HIGHLIGHTSOppo Reno 3 Pro Price Cut నిజంగా ఒప్పో అభిమానులకు మరియు కెమేరా ప్రియులకు శుభవార్తే అవుతుంది.
OPPO సంస్థ 44 MP+2 MP డ్యూయల్ సూపర్ సెల్ఫీ కేమేరాతో తీసుకోచ్చిన OPPO Reno 3 పైన మరొకసారి భారీ ప్రైస్ కట్ ప్రకటించింది.
Oppo Reno 3 Pro, కెమేరా పరంగా మాత్రమే కాకుండా గొప్ప అల్రౌండ్ ఫీచర్లను తీసుకొస్తుంది.
Vostro 3501
Popular tech to stay connected anywhere. Save more on exciting Dell PCs.
Click here to know more
AdvertisementsOppo Reno 3 Pro Price Cut నిజంగా ఒప్పో అభిమానులకు మరియు కెమేరా ప్రియులకు శుభవార్తే అవుతుంది. అల్టిమేట్ ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందించే కెమెరా-సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ కోసం అత్యంత ప్రసిద్ది చెందిన OPPO సంస్థ, ఇండియాలో ఎన్నడూ లేని విధంగా 44 MP+2 MP డ్యూయల్ సూపర్ సెల్ఫీ కేమేరాతో తీసుకోచ్చిన OPPO Reno 3 పైన మరొకసారి భారీ ప్రైస్ కట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్, కెమేరా పరంగా మాత్రమే కాకుండా గొప్ప అల్రౌండ్ ఫీచర్లను తీసుకొస్తుంది.
ఈ ఒప్పో రెనో 3 ప్రో కేవలం 8GB ర్యామ్ ఎంపికతో మాత్రమే విడుదల చెయ్యబడింది మరియు ఇది రేడు స్టోరేజి ఎంపికలతో ప్రకటించబడింది.
1. Oppo Reno 3 Pro (8GB + 128GB ) - ధర : Rs. 27,990
2. Oppo Reno 3 Pro (8GB + 256GB ) - ధర : Rs. 29,990
Oppo Reno 3 Pro స్మార్ట్ ఫోన్ ఒక మిడ్-రేంజ్ హ్యాండ్సెట్ గా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది గరిష్టంగా 2.2 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల సరికొత్త మీడియా టెక్ హీలియో P95 SoC యొక్క శక్తిని కలిగి ఉంది. ఇది వేగవంతమైన ప్రాసెసర్ కాబట్టి, స్మార్ట్ ఫోన్ చాలా వేగంగా మరియు స్మూత్ గా పనిచేస్తుంది.
ఇక స్క్రీన్ విషయానికి వస్తే, ఒక 6.4-అంగుళాల Full HD + Super AMOLED డిస్ప్లేని 91.5 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో డ్యూయల్ సెల్ఫీ కోసం కొంచెం పెద్దదైన పంచ్ హోల్ నోచ్ డిజైన్ ఉంది, ఇందులో డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉంచబడుతుంది మరియు వేగవంతమైన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, వెనుక ఒక ప్రత్యేకమైన గ్లాస్ డిజైన్ కలిగి ఉంది, అరోరల్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు స్కై వైట్ కలర్ వంటి అందమైన కలర్ ఎంపికలతో వస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, ఒప్పో రెనో 3 ప్రో వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఇది 5X ఆప్టిక్ జూమ్ లేదా 20X హైబ్రిడ్ జూమ్ చెయ్యగల f / 2.4 ఎపర్చరు కలిగిన ఒక 13MP లెన్స్ కి జతగా f/1.8 ఎపర్చర్ గల 64MP ప్రధాన సెన్సార్, దీనికి జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు చివరిగా f / 2.4 మాక్రో లెన్స్‌తో 2MP కెమెరా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్, చీకట్లో కూడా మెరుగైన Low -Light చిత్రాలను కూడా అందిస్తుంది. ముందు భాగంలో మొట్ట మొదటి సారిగా ఒక ప్రధాన 44MP సెన్సార్ గల డ్యూయల్ సెల్ఫీ కెమెరాని అందించిన ఘనత ఒప్పో కి మాత్రమే దక్కుతుంది. ఇందులో ఒక 2MP డెప్త్ సెనర్ కూడా జతగా వుంటుంది.
Oppo Reno 3 Pro గరిష్టంగా 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ లో హైపర్ బూస్ట్ అమర్చారు, ఇది గేమింగ్ ఆడేటప్పుడు మరింత మధురానుభూతిని అందిస్తుంది. అలాగే, ఒక 4025mAh బ్యాటరీతో మద్దతు ఉన్నఈ హ్యాండ్ సెట్ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది మరియు 30 వాట్స్ VOOC 4.0 ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. ఈ VOOC ఛార్జింగ్ 20 నిమిషాల్లో హ్యాండ్సెట్ బ్యాటరీని 50 శాతం నింపుతుంది.
టాప్ -ప్రోడక్టులు
హాట్ డీల్స్
మొత్తం చూపించుDigit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.
మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.