Infinix Note 50s launching with slimmest curved screen and stunning design
Infinix Note 50s స్మార్ట్ ఫోన్ ను స్టన్నింగ్ డిజైన్ మరియు అతి సన్నని కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ నోట్ 50 సిరీస్ నుంచి రీసెంట్ గా నోట్ 50x ఫోన్ ను అందించిన ఇన్ఫినిక్స్ ఇప్పుడు ఇదే నోట్ 50 సిరీస్ నుంచి ఈ కొత్త ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ కూడా కంపెనీ వెల్లడించింది.
ఇన్ఫినిక్స్ నోట్ 50s స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఫీచర్స్ కూడా ఇన్ఫినిక్స్ వెల్లడించింది. ఈ ఫోన్ ఇండియాలో అతి సన్నని 144Hz రిఫ్రెష్ రేట్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగిన ఫోన్ గా వస్తోంది. ఈ స్క్రీన్ 6.78 ఇంచ్ కలిగి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు లో బ్లూ లైట్ లైట్ TUV సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది.
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ 90 FPS గేమింగ్ సపోర్ట్ చేసే మీడియాటెక్ Dimensity 7300 ultimate 5జి చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. దీనికి జతగా 8GB LPDDR5 ఫిజికల్ ర్యామ్ మరియు 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో పాటు 256GB ఇంటర్నల్ స్టొరేజ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కూడా ఉంటుంది.
ఇక ఫోన్ డిజైన్ మరియు కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ 7.6mm స్లీక్ డిజైన్ మరియు లెథర్ బ్యాక్ డిజైన్ తో పాటు సరికొత్త మరైన్ డ్రిఫ్ట్ బ్లూ కలర్ లో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ లో వెనుక 64MP Sony IMX682 సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30fps 4K వీడియో సపోర్ట్ ఫీచర్ తో వస్తుంది మరియు AI కెమెరా ఫీచర్స్ తో పాటు AIGC పోర్ట్రైట్ ఇమేజ్ లను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ కెమెరా యాక్టివ్ హేలో లైట్ కలిగిన జెమ్ కట్ డిజైన్ తో ఉంటుంది.
Also Read: రేపు విడుదల కానున్న Samsung Galaxy M56 5G కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!
ఓవరాల్ గా ఈ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. అయితే, ఈ ఫోన్ ప్రైస్ ను బట్టి బడ్జెట్ సెగ్మెంట్ లో ఎటువంటి కాంపిటీషన్ అందిస్తుందో అంచనా వేయాల్సి ఉంటుంది.