jioPhone 3 ఒక మీడియా టెక్ చిప్సెట్ డ్యూయల్ 4G తో ఈ నెలలో మార్కెట్లోకి రావచ్చు :రిపోర్ట్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది Aug 30 2019
jioPhone 3 ఒక మీడియా టెక్ చిప్సెట్ డ్యూయల్ 4G తో ఈ నెలలో మార్కెట్లోకి రావచ్చు :రిపోర్ట్

Make your home smarter than the average home

Make your life smarter, simpler, and more convenient with IoT enabled TVs, speakers, fans, bulbs, locks and more.

Click here to know more

HIGHLIGHTS

జియోఫోన్ 2 స్థానంలో త్వరలో రాబోయే జియోఫోన్ 3 లాంచ్ అవుతుంది.

రిలయన్స్ జియో తన మూడవ తరం జియోఫోన్‌ను ఈ నెలలో ప్రారంభించవచ్చు. నివేదిక ప్రకారం, ఈ జియోఫోన్ 3 మీడియాటెక్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది  మరియు 4 జి మద్దతుతో వస్తుంది.

రిలయన్స్ జియో ఆగస్టు 12 నజరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఎజిఎం)లో  ఒక కొత్త ఫీచర్ ఫోన్‌ను గురించి ప్రకటించింది. ది ఎకనామిక్ టైమ్స్ యొక్క నివేదిక ప్రకారం, మీడియాటెక్ కొత్త 4 జి ఫీచర్ ఫోన్ల కోసం కైయోస్‌తో కలిసి పనిచేస్తోంది.

అంటే, రిలయన్స్ జియో ఇప్పుడు మీడియాటెక్ సహకారంతో 4 జి ఫోన్‌లను సిద్ధం చేస్తోంది. ఇది ప్రస్తుతం జియోఫోన్ కోసం క్వాల్కమ్ మరియు యునిసోక్ చిప్‌సెట్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది. రూ .2,999 కు అమ్ముడవుతున్న జియోఫోన్ 2 స్థానంలో త్వరలో రాబోయే జియోఫోన్ 3 లాంచ్ అవుతుంది.

ఈ 4 జి ఫీచర్ ఫోన్, ఒక 512MB ర్యామ్ మరియు 4GB ROM తో వస్తుంది మరియు స్టోరేజిని పెంచడానికి ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఇవ్వబడుతుంది. రిలయన్స్ జియోఫోన్ 2 లో 2.4-అంగుళాల QVGA డిస్ప్లే ఉంది మరియు ఈ ఫోన్ 2 మెగాపిక్సెల్ వెనుక కెమెరా మరియు విజిఎ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. కనెక్టివిటీ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ డ్యూయల్ సిమ్, 4 జి VoLTE , ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్ మరియు వై-ఫైలకు మద్దతు ఇస్తుంది మరియు ఫోన్ 2,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

సంస్థ యొక్క గత సంఘటనలను చూస్తే, జియోఫోన్ 3 AGM లోనే లాంచ్ అవుతుందని అందరూ ఊహించారు.కానీ, జియో గిగాఫైబర్ సేవను మొదలు పెట్టె అదే రోజున ఈ ఫోన్ను ప్రవేశపెట్టానున్నదని భావిస్తున్నారు. రిలయన్స్ జియో గిగా ఫైబర్ సేవ ప్రారంభ ధర 500 రూపాయలకు ప్రారంభించవచ్చు. అయితే, సంస్థ రూ.700 నుండి 1000 రూపాయల ధరల మధ్యలో ప్లాన్లను ప్రకటించనున్నదని తెలిపింది. కానీ, ప్రస్తుతం ఇతర సంస్థలు వాటి బ్రాడ్ బ్యాండ్ సేవల యొక్క ప్లాన్లలో చాలా మార్పులను చేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.        

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.