నెట్ న్యూట్రాలిటీ ను సపోర్ట్ చేయండి. ఆగస్ట్ 20 లోపు మీ అభిప్రాయాలను తెలపండి

Eng
బై Team Digit | పబ్లిష్ చేయబడింది 17 Aug 2015
HIGHLIGHTS
  • మీరు సీరియస్ గా కన్సిడర్ చేయవలసిన టాపిక్. లేదంటే ఫ్యూచర్ లో ఇంటర్నెట్ వాడటం చాలా కష్టం అవుతుంది.

నెట్ న్యూట్రాలిటీ ను సపోర్ట్ చేయండి. ఆగస్ట్ 20 లోపు మీ అభిప్రాయాలను తెలపండి

Net Neutrality అనే టాపిక్ మొన్నటి వరకూ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు దిపై వినియోగదారులను స్పందించమని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం, DOT ఆగస్ట్ 20 వరకూ గడువు పెంచింది. 

ఇంతకీ Net Neutrality అంటే ఏమిటి?
వాట్స్ అప్, ఫేస్ బుక్.. ట్విటర్ ఇలా వివిధ ఇంటర్నెట్ సర్వీసులకు ఇప్పటి వరకూ మనం ఒక ఇంటర్నెట్ ప్లాన్ యాక్టివేట్ చేసుకొని అన్నీ వాడుతున్నాం. దీనినే నెట్ న్యూట్రాలిటీ అంటాం. అంటే ఎటువంటి షరతులు, అదనపు పేమెంట్స్ లేకుండా ఓపెన్ గా ఫ్రీ గా ఇంటర్నెట్ వాడుకోవటం. అయితే నెట్వర్క్ ప్రొవైడర్స్ దీనిని మార్చేందుకు చేస్తున్నాయి.

నెట్ న్యూట్రాలిటీ లో వస్తున్న కొత్త మార్పులు ఏమిటి?
ఇప్పుడు జీరో రేటింగ్ అనే ప్లాన్ ను వాస్తవ రూపంలోకి తెస్తున్నాయి ఇండియన్ నెట్వర్క్స్. ఇది వస్తే వాట్స్ అప్ కు, ఫేస్ బుక్ అండ్ ట్విటర్ ఇలా అన్నీ సర్వీసులకు విడివిడిగా మీరు డబ్బులు పే చేయాలి నెట్వర్క్ లకు. అంటే ఇంటర్నెట్ ఇప్పటి వరకూ మన కంట్రోల్ ఉంది, జీరో రేటింగ్ కారణంగా ఇది వాళ్ల కంట్రోల్ లోకి వెళ్తుంది.

సడెన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది?
వాట్స్ అప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్, viber ఇలా ఇంటర్నెట్ యాప్స్ రావటం వలన స్మార్ట్ ఫోన్ యూజర్స్ అందరూ ముందు స్టాండర్డ్ మెసేజింగ్...లేటెస్ట్ గా స్టాండర్డ్ కాలింగ్ ను కూడా వాడుకోవటం పూర్తిగా తగ్గించేసారు. అందుకని నెట్ వర్క్ ప్రొవైడర్స్ అందరూ కలిసి ఇండియన్ టెలికాం తో జీరో రేటింగ్ అంటూ వాళ్లకు లాభాలు తెచ్చిపెట్టే ప్రయోగాలు చేస్తున్నారు. 

ఇది వాస్తవ రూపంలో రాకుండా చేయవచ్చు...
దీనిపై వినియోగదారుల అభిప్రాయాన్ని వెల్లడించటానికి ఇండియన్ గవర్నమెంట్ అవకాశం కలిపించింది. ఈ అభిప్రాయాలు ఎక్కువ సంఖ్యలో జీరో రేటింగ్ ను వ్యతిరేకిస్తే అది వాస్తవ రూపంలోకి రాకుండా చర్యలు తీసుకోనుండి గవర్నమెంట్.

దీనిపై మీ కామెంట్స్ ను ఇచ్చి mygov.in వెబ్ సైటు లో డిస్కస్ చేయమని టెలికాం బృందం కొంత సమయం ఇచ్చింది. అది ఇప్పుడు ఆగస్ట్ 20 వరకూ పొడిగించింది. సో మీకు free అండ్ open ఇంటర్నెట్ కావాలని అనుకుంటే ఆగస్ట్ 20 తారీఖు లోపు ఈ లింక్ లోకి వెళ్లి మీ అభిప్రాయాన్ని కొన్ని మాటలు ద్వారా తెలియ పరిచి నెట్ న్యూట్రాలిటీ ను కాపాడండి.

జస్ట్ సింపుల్ గా రిజిస్టర్ అయ్యి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే చాలు ఫ్యూచర్ లో ఇంటర్నెట్ అనేది మన చేతుల నుండి చేజారిపోకుండా కాపాడుకోగలం.  దీని పై అధిక సమాచారం ఈ లింక్ లో మీకు అర్ధమయ్యేలా వివరించ బడింది. దేశంలో చాలా మంది ముందుకు వచ్చి జీరో రేటింగ్ పై వ్యతిరేకతను చూపించి నెట్ న్యూట్రాలిటీను కాపాడటానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు.  

Team Digit
Team Digit

Email Email Team Digit

Follow Us Facebook Logo Facebook Logo Facebook Logo

About Me: All of us are better than one of us. Read the detailed BIO to know more about Team Digit Read More

Tags:
net neutrality internet india జీరో రేటింగ్ zero rating నెట్ న్యూట్రాలిటీ నెట్ ఇంటర్నెట్
DMCA.com Protection Status