లెనోవా ఐడియాప్యాడ్ యోగ 2 13 59-411008 Review: అల్టిమేట్ పోర్టబుల్ హైబ్రిడ్ లా ఉండనుందా?

బై Anirudh Regidi | అప్‌డేట్ చేయబడింది May 15 2015
లెనోవా ఐడియాప్యాడ్ యోగ 2 13 59-411008 Review: అల్టిమేట్ పోర్టబుల్ హైబ్రిడ్ లా ఉండనుందా?
DIGIT RATING
78 /100
 • design

  77

 • performance

  71

 • value for money

  85

 • features

  78

User Rating : 4/5 Out of 1 Reviews
 • PROS
 • గొప్ప స్క్రీన్
 • 360 ° కీలు
 • మంచి బిల్డ్ క్వాలిటీ
 • CONS
 • నార్మల్ బ్యాటరీ జీవితం
 • బేస్ వేడెక్కుతుంది
 • కేవలం ఒక USB 3.0 పోర్ట్

తీర్పు

ఈ  యోగా 2 (Yoga 2) అనేది  ఒక గొప్ప పరివర్తనాసామర్ధ్యం ఉన్న ల్యాప్టాప్. దీనిలో ఉన్నఅంశాలు: ఒక అధ్బుతమైన స్క్రీన్,  అత్యుత్తమమైన సామర్ధ్యం, సగటు బ్యాటరీ కాలప్రమాణం, గొప్ప భౌతిక నిర్మాణ స్వభావం  కలిగి ఉంది.   దీని లోపల వాళ్ళ మేము దీనికి "బెస్ట్ బై" బిరుదు ని ఇవ్వలేకపోయాము, కాని, మీకు కావలసినది ఒక ల్యాప్టాప్, అదీ 60,000/- రూపాయల లోపు అయితే, మరి ఇది మీ కోసమే.  
 
లెనోవో తన మొదటి యోగా(Yoga) ను విడుదల చేసినప్పుడు, దాని ఉద్దేశం కేవలం విండోస్ 8 టచ్ స్క్రీన్ సామర్ధ్యాన్ని మూలధనం గా మార్చుకోవటమే. పెద్ద సంఖ్యలో ఇతర ఉత్పత్తిదార్లు అందుకోసమే ప్రయత్నించారు, కాని ఈ Yoga ఆ పనిని సరిఅయిన విధంగా చేయగలిగింది. 
 
అది ఆదర్శవంతమైనది కాదు, విండోస్ 8 ఎంతయినా ఇప్పటికీ ఒక గందరగోళం (లేక కాదేమో?), అయినా ఈ పరికరం బాగుండి, ఇతరులతో పోటీలో నెగ్గి, అందరి మనసులలో ముద్ర వేసింది. 
మరి, ఈ లెనోవో  యోగా 2 (Yoga 2) ఎలా ఉంటుంది ? 

 

BUY లెనోవా ఐడియాప్యాడ్ యోగ 2 13 59-411008
Buy now on amazon స్టాక్ లేదు 40000
Buy now on flipkart స్టాక్ లేదు 56985

లెనోవా ఐడియాప్యాడ్ యోగ 2 13 59-411008 detailed review

రూపకల్పన మరియు నిర్మాణం (డిజైన్ అండ్ బిల్డ్)


ఇది బూడిద రంగులో ఉండి చెక్కుడుపలక తీరుగా అనిపించే దీర్ఘచతురస్రం లో ఉండే పరికరం, దీని సొగసు ను పెంచటానికి నల్లటి ఉబ్బెత్తు దిమ్మెలను మూత పైన మరియు దాని శరీర భాగం పైన అమర్చారు. దీని కీస్ అడుగున వెలుగు ఉండి, నల్లటి ద్వీపం లాగా కనిపించును, లెనోవో వీటిని తొలగించాలని ఈ మధ్య భావిస్తున్నది, ఇంకా మిగితావాన్ని, అంటే టచ్ ప్యాడ్ తో సహా,  చూడటానికి చెక్కుడు  పలక లాగా అనిపించే బూడిద రంగు లో ఉంటాయి. 

ఈ పరికరాన్నేచాలా ధృడంగా నిర్మించారు. మరీ ముఖ్యంగా 360° తిరిగగల కీలు, దీని దీర్ఘ కాల మన్నికకు ప్రథానాంశము. మిగితా భాగాలన్నీ చాలా ధృడంగా ఉండి, దీని కీస్ (కంజీలు) కూడా స్థిరంగా, అతి తక్కువ ఊగిసలాట కలిగి ఉంటాయి.
 
 ఫీచర్స్ అండ్ ఏర్గోనోమిక్స్

    
ఈ Yoga 2 అంటే, కేవలం దీని 360 డిగ్రీ తిరుగగల కీలు మాత్రమె అని మీరు అనుకుంటే మిమ్మల్ని క్షమించవచ్చు, కాని మీరు తప్పు కావచ్చు. ఈ పరికరం లోని కీలు ఒక అంశం మాత్రమే, కాని,  దీనిలో ఉన్నఇతర గొప్ప అంశాలు, ఇది తన శ్రేణి లో మరి ఏ ఇతర ల్యాప్టాప్ కన్నా అత్యుత్తమ డిస్ప్లే (స్క్రీన్) కలిగి  ఉండటం, ఉత్తమ నిర్మాణ నాణ్యత మరియు లెనోవో యొక్క గుర్తు గా నిలిచినా సామర్ధ్యాలు కలిగి ఉండటం.
 
సామర్ధ్యాల గురించి మాట్లాడాలంటే, దీని టచ్ స్క్రీన్ ను ఉపయోగించటం ఒక ఆనందం. అది i5 4200U ఇచ్చే శక్తీ తో  చాలా వేగంగా ప్రతిస్పందిస్తుంది, ఆపరేటింగ్ సిస్టం నుంచి వచ్చే ప్రతిస్పందన కూడా గొప్పగా ఉంటుంది.  కీబోర్డ్ కూడా చాలా బాగుంది, అయితే మేము కూడా లెనోవో నుంచి తక్కువేమీ ఆశించలేదు. అయితే ఏమైనా, దీని కీబోర్డ్ కు ఉపయోగించిన బ్యాక్ లైట్, ప్రత్యేకంగా మంచిదని, ఈ మధ్యకాలం లో ని ల్యాప్టాప్స్ తో పోల్చి పరీక్షించిన మీదట తేలింది (మా జూలై 2014 Digit సంచిక ను పరిశీలించండి). ఇతర ఉత్పత్తిదారులు పర్వాలేదు అనుకునే,  కళ్ళు చెదిరే కాంతి ప్రసరించే బ్యాక్ లైట్ ను అంతగా వెలుగు ని ప్రసరించకుండా శ్రద్ధగా అమర్చారు. 

ధ్వని నియంత్రణ బటన్స్ ని ఒక వైపు కి అమర్చిన ఏకైక ల్యాప్టాప్ కూడా ఇదే. అది చాలా చిన్న విషయం అనిపించవచ్చు, కాని మీరు ఉపయోగించి చూస్తే శాస్త్రీయ పద్ధతి లో ధ్వనితీవ్రత ను మార్చటం (Fn కీ  సహాయంతో) చాలా కష్టమని తెలుస్తుంది. ఒక పెద్ద లోపం ఇందులో ఏమిటంటే, ఒకే ఒక్క USB 3.0 పోర్ట్  కలిగిఉండటం. మీలో చాలా మందికి అవి ఒకటి ఎక్కువ కన్నా అవసరం లేదు కాని,  ఎక్కువ ఉండే అవకాసం ఉంటె మంచిదే.

ఓహ్, మరి మేము చెప్పామా ఈ Yoga 2  కదలికలను బట్టి గుర్తించటం అనే అంశాన్ని సమర్ధిస్తుందని?  మాది కాస్త తమాషా అనుభవమే అయినా, ఈ అంశం ఇతర సందర్భాల్లో అంటే టెక్స్ట్ మోడ్ లాంటి వాటిలో  ఉపయోగకరమే.

పెర్ఫార్మెన్స్

అంకెల విషయానికొస్తే, ఈ పరికరం,  సమాన సామర్ధ్యం కలిగిన ఇతర పరికరాలకన్నతక్కువ నెరవేరుస్తుంది.
ఉదాహరణకి 3DMark, కేవలం 33000 దరిదాపులో స్కోర్ కనపరిచింది, ఇది i5 4200U నుంచి ఆశించిన దానికన్నా దాదాపు 7000 తక్కువ.  PeaceKeeper స్కోర్ కూడా సగటు గ ఉండవలసిన 4000 కన్నా తగ్గి 2700 కు దగ్గరలో నిలిచింది. అదే సమయంలో టెంపరేచర్ ఎప్పుడూ 60°C దాటలేదని మేము గమనించాము. ఈ విషయాలను జతపరిస్తే, ఈ పరికరంలోని ఉష్ణోగ్రత అతి గా నియంత్రించ బడుతోంది, కాని అది మా ఆరోపణ కాదు. అంకెల గారడీ కోసమో మరియు CPU  అతిగా పనిచేయటం కోసం అయితే మీరు దీనిని కొనరు కదా, రోజువారి పనులకి దీని పనితనం సరిపోతుంది. మాకు గమనించతగ్గ లోటు ఏమి కనిపించలేదు, పైగా పక్క పక్కనే ఉంచి చూసినా, పని నేరవేర్చుటలో Yoga 2 మరియు అతి శక్తివంతమైన Flex 2 లలో తేడా చెప్పలేక పోయాము. 
దీని స్క్రీన్ మేము చూసిన అన్ని ల్యాప్టాప్స్ కన్నా సుందరమైనది, మేము కొలిచినప్పుడు, దీని ప్రకాశం   స్థాయి 300cd/m2  చేరుకుంది, ఇంకా కాంతి వ్యతిరేకత  నిష్పత్తి 600:1 కన్నా అధికం గా తేలింది. ఇది చాలా ఎక్కువ, ఇతర  ల్యాప్టాప్స్ 150cd /m2 ని అతికష్టం మీద దాటగలవు,  కాంతి వ్యతిరేక నిష్పత్తి 300:1 దాటడం చాలా అరుదు.

అతి నిరుత్సాహ పరిచే విషయం ఈ ల్యాప్టాప్ లో అంటే బ్యాటరీ నే అయి ఉండాలి, కేవలం 3 గంటల లోపు, అంటే, అది అరుదుగా సరిపోతుంది. అయినా, మా పరీక్షలు కాస్త కష్టమైనవే కాబట్టి, స్క్రీన్ ప్రకాశాన్ని తగ్గిస్తే బ్యాటరీ కాల ప్రమాణం పెరగవచ్చు. అయినా కూడా అవే పరీక్షలకి తట్టుకొని ఇతర పరికరాలు 4 గంటలు పనిచేస్తే, yoga 2 యొక్క పనితనం మాత్రం నిరుత్సాహకరమే.

వినియోగదారుడి అనుభవం 

Yoga 2 తో కలిసి జీవించటం అనేది ఒక ఆసక్తిక రమైన అనుభవం. ఇదివరకు చెప్పిన విధంగా, ఈ పరికరం నిర్మాణం చాలా బాగుంది, కాబట్టి మీకు ఒక ఖరీదైన పరికరాన్నిమోసుకు వెళ్తున్నారన్న భావన కలుగుతుంది. ఆ స్క్రీన్, 360డెగ్రీల కీలు ఉండటం మంచిదే, మరీ ముఖ్యం గా మీరు విశ్రమిస్తున్నప్పుడు, కాని ఎట్టి పరిస్థితుల్లో అది ఆవశ్యకత కాదు. మేము గమనించింది ఏమిటంటే, ఎక్కువసేపు వాడటం వల్ల దీని కింది భాగం చాలా వేడెక్కి పోయింది. ఇది కలిచివేసే విషయం, ఎందుకంటే,  ఇది చలనం లో ఉన్నప్పటి ఉష్ణోగ్రత తక్కువే, అయినా 40 డిగ్రీల వేడి పళ్లాన్నివడిలో పెట్టుకోవటం ఏమి సుఖం అనిపించదు. ఇది మరీ బాధాకరం ఎందుకంటే అతినాజూకు గా ఉండే ఎసేర్ ఎస్పయిర్ S7 (Acer Aspire S7) అతిగా ఉష్ణాన్ని విడుదల చేసినా, మీ తొడలను కాల్చకుండా జాగ్రత్త పడుతుంది.         

చివరి మాట

మొత్తానికి, ఈ లెనోవో Yoga 2 ఒక గొప్ప పరికరం. దీనికి చాలా గొప్పలక్షణాలు ఉన్నాయి, ఆ అద్భుతమైన కీలు కూడా ఉండటం మంచిదే.  స్క్రీన్ అత్యద్భుతం మరియు స్పర్శ స్పందన ఆశ్చర్యకరం, కాని ఆ వేడి గా ఉండే కింది పళ్ళెం మరియు ఎంతో కొంత తగ్గిన బ్యాటరీ కాలప్రమాణం వల్ల బెస్ట్ బై బిరుదు అందుకోవటం లో వెనకంజ వేసింది. దీని లక్షణాలు, మరియు మొత్తం మీద దీని పనితనం, దీనికి " ఎడిటర్స్ పిక్" అవార్డు దక్కించుకోవటానికి సరిపోతాయి. మీరు 60,000/- రూపాయిలు ఒక ల్యాప్ టాప్ మీద ఖర్చు చేయటానికి ఇష్టపడితే, దీని తర్వాత ఇంకేమి చూడకండి.
 

లెనోవా ఐడియాప్యాడ్ యోగ 2 13 59-411008 Key Specs, Price and Launch Date

Price:
Release Date: 14 Jul 2014
Market Status: Launched

Key Specs

 • OS OS
  Windows 8.1 64 bit
 • Display Display
  13.3" (1920 x 1080)
 • Processor Processor
  Intel Core i5 4200U | 1.6 Ghz
 • Memory Memory
  500 GB + 8 GB SSD Hybrid SATA/4GB DDRIII
Anirudh Regidi
Anirudh Regidi

Email Email Anirudh Regidi

Advertisements
Advertisements

లెనోవా ఐడియాప్యాడ్ యోగ 2 13 59-411008

Buy now on amazon 40000

లెనోవా ఐడియాప్యాడ్ యోగ 2 13 59-411008

Buy now on amazon ₹ 40000

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status