Infinix Note 12: బడ్జెట్ ధరలో భారీ స్పెక్స్ తో వచ్చింది.. ధర ఎంతంటే..!!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 20 May 2022
HIGHLIGHTS
  • ఇన్ఫినిక్స్ ఈరోజు Infinix Note 12 ను విడుదల చేసింది

  • FHD+ AMOLED డిస్ప్లే, 3GB వర్చువల్ ర్యామ్ వంటి మంచి ఫీచర్లతో వచ్చింది

  • ఈ ఫోన్ లో DTS Surround Sound సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లను కూడా అందించింది

Infinix Note 12: బడ్జెట్ ధరలో భారీ స్పెక్స్ తో వచ్చింది.. ధర ఎంతంటే..!!
Infinix Note 12: బడ్జెట్ ధరలో భారీ స్పెక్స్ తో వచ్చింది.. ధర ఎంతంటే..!!

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ ఈరోజు ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Infinix Note 12 ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను FHD+ AMOLED డిస్ప్లే, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ వంటి మంచి ఫీచర్లతో కేవలం రూ.11,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ పైన లాంఛ్ అఫర్ లో భాగంగా Axis బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 1,000 డిస్కౌంట్ మరియు అతి తక్కువ No Cost EMI అఫర్ ను కూడా జతచేసింది. ఇన్ఫినిక్స్ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధర మరియు స్పెక్స్ లను వివరంగా చూద్దాం.

Infinix Note 12: ధర & ఆఫర్లు

ఇన్ఫినిక్స్ నోట్ 12 రెండు వేరియంట్స్ లో లభిస్తుంది మరియు వాటి ధరలు క్రింద చూడవచ్చు.

Infinix Note 12 (4GB+64GB) ధర: రూ.11,999        

Infinix Note 12 (6GB+128GB) ధర: రూ.12,999

Axis బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 1,000 డిస్కౌంట్ మరియు అతి తక్కువ No Cost EMI అఫర్ ను కూడా జతచేసింది. ఈ ఫోన్ సేల్ మే 28 నుండి Flipkart ద్వారా సేల్ కి వస్తుంది.

Infinix Note 12: స్పెక్స్ మరియు ఫీచర్లు

ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD + రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 100% DCI P3 కలర్ గ్యాముట్, గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ అందిచడంతో పాటుగా గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ Helio G88 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB/6GB తో పాటుగా 3GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగి వుంది మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేసింది.

Infinix Note 12 కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ మరియు AI లెన్స్ లను కలిగివుంది. ముందు భాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని డ్యూయల్ LED ఫ్లాష్ టి కలిగి వుంది. ఈ ఫోన్ లో టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కలిగిన భారీ 5,000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఆడియో పరంగా, ఈ ఫోన్ లో DTS Surround Sound సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లను కూడా అందించింది.    

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Infinix Note 12 launched in india
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M53 5G (Mystique Green, 8GB, 128GB Storage) | 108MP Camera | sAmoled+ 120Hz | 32MP Front Camera | 6nm Processor | 16GB RAM with RAM Plus | Travel Adapter to be Purchased Separately
Samsung Galaxy M53 5G (Mystique Green, 8GB, 128GB Storage) | 108MP Camera | sAmoled+ 120Hz | 32MP Front Camera | 6nm Processor | 16GB RAM with RAM Plus | Travel Adapter to be Purchased Separately
₹ 28499 | $hotDeals->merchant_name
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
₹ 66999 | $hotDeals->merchant_name
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included | Get 2 Months of YouTube Premium Free!
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included | Get 2 Months of YouTube Premium Free!
₹ 12999 | $hotDeals->merchant_name
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
₹ 26990 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 29990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status