JioFi 4G: కేవలం 94 రుపాయిలకే Wi Fi హాట్ స్పాట్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 19 Aug 2020
HIGHLIGHTS
  • Jio మరొకసారి వినియోగదారుల కోసం బంపర్ అఫర్ ప్రకటించింది.

  • Jio ఇప్పుడు JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్ ప్రకటించింది.

  • రూ.1,999 విలువగల JioFi ని నెలకు కేవలం రూ. 94 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు.

JioFi 4G: కేవలం 94 రుపాయిలకే Wi Fi హాట్ స్పాట్
JioFi 4G: కేవలం 94 రుపాయిలకే Wi Fi హాట్ స్పాట్

Jio మరొకసారి వినియోగదారుల కోసం బంపర్ అఫర్ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో, కంటెంట్ వినియోగంతో పాటుగా ఇంటి నుండి పని చేసే వారి సంఖ్య పెరగడంతో డేటా ఎక్కువగా అవసరం అవుతుంది. అటువంటి అవసరం ఉన్నవారి కోసం Jio ఇప్పుడు JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్ ప్రకటించింది. అంతేకాదు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో ఇది బెస్ట్ అని కూడా చెప్పొచ్చు.

ఎందుకంటే, ప్రస్తుతం జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi ని ప్రతినెలా అతితక్కువ EMI  చెల్లించి సొంతం చేసుకునే అవకాశం తీసుకొచ్చింది. రూ.1,999 విలువగల JioFi ని  నెలకు కేవలం రూ. 94 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు.  అంటే, ఇప్పుడు మీరు వాటిని మాస్ EMI తో కొనుగోలు చెయ్యవచ్చు మరియు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

JioFi 4G తో 5 నెలల వరకూ ఉచిత డేటా ఆఫర్

JiioFi 4G హాట్ స్పాట్ డివైజ్ కొనేవారికి 5 నెలల ఉచిత డేటా మరియు జియో-టు-జియో  ఉచిత కాల్స్ కూడా అందిస్తోంది. ఈ JioFi 4G ధర కేవలం 1,999 రూపాయలు మాత్రమే. అయితే, ఈ ఆఫర్ ఉచిత అఫర్ పొందడానికి, వినియోగదారులు మొదట JioFi 4G కోసం ఈ క్రింది ప్లాన్లలో ఒక  దాన్ని రీఛార్జ్ చేయాలి.

JiioFi 4G తో ఉచిత డేటా అఫర్ ఎలా జతచేయాలి?

రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుండి JioFi 4G Hot Spot ‌ను కొనుగోలు చేసి, ఆపై జియో సిమ్ ‌ను యాక్టివేట్ చేసిన తరువాత, వినియోగదారులు డివైజ్ ని ఎనేబుల్ చేయడానికి అందుబాటులో ఉన్న మూడు కొత్త జియోఫీ ప్లాన్‌ లలో దేనినైనా ఎంచుకోవచ్చు. యాక్టివ్ సిమ్ ‌ను JioFi 4G  పరికరంలో చేర్చిన తర్వాత ఎంచుకున్న ప్లాన్ తో పాటుగా ఉచిత డేటా కొద్ది గంటల్లో ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్ యొక్క యాక్టివ్ స్టేటస్ ని MyJioApp ద్వారా తనిఖీ చేయవచ్చు. JioFi 4G  Device ని కంపెనీ సైట్ ద్వారా ఆన్‌ లైన్ ‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

మొదటి ప్లాన్: రూ. 199 ప్లాన్

ఇది ప్రతిరోజూ 1.5 జిబి డేటాను అందిస్తుంది. మరియు ఇది 28 రోజులు చెల్లుతుంది. మీరు అదనపు జియో ప్రైమ్ సభ్యత్వాన్ని 99 తో జోడించవచ్చు. ఇందులో ప్రతిరోజూ 1.5 జిబి ఉచిత డేటా, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్,  జియో నుండి ఇతర మొబైల్స్ కోసం 28 రోజులకు 1000 నెట్ ‌వర్క్ నిమిషాలు మరియు రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్ 140 రోజుల వరకూ అందిస్తుంది. అంటే, 5 నెలల వరకూ ఉచితంగా ఇస్తుందన్న మాట.     

రెండవ ప్లాన్: రూ .249 ప్లాన్

ఇది ప్రతిరోజూ 28 రోజుల పాటు 2 జిబి డేటాను అందిస్తుంది. ఇక్కడ కూడా మీరు అదనపు జియో ప్రైమ్ సభ్యత్వం 99 ను కూడా రీఛార్జ్ చేయాలి. దీనితో, మీకు రోజుకు 2GB డేటా జియో నుండి జియో అపరిమిత కాల్స్,  జియో నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్ కోసం 1000 నిమిషాలు 28 రోజుల కోసం మరియు డైలీ 100 జాతీయ SMS లను 112 రోజుల వరకూ అందిస్తుంది.

మూడవ ప్లాన్: రూ. 349 ప్లాన్

ఇది  రోజూ 3 GB డేటాని 28 రోజులు వ్యాలిడిటీతో అందిస్తుంది. ఇక్కడ మీరు అదనపు జియో ప్రైమ్ సభ్యత్వం 99 ను కూడా యాక్సెస్ చేయాలి. దీనితో, మీకు రోజుకు 3GB డేటా జియో నుండి జియో అపరిమిత కాల్స్,  జియో నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్ కోసం 1000 నిమిషాలు 28 రోజుల కోసం మరియు డైలీ 100 జాతీయ SMS లను 84 రోజుల వరకూ అందిస్తుంది.

Note: మరిన్ని Jio Best Plans కోసం ఇక్కడ నొక్కండి.   

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: JioFi 4G: Wi Fi hotspot for just Rs 94
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Asus AC1300 USB-AC55 B1 Dual Band 1267 Mbps USB W-Fi Adapter (Black)
Asus AC1300 USB-AC55 B1 Dual Band 1267 Mbps USB W-Fi Adapter (Black)
₹ 2611 | $hotDeals->merchant_name
Digisol DG-GR1321 Gepon/Gpon Onu/ONT WiFi Router & Voice
Digisol DG-GR1321 Gepon/Gpon Onu/ONT WiFi Router & Voice
₹ 2474 | $hotDeals->merchant_name
DigiSol DG-GS1008DG 8x10/100/1000 Gigabit Ethernet Unmanaged Desktop Switch (Black)
DigiSol DG-GS1008DG 8x10/100/1000 Gigabit Ethernet Unmanaged Desktop Switch (Black)
₹ 1499 | $hotDeals->merchant_name
DigiSol DG-WM6305SIE2 1200Mbps Ceiling Mount Access Point (White)
DigiSol DG-WM6305SIE2 1200Mbps Ceiling Mount Access Point (White)
₹ 6290 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status