OnePlus TV Y1s: రేపు సాయంత్రం లాంచ్ కానున్న వన్ ప్లస్ కొత్త స్మార్ట్ టీవీ

Updated on 28-Mar-2022
HIGHLIGHTS

వన్ ప్లస్ రేపు తన ప్రోడక్ట్స్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది

TV Y1s స్మార్ట్ టీవీని కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది

ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుందని వెల్లడి

వన్ ప్లస్ కంపెనీ రేపు తన ప్రోడక్ట్స్ ను విడుదల చెయ్యడానికి లాంచ్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. ఈ లాంచ్ ఈవెంట్ ద్వారా వన్ ప్లస్ నార్డ్ CE 5G మరియు TV Y1s స్మార్ట్ టీవీని కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 17 సాయంత్రం, అంటే రేపు సాయంత్ర 7 గంటలకు మొదలవుతుంది. అంతేకాదు, వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ TV Y1S యొక్క 6 ఆకర్షణీయమైన ప్రత్యేకతల గురించి టీజర్ ద్వారా చెబుతోంది.

ఇక ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ TV Y1S  గురించి టీజ్ చేస్తున్న 6 ప్రత్యేకతల వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ టీవీ అతి సన్నని అంచులను కలిగి ఉన్నట్లు చెబుతోంది మరియు టీజర్ పేజ్ ద్వారా ఈ విషయం మనకు కూడా అర్ధమవుతోంది. ఈ టీవిలో పవర్ ఫుల్ గామా ఇంజన్ అందించినట్లు, దీనిద్వారా స్పష్టమైన వివరాలను క్లియర్ గా చూడవచ్చని చెబుతోంది.

ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుందని కంపెనీ కూడా టీజర్ ద్వారా వెల్లడించింది. దీనితో పాటుగా ALLM (ఆటో లో లేటెన్సీ మోడ్) ని కూడా ఈ టీవిలో అందించింది. అంటే, ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ )OS తో పాటుగా ల్యాగ్ ఫ్రీ మరియు మృధువైన అనుభావాన్ని అందిస్తుందని చెబుతోంది.

ఈ OnePlus స్మార్ట్ టీవీ, వన్ ప్లస్ స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ మరియు బ్లూటూత్ డివైజ్ లకు ఎటువంటి అంతరాయం లేని సీమ్ లెస్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :