెస్టింగ్ లో దాదాపు 20 గంటల పాటు బ్యాటరీ బ్యాక్ అప్ ను ఇచ్చింది ఆసుస్ జెన్ 2. కాని మిగతా విషయాలలో బ్యాటరీ బ్యాక్ అప్ Xiaomi మి 4i కన్నా తక్కువగా ఇస్తుంది ఆసుస్ జెన్ 2. రోజు అంతా దానిని వాడుకునే యూజర్స్ అయితే దీనిని పవర్ సేవింగ్ మోడ్ లో పెట్టి వాడుకుంటేనే ఆ రోజు చివరి వరకూ వస్తుంది ఆసుస్. బ్యాటరీ సేవింగ్ మోడ్స్ ఏమి లేకుండా నార్మల్ గా వాడితే ఆసుస్ 10 నుండి 12 గంటలు బ్యాక్ అప్ ఇస్తుంది.

Zenfone 2 2GB Battery | Create infographics

 


మీరు బ్యాటరీ సేవింగ్ మోడ్ వాడుతున్నా, ఎక్కువ సేపు గేమింగ్ చేస్తే, జెన్ 2 15 నిమిషాల్లో 15 శాతం బ్యాటరీ లైఫ్ ను వాడుతుంది. కాని ఆ టైం లో ఫోన్ హిటింగ్ అవటం లాంటి ఇస్యుస్ ఉండకపోవటం వలన ప్రాసెసర్ పై ప్రేసర్ పడకుండా పెర్ఫార్మెన్స్ అసలు ఎక్కడా తగ్గించదు. అలాగే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న డి 1080P ఫుల్ HD 2జిబి వేరియేంట్ కాబట్టి 720P HD 2జిబి మోడల్ పై ఇంకా ఎక్కువ బ్యాటరీ ఇవనుంది ఆసుస్.

బాటమ్ లైన్:
ఆసుస్ జెన్ ఫోన్ 2 పెర్ఫార్మెన్స్ లో నంబర్ వన్(15 వేల బడ్జెట్ లో). హిటింగ్ ఉండదు. కాని Xiaomi మి 4i అంత బ్యాటరీ బ్యాక్ అప్ ను ఇవ్వటంలేదు. అలాగే కెమేరా క్వాలిటీ లో Xiaomi దీని కన్నా బెటర్ ఫోటోస్ ను ఇస్తుంది. సో మీకు కెమేరా ఎక్కువ క్వాలిటీ మరియు కామ్పెక్ట్ (చిన్న సైజు) స్మార్ట్ ఫోన్ కావాలని అనుకుంటే Xiaomi మి 4i తీసుకోండి. లేదు పెర్ఫార్మెన్స్ మొబైల్ కావాలని అనుకుంటే ఆసుస్ జెన్ ఫోన్ 2 2జిబి వెర్షన్ ను తీసుకోండి. కాని ఆసుస్ కెమేరా Xiaomi మి4i అంత బెటర్ కాదు అలా అని ఆసుస్ చెడ్డ కెమేరా అవుట్పుట్ ని అయితే ప్రదర్శించదు. మంచి లైటింగ్ కండిషన్స్ ఉంటే ప్రోపర్ ఫోటోస్ ను తీస్తుంది ఆసుస్.

ఓవర్ ఆల్ గా కెమేరా మరియు బ్యాటరీ xiaomi మి 4i తో కంపేర్ చేస్తే బెటర్ కాదు కాని ఇది ఇస్తున్న పెర్ఫార్మెన్స్ తో వాటిని జత కలిపితే, 15 వేల ధరకు ఆసుస్ బెస్ట్ చాయిస్.
 

ఆసుస్ జెన్ ఫోన్ 2 (2 జిబి ర్యామ్) ZE550ML Key Specs, Price and Launch Date

Price: ₹14999
Release Date: 05 Oct 2015
Variant: 16GB
Market Status: Discontinued

Key Specs

 • Screen Size Screen Size
  5.5" (1080 x 1920)
 • Camera Camera
  13 | N/A MP
 • Memory Memory
  16 GB/2 GB
 • Battery Battery
  3000 mAh
Prasid Banerjee
Prasid Banerjee

Email Email Prasid Banerjee

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Trying to explain technology to my parents. Failing miserably. Read More

Advertisements
Advertisements

ఆసుస్ జెన్ ఫోన్ 2 (2 జిబి ర్యామ్) ZE550ML

Buy now on flipkart 6999

ఆసుస్ జెన్ ఫోన్ 2 (2 జిబి ర్యామ్) ZE550ML

Buy now on flipkart ₹ 6999

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status