Realme 14 Pro Series 5G launching with super slim and super features
Realme 14 Pro Series 5G లాంచ్ డేట్ ను అనౌన్స్ చేయకుండానే కంపెనీ టీజింగ్ స్పీడ్ పెంచింది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను జనవరి నెలలో పరిచయం చేస్తుందని తెలిపిన రియల్ మీ ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను ఒక్కొక్కటిగా ముందే వెల్లడించడం మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను సూపర్ స్లిమ్ డిజైన్ మరియు సూపర్ ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్టు కంపెనీ గొప్పగా చెబుతోంది. ఇళ్ల చెప్పడానికి తగిన కారణమైన ఫీచర్ వివరాలు కూడా భయపెట్టింది.
రియల్ మీ 14 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్ లను సరికొత్త కోల్డ్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ డిజైన్ తో తెస్తున్నట్లు రియల్ మీ ప్రకటించింది. ఇది టెంపరేచర్ 16 డిగ్రీలకు పడి పోయినప్పుడు ఫోన్ కలర్ ను ఆటోమాటిగ్గా మారుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ యూనిక్ పర్ల్ డిజైన్ తో ఉంటుంది.
ఈ సిరీస్ నుంచి ప్రీమియం స్వెడ్ లెథర్ ఫోన్ లను కూడా లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ప్రీమియం లెదర్ జాకెట్ మరియు షూస్ లో ఉపయోగించే లెథర్ ను ఇప్పుడు మొబైల్ ఫోన్ లలో అందిస్తుందని రియల్ మీ చెబుతోంది. ఈ ఫోన్ కేవలం 7.55mm మందంతో చాలా స్లిమ్ ఫోన్ గా ఉంటుందంట.
ఇక ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ 42 డిగ్రీల గోల్డెన్ కర్వ్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 1.5K రిజల్యూషన్ మరియు 3840Hz PWM డిమ్మింగ్ కలిగిన డిస్ప్లే ఉంటుంది.
ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోన్ లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ సెంటర్ లో ట్రయాంగిల్ ఆకారంలో ఈ కెమెరా సెటప్ ను అందించింది మరియు మూడు కెమెరాల మధ్యలో మూడు LED ఫ్లాష్ లైట్ లను కూడా అందించింది. ఈ కెమెరా సెటప్ ఈ ఫోన్ ను చూడడానికి ఆకర్షణీయంగా మార్చింది.
Also Read: Lava Upcoming Mobile: సరికొత్త డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న లావా.!
ప్రస్తుతానికి ఈ ఫోన్ యొక్క ఈ వివరాలు మాత్రమే కంపెనీ అందించింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ ను కూడా రియల్ మీ అందిస్తుంది.