ఈ ట్రిక్ తో మీ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ అవుతుంది రెండు రేట్లు స్పీడ్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 25 Feb 2021
HIGHLIGHTS
  • స్మార్ట్‌ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ పెంచడం ఎలా

  • ఈ ట్రిక్ తో మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ డబుల్

ఈ ట్రిక్ తో మీ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ అవుతుంది రెండు రేట్లు స్పీడ్
ఈ ట్రిక్ తో మీ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ అవుతుంది రెండు రేట్లు స్పీడ్

ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే, స్మార్ట్ ఫోన్ అన్న మాటే కానీ కొన్ని సార్లు నెట్వర్క్ యెంత నెమ్మదిగా ఉంటుందంటే, చాలా చిరాకు తెప్పిస్తుంది. అవ్వడానికి 4G ఫోన్ మరియు 4G నెట్వర్క్ అయినా కూడా ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం సాధారణంగా అనిపిస్తుంది.          

అందుకే, ఈ సమస్యకు పరిష్కారంతో మేము మీ ముందుకు వచ్చాము. ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు కొన్ని మార్గాలను అనుసరిస్తే చాలు, Android స్మార్ట్ ‌ఫోన్‌లో ఇంటర్నెట్ వేగాన్ని అమాంతం పెంచవచ్చు. అందుకే,  ఈ మార్గాలను వివరంగా చూద్దాం ....

స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ వేగాన్ని ఎలా పెంచాలి?

1. ఫోన్‌ను Re-Start చెయ్యండి

ఇది మొదటి మరియు సులభమైన మార్గం. మీ ఫోన్‌ను పునఃప్రారంభించిన (Re-Start) తరువాత, మొబైల్ నెట్‌వర్క్ సెర్చ్ చేస్తుంది. కాబట్టి, మొబైల్ ఇంటర్నెట్ వేగం చాలా రెట్లు పెరుగుతుంది. ఈ మార్గంతో పాటు మీరు మొబైల్ డేటాను ఒకసారి ఆపివేసి పునఃప్రారంభించవచ్చు.

2. ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేయండి

మొబైల్‌ను పునఃప్రారంభించడంతో పాటు, మీరు మీ ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్‌ను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. ఆ విధానంలో కూడా మీ ఫోన్ మళ్ళీ మొబైల్ నెట్‌వర్క్‌ను Search చేస్తుంది కాబట్టి, ఇది ఫోన్ యొక్క ఇంటర్నెట్ వేగాన్ని చాలాసార్లు పెంచుతుంది.

3. డేటా వినియోగాన్ని తనిఖీ చేయండి

చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా రోజువారీ డేటా పరిమితితో వస్తాయి. ప్లాన్ యొక్క డేటా పరిమితి గడువు ముగిసిన తరువాత, ఇంటర్నెట్ వేగం ఆటొమ్యాటిగ్గా  తగ్గుతుంది. ఈ సందర్భంలో, మీరు మీ డేటా వినియోగాన్ని ఒకసారి పరిశీలించడం మంచిది.

4. ఆటో డౌన్‌లోడ్ Update నిలిపివేయండి

సాధారణంగా యాప్స్ ను అప్డేట్ చేయ్యుడానికి  ఫోన్‌లో ఆటో డౌన్‌లోడ్ ఎంపిక ఆన్ చేయబడుతుంది. మీరు ఈ ఎంపికను ఆపివేయగలిగితే బాగుంటుంది. ఈ విధానంలో మీకు పరిమిత ఇంటర్నెట్ వినియోగం ఉంటుంది మరియు దీని తరువాత మీకు మంచి వేగం లభిస్తుంది.

5. ఫోన్ యొక్క నెట్‌వర్క్ సెట్టింగ్‌లను Reset చేయండి

మీ ఫోన్ యొక్క సెట్టింగులను మార్చినప్పటికీ చాలా సార్లు ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. అలాంటప్పుడు, మీ ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను ఒకసారి Reset చేయడం మంచిది.

logo
Raja Pullagura

email

Web Title: you can increase your smartphone internet speed here is how to
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status