ఆపిల్ ఐ ఫోన్ SE Review

బై Souvik Das | అప్‌డేట్ చేయబడింది Jun 10 2016
ఆపిల్ ఐ ఫోన్ SE Review
 • PROS
 • Excellent పెర్ఫార్మన్స్
 • Best-in-class సౌలభ్యం ఫోన్ వాడుక
 • షార్ప్ అండ్ crisp డిస్ప్లే
 • CONS
 • 4 in స్క్రీన్
 • బ్యాటరీ లైఫ్ ఇంకా బెటర్ అవ్వాలి
 • Low లైటింగ్ ఫోటో గ్రఫీ లో కొంచెం వెనుక బడింది

తీర్పు

కచ్చితంగా ఫ్లాగ్ షిప్ కంటెంట్ తో ఉంది ఫోన్ అని చెప్పాలి. పవర్ ఫుల్. కానీ స్క్రీన్ దగ్గరే dilemma ఉంటుంది. దానికి తోడూ ప్రైస్ కూడా 39,000. కేవలం కొంచెం తేడా ఉంది ఐ ఫోన్ 6S కు దీనికి. 3000 రూ అదనంగా ఖర్చు చేసే అవకాశం ఉన్న వారు 6S లో ఉన్న 3D టచ్ మరియు bigger డిస్ప్లే ఎందుకు కోరుకోరు.

ఐ ఫోన్ 4S వాడుతున్న వారికీ పర్ఫెక్ట్ అప్ గ్రేడ్ SE ఫోన్. మరియు large స్క్రీన్ పై ఇష్టం లేని వారు కూడా ఇది ఇష్టపడతారు. అల్టిమేట్ కంటెంట్ ఉంది. సో మీకు స్క్రీన్ సైజ్ ప్రాబ్లెం కాకపోతే వెంటనే తీసుకోవచ్చు. సైజ్ ప్రాబ్లెం అనుకునే వారికి 6S మంచి చాయిస్. అన్ని ఐ ఫోన్ ల వలె ఐ ఫోన్ SE కూడా గ్రేట్ ఫోన్.

BUY ఆపిల్ ఐ ఫోన్ SE

ఆపిల్ ఐ ఫోన్ SE detailed review

రెండున్నర సంవత్సరాల అయ్యింది నా ఐ ఫోన్ 5S తీసుకోని. ఇప్పటికీ బెస్ట్ ఫోన్. ఎప్పుడూ యాప్స్ లాగ్ కాలేదు. ఓవర్ ఆల్ డైలీ usage లో fantastic ఫోన్. A7 ప్రొసెసర్ రిలీజ్ చేసిన టైమ్ కు ఫాస్ట్ ప్రొసెసర్ కాని ఇప్పటి ట్రెండ్ లో అంత ఫాస్ట్ కాదని చెప్పాలి. పెద్ద స్క్రీన్ ఫోనులు వాడిన తరువాత కూడా ఈ 4 in వాడుతున్నాను. సో 4 in స్క్రీన్ తో ప్రాబ్లెం లేకుండా ఫాస్ట్ అండ్ లేటెస్ట్ జనరేషన్ హార్డ్ వేర్ తో ఫోన్ ఉంటే బాగున్ను అనుకునే వారికీ ఐ ఫోన్ SE ఐ ఫోన్ 6S ప్లస్ స్పెక్స్ తో సమానం inside. కాని డిజైన్ మాత్రం ఐ ఫోన్ 5S. ఇప్పుడు ఈ ఫోన్ తీసుకోవాలా వద్దా? ఎవరు తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాము రండి..


4 in Retina డిస్ప్లే: బాగుంది
మనకు పర్సనల్ గా లేదా ట్రెండ్ కు తగ్గట్టుగా చిన్న స్క్రీన్ ఇష్టమా కాదా అనేది పక్కన పెడితే 4 in రెటినా బాగుంది. rich పిక్సెల్స్. షార్ప్ డిటేల్స్. ఫాస్ట్ అండ్ responsive. ఐ ఫోన్ 5S కన్నా warm గా కనిపిస్తుంది. నైట్ shift మోడ్ ఇంకా బాగుంది. క్వాలిటీ వైజ్ గా బెస్ట్. బ్రిలియంట్ వ్యూయింగ్ angles. సరిపడా బ్రైట్ నెస్, సన్ లైట్ విసిబిలిటి కూడా బాగుంది. అస్సలు ప్రాబ్లెం లేని టచ్ రెస్పాన్స్. కాని ఈ paragraph లో మొదట పక్కన పెట్టిన 4 in పాయింట్ ను తీసుకుంటే అదే కొంచెం కష్టమైన నిర్ణయం. ఎక్కువ స్క్రోలింగ్ చేయాలి ఏదైనా, పర్టికులర్ పాయింట్స్ పై టచ్ జాగ్రత్తగా చేయాలి, లేదంటే వేరేది టచ్ అవుతుంది. మీరు 5 in మరియు 5.5 in స్క్రీన్స్ వాడిన తరువాత మరలా 4 in లోకి వెళ్ళటం అంటే outdated స్క్రీన్ సైజ్ స్పెక్ ఉన్న కొత్త ఫోన్.

అయితే ఆపిల్ మాత్రం ఈ ఫోన్ 4 in స్క్రీన్ లను ఇష్టపడే వారికే అని చెప్పి మరి రిలీజ్ చేసింది ఫోన్. సో అలాంటి వారికైతే మరొక high end specs ఫోన్ రాదు దీని తరువాత. మీరు కనుక పాత 4 in ఐ ఫోన్ వాడుతున్నట్లు అయితే ఇది ఈజీగా మంచి అప్ గ్రేడ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ 4 in ఇప్పటికీ వాడుతున్నారు కాబట్టి దీనిలోని స్క్రీన్ సైజ్ అస్సలు outdated అనిపించదు. అలాగే పెద్ద సైజెస్ వాడి వాడి బోర్ కొట్టిన వారికీ కూడా ఈజీగా బెస్ట్ ప్రోసెసింగ్ పవర్ ఫోన్ ఇది. సో ఫైనల్ గా డిస్ప్లే మాత్రం కంటెంట్ వైజ్ గా ది బెస్ట్. మీకు బిగ్ స్క్రీన్ ఫోనుల comfort గా లేవు అనే అభిప్రాయం ఉంటే ఇది నచ్చుతుంది.

బిల్డ్ అండ్ డిజైన్: బాగున్నాయి
ఐ ఫోన్ SE సేమ్ 5S మేటేరియల్ తోనే తయారు అయ్యింది. బెస్ట్ ఐ ఫోన్ డిజైన్ till date అని నా పర్సనల్ అభిప్రాయం. 7.6mm thickness, 113 గ్రా బాడీ. కాని 5S కన్నా slight గా తక్కువ దృడంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సింగిల్ హ్యాండ్ టైపింగ్ too ఈజీగా ఉంది.షార్ప్ edges palms లో ఇబ్బంది గా అనిపిస్తాయి ఎక్కువ సేపు వాడితే. కాని ఇంత కంఫర్ట్ గా వాడుకోగలిగే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది అనే ఆనందం ఉంటుంది. మీరు compact ఫోనులంటే ఇష్టపడితే ఇది బెస్ట్ ఛాయిస్. ప్రీమియం లుక్స్ ఉంటాయి.

పెర్ఫార్మన్స్: సూపర్
ప్రెసెంట్ జనరేషన్ హార్డ్ వేర్ తో తయారు చేసింది ఆపిల్. A9 ప్రొసెసర్ ను  M9 మోషన్ కో ప్రొసెసర్ తో కలిపి లాంచ్ చేసింది. 2GB ర్యామ్ అదనంగా highlight. ఐ ఫోన్ 5S, 6S, సామ్సంగ్ S7 Edge, Xiaomi Mi5 లతో పోల్చిటెస్ట్స్ చేస్తే సింగిల్ కోర్ మరియు గ్రాఫికల్ ఫ్రేమ్స్ లో లీడింగ్ లో ఉంది బెంచ్మార్క్స్ స్కోర్స్ లో. మల్టీ కోర్ ప్రోసెసింగ్ S7 Edge అండ్ Xiaomi Mi5 లీడింగ్ లో ఉన్నాయి.రియల్ లైఫ్ లో SE ఫ్లాగ్ షిప్ పెర్ఫార్మన్స్ చూపిస్తుంది. డైలీ usage వెరీ గుడ్. delay లేకుండా అన్ని యాప్స్ ఓపెన్ అవుతున్నాయి mostly. spotlight సర్చ్ స్మూత్. ఎప్పుడూ రన్నింగ్ లో ఉండే Hey సిరి కూడా మంచి ఫంక్షనల్. గేమింగ్ enjoyable. గ్రాఫిక్స్ రిచ్ గా ఉన్నాయి. Hexa కోర్ PowerVR GT7600 GPU ఉంది. స్క్రీన్ సైజ్ చిన్నది అవటం వలన కూడా higher ఫ్రేమ్ రేట్స్ వస్తున్నాయి స్మూత్ గేమ్ play కు. 2GB ర్యామ్ వలన ఎక్కడ delay అవటం లేదు ఫోన్. unlocking, switching between యాప్స్ అండ్ ఇతర రెగ్యులర్ యాక్షన్స్ లో కూడా no లాగ్స్. multiple tasks ను హేండిల్ చేయగలదు ఈజీగా. OS విషయానికి వస్తే iOS 9.3.1 ఫాస్ట్ మరియు stable. టచ్ పది సార్లకు ఒక సారి మిస్ అవుతుంది అంతే. ఓవర్ ఆల్ గా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న ఫోన్ ఇది.

iPhone SE benchmarks
Create bar charts

కెమెరా: బాగుంది
డైలీ ఫోటోగ్రఫీ లో డీసెంట్. true-to-source కలర్స్ ఇస్తుంది. ఫోకస్ కూడా ఫాస్ట్, షట్టర్ రెస్పాన్స్ స్మూత్. సో డిసప్పాయింట్ అవ్వరు ఫోటోస్ తో. అయితే పెర్ఫార్మన్స్ ఫ్లాగ్ షిప్ ఫోనులతో పోటీ పడింది కాని కెమెరా మాత్రం అసలు పోటీ లైన్ లోనే లేదు కెమెరా విషయంలో

 .

ఆప్టికల్ ఇమేజ్ stabilisation కూడా లేదు. ఇమేజ్ క్వాలిటీ పరంగా మాత్రం బాగుంది కాని కంపేర్ చేస్తే వాటికన్నా బాలేదు. డిసెంట్ డిటేల్స్, షార్ప్ నెస్, క్లారిటీ ఉన్నాయి. Low లైటింగ్ లో మాత్రం నాయిస్ ఇస్తుంది. ఫ్రంట్ కెమెరా కు ఈ ప్రాబ్లెం బాగా ఉంది. కాని రెటినా ఫ్లాష్ వలన low లైటింగ్ లో ప్రాబ్లెం కొంచెం resolve అవుతుంది selfies విషయంలో. 

View post on imgur.com

బ్యాటరీ: casual users కు ఫర్వాలేదు
ఆపిల్ ఇంప్రూవ్డ్ బ్యాటరీ అని చెప్పింది కాని బెస్ట్ బ్యాటరీ దగ్గరలో మాత్రం లేదు బ్యాటరీ లైఫ్. ఎవరేజ్ usage లో 5S ఫోన్ అయితే రెండు సార్లు కన్నా ఎక్కువ సార్లు చార్జింగ్ చేయాలి. SE మాత్రం ఈజీగా day అంతా వచ్చింది. 18% మిగిలింది Low power మోడ్ లో. గిక్ బెంచ్ టెస్ట్ లో 4 అండ్ హాఫ్ hours వచ్చింది. ఇది చాలా తక్కువ స్కోర్.every day usage బానే ఉంటుంది కాని ఎక్కువ usage ఉంటే మాత్రం ఎక్కువ డ్రాప్ అవుతుంది.

బాటం లైన్
కచ్చితంగా ఫ్లాగ్ షిప్ కంటెంట్ తో ఉంది ఫోన్ అని చెప్పాలి. పవర్ ఫుల్. కానీ స్క్రీన్ దగ్గరే dilemma ఉంటుంది. దానికి తోడూ ప్రైస్ కూడా 39,000. కేవలం కొంచెం తేడా ఉంది ఐ ఫోన్ 6S కు దీనికి. 3000 రూ అదనంగా ఖర్చు చేసే అవకాశం ఉన్న వారు 6S లో ఉన్న 3D టచ్ మరియు bigger డిస్ప్లే ఎందుకు కోరుకోరు.

ఐ ఫోన్ 4S వాడుతున్న వారికీ పర్ఫెక్ట్ అప్ గ్రేడ్ SE ఫోన్. మరియు large స్క్రీన్ పై ఇష్టం లేని వారు కూడా ఇది ఇష్టపడతారు. అల్టిమేట్ కంటెంట్ ఉంది. సో మీకు స్క్రీన్ సైజ్ ప్రాబ్లెం కాకపోతే వెంటనే తీసుకోవచ్చు. సైజ్ ప్రాబ్లెం అనుకునే వారికి 6S మంచి చాయిస్. అన్ని ఐ ఫోన్ ల వలె ఐ ఫోన్ SE కూడా గ్రేట్ ఫోన్.

ఆపిల్ ఐ ఫోన్ SE Key Specs, Price and Launch Date

Release Date: 09 Jun 2016
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  NA
 • Camera Camera
  NA
 • Memory Memory
  NA
 • Battery Battery
  NA
logo
Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class.

Advertisements
Advertisements

ఆపిల్ ఐ ఫోన్ SE

ఆపిల్ ఐ ఫోన్ SE

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status