Xolo క్రోమ్ బుక్ Review: క్రోమ్ బుక్స్ ప్రధానంగా ఇంటర్నెట్ పనులు చేసుకోవటనికే. పర్సనేల్ గా నార్మల్ యూసేజ్ కి కాదు.

బై Nikhil Pradhan | అప్‌డేట్ చేయబడింది Jun 02 2015
Xolo క్రోమ్ బుక్ Review: క్రోమ్ బుక్స్ ప్రధానంగా ఇంటర్నెట్ పనులు చేసుకోవటనికే. పర్సనేల్ గా నార్మల్ యూసేజ్ కి కాదు.
DIGIT RATING
61 /100
 • design

  72

 • performance

  56

 • value for money

  57

 • features

  63

 • PROS
 • మ్యాటి డిస్ప్లే స్క్రీన్
 • ఫాస్ట్ బూటింగ్
 • ఫర్వాలేదు అనిపించే ఆఫ్ లైన్ ఆప్స్ సంఖ్య
 • CONS
 • సైజు కు మించిన బరువు
 • ఏవరేజ్ పెర్ఫార్మెన్స్
 • క్రోమ్ os లో లిమిటేషన్స్ ఎక్కువ
 • అప్లికేషన్స్ మరియు గేమ్స్ కూడా తక్కువ సంఖ్యలో ఉంటాయి.

తీర్పు

12,999 ధర కి Xolo క్రోమ్ బుక్ చాలా ఇస్తుంది కాని, దీని పై డిపెండ్ అయ్యి మన దగ్గర ఒక కంప్యూటర్ ఉంది అని ఫీల్ అయ్యేంత బరోసాను ఇది ఇవ్వదు. ఇందుకు కారణం ఒక రకంగా క్రోమ్ OS కుడా. సో దీని బదులు బడ్జెట్ లో విండోస్ లాప్టాప్ తీసుకోవడం మంచిది.

BUY Xolo క్రోమ్ బుక్

Xolo క్రోమ్ బుక్ detailed review

మొదటిగా చెప్పవలిసినది, గూగల్ అనుసంధానం అయిన పనులు మీరు డైలీ చేసుకునే ఆఫీస్ వాతావరణంలో ఉంటే, గూగల్ క్రోమ్ బుక్స్ ఉపయోగం పూర్తిగా ఉంటుంది. జెనెరల్ యూజ్ కోసం ఇవి అంత కరెక్ట్ చాయిస్ కాదు. నిరంతరం జి మెయిల్ లాగిన్ లో ఉంది, రోజంతా హ్యాంగ్ అవుట్స్ లో చాటింగ్ చేసుకుంటూ, క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్ లో ఉండవలిసి వస్తే ఈ లైట్ క్రోమ్ బుక్స్ సరైన డివైజెస్, ఎటువంటి అదనపు సాఫ్టవేర్ ఇన్స్టాలేషన్ లేకుండా లైట్ గా ఉంటాయి ఇవి.

కాని క్రోమ్ బుక్స్ లో కొన్ని నష్టాలు ఉన్నాయి. నిరంతరం ఇంటర్నెట్ ఉంటేనే కాని ఇవి ఎందుకు పనిరావు. మరియు నెట్ ఉన్నా గూగల్ ఆప్స్ మాత్రమే ఇందులో పనిచేస్తాయి. గూగల్ ఆప్స్ క్రోమ్  బుక్స్ కు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి.
                                                                                                                                                          

బిల్డ్ డిజైన్:
దీని బయటకు కనిపించే ఫిసికల్ లుక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ తక్కువ బడ్జెట్ లో ఇంత ధృడమైన మరియు ఆకర్షణీయమైన బిల్డ్ క్వాలిటీ అందించటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది ప్లాస్టిక్ బాడీ అయినప్పటికీ దీనికి బిల్డ్ విషయంలో డ్రా బ్యాక్స్ లేవు. గ్లాసీ, మ్యాటీ ఫినిషింగ్ తో వస్తున్న దీని బాడీ ఫింగర్ ప్రింట్లను ఎక్కువుగా చూపిస్తుంది.

                                                                                                                                                         
                                                                                                                                                         
కాని లాప్టాప్ ను ఓపెన్ చేసిన వెంటనే, మీకు చీప్ గ్లాసీ ప్లాస్టిక్ కీ బోర్డ్ చుట్టూ కనిపిస్తుంది. డిజైన్ కూడా చీప్ గా అనిపిస్తుంది. రెండు రకాలు టీం లు దీని బిల్డ్ పై పనిచేసినట్టు, ఒక మంచి టీం అవుటర్ బాడికి, మరో టీం ఇన్నర్ బిల్ట్ కోసం పనిచేసినట్టు అనిపిస్తుంది.

Xolo క్రోమ్ బుక్ 11.6 మ్యాటీ డిస్ప్లే తో వస్తుంది. ఇది కూడా మంచిదే, గ్లేర్స్ మరియు రిఫ్లెక్షన్స్ ఏమి రాకుండా ఇది ఉపయోగపడతుంది. డిస్ప్లే ని 45 డిగ్రీల కన్నా ఎక్కువ కోణంలో ఉంచితే, మీకు కలర్స్ మారిపోతాయి. వ్యూయింగ్ ఏంగిల్స్ ఫర్వాలేదు అనిపిస్తున్నాయి.

                                                                                                                                                         
కీ బోర్డ్ విషయానికి వస్తే చూడటానికి మంచి లుక్ తో చిక్లేట్ కీ బోర్డ్ తో వస్తుంది ఈ క్రోమ్ బుక్. కీస్ చాలా సాలిడ్ గా మంచి స్పేసింగ్ తో అమర్చబడ్డాయి. కాకపోతే కీస్ ను మధ్యలో కరెక్టుగా ప్రెస్ చేయకపోతే, సగం ప్రెస్ అయి ఉండిపోయి జామ్ అవుతున్నాయి. ఫస్స్ట్ గా టైపు చేసేటప్పుడు ఇది కొంచెం ఇబ్బంది గా అనిపించే సమస్య. విండోస్ కీ బోర్డ్ కి దగ్గరిలో డిజైన్ చేయబడ్డ క్రోమ్ బుక్ కీ బోర్డ్ లో కొన్ని ఇంపార్టెంట్ కీస్ లేకపోవటం పెద్ద మైనస్. దీనిలో డిలిట్, Caps లాక్ మరియు ఫంక్షన్ కీస్ ఉండవు. కొత్త షార్ట్ కట్స్ ను ఉపయోగించి మీరు వాటిని ఏక్సిస్ చేసుకోవాలి. షార్ట్ కట్స్ అన్నీ మళ్ళీ కొత్త ప్యాట్రాన్ లో నేర్చుకోవాలంటే క్రోమ్ బుక్ కోసం అంత చేసేంత అవసరం ఉందా అనే ప్రశ్న మీకు వస్తుంది.
వరసుగా 10 డెడికేటెడ్ కిస్ ను అమర్చారు పైన, వీటితో  వెబ్ పేజ్ ను రీ లోడ్, ఫుల్ స్క్రీన్ , బ్రైట్ నేస్ మార్చుకోవటం , వాల్యూమ్ మార్చుకోవటం వంటి పనులు చేసుకోవచ్చు. ట్రాక్ ప్యాడ్ ఫ్లాట్ గా ఉంటుంది. ఎటువంటి డిటాచింగ్ లు, డిజైన్ లు లేకుండా స్మూత్ గా, క్లికబల్ గా ఉంది. మౌస్ ట్రాకింగ్ ప్యాడ్ లో ఎటువంటి ఇబ్బందులు లేవు. Xolo క్రోమ్ బుక్ బరువు 1.5 Kgs తో కొంచెం బరువుగా ఉంది కాని సైజు మాత్రం చిన్నగా ఉంది. కచ్చితంగా వెయిట్ ని మీరు ఫీల్ అవుతారు, కాని రోజు వాడుతుంటే ఆ బరువు ను అలవాటుపడిపోతారు.
                                                                                                                                                         
                                                                                                                                                         

క్రోమ్ OS : కొత్తగా ఉంది.
ఇది 2009 లోనే అనౌన్స్ చేసిన OS అయినప్పటికీ ఇంతవరకూ దీనిని వాడిన వారి సంఖ్య చాలా తక్కువ కాబట్టి, చాలా మందికి ఇది కచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది. క్రోమ్ os అంతా బ్రౌజర్ తోనే ఎక్కువ నడుస్తుంది. దీనికి అంటూ సేపెరేట్ ఫైల్ సిస్టం ఉంది. వీడియోస్, మ్యూజిక్ వంటివి చూడటానికి దాని సొంత ఆఫ్లైన్ ఆప్స్ ను వాడుతుంది క్రోమ్. విండోస్ సాఫ్టవేర్ అంత కేపబిలిటీస్ అయితే లేవు కాని ఉన్న డిఫాల్ట్ విడియో, మ్యూజిక్ ఫైల్ మేనేజర్ ఆప్స్ వంటివి పూర్తిగా ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తాయి.
                                                                                                                                                        
                                                                                                                                                          పైన ఉన్నపిక్  క్రోమ్ డిఫాల్ట్ మ్యూజిక్ ప్లేయర్ 

                                                                                                                                                        
                                                                                                                                                        ఈ 
పైన ఉన్న పిక్ క్రోమ్ డిఫాల్ట్ విడియో ప్లేయర్ 

ఫైల్ మేనేజర్ విండోస్ వలె ఉంటుంది, కాని క్రోమ్ బుక్స్ లో హార్డ్ డిస్క్ చాలా తక్కువుగా వస్తుంది. ఇందుకు ప్రధాన కారణం, క్రోమ్ బుక్స్ కోసం గూగల్ ఇంటర్నెట్ లో క్లౌడ్ స్టోరేజి ను ఉచితంగా ఇస్తుంది. మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే ఒక క్లౌడ్ డ్రైవ్ మరియు మీరు క్రోమ్ బ్రౌజర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ డ్రైవ్ కనిపిస్తాయి. Xolo క్రోమ్ బుక్ లో ఇంటర్నెల్ స్టోరేజి కేవలం 16 జిబి, క్లౌడ్ స్టోరేజ్ 100 జిబి. ఇది కచ్చితంగా మీరు ఊహించని తక్కువ స్టోరేజి.

                                                                                                                                                        
                                                                                                                                                        పైన ఉన్నది ఫైల్ మేనేజింగ్ అప్లికేషన్.

గూగల్ క్రోమ్ os పై రెండు రకాల సాఫ్ట్ వేర్ లు రన్ అవుతాయి. అవి ఎక్స్టెన్షన్స్ మరియు అప్లికేషన్స్. ఎక్స్టెన్షన్స్ అనేవి మీరు మాముల క్రోమ్ బ్రౌజర్ లో వాడుకునే ప్లగిన్స్ లాంటివి. కాని ఇవి క్రోమ్ కి చాలా ఉపయోగపడతాయి. రెండవది ఆప్స్. ఇవి క్రోమ్ బ్రౌజర్ లో కాకుండా బయట పనిచేస్తాయి. అలాగే గేమ్స్ లాంటి అప్లికేషన్ అయితే క్రోమ్ బ్రౌజర్ లో కూడా పనిచేస్తాయి. మీరు ఏమి వాడలన్నా మీకు ఉండే ఒకే ఒక్క సోర్స్, క్రోమ్ వెబ్ స్టోర్. దాని నుండే ఆప్స్ లేదా ఎక్స్టెన్షన్స్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
                                                                                                                                                       
                                                                                                                                                       అప్లికేషన్స్
                                                                                                                                                      
                                                                                                                                                      ఎక్స్టెన్షన్స్
                                                                                                                                                      
                                                                                                                                                      క్రోమ్ బుక్ లో ఇంస్టాల్ అయిన ఆప్స్


క్రోమ్ వెబ్ స్టోర్ లో గేమ్స్ దొరికినా అవి చాలా చిన్నవి, కొన్ని ఫేమస్ ఉన్నప్పటికీ తక్కువ సంఖ్యలో ఉంటాయి. పైగా మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవాలంటే దాని పేరు మీకు తెలిసి ఉండాలి, వెబ్ స్టోర్ లో వెతకటం కొద్దిగా కష్టంగా ఉంది.

క్రోమ్ OS : ఆఫ్ లైన్ యూసేజ్
ఇది పూర్తిగా ఇంటర్నెట్ ఎక్కువుగా వాడుకునే వారికీ అయినప్పటికీ, దీనిలో కూడా ఆఫ్ లైన్ పనులు చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసేసుకున్న గేమ్స్ ను ఆడుకోవటం, ఫైల్స్ పై వర్క్ చేయటం, మీ ఇంటర్నెల్ స్టోరేజ్ లో ఉన్న మ్యూజిక్ ను, వీడియోస్ ను వినటం వంటివి ఆఫ్ లైన్ లో జరుగుతాయి. గూగల్ క్రోమ్ బుక్ వెబ్ స్టోర్ లో మీకు కొన్ని ఆఫ్ లైన్ అప్లికేషన్స్ లిస్టు ఇక్కడ పొందగలరు.

పెర్ఫార్మెన్స్:
Xolo క్రోమ్ బుక్  రాక చిప్ 3288 SoC 1.8GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్ పై పనిచేస్తుంది. ఇది ARM బేస్డ్ మొబైల్ SoC అవటంతో ఇది నోట్ బుక్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ను ప్రదర్శించదు. ఆలాగని దీనిని మనం ఒప్పుకోలేము కాబట్టి, పెర్ఫార్మెన్స్ విషయంలో మీకు కాస్త నిరాశ వస్తుంది. క్రింద Xolo క్రోమ్ బుక్ బెంచ్ మార్క్స్ ను గమనిస్తే మీకు ఒక అవగాహన వస్తుంది.               


Xolo Chromebook benchmarks | Create infographics

 


డే టు డే యూసేజ్ లో మీరు బ్రౌజర్ ను బాగా వాడుకోవచ్చు, కాని ఏదైనా లోడ్ ఎక్కువుగా ఉన్న సైటు ను ఓపెన్ చేస్తే స్లో అయిపోతుంది. మెమరీ మేనేజ్మెంట్ కూడా డిఫెరెంట్ గా ఉంది. మీ బ్రౌజర్ లోని ఓపెన్ చేసిన ట్యాబ వద్దకు మీరు కొంచెం సేపటి తరువాత వెళ్తే దాని మళ్ళీ లోడ్ చేయవలిసి వస్తుంది. ఇది 2జిబి ర్యామ్ ను ఫ్రీ చేసేందుకు పెట్టిన సిస్టం అయినప్పటికీ, మళ్ళీ లోడ్ చేసుకోవటం అనేది కొంచెం ఇబ్బంది గా అనిపిస్తుంది. క్రోమ్ బుక్ లో ఉన్న ఒక మంచి విషయం చాలా తక్కువ స్టార్ట్ అప్ మరియు బూటింగ్ టైం.

1080P MP4 వీడియోస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్లే అయ్యాయి. కొన్ని MKV వీడియోస్ ప్లే చేసేటప్పుడు జర్క్స్ ఇచ్చింది, అలాగే ఆడియో చాలా సార్లు పనిచేయలేదు.  HD విడియో ప్లేయింగ్ లో  7.5 గంటలు బ్యాటరీ లైఫ్ వచ్చింది. అంటే జెనెరల్ యూస్ లో ఒక రోజు అంతా వస్తుంది Xolo క్రోమ్ బుక్. ఓవర్ ఆల్ గా దీని ధరకు తగ్గా పెర్ఫార్మెన్స్ ఇది ఇస్తుంది కాని దీని మీద డిపెండ్ అయ్యి దీనిని ప్రైమరీ డివైజ్ గా వాడలేము.

బాటమ్ లైన్:

కేవలం 12,999 రూ లకు వస్తుంది కదా అని దీనిని కొనే అవకాశాలు ఉన్నాయి కాని, దీని మీద నమ్మకంతో కొనే అంత కంటెంట్ Xolo క్రోమ్ బుక్ లో లేదు, అలాగని Xolo ను ఏమీ అనలేము. ఆ మాత్రం రేటు కి అంతకి మించి ఆశించడం కూడా కరెక్టు కాదు అని మా అభిప్రాయం. మీ విండోస్ లాప్టాప్ కు బదులుగా దీనిని వాడుదామని అనుకుంటే మాత్రం అది బ్యాడ్ డేశెషన్ అవుతుంది. లేదు బడ్జెట్ లో లాప్టాప్ ను కొనే అవసరం ఉన్నట్లు అయితే విండోస్ ఆధారిత HP  పెవిలియన్ 14 లేదా లెనోవో G50 లను ఒకసారి చూడండి. పెద్ద సైజు లో వద్దు, Xolo క్రోమ్ బుక్ సైజు మాదిరి గానే కావలి అనుకుంటే ఆసుస్ Eee బుక్ X205ta ను చూడండి.

ఎంత కాదన్నా మీకు క్రోమ్ బుక్ ను ట్రై చేయాలనీ అనిపిస్తే, క్రోమ్ బుక్ మీ అవసరాలకు అనుగుణంగా ఉంది అని అనుకుంటే, HP క్రోమ్ బుక్ 11 బెటర్ చాయిస్ అవుతుంది. లేదు సెకెండరీ డెస్క్ టాప్ కావలి , అది నాన్ విండోస్ అయినా ఫర్వాలేదు అనుకుంటే, Xolo క్రోమ్ బుక్ ను ఎంచుకోవచ్చు. లేదంటే సెకెండరీ డివైజ్ కోసం ఐ ప్యాడ్ ను తీసుకున్నా అదే అవసరాలను ఎక్కడికైనా తిరుగుతూ అవసరాలను, పనులను చేసుకునే సౌలభ్యం ఉంటుంది. అప్లికేషన్ ఎకో సిస్టం కూడా పెద్దది.

Xolo క్రోమ్ బుక్ Key Specs, Price and Launch Date

Release Date: 05 Oct 2015
Market Status: Launched

Key Specs

 • OS OS
  Chrome
 • Display Display
  11.6" (1366 x 768)
 • Processor Processor
  Rockchip 3288 | 1.8 Ghz
 • Memory Memory
  16 GB eMMC Flash/2GB DDR 3
logo
Nikhil Pradhan

https://plus.google.com/u/0/101379756352447467333

Advertisements
Advertisements

Xolo క్రోమ్ బుక్

Xolo క్రోమ్ బుక్

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status