మనిషిని దోమ ఎలా టార్గెట్ చేస్తుందో, దాని మెదడు పైన పరీక్షలు చేసి గనుగొన్న పరిశోధకులు

మనిషిని దోమ ఎలా టార్గెట్ చేస్తుందో, దాని మెదడు పైన పరీక్షలు చేసి గనుగొన్న పరిశోధకులు
HIGHLIGHTS

ఒక దోమ ఎలాగ మనిషిని టార్గెట్ చేస్తుందో అనేవిషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు

మనిషి రక్తాన్ని పీల్చుకోవడానికి, ఒక దోమ ఎలాగ మనిషిని టార్గెట్ చేస్తుందో తెలుసుకోవడానికి, దోమ యొక్క మెదడులో ఏమి జరుగుతుందో అనేవిషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు.  వారు చేసిన పరిశోధనలో, దోమలు ప్రధానంగా వారి వాసన యొక్క భావం మీద ఆధారపడి ఉంటాయని, అటుతరువాత ఆ వాసనను బట్టి వారిని లక్ష్యంగా చేసుకుంటాయి. వాస్తవానికి, మానవులు మరియు ఇతర జంతువులు వదిలే కార్బన్ డయాక్సైడ్ దీనికి ఒక ప్రాధమిక మార్గం, ఇది దోమ మెదడు యొక్క దృశ్య కేంద్రాలను చర్యలోకి తెస్తుంది. లక్ష్యానికి లేదా కార్బన్ డయాక్సైడ్ యొక్క మూలానికి సరిపోయే ఆకారాల కోసం దోమ పరిసరాలను స్కాన్ చేయడం ప్రారంభిస్తుంది మరియు దాన్ని టార్గెట్ చేస్తుంది.

అధ్యయనం యొక్క ప్రధాన సూత్రధారి, జెఫ్రీ రిఫెల్ ఇలా అన్నారు, “మన శ్వాస కేవలం CO2 తో లోడ్ చేయబడి ఉంటుంది. ఇది దోమలకు సుదూర ఆకర్షణ, దీనితో 100 అడుగుల కన్నా ఎక్కువ దూరంగా ఉండే వాటిని కూడా దోమలు గుర్తించగలవు. ”దోమలు 100 అడుగుల దూరం నుండి కార్బన్ డయాక్సైడ్ వాసనను గుర్తించగల దోమలు, 20 అడుగుల దూరంలో లేదా చాలా దగ్గరగా ఉండే లక్ష్యాలను మాత్రమే ఎక్కువగా ఎంచుకుంటాయి.

ఈ ప్రయోగం కోసం చేసిన సెటప్ చాలా చిన్నది, కానీ విస్తృతమైనది. ఈ ప్రధాన సెటప్ ఏడు అంగుళాల వ్యాసం కలిగిన వృత్తాకార “అరేనా” మాత్రమే. అరేనా లోపలి గోడ ఎల్‌ఈడీ డిస్ప్లే తో ఏర్పాటు చేశారు, ఇది దోమలకు దృశ్య ఉద్దీపనను అందించింది. ఒక మార్గం నుండి అరేనాకు వాసన వస్తుంది. మధ్యలో, దోమలు ఒకదానికొకటి టంగ్స్టన్ తీగతో కలుపుతారు. దోమ క్రింద ఉన్న ఆప్టికల్ సెన్సార్ వింగ్ బీట్స్, దాని ఫ్రీక్వెన్సీ మరియు దిశపై సమాచారాన్ని సేకరించింది. ఈ సెటప్‌లో 250 విడివిడి దోమలను పరీక్షించారు.

5 శాతం కార్బన్ డయాక్సైడ్‌ను అరేనాలో ప్రవేశపెట్టినప్పుడు, దోమలు రెక్కలను వేగంగా కొట్టడం మొదలుపెట్టాయి. ఇందులో ప్రవేశపెట్టిన మొత్తం వాసన మానవులు వదిలే కార్బన్ డయాక్సిడ్ లో కేవలం – 4.5 శాతం మాత్రమే . కార్బన్ డయాక్సైడ్ లోపైలి వచ్చిన వెంటనే, వచ్చిన వైపుగా దోమ వెంటనే అటువైపుకు  తిరిగింది.

ఇప్పుడు నిజంగా ఆసక్తికరమైన విషయానికి వచ్చాము. పరిశోధకులు జన్యుపరంగా మార్పు చెందిన దోమలతో ఇదే ప్రయోగం చేశారు. ఈ దోమలలో కాల్షియం అధికంగా ఉంటే ఫ్లోరోసెంట్ ఆకుపచ్చ రంగులో మెరుస్తున్న కాళ్ళు ఉన్నాయి. ఫలితంగా, ఈ దోమలలోని నాడీ కణాలు చురుకుగా చర్యలను జరుపుతున్నప్పుడు ఇవి మెరుస్తాయి.  పరిశోధకులు చిన్న దోమల పుర్రెలలో కొంత భాగాన్ని తొలగించి, ఈ దోమలలోని మెదడులను బహిర్గతం చేసి, వాటిని టెథర్‌పై ఉంచి, మైక్రో స్కోప్ నుండి దోమల మెదడులను ప్రత్యక్షంగా గమనించారు. మెదడు యొక్క దృష్టి కేంద్రంలోని న్యూరాన్లు ఘాడ ఉద్దీపనలో ఉన్నప్పుడు కుట్టడం చేస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అంటే, ఇక్కడ దృశ్య ఉద్దీపన కేవలం వాసన యొక్క భావాన్నిబట్టి ప్రేరేపిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ వాసనను దోమ గుర్తించినప్పుడు దృష్టి కేంద్రంలోని న్యూరాన్లు పనిని ప్రారంభిస్తాయి. "ఒల్ఫాక్షన్ అనేది దోమలకు సుదూర భావన, అయితే వాటి దృష్టి అనేది ఇంటర్మీడియట్-రేంజ్ ట్రాకింగ్ కోసం ఆపనిచేస్తుంది.

తరువాత, పరిశోధకులు దోమల ప్రవర్తనపై ఇతర ఆకృతుల ప్రభావాలను పరిశోధించాలనుకుంటున్నారు. ఈ పరిశోధన ఫలితముగా, దోమలను నియంత్రించడానికి కొత్త మార్గాలను కనుగొనడానికి మార్గం సుగమం చేస్తుంది మరియు వాటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను కూడా నివారించవచ్చు.

మూలం:  వాషింగ్టన్ విశ్వవిద్యాలయం

కవర్ చిత్రం : స్కీజ్ ఫ్రమ్ పిక్సబై   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo