Oppo F29 Series 5G: అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మరియు 300% నెట్వర్క్ బూస్ట్ తో వస్తుంది.!
ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో
ఒప్పో ఇప్పుడు ఈ అప్ కమింగ్ ఫోన్స్ కీలకమైన ఫీచర్స్ కూడా బయటపెట్టింది
F29 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఫీచర్ ఉంటుంది
Oppo F29 Series 5G: ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో ఇప్పుడు ఈ అప్ కమింగ్ ఫోన్స్ కీలకమైన ఫీచర్స్ కూడా బయటపెట్టింది. ఒప్పో అప్ కమింగ్ ఫోన్ F29 సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న స్మార్ట్ ఫోన్లలో అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మరియు 300% నెట్వర్క్ బూస్ట్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా ఉంటాయని ఒప్పో టీజింగ్ చేస్తోంది. మరి ఈ ఒప్పో అప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోన్లు ఎలా ఉండనున్నాయో ఒక లుక్కేద్దామా.
SurveyOppo F29 Series 5G: లాంచ్
ఒప్పో F29 సిరీస్ స్మార్ట్ ఫోన్లు మార్చి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ఒప్పో డేట్ మరియు టైం అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా టీజర్ పేజీ ద్వారా అందించింది. ఈ అప్ కమింగ్ ఫోన్స్ కోసం Flipkart కూడా ప్రతేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
Also Read: IPL 2025: ఈ జియో ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే ఐపీఎల్ మ్యాచ్ లను ఉచితంగా చూడవచ్చు.!
Oppo F29 Series 5G: కీలకమైన ఫీచర్స్
ఒప్పో F29 సిరీస్ స్మార్ట్ ఫోలు చాలా స్లీక్ గా ఉంటాయి. ఈ ఫోన్లు చుట్టూ యాంటెన్నా కలిగిన సరికొత్త డిజైన్ తో ఉంటాయి మరియు 300% నెట్వర్క్ బూస్ట్ అందిస్తాయని కూడా ఒప్పో తెలిపింది. ఇది కాకుండా ఈ ఫోన్ యొక్క పటిష్టమైన డిజైన్ గురించి కూడా ఒప్పో పేర్కొంది. ఈ ఫోన్ 360 డిగ్రీల ఆర్మోర్ బాడీ డిజైన్ తో ఉంటుంది మరియు ఇది 18 రకాల లిక్విడ్స్ నుంచి రక్షణ కలిగి ఉంటుందని కూడా ఒప్పో టీజింగ్ చేస్తోంది.

ఒప్పో అప్ కమింగ్ స్మార్ ఫోన్ సిరీస్ నుంచి వచ్చే ఫోన్లు డ్యూయల్ రియర్ కెమెరా మరియు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్స్ 6000 mAh బిగ్ అండ్ పవర్ ఫుల్ బ్యాటరీ మరియు 80W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సిరీస్ ఫోన్ లను మీడియాటెక్ Dimensity 7300 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా ఒప్పో అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సిరీస్ ఫోన్లు కఠినమైన డిజైన్, వాటర్ ప్రూఫ్ సపోర్ట్ మరియు గొప్ప కెమెరా ఫీచర్స్ తో లాంచ్ చేయడానికి ఒప్పో సిద్ధమయినట్లు ఈ కీలకమైన ఫీచర్స్ ద్వారా తెలుస్తోంది.