iQOO Z10R: స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

Updated on 24-Jul-2025
HIGHLIGHTS

ఐకూ జెడ్ 10 సిరీస్ నుంచి Z10, Z10x, Z10 లైట్ ఫోన్ లను విడుదల చేసిన కంపెనీ ఈరోజు మరో బడ్జెట్ ఫోన్ Z10R కూడా లాంచ్ చేసింది

ఈ ఫోన్ ను అన్ని 4K సపోర్ట్ కెమెరాలు మరియు బిగ్ అండ్ పవర్ ఫుల్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక మరియు ముందు సెల్ఫీ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది

iQOO Z10R : ఇప్పటికే ఐకూ జెడ్ 10 సిరీస్ నుంచి Z10, Z10x, Z10 లైట్ ఫోన్ లను విడుదల చేసిన కంపెనీ ఈరోజు మరో బడ్జెట్ ఫోన్ Z10R కూడా లాంచ్ చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఫోన్ ను అన్ని 4K సపోర్ట్ కెమెరాలు మరియు బిగ్ అండ్ పవర్ ఫుల్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఐకూ లేటెస్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు పూర్తిగా తెలుసుకోండి.

iQOO Z10R: ప్రైస్

ఐకూ ఈ ఫోన్ ను కేవలం రూ. 19,499 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ను ఈ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8 జీబీ + 256 జీబీ వేరియంట్ రూ. 21,499 ధరతో మరియు 12 జీబీ + 256 జీబీ వేరియంట్ రూ. 23,499 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. జూలై 29 నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ నుంచి సేల్ అవుతుంది.

ఆఫర్లు :

ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల భారీ తగ్గింపు అందుకునే అవకాశం ఐకూ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల HDFC మరియు Axis బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లేదా రూ. 2,000 రూపాయల ఎక్స్చేంజ్ బోనస్ అందుకునే అవకాశం అందించింది. అంతేకాదు, ఏ ఫోన్ పై 6 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ కూడా అందించింది.

iQOO Z10R: ఫీచర్లు

ఐకూ ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను కేవలం 7.39mm మందం మాత్రమే కలిగిన స్లీక్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, HDR 10+, నెట్ ఫ్లిక్స్ HDR సపోర్ట్ మరియు స్కాట్ ఆల్ఫా గ్లాస్ రక్షణ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇందులో, 8 జీబీ / 12 జీబీ ఫిజికల్ ర్యామ్ 12 జీబీ వరకు ఎక్స్టెండెడ్ ర్యామ్ మరియు 128 జీబీ / 256 జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్ అందించింది.

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక మరియు ముందు సెల్ఫీ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony IMX 882) మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్లతో పాటు మరిన్ని కెమెరా ఫిల్టర్లు మరియు ఫీచర్లు కలిగి ఉంటుంది.

Also Read: MOTOROLA Edge 60 Fusion పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

ఐకూ ఈ కొత్త ఫోన్ ను 5700 mAh బిగ్ బ్యాటరీ తో జతగా అందించింది మరియు ఇందులో ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ IP 68 మరియు IP 69 రేటింగ్ తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఫోన్ ను వేగంగా చల్లబరిచే పెద్ద గ్రాఫైట్ కూలింగ్ స్పేస్, మరియు బైపాస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా పటిష్టమైన మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :